మదర్ థెరిసా గురించి ప్రచారంలో ఉన్న సుగుణాలు ఒట్టి మిథ్య అని ముగ్గురు కెనడా పరిశోధకులు తేల్చి చెప్పారు. వాస్తవాలను విశ్లేషిస్తే దయామయి, నిస్వార్ధపరురాలు అన్న సుగుణాలు ఆమెకు నప్పవని తమ పరిశోధనలో తేలినట్లు మాంట్రియల్ యూనివర్సిటీ, ఒట్టావా యూనివర్శిటీల పరిశోధకులు తెలిపారని ఎ.ఎన్.ఐ వార్తా సంస్థ తెలియజేసింది. ప్రపంచ వ్యాపితంగా ఉన్న అనేకమంది దాతలనుండి వందల మిలియన్ల డాలర్లు విరాళాలుగా సేకరించిన థెరిసా ఆ డబ్బుని తాను చెప్పిన లక్ష్యాలకు వినియోగించలేదని, ఆమె రాజకీయ సంబంధాలు ప్రశ్నార్ధకం అని వారు తెలిపారు. థెరిసాకు విస్తృతంగా లభించిన ప్రచారం వెనుక శక్తివంతమైన మీడియా సంబంధాలు, బిబిసి విలేఖరి మాల్కం మగ్గరిడ్జ్ కృషి ఉన్నదని వెల్లడి చేశారు.
యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ కి చెందిన ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ సైకో ఎడ్యుకేషన్‘ ప్రొఫెసర్లు సెర్గి లారివి మరియు జెనెవీవ్ చెనార్డ్, యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా కి చెందిన ఫేకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ కేరోల్ సెనెచల్ ఈ పరిశోధన నిర్వహించారు. “ఎథిక్స్ పై సెమినార్ జరుపుతూ నిస్వార్ధం జీవనం గురించిన పత్రాలను శోధిస్తుండగా కేధలిక్ చర్చి పరిధిలో ప్రసిద్ధి చెందిన వారిలో ఒకరైన మహిళ విషయం మాలో ఒకరి దృష్టికి వచ్చింది. మన ఉమ్మడి ఊహల్లో ఆమె మదర్ థెరిసాగా చిరపరిచితురాలయిన ఆమె అసలు పేరు ‘ఎగ్నెస్ గాంక్షా‘” అని పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ లారివి అన్నాడు. “ఆమె గురించిన వర్ణన ఎంత పరవశ భరితంగా ఉన్నదంటే ఆమె గురించి తెలుసుకోవాలన్న తహతహను అది మాలో రేకెత్తించి మరింత పరిశోధనకు పురికొల్పింది” అని ఆయన తెలిపాడు.
పరిశోధనలో భాగంగా మదర్ థెరిసా జీవితం గురించి వారు 502 పత్రాలు సంపాదించారు. అందులో జతలుగా వచ్చిన 195 పత్రాలను తొలగించి మిగిలిన 287 పత్రాలను విశ్లేషించారు. ‘ఆర్డర్ ఆఫ్ ద మిషనరీస్ ఆఫ్ ఛారిటీ‘ (ఒ.ఎం.సి) వ్యవస్థాపకురాలైన మదర్ థెరిసా పైన విడుదలైన రచనల్లో 96 శాతం ఈ పత్రాలే ఉన్నాయనీ, అందులో వాస్తవాలు తరిచిచూస్తే ‘మదర్ ధెరిసా‘ అనే భ్రమను పటాపంచలు చేశాయని పరిశోధకులు తెలిపారు. మదర్ ధెరిసా నిర్వాణం చెందినట్లు ప్రకటించే క్రమంలో వాటికన్ కూడా అనేక సమస్యలను పట్టించుకోలేదని తెలిపారు. “రోగులకు సేవ చేయడంలో ఆమె అవలంబించిన మోసపూరిత పద్ధతి, ప్రశ్నించదగిన ఆమె రాజకీయ సంబంధాలు, తనకు అందిన భారీ విరాళాలను అనుమాస్పద రీతిలో నిర్వహించిన విధము, ఆమెకు గల అతి మూఢ భావాలు, ముఖ్యంగా అబార్షన్, గర్భనిరోధకత్వం, విడాకులు తదితర అంశాలపై ఆమెకు గల మూఢ భావాలు… ఈ సమస్యలను వారు పట్టించుకోలేదు” అని లారివి తెలిపాడు.
మదర్ ధెరిసా మరణించేనాటికి ప్రపంచ వ్యాపితంగా వంద దేశాలలో ఆమె స్ధాపించిన 517 మిషన్లు పని చేస్తున్నాయి. పేదలను, రోగులను ఆహ్వానించి అక్కున చేర్చుకుని ప్రేమ, వైద్య పంచే కేంద్రాలుగా వీటి గురించి చెప్పారు. కలకత్తాలో ఈ మిషన్లను సందర్శించిన డాక్టర్లు ‘మరణం అంచులో ఉన్నవారి ఇళ్లు‘ (homes for the dying) గా వాటిని అభివర్ణించారు. అంటే మృత్యువాత పాడడానికే వారు ఇక్కడికి వస్తారని వారి అభిప్రాయం. పరిశోధకుల ప్రకారం ఇక్కడికి వచ్చే 2/3 వంతు మంది తమ రోగాలను నయం చేసే డాక్టర్లు దొరుకుతారని వస్తే, మిగిలిన మూడో వంతు మంది సరైన వైద్య రక్షణ లభించని నిరాదరణ స్థితిలోనే ప్రాణాలు వదిలేస్తుంటారు. అపరిశుభ్ర పరిస్ధితులు, చికిత్సకు ఏమాత్రం అనువు కాని వాతావరణం, నిజమైన శ్రద్ధ అసలే లేకపోవడం, ఆహార కొరత, నొప్పి నివారణ మాత్రల లేమి ఈ మిషన్లలో గమనించామని డాక్టర్లు చెప్పారు.
ఈ పరిస్ధితికి కారణం డబ్బులు లేకపోవడం కాదని పరిశోధకులు తెలిపారు. నిజానికి మదర్ ధెరిసా స్ధాపించిన ఫౌండేషన్ కొన్ని వందల మిలియన్ల డాలర్లు విరాళాలుగా సేకరించింది. బాధ మరియు మృత్యువుల గురించిన నిర్దిష్ట వైఖరి వల్లనే ఈ పరిస్ధితి నెలకొన్నదని పరిశోధకులు తెలిపారు. “పేదలు తమ భారవంతమైన కష్టాలను అనుభవించడంలో ఒక విధమైన సౌందర్యం దాగి ఉన్నది. యేసు క్రీస్తు బాధలు అనుభవించిన తరహాలో వారు వాటిని అనుభవిస్తారు. వారి బాధల ద్వారా ప్రపంచానికి చాలా లాభకరం” అని మదర్ ధెరిసా పేదల బాధలపై వ్యాఖ్యానించినట్లు పరిశోధకులు తెలిపారు. ప్రయాసపడి భారము మోయుచున్న పాపుల పాపాలను శిలువ రూపంలో యేసు క్రీస్తు మోసినట్లుగా ధనికుల దోపిడీ పాపాలను పేదలు ‘పేదరికం‘ అని శిలువ రూపంలో మోస్తున్నట్లు మదర్ ధెరిసా ఉద్దేశమేమో తెలియడం లేదు.
చిత్రం ఏమిటంటే మదర్ థెరిసాయే స్వయంగా జబ్బు పడినప్పుడు మాత్రం అత్యాధునిక వైద్యం ఆమెకు అవసరం కాగా ప్రసిద్ధి చెందిన ఒక అమెరికన్ ఆసుపత్రిలో వైద్యం పొందగలిగింది. మదర్ ధెరిసా ప్రార్ధనలు అందజేయడంలో ఎంత ఉదారంగా వ్యవహరిస్తారో, మనుషుల బాధలను దూరం చెయ్యడానికి ఖర్చు పెట్టడంలో అంత పొదుపరి. ఫౌండేషన్ యొక్క మిలియన్ల డాలర్లు ఏమాత్రం అక్కరకు వచ్చేవి కావు. ఇండియాలో అనేకసార్లు వరదలు వచ్చిన సందర్భంలో గాని, భోపాల్ లో విషయ వాయువు ఫ్యాక్టరీ పేలి విష వాయువు లీకై వందల మంది మృత్యువాత పడినప్పుడు గానీ లెక్కకు మిక్కిలిగా ప్రార్ధనలు చేయడం, కన్యక మేరీ మాత పేరుతో మెడలియన్లు పంచి పెట్టడం తప్ప డబ్బు సహాయం చేసిన ఉదాహరణ ఒక్కటీ లేదని పరిశోధకులు వివరించారు.
మరో వైపు అనేక వైపుల నుండి వచ్చి పడుతున్న సన్మానాలను, గౌరవాలను స్వీకరించడానికి ఆమెకు అభ్యంతరం లేదు. హైతీ నియంత దువాలియార్ లాంటి వారి నుండి నిధులు విరాళాలుగా స్వీకరించడానికి కష్టం అనుకోలేదు. MCO కి చెందిన అనేక బ్యాంకు ఖాతాలకు డబ్బు బదలాయించి వాటిని రహస్యంగా ఉంచారని లారివి తెలిపాడు. అతి పొదుపు పాటించే మదర్ ధెరిసా కార్యక్రమాలు గమనించినవారికి “పేదలలోకెల్లా పేదలకు అందవలసిన ఈ నిధులన్నీ ఎక్కడికి వెళుతున్నట్లు?” అన్న ప్రశ్న తప్పకుండా ఉదయిస్తుందని పరిశోధకుల అభిప్రాయం.
వాస్తవాలు ఇలా ఉండగా అంత అద్భుతమైన సానుకూల ప్రచారం ధెరిసా ఎలా పొందగలిగింది? అసాధ్యమైన పవిత్రత, అనంతమైన మంచితనం ఆమె ఇమేజ్ గా ఎలా వచ్చి చేరాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఒక్కసారి కాలంలో వెనక్కి ప్రయాణించి బిబిసి దగ్గర తేలాల్సిందే. 1968లో బిబిసి విలేఖరి మాల్కం మగ్గరిడ్జ్ తో ఆమె జరిపిన సమావేశం ఈ మీడియా ఇమేజి సృష్టిలోనూ, ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించిందని పరిశోధకులు తెలిపారు. అబార్షన్ వ్యతిరేక భావాలు కలిగి ఉన్న మాల్కం, మదర్ ధెరిసా మితవాద భావాలకు నమ్మకమైన అనుచరుడు కూడా. థెరిసాను ప్రమోట్ చేయడానికి నిర్ణయించుకోవడంతో మాస్ మీడియా శక్తి ఏమిటో మదర్ థెరిసాకు అనుభవంలోకి వచ్చింది. 1969లో మాల్కం మిషనరీల గురించి ప్రశంసలు కురిపిస్తూ ఒక ఫిల్ము రూపొందించాడు. ఆమెకు మొదటి ‘ఫోటోగ్రాఫిక్ అద్భుతాన్ని‘ ఆపాదిస్తూ ఆ ఫిల్ము రూపొందించబడింది. నిజానికి, పరిశోధకుల ప్రకారం, ఆ అద్భుతం కొడాక్ కంపెనీ కొత్తగా మార్కెటింగ్ మొదలు పెట్టిన ఫిల్మ్ స్టాక్ కి చెందవలసిన క్రెడిట్.
ఆ తర్వాత మదర్ ధెరిసా వెనుదిరిగి చూడలేదు. ప్రపంచ వ్యాపితంగా పర్యటించి అనేక అవార్డులు సంపాదించింది. నోబెల్ శాంతి బహుమతి అందులో ఒకటి. నోబెల్ శాంతి బహుమతిని స్వీకరిస్తూ బోస్నియా సెర్బుల చేతుల్లో అత్యాచారాలు ఎదుర్కున్న బోస్నియన్ ముస్లిం మహిళలు అబార్షన్ చేయించుకోవడానికి నిర్ణయించడంపై ఆమె ఇలా వ్యాఖ్యానించింది. “ఈనాడు శాంతిని నాశనం చేస్తున్న అతిపెద్ద అంశాల్లో అబార్షన్ ఒకటని నా అభిప్రాయం. ఎందుకంటే అది ప్రత్యక్ష యుద్ధం. ప్రత్యక్షంగా చంపివేయడం– తల్లే స్వయంగా హత్యకు పాల్పడడం.” అత్యాచారాలు ఎదుర్కున్న స్త్రీలు నిర్వాణం పొందిన ఒక మహోన్నత దయామయి, పేదల ఆపన్నురాలు మదర్ ధెరిసా నుండి ఇంత గొప్ప ఆదరణను స్వీకరించారన్నమాట!
మదర్ ధెరిసా మరణానంతరం నిర్వాణం (beatification) ప్రసాదించడానికి ముందు పాటించవలసిన 5 సంవత్సరాల విరామానికి కూడా వాటికన్ మినహాయింపు ఇచ్చింది. మదర్ థెరిసాకు ఆపాదించబడిన ఆ అద్భుతం ఏమిటయ్యా అంటే తీవ్రమైన పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్న మోనికా బెర్సా అనే మహిళకు నొప్పి నయం చేయడం. మదర్ ధెరిసా ఆశీర్వదించి ప్రసాదించిన మెడలియన్ ను తన పొత్తికడుపు పైన ఉంచడంతో తనకు నొప్పి నయం అయిందని మోనికా సాక్ష్యం ఇచ్చింది. కానీ ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు చెప్పింది వేరు. మోనికా నొప్పికి కారణం ఒవేరియన్ సిస్ట్ మరియు టి.బి. ఆ జబ్బుల కోసం తాము ఇచ్చిన ఔషధాల వల్లనే ఆమెకు జబ్బు నయం అయిందని డాక్టర్లు స్పష్టం చేసినట్లు పరిశోధకులు తెలిపారు. అయితే వాటికన్ అదేమీ పట్టించుకోకుండా దానిని మదర్ ధెరిసా అద్భుతంగా నిర్ధారించి బీటిఫికేషన్ పూర్తి చేశారు. ఆమె పాపులారిటీ ఎంతగా పెరిగిపోయిందంటే ప్రజా సామాన్యం ఆమె గురించి ఇక ప్రశ్నలు వేయకూడనంతగా.
“చర్చిలు ఖాళీ అయిపోతూ, రోమన్ అధికారం దిగనాసిల్లుతున్న పరిస్ధితుల్లో చర్చికి పునర్‌వైభవం సంపాదించి విశ్వాసులలో పునరుత్తేజం నింపడానికి ఈ మదర్ ధెరిసా బీటిఫికేషన్ కంటే మెరుగైన నమూనా ఏమి ఉంటుంది?” అని సెర్గి లారివి ప్రశ్నిస్తున్నాడు. రోగుల బాధలను తగ్గించి నయం చేయడానికి బదులు ఆ బాధలనే స్తుతించిన మదర్ ధెరిసా కార్యక్రమం మోసపూరితమే అయినా ఆ కార్యక్రమాలు సృష్టించిన ఒక మిథ్యా వాతావరణం ఇతరులు నిజంగానే కొద్దిపాటి సేవలకైనా నడుం కట్టడానికి ఉత్తేజం ఇచ్చిందని మదర్ థెరిసాకు అంతకు మించిన ప్రాముఖ్యత లేదని పరిశోధకులు తమ పరిశోధనా నివేదిక ద్వారా తేల్చి చెప్పారు.

అసలు ఈ suffering అనేది Catholic faith లో ఒక ముఖ్య భాగమనుకుంటాను. నేలమీద ఎక్కువమంది suffer ఐతే, దాన్ని తగ్గించివేయడానికి దేవుడు నేలకు దిగివస్తాడట. అదికాక suffering అనేది పాపాలను టోకున cancel చేస్తుందట. ఇలాంటి పిచ్చి అభిప్రాయాలను ప్రాచుర్యంలోకి తెస్తూ church ఎన్నో ఏళ్ళుగా శాడిజాన్ని భక్తిగా promote చేయజూస్తున్నది.
తెరెసా అట్టి మూర్ఖత్వము వంటబట్టించబడిన(brainwashed) పావుమాత్రమే. ఆవిడ చివరిరోజుల్లో దైవం ఉనికిమీద అనుమానాలు వ్యక్తంచేస్తూ, పోపుతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపారు. మీరు ఆవిషయాన్నికూడా ప్రస్తావించి ఉండాల్సింది.
Can you write an article about Delwar Hossein’s death sentence?
మదర్ తెరీసా మీద మీ వ్యాసం చాలా కనువిప్పు గా ఉంది ! ( కానీ కేవలం , ఇది కేవలం మీ బ్లాగు చదివే వారికే ! )
భారత దేశం లో, చాలా మత పరమైన సంస్థలు కోట్ల కొద్దీ విరాళాలు సేకరించడమే కానీ, ఆ డబ్బుఏ విధం గా ( పేదలకు ) ఉపయోగిస్తున్నాయన్న విషయం స్పష్టం గా తెలియచేసిన దాఖలా లు ఏవీ లేవు !
” దేవుడి నిజ స్వరూపం తెలుసుకోవడానికి , ఎంతో సాధన చేయాలి , ఎంతో యోగ సాధన చేయాలి !” అని అంటూ ఉంటారు సామాన్యం గా ! అది సాధ్యమేమో కానీ, దేవుడి పేరు చెప్పుకుని , వివిధ మత సంస్థలు సేకరిస్తున్న విరాళాల గురించి ఎంత సాధన చేసినా అసాధ్యమే !
ఒక వేళ దేవుడు ఉన్నా, అతడు ( లేక ఆమె ) శక్తి హీనులు ! ఎందుకంటే , కోట్లాది పేద ప్రజలను ” పుట్టించడమే ” కాకుండా , వారికి ప్రత్యక్షం గానూ , పరోక్షం గానూ ఏ విధమైన సహాయమూ చేయ లేక పోతున్నాడు !
ఒక వేళ , ” దేవుడు అత్యంత శక్తి సంపన్నుడు ” అనుకుంటే, ” పరమ శాడిస్ట్ ” అయి ఉండాలి ! ఎందుకంటే , దుర్భర దారిద్ర్యం లో కష్టాలు అనుభవిస్తున్న మానవులను చూస్తూ ఉన్నాడు కనుక !
ఇక గర్భ విచ్చిత్తి విషయానికొస్తే ,
గర్భ విచ్చిత్తి ( అబార్షన్ ) చట్టం లో కూడా కేవలం గర్భం కొనసాగిస్తే , ఏ కారణం వల్ల నైనా తల్లి ఆరోగ్యానికి హాని తప్పదన్న సందర్భం లోనే , అబార్షన్ చేయాలి ( లేదా చేయించుకోవాలి ) అని స్పష్టం గా ఉన్నా , అమలు జరిపేది మాత్రం ఎక్కువ గా కేవలం , వారు ఆడ శిశువును గర్భ ధారణ చేసినందుకే ! ( ఈ విషయం ప్రత్యేకించి భారత దేశం లో ! )
గర్భం దాల్చిన కాలం పెరుగుతూ ఉన్న కొద్దీ , శిశువు స్వతంత్రం గా ( అంటే గర్భం బయట ) మనగలుగుతుంది ! అంటే , ఆ కాలం లో గర్భ విచ్చిత్తి కేవలం చట్టపరం గా సమ్మతం అయినా, వివిధ కారణాల వల్ల గర్భ విచ్చిత్తి చేయించు కుంటున్నా , మానవతా దృష్టి తో చూస్తే , శిశు హత్యే కదా !
” సర్వం దైవ మాయ” ! అనే నానుడి ని మనం ” సర్వం మీడియా మహిమ ” అని మార్చు కోవచ్చేమో !
Respected vsheker
I believe the Origen of this article was from some other sources, but not your own.
I am still wondering why you choose this article instead of other issues.
Any way
I want to mention few things here
1) the research institutions in North America and Canada are like similar to western corporate news channels( I am talking about attitude and their objectives)
2) the fundamental hierarchy of the research is, the research should done on both sides of the coin, that means, for example I can publish a paper against grate people like Jesus , Buddha, Rama and vise- versa. And the acceptance of the research again depends up on references, again which is comes from their own archives.( this is the one of the critical reason for rejections of research about Asian countries and including Germany and USSR, because all major research organizations are from North America )
3) now about mother Theresa…..!
She was the only lady dedicated her life for poor people, even though if she made mistakes( there is no such a statement that she hate poor people and she did not serve poor people either) no one is perfect, and at the same time defect either. Because there no scale for perfectness. But the whole planet knows that she was a great lady and she deserve Nobel peace prize
I want to mention one thing to విశేషజ్ఞ, for what ever reason( majorly there are two goals for religion, first spread their religion and next establish peace in the world) whether its god or bad, Christianity is the only religion helping people “directly ” to spread their religion with out making any violence ( crusades are again different )
Conclusion
Bharat rathna mother Teresa had kindness and also she is not selfish
“whether its god or bad, Christianity is the only religion helping people “directly ” to spread their religion with out making any violence”
This is exactly when we should use indirect speech. Which, when used would be :Christianity is the only religions by which people are being helped “directly”. I wanna lay stress on the intention. Yes I agree the Church and the people of Church seem to be making themselves busy in the charity. But charity is not their intention that’s just an overleaf reason. Their intention is to work on the numbers which would only guaranty bigger stacks of cash in future. Yes I agree that no other religious organization seem to be making a gesture the Church seem to be doing and Church seem to be concerned about the people while the others are putting a deaf ear to peoples mundane problems.
Coming to Teresa, I don’t think she is vile, she did what she did because of the faith she had been doctrined. The fault (or the virtue) lies with the faith that spurred to do so. This is exactly the reason I though mentioning her disillusionment in her last days would complete this article.