లిక్కర్ రారాజుకి కష్టాలట! కేంద్రం బెయిలౌట్ ఇచ్చి ఆదుకుంటుందట!!
ప్రజలకి కష్టాలొచ్చినపుడు ఆదుకోవాలనీ, వారికి బెయిలౌట్ ఇవ్వాలనీ ప్రభుత్వాలు భావించిన దృష్టాంతాలు చరిత్రలో దుర్భిణీ వేసినా వెతకినా కనపడవు. కాని జనాలకి మద్యం తాగబోసి, తెగమేసిన సొమ్ముల్ని బొక్కసంలో కుక్కుకుని, తమ మరో కంపెనీ ‘కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్’ కష్టాల్లో ఉందంటూ బీద అరుపులు అరుస్తున్న లిక్కర్ రారాజు విజయ్ మాల్యాకు బెయిలౌట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధ పడుతోంది. ఐ.పి.ఎల్ ఫ్రాంచైజి ల్లో ఒకటయిన పంజాబ్ సూపర్ కింగ్స్ కి సొంతదారు కూడా అయిన విజయ్…