మా బృందంలో ప్రశాంత్ భూషణ్ కొనసాగేదీ లేనిదీ తర్వాత నిర్ణయిస్తాం -అన్నా హజారే
అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు లాయర్ ప్రశాంత్ భూషణ్ పై శ్రీరాం సేన, భగత్ సింగ్ క్రాంతి సేన సభ్యులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు దాడి చేసి కొట్టాక అన్నా హజారే బృందం కేంద్రంగా కొన్ని మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. ‘కాశ్మీరు ప్రజలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వచ్చే ఫలితాల్లో వేరు పడాలని వారు కోరితే వారికా అవకాశం ఇవ్వాలి” అని ప్రశాంత్ భూషణ్, వారణాసిలో జరిగిన ఒక సమావేశంలో చెప్పడమే తమ దాడికి కారణమని…
అమెరికా పచ్చి అబద్ధాల చరిత్రలో ఇంకొక పేజీ
ఈ సారి ఇరాన్ ప్రభుత్వం నేరుగా అమెరికా గడ్డపైనే సౌదీ అరేబియా రాయబారి హత్యకు కుట్ర చేసింది. అందుకు విచిత్రంగా మెక్సికో ‘హిట్ మేన్’ (ఖచ్చితంగా చెబితే కిరాయి గూండా) ను ఇరాన్ కాంట్రాక్టుకు మాట్లాడుకుంది. కాంట్రాక్టు కిల్లర్ ను మాట్లాడాడని అమెరికా చెబుతున్న వ్యక్తి, డ్రగ్స్ కేసుల్లో సి.ఐ.ఎ కి ఇన్‌ఫార్మర్ అన్న విషయం కూడా మరిచిపోయి అమెరికా గొప్ప కుట్రను బైటపెట్టాయి. ఇరాన్ కుట్రకు శిక్షగా అమెరికా తాజాగా మరికొన్ని ఆంక్షలను ఇరాన్ పైన…
“వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం!” -కార్టూన్
– “అయితే, ఈ ఆందోళనకారులను సరిపోయినంతమందిని అరెస్టు చేస్తే ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపడుతుంది. అంతేగా మన ప్లాన్!” — —
సామాజికంగా, జీవ శాస్త్ర పరంగా “జాతి” నిర్వచనం
అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు, పౌర హక్కుల కార్యకర్త, సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ పైన బుధవారం ఢిల్లీలో దాడి జరిగింది. శ్రీరాం సేన, భగత్ సింగ్ క్రాంతి సేన లకు చెందిన సభ్యులు ముగ్గురు ఈ దాడిలో పాల్గొన్నారని పత్రికలు నిర్ధారించాయి. ఒకరు దాడి జరిగినపుడే పట్టుబడగా, మిగిలిన ఇద్దరు గురువారం కోర్టులో లొంగిపోయారు. ఎందుకు లొంగిపోతున్నారని విలేఖరులు ప్రశ్నిస్తే “మేము చట్టాన్ని ఉల్లంఘించాము. అది నేరం. కనుక లొంగిపోతున్నాం” అని చెప్పారు.…
హర్యానాలో టెర్రర్ కుట్ర విఫలం
హార్యానా రాష్ట్రం, అంబాలాలో పార్క్ చేసి ఉన్న కారు నుండి పోలీసులు డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్ధాలు, టైమర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీలలో భాగంగా ఇది వెల్లడి కాకపోవడం గమనార్హం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉప్పందించారని పోలీసులు తెలిపారు. దీనితో మరోసారి టెర్రరిస్టు పేలుళ్ళు జరగకుండా తప్పించుకున్నట్లైంది. సమాచారం అందుకున్నాక ఢిల్లీ, హర్యానా పోలీసులు ఇరువురూ ఉమ్మడిగా పార్కింగ్ చేసి ఉన్న బ్లూ ఇండికా కారును తనిఖీ చేశారు. “ఐదు డిటోనేటర్లు, రెండు టైమర్…
ఇప్పుడు, తెలంగాణ పరిష్కారం కోసం రెండో ఎస్సార్సీ వేయడం అంటే……
ప్రస్తుత పరిస్ధితుల్లో తెలంగాణ సమస్య పరిష్కారం కోసం రెండో ఎస్.ఆర్.సి వేయడం అంటే, నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకోవడమే. —–సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ – (ఇంతకీ గాడిద ఎవరు చెప్మా!!!) — —
టీం అన్నా సభ్యుడిపై ‘శ్రీరాం సేన’ దాడి, కాశ్మీరు సమస్యపై వ్యాఖ్యే కారణం
మత మూఢులకి పరమత సహనం ఎలాగూ ఉండదు. వారికి ప్రజాస్వామ్య భావాల పట్ల కూడా గౌరవం ఉండదు. తమ నమ్మకాలకు భిన్నమైన భావాలను సహించడాం వారి వల్ల కాదు. అది ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం కావొచ్చు, లేదా క్రిస్టియన్ మతం కావొచ్చు. అందుకు తార్కాణంగా సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టు ప్రాంగణంలోనే బుధవారం ఒక సంఘటన చోటు చేసుకుంది. అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు, సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాది అయిన ప్రశాంత్ భూషణ్…
యూరప్ సంక్షోభంలోనూ దండుకుంటున్న ధనికులు -కార్టూన్
యూరప్ రుణ సంక్షోభం యూరప్ ప్రజలకు ఉద్యోగాలు లేకుండా చేసింది. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది. కొత్త ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంది. సామాజిక సదుపాయాలు రద్దు పరిచింది. ప్రభుత్వరంగ కంపెనీలను ప్రవేటోడిక అమ్మించింది. ప్రజలను ఇంతగా అతలా కుతలం చేసి సామాజిక సంక్షోభాలను (ఉదా: లండన్ అల్లర్లు) కూడా సృష్టించిన యూరప్ రుణ సంక్షోభం ధనికులను తాకలేకపోయింది. కారణం గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ సంక్షోభాల పేరుచెప్పి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఆ దేశాలకు ఇచ్చిన బెయిలౌట్ రుణాలు నిజానికి…
రంగులను చూడడంలో స్త్రీ, పురుషుల మధ్య తేడా -బొమ్మ
ఈ బొమ్మ సైంటిఫిక్ కోణం నుండి గీసినది కాదు. శాస్త్ర పరంగా ఈ బొమ్మ కరెక్టు కాదు. ఇది సామాజిక కోణం నుండి చూస్తూ గీసిన చిత్రం. స్త్రీలు బాగా అలంకరించుకుని అందంగా తయారై అందర్నీ ఆకట్టుకోవలసిన బాధ్యత ఉన్నదని సమాజం నేర్పింది. ఉంటే వంటిల్లు, బైటికొస్తే భర్త పక్కన అందమైన భార్యగా, ఆమె అందాన్ని చూసి ఆమె భర్త పట్ల పలువురు ఈర్ష్య పడేలా ఉండాలని సమాజం వివిధ నియమ నిబంధనల ద్వారా స్త్రీలకు నేర్పింది.…
‘ఇరవై సంవత్సరాల్లో ఇజ్రాయెల్ నాశనం’, రెండేళ్ళ క్రితమే హెచ్చరించిన అమెరికా
తన మూర్ఖ పద్ధతులను మార్చుకోకపోతే మరో ఇరవై ఏళ్లలో ఇజ్రాయెల్ ఒక దేశంగా అంతరించడం ఖాయమని అమెరికా రెండేళ్ల క్రితమే హెచ్చరించింది. ఈజిప్టు, ట్యునీషీయా తిరుగుబాట్లగురించి రెండేళ్ల క్రితం అసలు ఊహించనైనా సాధ్యం కాదు. అటువంటి పరిస్ధుతుల్లోనే అమెరికా ఇటువంటి హెచ్చరిక చేసిందంటే గత తొమ్మిది నెలలుగా అరబ్ దేశాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి ఇజ్రాయెల్ అంతానికి ఇరవై సంవత్సరాలు కూడా అవసరం లేదేమో! ఒబామా అధ్యక్ష భాధ్యతలు స్వీకరించిన మూడు వారాల తర్వాత జనవరి 2009లో…
మానవ లిబర్టీ విగ్రహం -1918 నాటి ఫొటో
18,000 మంది అమెరికా సైనికులు లిబర్టీ విగ్రహం ఆకారంలో నిలబడి ఉండగా తీసిన ఫోటో ఇది. 1918 సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఐవా నగరంలో ‘కేంప్ డాడ్జి’ వద్ద తీసిన ఫొటో ఇది. విగ్రహంలో వివిధ ఎఫెక్టులు రావడం కోసం కొంతమంది సైనికులు టోపిలు ధరిస్తే మరికొందరు టోపిలు లేకుండా నిలబడ్డారు. కొన్ని చోట్ల టోపి ధరించి తల వంచి నిలుచుంటే, మరికొన్ని చోట్ల టోపితో తల ఎత్తి నిలబడ్డారు. టోపి లేకుండా కూడా…
కరుణానిధి తండ్రి హృదయం
సోమవారం మారన్ సోదరుల ఇళ్ళపైన సి.బి.ఐ అధికారులు దాడి చేసి రోజంతా తనిఖీలు జరిపి కీలకమైన రికార్డులు పట్టుకెళ్ళారు. –వార్త కరుణా నిధి: నేను నా కూతురు కనిమొళినీ మారన్ సోదరులనూ సమానంగా చూస్తాను. (అందుకే కనిమొళి ఉన్నచోటుకే మారన్ సోదరులను కూడా పంపించాలని చూస్తున్నారు) – — —
దళితులైతేనేం? ఆడవాళ్లు ఆడవాళ్ళే!
దళితులకంటే దళితులు స్త్రీలని మరోసారి రుజువైంది. ఓ దళిత మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులతో సంబంధాలున్న ఓ ధనిక దళిత కుటుంబం తోటి పేద దళిత మహిళను నగ్నంగా గ్రామంలో ఊరేగించిన దారుణం చోటు చేసుకుంది. కక్ష సాధించే క్రమంలో డబ్బుకీ, రాజకీయ పలుకుబడికీ స్త్రీలే ప్రధమ లక్ష్యమని ఈ సంఘటన మరొకసారి చాటి చెప్పింది. విడాకులు తీసుకున్న తమ కూతురు వేరే యువకుడితో కలిసి గ్రామం నుండి వెళ్ళిపోవడానికి సాయం చేశాడని బాధిత…
ముంబై దాడులపై పాక్ కోర్టు విచారణ: దాడుల పర్యవేక్షకుని గొంతుతో పాక్ నిందితుడి గొంతు సరిపోలింది
ముంబై టెర్రరిస్టు దాడులకు సంబంధించి పాకిస్ధాన్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులలో ఒకరి గొంతు ముంబై దాడులను పాకిస్ధాన్ నుండి పర్యవేక్షించిన వ్యక్తి గొంతుతో సరిపోలిందని పాకిస్ధాన్ పోలీసు సాక్షి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. పాకిస్ధాన్ కి చెందిన యాంటి టెర్రరిజం కోర్టు (ఎ.టి.సి) ముంబై దాడులపై విచారిస్తున్న సంగతి తెలిసిందే. ముంబై దాడులకు సంబంధించి వివిధ సాక్ష్యాలను ఇండియా, పాకిస్ధాన్ కు సమర్పించింది. ఈ సాక్ష్యాలలో పాకిస్ధాన్ నుండి ముంబై దాడులను పర్యవేక్షించిన వ్యక్తి గొంతును…