ఈ వికలాంగుల్ని చూస్తే స్ఫూర్తి కోసం వెతుక్కోవాల్సిన పని లేదు -ఫోటోలు

ఈ అధ్లెట్లని వికలాంగులని సంబోధించడానికి నిజానికి సిగ్గుపడాలి. కానీ అవధుల్లేని వీరి ఆత్మవిశ్వాసం యొక్క గ్రావిటీని అర్ధం చేసుకోవాలంటే వారి అంగవైకల్యాన్ని రిఫరెన్స్ గా తీసుకోక తప్పదు. కాసిన్ని కష్టాలు చుట్టుముడితేనో, ఆశించిన కాలేజీ సీటో, ఉద్యోగమో దక్కకపోతేనో, నచ్చిన వ్యక్తి భాగస్వామిగా దక్కకపోతేనో, మరింకేదో కష్టం ఎదురైతేనో… జీవితాల చివరి ఘడియల్ని వాటేసుకోవడానికి ఆతృత పడే బలహీన మనస్కులకు ఈ పారా-ఒలింపియన్ల జీవోన్మాదం కనువిప్పు కలిగిస్తుంది. 14 వ పారాలింపిక్స్ లండన్ లో ఆగస్టు 29…

అంతర్జాతీయ సభలో డీజెల్ రేట్లపై ప్రధానికి నిరసన

న్యూ ఢిల్లీలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని మన్మోహన్ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ‘ఆసియాలో ఆర్ధిక వృద్ధి, కార్పొరేట్ వాతావరణంలో మార్పులు’ అన్న అంశంపై జరిగిన సమావేశంలో ప్రధాని ప్రసంగించడానికి లేచినపుడు సుప్రీం కోర్టు అడ్వకేటు ‘సంతోష్ కుమార్’ చొక్కా విప్పి నిరసన తెలిపాడు. పెంచిన డీజెల్ ధరలని తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాడు. నినాదాలతో ప్రధాని తన ప్రసంగాన్ని కొద్ది నిమిషాలు ఆపవలసి వచ్చిందని ‘ది హిందూ’ తెలిపింది. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్…

కూడంకుళం: ఆగని నిరసనలు, ట్యుటికోరిన్ పోర్టు సీజ్

కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా లక్షలాది గ్రామ ప్రజలు సాగిస్తున్న పోరాటం కొనసాగుతోంది. ప్రజల భయాలు, ఆందోళనలు పట్టించుకోకుండా కూడంకుళం అణు రియాక్టర్ లో యురేనియం ఇంధన కడ్డీలను నింపడం ప్రారంభం అయిన నేపధ్యంలో మత్స్యకారులు వెయ్యికి పైగా పడవలతో ట్యుటికోరిన్ పోర్టును శనివారం దిగ్బంధించారు. తమిళనాడు తీరం అంతటా మత్స్యకారులు ఆందోళన చేయాలని PMANE (Peoples Movement Aganist Nuclear Energy) ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఈ నిరసనను చేపట్టారు. మరో వైపు అణు…

కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయాలి? ఏం చేస్తున్నాయి?

బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలు భారత దేశంలోని దోపిడి వర్గాలైన భూస్వాములు, పెట్టుబడుదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు. ఇవి పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ప్రభుత్వాధికారం చేతికి వచ్చాక దోపిడీవర్గాల ప్రయోజనాలే నెరవేరుస్తాయి. శ్రామిక ప్రజల ప్రయోజనాలను అవి పట్టించుకోవు. పట్టించుకోకపోగా హక్కుల కోసం, మెరుగైన జీవనం కోసం ప్రయత్నించే ప్రజలపైన అణచివేతను అమలు చేస్తాయి. అమెరికా తదితర పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు వీరి ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు కట్టుబడి ఉంటాయి. సామ్రాజ్యవాదులకు…

ఒకే వేదికపై బి.జె.పి, లెఫ్ట్ పార్టీలు

బి.జె.పి, లెఫ్ట్ పార్టీల నాయకులు ఢిల్లీలో కలకలం సృష్టించారు. చిల్లర వర్తకంలో 51 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించినందుకు నిరసనగా ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ సందర్భంగా ఉప్పు, నిప్పుగా ఉండవలసినవారు ఒకే వేదికపైకి చేరారు. వ్యాపారులు నిర్వహించిన నిరసన సభలో బి.జె.పి, లెఫ్ట్ పార్టీల అగ్రనాయకులు ఆసీనులై పత్రికల, విశ్లేషకుల ఊహాగానాలకు పని పెట్టారు. ఇది దేశ రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చే పరిణామం కాకపోయినప్పటికీ వామపక్ష పార్టీల ప్రకటిత విధానాలు తెలిసినవారు భృకుటి ముడివేసే పరిణామమే.…

అచంగ మార్కు డొల్ల శాస్త్రీయత మరొక్కసారి…

ఎకాలజిస్టు అచంగ గారు మళ్ళీ పాఠకులను తప్పుదారి పట్టించే పనిలో పడ్డారు. ఆయన నన్ను ఉద్దేశించి రాసిన తాజా టపాలో ఇలా రాశారు. ఇంకా తమరేమన్నారంటే, “అసలీయన సవాలు విసిరిందే ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్‌ల దాకా రాలేదని“ఈ ముక్క చెప్పి చెలరేగిపోయారు! తమరికి తెలుగు రాకపోయన్నా ఉండాలి లేదా ఒక వ్యక్తి వ్యాఖ్యలను తమ నరంలేని నాలుక వంకర్లు తిప్పి అయినా ఉండాలి. నేనన్నదేమిటి మీరు చెప్పింది ఏమిటి? “అణుధార్మికత యూరోపు వరకూ విస్తరించిందనటానికి ఆధారాలేవైనా…

నిలువునా చీలిన అన్నా బృందం, చిచ్చు పెట్టిన రాజకీయ పార్టీ ఆలోచన

“బృందం వేరు పడడం దురదృష్టకరం… ఎటువంటి రాజకీయ పార్టీలోనూ, గ్రూపులోనూ నేను చేరేదిలేదు. వారి ప్రచారానికి నేను వెళ్లను. ప్రచారం సందర్భంగా నా ఫోటోని గానీ, నా పేరుని గానీ వాడుకోవద్దని వారికి చెప్పాను. మీరు స్వంతంగా పోరాడండి.” అరవింద్ కేజ్రీవాల్ తో తెగతెంపులు చేసుకుంటూ అన్నా హజారే చేసిన ప్రకటన ఇది. కేజ్రీవాల్ తో విభేధాలున్నాయని అంగీకరించిన తర్వాత రోజే అన్నా, తాజా ప్రకటనతో రాజకీయ పార్టీ ఆలోచన నుండి పూర్తిగా వైదొలిగినట్లయింది. ఆగస్టులో అరవింద్…

యు.పి.ఎ కి మమత సెలవు, మైనారిటీలో కేంద్ర ప్రభుత్వం

మమత బెనర్జీ చెప్పినట్లే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అనుమతి, డీజెల్ రేట్ల పెంపుదల, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీలో భారీ కోత… నిర్ణయాలను ఉపసంహరించుకోవాలంటూ మమత విధించిన 72 గంటల గడువు ముగిశాక మద్దతు ఉపసంహరిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ నేత ప్రకటించింది. కోల్ గేట్ కుంభకోణం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ఒక్కుమ్మడిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందన్న అద్వానీ ఆరోపణలను మమత ఉద్ఘాటించింది. ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకున్నట్లయితే…

మంత్రి కన్నా గారూ! మంత్రి పదవులకి బోలెడుమంది రెడీ

“బిజినెస్ రూల్స్ ప్రకారమే జి.ఒ లు జారీ చేశాం. ఈ జి.ఒ లని తప్పు పడితే భవిష్యత్తులో ఎవరూ మంత్రి పదవి చేపట్టరు.” (టి.వి 5) ఈ మాటలన్నది రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ.  జగన్ అవినీతి కేసులో తమకి సుప్రీం కోర్టు జారీ చేసిన నోటీసుల వల్ల భవిష్యత్తులో మంత్రి పదవులు నిర్వహించడానికి ఎవరూ ముదుకు రారేమోనని మంత్రిగారికి అర్జెంటుగా భయం పట్టుకుంది. కోర్టులు ఇలాగే అవినీతి పేరుతో మంత్రులకి నోటీసులు ఇస్తూ భయపెడుతుంటే…

భారత విద్యుత్ అవసరాలు అణు విద్యుత్ తీర్చేనా? -కార్టూన్

విద్యుత్ అవసరాలు తీర్చుకునేందుకు భారత దేశం చేసే ప్రయాణంలో అణు విద్యుత్ కర్మాగారాలు సహాయపడతాయా?  లేక ఆటంకం కలిగిస్తాయా? ‘ది హిందూ’ కార్టూనిస్టు ‘కేశవ్’ కాసిన్ని గీతలు గీసి, మరి కాసిన్ని రంగులు అద్ది వివరించారు. అమెరికన్ అణు పరిశ్రమ వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికే భారత్-అమెరికాల మధ్య ‘అణు ఒప్పందం’ కుదుర్చుకున్నామని అణు నియంత్రణ సంస్ధ ఎ.ఇ.ఆర్.బి మాజీ అధిపతి గోపాల కృష్ణన్ సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టాడు. గతంలో అణు…

ప్రపంచ వ్యాపితంగా అమెరికా వ్యతిరేక నిరసనలు -ఫోటోలు

ఒక అమెరికన్ యూదు (నకౌలా బెస్సెలే నకౌలా) నిర్మించాడని చెబుతున్న ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ సినిమా కు నిరసనగా సెప్టెంబరు 11 తేదీన ప్రారంభమయిన నిరసనలు ప్రపంచం అంతటా విస్తరించాయి. కైరో, బెంఘాజీ నగరాల్లో జరిగిన హింసాత్మకం దాడుల అనంతరం పెచ్చరిల్లిన ఈ నిరసనలు ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ లకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడ్డాయి. అమెరికా ఎంబసీలు నిరసనలకు, విధ్వంసాలకు లక్ష్యంగా మారాయి. తమ ఎంబసీలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెబుతూనే అమెరికా కొన్ని అరబ్,…

అణుకంప కేంద్రం! -ఈనాడు ఎడిటోరియల్

(అణు విద్యుత్ కి వ్యతిరేకంగా దేశంలో క్రమంగా నిరసన వ్యాపిస్తోంది. ప్రజల పట్ల జవాబుదారీతనం లేని ప్రభుత్వాల వ్యవహార శైలి మేధో జీవులను కదిలిస్తోంది. ప్రజల భయాలకు సమాధానం చెప్పే బదులు ‘జీవించే హక్కు’ ను కోరడమే ‘దేశ ద్రోహం’ కింద లెక్కిస్తున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాల ‘ప్రజాస్వామిక డొల్లతనాన్ని’ పత్రికలు కూడా ప్రశ్నిస్తున్నాయి. సోమవారం, సెప్టెంబర్ 17 తేదీ నాటి ఈనాడు దిన పత్రిక సంపాదకీయం, కేంద్ర ప్రభుత్వ ఆలోచనా రాహిత్యాన్ని తూర్పారబట్టింది. ఆ సంపాదకీయమే ఇది.)…

లిబియా ఎంబసీపై దాడులు అమెరికాకి ముందే తెలుసు -ది ఇండిపెండెంట్

లిబియాలో అమెరికా రాయబారి హత్యకు దారి తీసిన ‘ఆల్-ఖైదా’ దాడుల గురించి అమెరికాకి ముందే తెలిసినా ఏమీ చేయలేదని బ్రిటన్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ వెల్లడి చేసింది. సెప్టెంబరు 11, 2012 తేదీన లిబియా నగరం బెంఘాజీ లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో రాయబారి క్రిస్టఫర్ స్టీవెన్స్, మరో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందిన సంగతి విదితమే. అమెరికా మద్దతుతో లిబియాను పాలిస్తున్న ఆల్-ఖైదా గ్రూపుల్లోని ఒక గ్రూపు అమెరికా రాయబారి హత్యకు బాధ్యురాలు.…

ఆఫ్ఘన్ దురాక్రమణ: 3 రోజుల్లో 8 మంది నాటో సైనికులు హతం

శుక్రవారం నుండి ఆదివారం వరకూ మూడు రోజుల పరిధిలో ఎనిమిది మంది నాటో సైనికులు హతమయ్యారు. ఆఫ్ఘన్ ప్రతిఘటనా దళాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే సైనిక స్ధావరాలపై దాడులు చేసి శుక్రవారం ఇద్దరు, శనివారం మరో ఇద్దరు, ఆదివారం నలుగురు విదేశీ దురాక్రమణ సైనికులను చంపేశారు. చనిపోయిన విదేశీ సైనికులు ఏ దేశానికి చెందినదీ తెలియలేదు. వాయవ్య ఆఫ్ఘనిస్ధాన్ లోని బ్రిటిష్ స్ధావరంలో శుక్రవారం చనిపోయిన ఇద్దరు అమెరికా సైనికులని, శనివారం చనిపోయిన ఇద్దరు…

చంద్రబాబు నాయుడు గారూ! గ్యాస్ బండ మోస్తే, నిరసనా?

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పెంచింది. పెంచడం పరోక్షంగా జరిగినా జనంపైన మాత్రం ప్రత్యక్షంగా బాదేసింది. సంవత్సరానికి కుటుంబానికి 6 సిలిండర్లు మాత్రమే సబ్సిడీ రేట్లకు ఇస్తానని చెప్పింది. తద్వారా మిగిలిన సిలిండర్లను ఓపెన్ మార్కెట్లో 750/- ధరకి కొనక తప్పని పరిస్ధితి కల్పించింది. బి.జె.పి నాయకుడు వెంకయ్య నాయుడు ప్రకారం ప్రతి కుటుంబం పైనా సంవత్సరానికి అదనంగా 750 రూపాయల భారం పడనుంది. ఈనాడు ఎడిటోరియల్ ప్రకారం ఐదుగురు ఉన్న కుటుంబానికి…