మంగళయానం: చైనా ప్రశంసల జల్లు

అంగారక ప్రయాణాన్ని విజయవంతం చేసినందుకు ఇండియాపై చైనా ప్రశంసల వర్షం కురిపించింది. రష్యా కూడా ఇండియాను అభినందించింది. మంగళయానం విజయవంతం కావడం ఒక్క ఇండియాకు మాత్రమే గర్వకారణం కాదని ఆసియా ఖండానికి అంతటికీ గర్వకారణం అనీ చైనా ప్రశంసించడం విశేషం. మంగళయానం విజయం ద్వారా ఇండియా, చైనాకు అంతరిక్ష యానాంలో గట్టి పోటీదారుగా అవతరించిందని భారత పత్రికలు వ్యాఖ్యానించాయి. అయితే చైనా మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించింది. ఇండియా విజయం తన ఆసియా సహోదరుడి విజయం కనుక…

చెక్ చేసుకోండి! 5 మిలి. జీమెయిల్ పాస్ వర్డ్ లు లీక్

యాపిల్ అయింది, ఇప్పుడు జీ మెయిల్ వంతు వచ్చింది. యాపిల్ కంపెనీకి చెందిన ఐ క్లౌడ్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు పలువురు సెలబ్రిటీల (పశ్చిమ దేశాలకు చెందినవారు) నగ్న చిత్రాలను దొంగిలించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన ఉదంతం మరువక ముందే, జీ మెయిల్ కు చెందిన 5 మిలియన్ల వినియోగదారుల యూజర్ నేమ్ లు, పాస్ వర్డ్ లను హ్యాకర్లు సంపాదించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. బిట్ కాయిన్ సంస్ధ నిర్వహించే ఒక…

సి.బి.ఐ పరిశోధనపై పరిశోధన -కార్టూన్

దేశంలో అత్యున్నత స్ధాయి పరిశోధన సంస్ధ సి.బి.ఐ. ప్రభుత్వంలోనూ, బ్యూరోక్రసీలోనూ ఉన్నత స్ధానాలను ఆక్రమించి ఉన్న స్వార్ధపర ఆశపోతులను, దొంగలను పట్టుకుని విచారించి శిక్షపడేలా చూడవలసిన సి.బి.ఐ అధికారులు సదరు ఉన్నత స్ధాయి నేరస్ధులతోనే కుమ్మక్కు అవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో అవినీతిని ప్రముఖంగా చర్చలోకి తెచ్చిన కుంభకోణం 2జి కుంభకోణం. ఈ కుంభకోణంలో నిందితులైన సీనియర్ బ్యూరోక్రాట్ అధికారులు క్రమం తప్పకుండా సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ ఇంటికి వెళ్తున్నారని ఎఎపి నేత, సుప్రీం…

ఇండియా-ఆస్ట్రేలియా: కుదిరిన అణు ఒప్పందం

ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ఇండియా పర్యటన ఫలితంగా ఇరు దేశాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. దాదాపు రెండు సంవత్సరాలుగా విడతలు విడతలుగా జరిగిన చర్చలు ఫలప్రదమై శుక్రవారం సంతకాలతో ఒప్పందం రూపం సంతరించుకున్నాయి. “పౌర అణు సహకార ఒప్పందం” గా పిలుస్తున్న ఈ ఒప్పందానికి అమెరికా ఆమోదం ఉంది. అమెరికా ‘ఊ’ అనకుండా ఒప్పందం సాధ్యం కాదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్.పి.టి) పై ఇండియా సంతకందారు కానప్పటికీ ఆస్ట్రేలియాతో అణు…

మోడి: జపాన్ షరతులతో అణు ఒప్పందం వాయిదా

భారత ప్రధాని నరేంద్ర మోడి జపాన్ పర్యటనలో ఇండియా-జపాన్ ల మధ్య చరిత్రాత్మక అణు ఒప్పందం ఆమోదం పొందుతుందని పలువురు భావించారు. అందుకే ప్రపంచ అణు పరిశ్రమతో వివిధ రకాలుగా సంబంధం ఉన్నవారందరూ మోడి పర్యటనను ఆసక్తిగా, ఆశగా, భయంగా, ఆందోళనగా తిలకించారు. చివరికి ఒప్పందం కుదరకపోవడంతో పరిశ్రమ వర్గాలు తమ తమ స్ధానాలను బట్టి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ నిట్టూర్చగా ప్రజల తరపున ఆలోచించేవారు ‘పోనీలెమ్మ’ని ఊపిరి పీల్చుకున్నారు. ఒప్పందం కుదరకపోవడానికి కారణం జపాన్ విధించిన విషమ…

ఎఫ్.డి.ఐల కోసం మోడీ అన్నీ తానే అయి…

జపాన్ పర్యటనను భారత ప్రధాని మోడి ముగించుకున్నారు. పర్యటనలో ఉండగా ఆయన జపాన్ పెట్టుబడుల కోసం ఎన్ని విన్యాసాలు ప్రదర్శించిందీ ఈ కార్టూన్ తెలియజేస్తోంది. భారత దేశంలో రెడ్ టేపిజం తొలగించి దానికి బదులు విదేశీ కంపెనీలకోసం రెడ్ కార్పెట్ పరుస్తామని మోడి ప్రకటించారు. దేశంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టదలిస్తే ఏ దేశమైనా కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంది. స్వేచ్చా మార్కెట్ సూత్రాలను పాటిస్తామని చెప్పుకునే అమెరికా, ఐరోపాలు కూడా వివిధ సుంకాలు, పన్నులు, అనుమతులను ఎఫ్.డి.ఐ…

రష్యా ఆంక్షలను దాటేందుకు ఇ.యు వక్రమార్గం

ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో రష్యాపై అట్టహాసంగా ఆంక్షలు ప్రకటించిన యూరోపియన్ దేశాలు, అవే ఆంక్షలను రష్యా తమపై విధించేసరికి కిందిమీదులవుతున్నాయి. అమెరికా, ఇ.యు, కెనడా, నార్వే, ఆస్ట్రేలియా దేశాల నుండి వచ్చే ఆహార దిగుమతులపై రష్యా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను తప్పించుకునేందుకు యూరోపియన్ యూనియన్ కంపెనీలు స్విట్జర్లాండ్, దక్షిణ అమెరికా దేశాల లాంటి ప్రత్యామ్న్యాయ వాణిజ్య మార్గాల ద్వారా తమ ఎగుమతులు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ స్విట్జర్లాండ్ సహాయ నిరాకరణతో ఈ ప్రయత్నాలకు చెక్ పడింది.…

రష్యాలో ఇక చైనా క్రెడిట్ కార్డులు

అంతర్జాతీయ ద్రవ్య రంగంలో అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతూ రష్యా మరో నిర్ణయం తీసుకుంది. చైనా క్రెడిట్ కార్డుల సంస్ధ యూనియన్ పే కార్డులను దేశంలో వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో రష్యాపై అమెరికా ఆంక్షలు ప్రకటించడంతో వీసా, మాస్టర్ కార్డ్ సంస్ధల క్రెడిట్ కార్డులను రష్యా దేశం నుండి తన్ని తగలేసింది. అమెరికా ఆంక్షలను అనుసరించి కొన్ని రష్యన్ కంపెనీల ఖాతాలను వీసా, మాస్టర్ కార్డ్ లు స్తంభింపజేశాయి. అందుకు ప్రతీకారంగా చైనా…

అమెరికా విదేశీ మంత్రులపై జర్మనీ గూఢచర్యం

తమ దేశంలో గూఢచర్యం చేసినందుకు అమెరికాపై కారాలు మిరియాలు నూరుతున్న జర్మనీ అమెరికా పైన తానూ అదే నిర్వాకానికి పాల్పడింది. ఈ సంగతి జర్మనీ పత్రిక డెర్ స్పీజెల్ బైట పెట్టింది. అయితే అది పొరబాటున జరిగిందని అది కూడా ఒక్కసారే జరిగిందని ఆ పత్రిక చెబుతోంది. ఒబామా మొదటి అధ్యక్షరికంలో విదేశీ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) గా హిల్లరీ క్లింటన్ పని చేయగా రెండో విడత అధ్యక్షరికంలో జాన్ కెర్రీ పని చేస్తున్నారు. వీరిద్దరి…

TAPI గ్యాస్ పైప్ లైన్: ఫ్రెంచి కంపెనీ ఆసక్తి

ఫ్రాన్స్ కు చెందిన బడా బహుళజాతి చమురు & సహజవాయువు కంపెనీ టోటల్ (TOTAL) భారత్ కు గ్యాస్ తెచ్చే పైప్ లైన్ పై ఆసక్తి ప్రదర్శిస్తోంది. తుర్క్ మెనిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్-పాకిస్ధాన్-ఇండియా (T-A-P-I) దేశాల మీదుగా సాగే ఈ పైప్ లైన్ నిర్మాణంలో తానూ భాగం పంచుకుంటానని టోటల్ ముందుకు వచ్చింది. ఇరాన్ నుండి గ్యాస్ ను తెచ్చే పీస్ పైప్ లైన్ (ఇరాన్-పాకిస్ధాన్-ఇండియా) నుండి వెనక్కి తగ్గి అమెరికా ఒత్తిడితో TAPI పైప్ లైన్ వైపు మొగ్గు…

ద.చై.సముద్రం: అమెరికా ప్రతిపాదనను లెక్క చేయని ASEAN

దక్షిణ చైనా సముద్రంలో మరోసారి ఉద్రిక్తతలు రేపడానికి అమెరికా చేసిన ప్రయత్నం విఫలం అయినట్లు కనిపిస్తోంది. సముద్రంలో చైనా ప్రారంభించిన చమురు డ్రిల్లింగ్ కార్యకలాపాలను స్తంభింపజేయాలని అమెరికా ప్రతిపాదించగా ASEAN దేశాలు సదరు ప్రతిపాదనను తాము చర్చించనేలేదు పొమ్మన్నాయి. అసలు దక్షిణ చైనా సముద్రంలో సమస్యలు ఉన్నాయని ఎవరన్నారని చైనా ప్రశ్నించింది. ASEAN గ్రూపు దేశాలే అమెరికా ప్రతిపాదనను పట్టించుకోకపోవడంతో అమెరికా పరువు గంగలో కలిసినట్లయింది. ASEAN రీజినల్ ఫోరం సమావేశాలు మియాన్మార్ రాజధానిలో ఈ వారాంతంలో…

మోడిని ప్రసన్నం చేసుకోలేని కెర్రీ? -కార్టూన్

అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ కొద్ది రోజుల క్రితం ఇండియా వచ్చి వెళ్లారు. మోడి రాక కోసం తమ అధ్యక్షుడు బారక్ ఒబామా ఆత్రంగా ఎదురు చూస్తున్నారన్న సందేశాన్ని మోసుకొచ్చిన కెర్రీ, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా మోడీ ముందు వ్యవహరించారని కార్టూన్ సూచిస్తోంది. దేవయాని ఖోబ్రగదేను అమెరికాలో అరెస్టు చేసినప్పటి నుండి ఇరు దేశాల సంబంధాలు క్షీణ దశలో ఉన్నాయని పత్రికలు చెప్పే మాట. మోడి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న…

రిలయన్స్ చేతిలో ఐ.బి.ఎన్ ఛానెళ్లు, ఎడిటర్ల రాజీనామా

నెట్ వర్క్ 18 మీడియా గ్రూపుకు చెందిన మీడియా ఛానెళ్లు రిలయన్స్ కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆ గ్రూపులోని వివిధ ఛానెళ్ల ఎడిటర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. రిలయన్స్ యాజమాన్యం ఎడిటోరియల్ విధానంలోనూ, న్యూస్ కవరేజీ లోనూ జోక్యం చేసుకోవడం పెరగడంతో తాను రాజీనామా చేయక తప్పలేదని ఒక ఎడిటర్ చెప్పగా అదే విషయాన్ని మరో ఎడిటర్ పరోక్షంగా సూచించారు. భారత చట్టాలను ఎగవేస్తూ ప్రభుత్వం విధించే కోట్ల రూపాయల అపరాధ రుసుములను ఎగవేయడంలోనూ అగ్రభాగాన ఉన్న…

సి.బి.ఐ విచారణలో గూగుల్ మ్యాప్స్

గూగుల్ ఇండియా కంపెనీపై పోలీసులు వేసిన కేసు సి.బి.ఐ చేతుల్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. భారత పౌరులకు గూగుల్ నిర్వహించిన మేపధాన్-2013  పోటీ వల్ల దేశ భద్రతకు ప్రమాదం అని బి.జె.పి ఎం.పి లు గత సం. ఫిర్యాదు చేయడంతో గూగుల్ అతి తెలివి వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదును సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ధారించడంతో పోలీసులు విచారణ చేపట్టినట్లు గత సం. ఏప్రిల్ లో పత్రికలు తెలిపాయి. ఈ కేసును స్వీకరించిన సి.బి.ఐ ‘ప్రాధమిక విచారణ’…

సివిల్స్ డైరెక్టివ్ ‘డిస్కస్’ గురించి… -ఈనాడు

సివిల్స్ పరీక్షల్లో కొశ్చెన్ ట్యాగ్స్ (డైరెక్టివ్) గురించి ఈనాడు చదువు పేజీలో చర్చిస్తున్నాము. ఈ వారం భాగంలో ‘డిస్కస్’ అనే డైరెక్టివ్ గురించి రాశాను.  గత సంవత్సరం ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఒక ప్రశ్నను ఉదాహరణగా తీసుకుని చర్చించాను. తెలుగు పత్రికల్లో పెద్దగా చర్చకు రాని షేల్ గ్యాస్ గురించిన ప్రశ్నను తీసుకుని సమాధానం ఎలా రాయవచ్చో వివరించాను. ఈనాడు వెబ్ సైట్ లో ఈ వారం భాగాన్ని చూడాలనుకుంటే కింది లింక్ ను క్లిక్ చేయగలరు. వివరంగా……