అణు ఒప్పందం పురోగతిపై అమెరికా నిస్పృహ!?

2008లో ఇండియా, అమెరికాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం ఎటువంటి పురోగతి లేకుండా స్తంభించిపోవడం పట్ల అమెరికా నిస్పృహగా ఉందిట. అంతర్జాతీయ అణు ఏకాకితనం నుండి ఇండియాను బైటపడేసినా అమెరికాకు ఇంతవరకూ పైసా ప్రయోజనం లేకపోవడం అమెరికా నిస్పృహకు కారణం. కానీ ఈ వ్యవహారంలో దోషులు ఎవరన్న విషయంలో అమెరికా అమాయకత్వం నటించడమే ఆశ్చర్యకరం. అణు రియాక్టర్, తదితర అణు పరికరాలు లోప భూయిష్టమైనవి సరఫరా చేసినందువల్ల అణు ప్రమాదం సంభావిస్తే అందుకు ఆ పరికరాలు అమ్మిన కంపెనీ…

రిలయన్స్ పై మరో 3.5 వేల కోట్ల జరిమానా

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పై కేంద్రం మరో 579 మిలియన్ డాలర్ల (సుమారు రు. 3.5 వేల కోట్లకు సమానం) జరిమానా విధిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ చమురు సహజవాయువు మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఈ సంగతి తెలిపారు. 2013-14 సంవత్సరంలో కాంట్రాక్టు మేరకు సహజవాయువు ఉత్పత్తి చేయనందుకు గాను ఈ జరిమానా విధించామని చెప్పారు. దీనితో రిలయన్స్ కంపెనీపై విధించామని కేంద్రం చెప్పిన జరిమానా మొత్తం…

బంగాళాఖాతం వివాదం: ఐరాస బంగ్లాదేశ్ అనుకూల తీర్పు

మూడు దశాబ్దాల నాటి సముద్ర జలాల సరిహద్దు వివాదంలో ఐక్యరాజ్య సమితి సంస్ధ ఒకటి ఇండియాకు వ్యతిరేకంగానూ, బంగ్లాదేశ్ కు అనుకూలంగానూ తీర్పు చెప్పింది. పొరుగు దేశాలతో వివాదాల్లో హిందూ-ముస్లిం సెంటిమెంట్లను చొప్పించి ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇండియా వైపే మొగ్గు చూపాలని వాదించే బి.జె.పి/ప్రధాని మోడి ఆశ్చర్యకరంగా తీర్పును స్వాగతించారు. ప్రమాణ స్వీకారం రోజే సార్క్ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపి స్నేహ పూర్వక పొరుగు సంబంధాలకు ప్రాధాన్యతను ప్రకటించిన మోడి ఆ అవగాననే ఐరాస తీర్పు సందర్భంగానూ…

రిలయన్స్ గ్యాస్: యు.పి.ఏ ధర పెంపుకు ఎన్.డి.ఏ కోత

ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ కమిటీ రూపొందించిన ఫార్మూలను అనుసరిస్తూ రిలయన్స్ కంపెనీ వెలికి తీస్తున్న గ్యాస్ ధరను యు.పి.ఏ రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. సదరు పెంపును తగ్గిస్తూ ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సి.రంగరాజన్ రూపొందించిన ఫార్ములాను ఆమోదించడానికి ఎన్.డి.ఏ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం ఎంతకాలం అమలులో ఉంటుందో వేచి చూడాల్సిన విషయం. కె.జి. బేసిన్ లో గ్యాస్ వెలికి తీస్తున్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్…

యుద్ధోన్మాది మెక్ కెయిన్ ఇండియా పర్యటన

కరడు గట్టిన యుద్ధోన్మాది, అమెరికా సెనేటర్ జాన్ మెక్ కెయిన్ ఇండియా పర్యటన కోసం వేంచేశారు. దేవయాని ఖోబ్రగదే వ్యవహారం వల్ల చెడిన ఇండియా-అమెరికా సంబంధాలను తిరిగి పట్టాలు ఎక్కించడానికి మెక్ కెయిన్ పర్యటన ఉద్దేశించబడింది. మెక్ కెయిన్ రాకకు మునుపు బి.జె.పి పార్టీపై గూఢచర్యం నిర్వహించడానికి అమెరికా రహస్య గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అనుమతి సంపాదించిందన్న సమాచారాన్ని ఎడ్వర్డ్ స్నోడెన్ లీక్ చేసినప్పటికీ అమెరికాతో దృఢమైన సంబంధాల పెంపుదలకు మోడి ప్రభుత్వానికి ఏమీ ఆటంకం కాలేకపోయింది.…

గోదావరి ‘గుండె మంట’కు బాధ్యులెవరు? -ఫోటోలు

సహజ వాయువును అమ్మే కంపెనీయేమో ‘గ్యాస్ ఆధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్)’. ఆ గ్యాస్ ని కొనుగోలు చేసి వినియోగించుకుంటున్నదేమో లగడపాటి రాజగోపాల్ కి చెందిన లాంకో కంపెనీ. ఆ గ్యాస్ వెళ్ళేది మాత్రం కోన సీమ గుండెలపై నుండి. ఫలితంగా ప్రమాదం జరిగిన ఫలితాన్ని అనుభవిస్తోంది కోన సీమ ప్రజలు, వారి పొలాలు, వారి ఇళ్లూ, వారి సమస్త ఆస్తులు కాగా బాధ్యతని నిస్సంకోచంగా మళ్ళీ ఆ ప్రజలపైకే నెట్టివేస్తున్న గెయిల్, లాంకోలను ఏమనాలి?…

రష్యా: మానవ రహిత డ్రోన్ లో పిజ్జా డెలివరీ

మనిషి స్వయంగా నడపకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపే విమానాలను డ్రోన్ విమానాలు అంటున్న సంగతి విదితమే. ఇలాంటి డ్రోన్ విమానం ద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా ఓ వినియోగదారుడికి పిజ్జా అందజేశామని రష్యా పిజ్జా కంపెనీ డోడో పిజ్జా ప్రకటించింది. గత నెలలో ముంబైలో ‘ఫ్రాన్సెస్కో పిజ్జరియా’ అనే కంపెనీ డ్రోన్ ద్వారా పిజ్జా అందజేసినట్లు వార్త వచ్చినందున ‘మేమే ఫస్ట్’ అన్న రష్యా కంపెనీ వాదనపై అనుమానం కలుగుతోంది. కాగా, వ్యాపార నిర్వహణలో మానవ శ్రమ…

విదేశీ మందులోడికి మోడీ షాక్?!

“నెత్తిన పేనుకు పెత్తనమిస్తే నెత్తి గొరుగురా ఒరే ఒరే” అని విదేశీ మందులోడు పాడుకుంటాడేమో ఇక! లేకపోతే నమ్మి, బ్రాండ్ ఇమేజి పెంచి, అధికారంలోకి రావడానికి సహకరిస్తే మరిన్ని మందులని ‘నియంత్రిత ధరల’ జాబితాలోకి మోడి ప్రభుత్వం తేవడాన్ని విదేశీ బహుళజాతి కంపెనీలు ఎలా అర్ధం చేసుకోగలవు? భారత దేశంలో అమ్ముడయ్యే ఔషధాలలో మరిన్ని ‘ధరల నియంత్రిత జాబితా’ (price control) లోకి చేర్చాలని నరేంద్ర మోడి ప్రభుత్వం యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలు కొన్ని పత్రికలకు ఉప్పందించాయి.…

అమెరికన్ ఉబర్ ఆప్ పై ఐరోపా టాక్సీ డ్రైవర్ల సమ్మె పోరు

అమెరికాకు చెందిన ‘ఉబర్’ కంపెనీ తయారు చేసిన మొబైల్ ఫోన్ అప్లికేషన్ పై యూరోపియన్ దేశాల టాక్సీ డ్రైవర్లు యుద్ధం ప్రకటించారు. ఈ అప్లికేషన్ తమ పొట్ట కొడుతోందని వారు ఆగ్రహం ప్రకటిస్తున్నారు. ఎంతగా మొరపెట్టుకున్నా తమ ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో ఉబర్ మొబైల్ అప్లికేషన్ కు వ్యతిరేకంగా బుధవారం (జూన్ 11) సమ్మె పాటించారు. ఈ సమ్మెతో ఐరోపా దేశాల ప్రధాన నగరాల్లో వీధులు స్తంభించిపోయాయని రాయిటర్స్, బి.బి.సి, న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు తెలియజేశాయి.…

రైతులకు మోడి వాత, యూరియా ధర పెంచే యోచన

బహుళ బ్రాండు రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను పరోక్షంగా ప్రవేశపెట్టనున్న మోడి ప్రభుత్వం అదే ఊపుతో రైతులకు నేరుగానే వాత పెట్టేందుకు యోచిస్తోంది. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇచ్చినందుకు తగిన విధంగా రుణం తీర్చుకోవడానికి మోడి ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఇండస్ట్రీస్ కు మేలు చేయడం కోసం గ్యాస్ ధరలను రెట్టింపు చేసినందున పెరగనున్న సబ్సిడీ భారం తగ్గించుకోవడానికి యూరియా ఎరువు ధరను కనీసం 10 శాతం పెంచేందుకు యోచిస్తోంది. ఈ…

దొడ్డి దారిన రిటైల్ ఎఫ్.డి.ఐ యోచనలో మోడి ప్రభుత్వం?

బి.జె.పి/నరేంద్ర మోడి ఎన్నికల వాగ్దానాల్లో రిటైల్ ఎఫ్.డి.ఐ ఒకటి. మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను యు.పి.ఏ ప్రభుత్వం అనుమతించగా బి.జె.పి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే ఈ నిర్ణయాన్ని తిరగదోడతామని బి.జె.పి వాగ్దానం ఇచ్చింది. సదరు వాగ్దానాన్ని నెరవేర్చడం మాట అటుంచి దొడ్డి దారిన యు.పి.ఏ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే యోచనలో మోడి ప్రభుత్వం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుండి తమకు గట్టి…

యాండ్రాయిడ్ కాపీరైట్ కేసు: గూగుల్ పై ఒరకిల్ గెలుపు

ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు ఒకరిపై మరొకరు కాపీ రైట్ ఉల్లంఘన కేసులు పెట్టుకోవడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. మొబైల్ ఫోన్ డిజైన్, టెక్నాలజీల విషయంలో సామ్ సంగ్, యాపిల్ కంపెనీల మధ్య సాగిన సుదీర్ఘ కోర్టు పోరాటంలో ఒక భాగం కొద్ది రోజుల క్రితమే ముగిసింది. ఇప్పుడు గూగుల్, ఒరకిల్ కంపెనీల మధ్య నడిచిన పోరు ఒక కొలిక్కి వచ్చింది. యాపిల్ ఆశించిన నష్టపరిహారంలో కేవలం 10వ వంతుకంటే తక్కువ మాత్రమే సామ్ సంగ్ చెల్లించాలని…

బంగాళాఖాతంలో మలేషియా విమానం?

హిందూ మహా సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా పౌర విమానం MH370 గురించి మరో కొత్త సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రైవేటు కంపెనీ సదరు విమానం బంగాళాఖాతంలో కూలిపోయిందని భావించేందుకు తగిన ఆధారాలు తమకు లభ్యం అయ్యాయని ప్రకటించింది. అప్పుడే నిర్ధారించలేము గానీ తమకు దొరికిన శిధిలాలన్నీ బోయింగ్ 777 కి సంబంధించిన శిధిలాలే అనీ కాబట్టి మలేషియా విమానం బంగాళాఖాతంలో కూలిందనేందుకు ఇది గట్టి సాక్ష్యం కావచ్చని తెలిపింది. గత కొద్ది…

కెవిపి ని అరెస్ట్ చేయండి -అమెరికా

టైటానియం మైనింగ్ కుంభకోణం విషయంలో నిందితుడుగా అమెరికా కోర్టులు పేర్కొన్న కె.వి.పి రామచంద్ర రావును వెంటనే అరెస్టు చేయాలని అమెరికా కోరింది. రాజ్య సభ సభ్యుడు అయిన కెవిపి ఆంధ్ర ప్రదేశ్ లో టైటానియం గనుల తవ్వకానికి అనుమతులు ఇప్పించినందుకు గాను అమెరికా కంపెనీ నుండి లంచం వసూలు చేశారని అమెరికా ఆరోపించింది. ఆరోపణలను కెవిపి ఖండించినప్పటికీ ఆయన మాటలను ఎవరూ నమ్మే పరిస్ధితి ఆంధ్ర ప్రదేశ్ లో అయితే లేదు. టైటానియం గనుల తవ్వకానికి అనుమతులు…

హృదయస్రావం: ఇంటర్నెట్ ని వణికిస్తున్న తాజా క్రిమి

తట్టుకోలేని దృశ్యం చూసినప్పుడు హృదయం ద్రవించిపోయింది అంటాం కదా! మొన్నామధ్య తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవడానికి సీమాంధ్ర ఎం.పి లు తీవ్ర గలాభా సృష్టిస్తున్నప్పుడు కూడా మన ప్రధాని ‘నా హృదయం ద్రవించిపోతోంది’ (My heart bleeds) అంటూ వాపోయారు. సరిగ్గా ఆ పేరుతోనే ఉన్న ఒక సాఫ్ట్ వేర్ క్రిమి (బగ్) అనేక పేరు పొందిన ఇంటర్నెట్ కంపెనీలను వణికిస్తోంది. ఇంటర్నెట్ రక్షణ కోసం ఏర్పరుచుకున్న ఎన్ క్రిప్షన్ వ్యవస్ధ లోనే ఈ క్రిమి…