విద్యుత్ రంగాన్ని జగన్ నాశనం చేశాడు -చంద్రబాబు

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వ నాశనం చేశాడని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ రంగం పైన శ్వేత పత్రం విడుదల చేస్తూ ముఖ్య మంత్రి గత ముఖ్య మంత్రి జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన రాష్ట్ర విద్యుత్ రంగం అనేక నష్టాలు ఎదుర్కొన్నదని, ఇప్పుడు అది అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నదని వివరించాడు.…

ఇండియన్ ట్విట్టర్ ‘కూ’ మూసివేత!

ట్విట్టర్, ఇపుడు ఎక్స్, కు భారతీయ పోటీగా ప్రస్తుతించ బడిన భారతీయ మైక్రో బ్లాగింగ్ కంపెనీ ‘కూ’ ను మూసి వేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు ప్రకటించారు. కూ అభివృద్ధికి అవసరమైన నిధులను సంపాదించడం కష్టంగా మారడంతో సంస్థను మూసివేయక తప్పడం లేదని వారు ప్రకటించారు. “కూ యాప్ ను కొనసాగించడం మాకు ఇష్టమే అయినప్పటికీ టెక్నాలజీ సేవలను నిర్వహించేందుకు అయే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నందున ఈ కష్టమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు” అని కూ కంపెనీ…

ఎఫ్.డి.ఐల దోపిడీ, భారతీయ పాలకులు మేధావుల సహకారం

మార్చి 2024తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఇండియా లోకి ఎఫ్.డి.ఐల రాబడి గత ఆర్ధిక సంవత్సరం (FY 2023) తో పోల్చితే ఏకంగా 62 శాతం పడిపోయినట్లు ఆర్.బి.ఐ ప్రకటించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి.

2023-24 ఆర్ధిక సం. లో దేశం లోకి వచ్చిన నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) కేవలం 10.58 బిలియన్ డాలర్లు మాత్రమే.

డాలర్లు: ఇండియాకి వచ్చేదాని కంటే పోయేది రెట్టింపు

మన ప్రధాన మంత్రి లేదా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాళ్ళరిగేలా తిరిగి దేశానికి రప్పించుకునే పెట్టుబడుల వల్ల ఎవరికీ లాభం కలుగుతోంది? ఆర్.బి.ఐ లెక్కల ప్రకారం చూస్తే దేశంలోకి వస్తున్న డాలర్ పెట్టుబడుల కంటే దేశం దాటి పోతున్న లాభాల డాలర్లే అధికంగా ఉంటున్నాయి.

ఋతుపవన వర్షాలపైనే ప్రధానంగా ఆధారపడ్డ భారతదేశ ఆర్ధిక వ్యవస్ధ ఫండమెంటల్స్

భారత దేశ మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ పండితులు ప్రధాని మన్మోహన్, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు మాంటెక్ అహ్లూవాలియా (ఈయన రేప్ ప్రయత్నం నేరానికి అరెస్టయిన ఐ.ఎం.ఎఫ్ ఎం.డి స్ట్రాస్ కాన్ స్ధానంలో నియమితులయ్యే అవకాశం ఉన్నవారిలో ఒకటిగా పరిగణింపబడుతున్నాడు. యూరప్ ఒప్పుకోదనుకోండి!), ప్రధానికి ఆర్ధిక సలహాదారుల ముఠాకి నాయకుడైన కౌశిక బసు లు (హోం మంత్రి చిదంబరంను కూడా వీళ్ళలో కలపవచ్చు. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నెహ్రూవియన్ ఆర్ధిక విధానాలని కొంతవరకు ఇంకా అంటిపెట్టుకుని ఉన్నందున…

బ్రెజిల్ నుండి ఐ‌ఎం‌ఎఫ్ గెంటివేత!

ఐ‌ఎం‌ఎఫ్ ని బ్రెజిల్ గెంటివేసింది. మీ సేవలు చాలు, దేశాన్ని విడిచి వెళ్ళండి అని మొఖం మీదే చెప్పింది. బ్రెజిల్ ఆర్ధిక మంత్రి స్వయంగా ‘ఇక చాలు, మూటా ముల్లె సర్దుకోండి’ అని చెప్పేశాడు. దానితో బ్రెజిల్ లో తమ కార్యాలయాన్ని మూసివేస్తామని బ్రెజిల్ ప్రకటించింది. ఐ‌ఎం‌ఎఫ్ సంస్ధ ప్రపంచ కాబూలీవాలా. ఆర్ధిక కష్టాల్లో ఉన్న దేశాలకు అప్పులిచ్చి ఆదుకుంటామని చెప్పుకుంటుంది. సంక్షోభంలో ఉన్న దేశాలకు సంక్షోభ నివారణ ఔషధాలు అందజేసి కోమా ఉన్న ఆర్ధిక వ్యవస్ధలను…

అత్యంత ధనిక దేశంగా అమెరికాను వెనక్కి నెట్టిన చైనా!

ప్రధాన ఆర్ధిక శక్తిగా అత్యంత వేగంగా ఎదుగుతున్న చైనా ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా అవతరించింది. వార్షిక జి‌డి‌పి రీత్యా అమెరికా ఇప్పటికీ మొదటి స్ధానంలో ఉన్నప్పటికీ సంపదల సృష్టిలో మాత్రం చైనా అమెరికాను మించిపోయింది. రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే చైనాలో సంపదలు విపరీతంగా పెరిగాయి. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచంలో సంపదలు మూడు రెట్లు పెరిగాయని ప్రఖ్యాత కన్సల్టింగ్ కంపెనీ మెకిన్సే అండ్ కో తెలిపింది. అత్యంత సంపన్న దేశాలలో టాప్ 10…

ప్రశ్న: గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ గురించి వివరించండి

ప్రశ్న (పేరు ఇవ్వలేదు): క్యూబా వ్యాక్సిన్ ఆర్టికల్ లో గ్లోబల్ సౌత్ అన్న పదజాలం వాడారు. భూమధ్య రేఖకు దిగువ దేశాలు అంటూనే ‘కొన్ని పరిమితులతో’ అన్నారు. కాస్త వివరించగలరు. జవాబు: ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం చాలా అవసరం. ప్రపంచ స్ధాయి పరిణామాలు, ముఖ్యంగా భౌగోళిక రాజకీయార్ధిక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఆంగ్ల పత్రికలు తరచుగా గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ అన్న పదజాలాల్ని ఉపయోగిస్తాయి. ఈ పేర్లు సూచించే విధంగా ఉత్తరార్ధ గోళంలో ఉన్న…

నెమ్మదిగా పురోగమిస్తున్న బ్రిక్స్ బ్యాంక్

సెప్టెంబర్ 9, 2021 తేదీన భారత దేశం నేతృత్వంలో (Chairship) 13వ బ్రిక్స్ సమావేశాలు ఆన్-లైన్ పద్ధతిలో జరిగాయి. మిగతా నాలుగు దేశాల నేతలు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొని చర్చలు జరిపారు. “బ్రిక్స్ సభ్య దేశాల అంతర్గత సహకారం కొనసాగింపు, స్ధిరీకరణ, ఏకాభిప్రాయం” అనే అంశం కేంద్రంగా ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశం నాటికి బ్రిక్స్ ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తవడం విశేషం. మూడు మూల స్తంభాల ప్రాతిపదికన బ్రిక్స్ దేశాల మధ్య సహకారం…

అమెరికా ఆర్ధిక పరిస్ధితులే బ్లడ్ బాత్ కి కారణం -2

“రష్యాలో వర్షం కురిస్తే భారత కమ్యూనిస్టులు ఇండియాలో గొడుగు పట్టుకుంటారు” అని గతంలో పరిహాసం ఆడేవాళ్లు. బి‌జే‌పి పార్టీ, దాని అనుబంధ సంఘాల వాళ్ళకు ఈ పరిహాసం అంటే తగని ఇష్టంగా ఉండేది. “భారత స్టాక్ మార్కెట్ల పతనానికి మేము తెచ్చిన ఎల్‌టి‌సి‌జి పన్ను కారణం కాదు, బలహీన గ్లోబల్ (అమెరికా అని చదువుకోవాలి) ఆర్ధిక పరిస్ధితులే అందుకు కారణం” అని ఇప్పుడు బి‌జే‌పి మంత్రి జైట్లీ నిజాలను విడమరిచి చెబుతున్నాడు. అప్పుడు కమ్యూనిస్టులపై చేసిన పరిహాసం…

ప్రపంచ స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ –విశ్లేషణ 1

సోమవారం ప్రపంచం లోని వివిధ ప్రధాన స్టాక్ మార్కెట్లు భారీ మొత్తంలో నష్టపోయాయి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఈ భారీ పతనాన్ని బ్లడ్ బాత్ గా అభివర్ణిస్తున్నాయి. అమెరికా ప్రధాన స్టాక్ సూచీ అయిన డౌ జోన్స్, 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం కాలంలో కూడా ఎరగని విధంగా ఒకే రోజు 1175 పాయింట్లు నష్టపోయింది. కాబట్టి బ్లడ్ బాత్ అనడం కరెక్ట్ అనిపించక మానదు. అంకెల్లో చూసినప్పుడు ఇంత భారీ పతనాన్ని డౌ…

మోడి, దావోస్ సమావేశాలు, సామ్రాజ్యవాద వైరుధ్యాలు -2

మోడికి దక్కిన ఈ పోస్ట్ మెన్ / కొరియర్ పాత్రకే భారత మీడియా, బి‌జే‌పి నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. ప్రపంచ వేదికలపై భారత్ కు ప్రతిష్ఠ పెరిగింది అని చెప్పడానికి ఇదే తార్కాణం అని ప్రజలకు నమ్మబలుకుతున్నారు. బలి ఇచ్చేముందు మేకపోతును అందంగా అలంకరించి, డప్పు వాయిద్యాల మధ్య వీధుల వెంట ఊరేగిస్తారన్న ఎరుక వీరికి లేకపోవడం భారత ప్రజల దౌర్భాగ్యం. కాగా మోడీ, ట్రంప్ ను తప్పు పట్టడాన్ని చైనా భలే సంతోషపడింది. దావోస్ వేదికపై…

మోడి, దావోస్ సమావేశాలు, సామ్రాజ్యవాద వైరుధ్యాలు -1

ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఆల్పైన్ పర్వతాల లోని విడిది నగరం దావోస్ లో ప్రపంచ ఆర్ధిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) సమావేశాలు జరుగుతున్నాయి. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి కూడా ఈ సమావేశాలకు హాజరై ప్రారంభ ప్రసంగం చేసి వచ్చాడు. మోడీతో పాటు పలు ఇతర దేశాల ప్రభుత్వాధినేతలు కూడా వేదికపై ప్రసంగాలు చేస్తున్నారు. 2000 సం. తర్వాత మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు ఈ సమావేశాలకు హాజరవుతున్నాడు. అందుకు అమెరికాకు కారణాలు ఉన్నాయి. అధ్యక్షుడు…

బడ్జెట్ 2018-19: ఉద్యోగులకు తొండి చెయ్యి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గర కావడంతో వారి ఆశలు ఇంకా పెరిగాయి. ఓట్ల కోసం ఆదాయ పన్ను విషయంలో మరింత రాయితీ ఇస్తాడని ఆశించారు. కానీ వారిని జైట్లీ బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచింది. గతంలో ఉన్న రాయితీలలో ఎలాంటి మార్పూ లేకుండా అట్టే కొనసాగించింది. విద్యా సెస్ కు ఆరోగ్యం జత కలిపి 1% అదనంగా సెస్ వసూలు చేస్తామని ప్రకటించారు. గత సంవత్సర…

ఎకనమిక్ సర్వే 2018: 10 ప్రధాన అంశాలు

జనవరి 29 తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వే – 2018, 10 ప్రధాన అంశాలను గుర్తించింది. ఇవి భారత ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రమణీయన్ దృష్టిలో ప్రధానమైనవి. ‘పది కొత్త ఆర్ధిక నిజాలు’ అని సర్వే వీటిని అభివర్ణించింది.  ప్రజల వైపు నుండి చూసినపుడు ప్రధానం కావచ్చు, కాకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నియమించుకున్న సలహాదారు కనుక ఈ అంశాలు పాలకవర్గాల దృక్కోణం నుండి ప్రధాన అంశాలుగా ఉంటాయని గుర్తించడం సబబు.…