గవర్నర్ అత్యాచారం: పోలీసు విచారణ నుండి ఎస్కేప్!

పశ్చిమ బెంగాల్ గవర్నర్ పైన ఆయన సిబ్బంది లోని మహిళ ఒకరు ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. పోలీసుల విచారణ నుండి తప్పించుకునేందుకు ఘనత వహించిన ఆ గవర్నర్ సిగ్గు లేకుండా తన గవర్నర్ గిరీని అడ్డం తెచ్చుకుంటున్నాడు. గవర్నర్ కార్యాలయంలో పని చేసే సిబ్బందిలోని మహిళ తనపై లైంగిక అత్యాచార ఆరోపణ చేసిన తర్వాత, ఏ మాత్రం ఆత్మ గౌరవం ఉన్నా, తాను నిర్వహిస్తున్న పదవి పట్ల ఇసుమంతైనా బాధ్యత ఉన్నా వెంటనే…

ఉక్రెయిన్: ఆయుధ రహస్యాలు చైనాకు చేరుతున్నాయన్న బెంగలో అమెరికా!

ఇప్పుడు అమెరికాకి కొత్త భయం పట్టుకుంది. ఉక్రెయిన్ సైన్యానికి సరఫరా చేస్తున్న అమెరికా ఆయుధాలన్నీ రష్యా యుద్ధ ఎత్తుగడల ముందు ఎందుకూ పనికి రాకుండా విఫలం అవుతుండడంతో తమ ఆయుధాల రహస్యాలు రష్యాకు తెలిసిపోతున్నాయని ఆందోళన చెందుతోంది. అంతకంటే ముఖ్యంగా తమ ఆయుధాల రహస్యాలను రష్యా, చైనాకు కూడా సరఫరా చేస్తున్నదని అనుమానిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల ఆయుధాల సమాచారం చైనాకు సరఫరా అవుతోందన్న అనుమానం అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తున్నది. అమెరికా మరియు…

జ్ఞాన యోధుడు: సన్నాఫ్ జోగిని చిన్నూబాయి

—–రచన: డాక్టర్ కోయి కోటేశ్వరరావు జోగినికి పుట్టిన బిడ్డ అంటూ లోకం అతనిని అవమానించింది. తండ్రి ఎవరో తెలియని అనామకుడని సభ్య సమాజం తిరస్కరించింది. అంటరాని అభాగ్యుడని ఊరు ‘బాకున కుమ్మినట్లు’ బాధించింది. కుల భూతం విషం చిమ్మింది. పేదరికం వెక్కిరించింది. చుట్టుముట్టిన లెక్కలేని అవమానాలను ధిక్కరించి, కఠోర శ్రమతో అచంచల కార్యదీక్షతో ధీరోచితంగా అతను ముందడుగు వేశాడు. దారి కడ్డంగా పరుచుకున్న రాళ్ల గుట్టలను దాటుకుంటూ, ముళ్ళ తుప్పలను తొక్కుకుంటూ నెత్తుటి పాదాలతోనే నడక సాగించి…

రష్యాతో యుద్ధానికి 8 లక్షల సైన్యం, ప్లాన్ సిద్ధం చేస్తున్న జర్మనీ

German Superior Tank -Leapord 2A7A1 కొన్ని వందల వేల సైన్యాన్ని రష్యాతో యుద్ధానికి జర్మనీ సిద్ధం చేస్తున్నట్లు న్యూస్ వీక్ పత్రిక వెల్లడి చేసింది. జర్మనీ పత్రిక డెష్పీగెల్ (Der Spiegel) ప్రభుత్వం తయారు చేసిన ఒక రహస్య పత్రాన్ని సంపాదించి దాని వివరాలు వెల్లడి చేయగా ఆ వివరాలని న్యూస్ వీక్ ఆన్ లైన్ అమెరికన్ పత్రిక న్యూస్ వీక్ ప్రచురించింది. త్వరలోనే రష్యాతో యుద్ధం తలెత్తవచ్చని పశ్చిమ పత్రికలన్నీ అడపా దడపా విశ్లేషణలు…

ప్రశ్న: రియల్ జిడిపి, నామినల్ జిడిపిల మధ్య తేడా ఏమిటి?

అంకమ్మ ‘ ‘: సర్, రియల్ జిడిపి, నామినల్ జిడిపిల మధ్య తేడా ఏమిటో చెప్పండి. జవాబు: మీ పేరు చివర తోకను రాయనందుకు అన్యధా భావించ వద్దు. నిన్న రష్యా ఆర్ధిక వ్యవస్థ గురించి రాసిన టపాలో రియల్, నామినల్ జిడిపి ల గురించి ప్రస్తావించాను. బహుశా అది చదివాక మీకు ఈ ప్రశ్న ఉదయించి ఉంటుంది. ఈ జవాబు పాఠకులకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను. రియల్ జిడిపి: పేరులోనే ఉన్నట్లు రియల్ జిడిపి ఒక…

పశ్చిమ ఆంక్షల నడుమ high-income దేశంగా రష్యా!

ఉక్రెయిన్ పై దాడిని సాకుగా చూపిస్తూ రష్యా పైన అమెరికా, ఐరోపా దేశాలు విస్తృతమైన ఆంక్షలు అమలు చేసినప్పటికీ రష్యా ఉన్నత ఆదాయ దేశంగా అవతరించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన జాబితా ద్వారా ఈ సంగతి వెలుగు లోకి వచ్చింది. నిజానికి రష్యా 2014 వరకు ఉన్నత ఆదాయ దేశమే. మార్చి 2014 లో ఉక్రెయిన్ లో ‘యూరో మైదాన్’ పేరుతో జరిగిన ఆందోళనల నేపధ్యంలో, అప్పటి వరకు జి8 గ్రూపు దేశాల…

విద్యుత్ రంగాన్ని జగన్ నాశనం చేశాడు -చంద్రబాబు

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వ నాశనం చేశాడని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ రంగం పైన శ్వేత పత్రం విడుదల చేస్తూ ముఖ్య మంత్రి గత ముఖ్య మంత్రి జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన రాష్ట్ర విద్యుత్ రంగం అనేక నష్టాలు ఎదుర్కొన్నదని, ఇప్పుడు అది అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నదని వివరించాడు.…

గాజా యుద్ధం: పాలస్తీనియన్లు వెళ్లేందుకు ఇక చోటు లేదు -ఐరాస

గాజాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) సైన్యం పాలస్తీనా పౌరుల మారణ హోమం కొనసాగిస్తోంది. అక్టోబర్ 7 తేదీన హమాస్ తమ పైన దాడి చేసి 2 వందల మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను, సైనికులను కిడ్నాప్ చేసిన తర్వాత ఆ సాకుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమంలో ఇప్పటి వరకు 38,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. కాగా వారిలో 75 శాతం మంది స్త్రీలు, పిల్లలే కావటం గమనార్హం. కాగా గాజాలో పరిస్ధితిని తాజాగా…

ఉక్రెయిన్ లో నాటో సైన్యం, సమీపంలో WW-3?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యం వరుస ఓటములు ఎదుర్కొంటోంది. రష్యా సైన్యం రోజు రోజుకీ ముందడుగు వేస్తున్నది. దీనితో అమెరికా గంగవెర్రులు ఎత్తుతోంది. ఉక్రెయిన్ కి ఓటమి తప్పదన్న భయం అమెరికాకి పట్టుకుంది. ఈ పరిస్ధితుల్లో నాటో కూటమి సైనికులు వివిధ రూపాల్లో ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనడం ఎక్కువ అవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. నిజానికి నాటో మిలటరీ కాంట్రాక్టర్లు మొదటి నుండి ఉక్రెయిన్ లో ఉంటూ ఉక్రెయిన్ సైన్యానికి సలహా, సూచనలు ఇస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.…

ఇండియన్ ట్విట్టర్ ‘కూ’ మూసివేత!

ట్విట్టర్, ఇపుడు ఎక్స్, కు భారతీయ పోటీగా ప్రస్తుతించ బడిన భారతీయ మైక్రో బ్లాగింగ్ కంపెనీ ‘కూ’ ను మూసి వేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు ప్రకటించారు. కూ అభివృద్ధికి అవసరమైన నిధులను సంపాదించడం కష్టంగా మారడంతో సంస్థను మూసివేయక తప్పడం లేదని వారు ప్రకటించారు. “కూ యాప్ ను కొనసాగించడం మాకు ఇష్టమే అయినప్పటికీ టెక్నాలజీ సేవలను నిర్వహించేందుకు అయే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నందున ఈ కష్టమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు” అని కూ కంపెనీ…

మీరు హిందువు కాదు -మోడీతో రాహుల్

జులై 1 తేదీన ప్రతిపక్ష నేత మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. “తమను తాము హిందువులుగా చెప్పుకునే వాళ్ళు నిరంతరం హింస, విద్వేషాలకు పాల్పడుతున్నారు” అని ఆరోపించాడు. ఇదే అవకాశంగా దొరకబుచ్చుకున్న ప్రధాని మోడీ రాహుల్ మాటలను వక్రీకరిస్తూ “హిందూ సమాజం మొత్తాన్ని హింసాత్మకం గా వర్ణించడం చాలా తీవ్రమైన విషయం” అని విమర్శించాడు. ప్రధాని ఆరోపణలకు బదులిస్తూ రాహుల్ గాంధీ “నేను అన్నది బిజేపి పార్టీని. మీ పార్టీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ మాత్రమే…

హేమంత్ సొరేన్ నేరంపై సాక్షాలు లేవు -హై కోర్టు

నరేంద్ర మోడీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఇడి లను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను ఒక్కొక్కరినీ జైలు పాలు చేస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వానికి జార్ఖండ్ హై కోర్టు నుండి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జార్ఖండ్ మాజీ ముఖ్య మంత్రి హేమంత్ సొరేన్ భూ కుంభ కోణానికి పాల్పడినట్లు ఎలాంటి సాక్షాలు లేవు అని చెబుతూ హై కోర్టు ఆయనకు జూన్ 28 తేదీన సాధారణ బెయిలు మంజూరు చేసింది. 50 వేల రూపాయల…

శంకర నారాయణ డిక్షనరి కథ

కింద ప్రచురిస్తున్న పాఠ్యం నేను రాసింది కాదు. నాకు ఒక మిత్రుడు ఒకడు వాట్సప్ మెసేజ్ చేశాడు. చదవగానే మరింత మందికి పంచితే బాగుండు అనుకున్నాను. కానీ నాకు వాట్సప్ లో మెసేజ్ లు ఫార్వర్డ్ చెయ్యడం అలవాటు లేదు. మెసేజ్ లో ఉండే అంశం నిజమా కాదా అని తెలుసుకోకుండానే చాలా మంది మెసేజ్ లను కుప్పలు తెప్పలుగా ఫార్వర్డ్ చేస్తుంటారు. మరీ ఘోరం ఏమిటంటే అదే మెసేజ్ ని మరో ఇద్దరు ముగ్గురు అదే…

ఈజిప్టు: పాలస్తీనా ఉద్యమంలో ట్రోజాన్ హార్స్ (5)

Rafah Border సహజవాయువు, టూరిజం 2021లో ఈజిప్టు ఇంధన శాఖ మంత్రి తారెక్ ఆల్-మొల్లా ఇజ్రాయెల్ వెళ్లి ఆ దేశ ఇంధన మంత్రి యువాల్ స్టీనిట్జ్, ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ లతో ఓ ప్రధాన సహకార ఒప్పందం గురించి చర్చలు జరిపాడు. వాషింగ్టన్ డి.సి. లోని అరబ్ సెంటర్ నివేదిక ప్రకారం, “పాలస్తీనా సముద్ర తీరం లోని లెవియాథన్ చమురు ఫీల్డ్ నుండి వెలికి తీసిన సహజ వాయువును సముద్రం అడుగు నుండి వేసిన కొత్త పైప్…

ఈజిప్టు: పాలస్తీనా ప్రతిఘటనలో ట్రోజాన్ హార్స్ (4)

Egypt President Abdel Fattah El-Sisi with Saudi Prince Mohammed Bin Salman 3వ భాగం తరువాత…. పాన్ అరబ్బు జాతీయ ఉద్యమానికి, పాలస్తీనా విముక్తికి సిరియా, ఈజిప్టుల వ్యూహాత్మక సహకారం అత్యవసరం అని ఈజిప్టు నేత గమాల్ అబ్దుల్ నాజర్, సిరియా నేత హఫీజ్ ఆల్-అస్సాద్ లు సరిగ్గానే గుర్తించారు. ఇరు దేశాల సహకారాన్ని అమెరికా, బ్రిటన్ లు ఇజ్రాయెల్ సహాయంతో నివారించగలిగాయి. నాజర్ హత్య తర్వాత అన్వర్ సాదత్ నేతృత్వం లోని ఈజిప్టు…