అద్వానీ స్ధానం అదే! -కార్టూన్


Advani mentorship

“చివరికి ఈ పరిస్ధితి వచ్చిందా! మన గురువుగారు అద్వానీజీని గురువు స్ధానంలోనే ఉండమని నచ్చజెప్పడానికి ఒక రధయాత్ర చేయాల్సివచ్చిందన్నమాట!”

మొత్తం మీద బి.జె.పి పార్టీకి ఒక యజ్ఞం పూర్తయింది. ప్రధాన మంత్రి పదవి కుర్చీలో కూర్చోవాలన్న అద్వానీ కలను నరేంద్ర మోడి గద్దలా వచ్చి తన్నుకుపోయారు. రధయాత్రతో మత ఘర్షణల మంటలు రేపి పార్లమెంటులో సీట్ల చలి కాచుకున్న గురువు గారికి, దేశచరిత్రలో మచ్చగా మిగలాల్సిన కరసేవకుల దహనాన్ని ముస్లింల దహనకాండతో మాపుకున్న శిష్యుడు! గురువును మించిన శిష్యరికానికి ఇంతకంటే మించిన ఉదాహరణ ఉంటుందా?

కానీ అద్వానీని సాగనంపిన తీరే ఏ మాత్రం బాలేదు. ‘మోడిని ప్రధాని అభ్యర్ధిగా చేస్తే నాకిక బి.జె.పి పైన ఆసక్తి ఉండదు’ అని చెప్పినా ఆయనను పట్టించుకున్నవారే లేరు. చివరికి ఆయనకు నమ్మకస్తులుగా పేరుగాంచిన సుష్మా స్వరాజ్ సైతం అద్వానిని వదిలి మోడి బ్యాండ్ వాగన్ లో, అయిష్టంగానే కావచ్చు, చేరిపోయారు. ఒక్కొక్క యోధుడు/యోధురాలూ వైరి శిబిరంలో చేరిపోతుండగా నిస్సహాయంగా ఒక ఉత్తరం ముక్కతో నిరసన చెప్పి ఊరుకోవాల్సిన పరిస్ధితికి చేరుకోవడం ఏ స్ధాయి భీష్మ పితామహుడికైనా బాధాకరమే!

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఎంతగా క్రోధగ్నిపీడితుడైనా అద్వానీ తన మాతృసంస్ధను ధిక్కరించలేదు. తన గురువుగారికి తీరని అవమానం జరిగినా సుష్మా లాంటివారు పార్టీ నిర్ణయానికే కట్టుబడి తిర్గుబాటు బావుటా ఎగురవేయలేదు. అదే కాంగ్రెస్ అయితే ఎన్ని దూకుళ్ళు జరిగేవో! మళ్ళీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకుంటే కాంగ్రెస్ లో ఉండే స్వేచ్ఛ బి.జె.పిలో లేదేమో!

ప్రజలకు సంబంధం లేని ఈ వ్యవహారాలు ఎటుపోయినా పోయేది లేదు. కానీ గుజరాత్ మారణకాండను గుర్తు తెచ్చుకున్నపుడు అలా అనుకుని ఊరుకోనూ లేము!

5 thoughts on “అద్వానీ స్ధానం అదే! -కార్టూన్

వ్యాఖ్యానించండి