‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయం, వెనక్కి వెళ్ళేది లేదు’ అని కాంగ్రెస్ అధినాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులు హైద్రాబాద్ సెంటిమెంటును తమ ప్రాంత ప్రజల్లో విస్తృతంగా ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి సీమాంధ్రులు రాజధానిని అభివృద్ధి చేశారని, ఇప్పుడు వెళ్లమంటే ఎలా వెళ్తాం అని పెట్టుబడిదారులు, భూస్వాములు వాదిస్తున్నారు. వారి వాదనలను ప్రజలు కూడా మోస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది.
‘హైద్రాబాద్ రెవిన్యూ ఆదాయం ఎలా పోగొట్టుకుంటాం?’ అన్న సూపర్ ధనికుల ప్రశ్నకు పై రూపమే ‘హైద్రాబాద్ సెంటిమెంటు.’ రాష్ట్ర ఆదాయంలో హైద్రాబాద్ నుండి వచ్చే ఆదాయమే 50 శాతం అని కొందరు చెబుతుంటే మరి కొందరు 70 శాతం అని చెబుతున్నారు. ఇంత ఆదాయాన్ని కోల్పోతే సీమాంధ్ర ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కూడా కష్టం అవుతుందని అనేకమంది బలంగా వాదిస్తున్నారు. దానితో ఉద్యోగులు భయాందోళనలతో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇస్తూ అందులో పాల్గొంటున్నారు.
రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందా? ఇంత పిచ్చి పనికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పూనుకుంటుంది? ఇందులో వాస్తవాలు విచారించడం అవసరం. రాష్ట్ర విభజన సందర్భంగా అయినా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాల పైన చర్చ జరగడం ఒక ఆహ్వానించదగిన పరిణామం కాగా, ఆ చర్చ ఆరోగ్యకరమైన రీతిలో కాకుండా అపోహలతో, విద్వేషపూర్వక వాతావరణంలో జరగడం దురదృష్టకరం!
కొన్ని అంశాలు చూద్దాం.
హైద్రాబాద్ రెవిన్యూ:
-
రాష్ట్రాల ఆదాయం ప్రధానంగా పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం పన్నుల ఆదాయంలో వాటా, గ్రాంట్ ఇన్-ఎయిడ్ ల మొత్తం.
-
విభజన ప్రభావం కేంద్ర పన్నుల వాటా, పన్నేతర ఆదాయం (ప్రభుత్వ భూముల అమ్మకంపై వచ్చే ఆదాయం), గ్రాంట్-ఇన్-ఎయిడ్ లపైన ఉండదు. పైగా సీమాంధ్రలో కొత్త రాజధాని వల్ల రియల్ ఎస్టేట్ ఆదాయం పెరుగుతుంది కనుక పన్నేతర ఆదాయం పెరుగుతుంది. హైద్రాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుంది గనక ఆ మేరకు తెలంగాణ పన్నేతర ఆదాయం తగ్గుతుంది.
-
విభజన ప్రభావం ఉండేది రాష్ట్ర పన్నుల ఆదాయం పైనే.
-
అమ్మకపు పన్ను, ఎక్సైజ్ పన్ను, స్టాంపులు & రిజిస్ట్రేషన్, వాహన పన్ను… ఇవే రాష్ట్ర పన్నుల ఆదాయంలో ప్రధానం (98 శాతం). ఇవి జిల్లాల్లోనే వసూలవుతాయి గనక విభజన తర్వాత ఎవరివి వారికే చెందుతాయి.
-
2003-06 మధ్య కాలంలో గ్రేటర్ హైద్రాబాద్ సగటు సాంవత్సరిక పన్నుల ఆదాయం 7,704 కోట్లు అని, రాష్ట్ర పన్నుల ఆదాయంలో ఇది 37 శాతం అని అప్పటి ఆర్ధిక మంత్రి రోశయ్య గారు శాసనసభలో ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. (ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆగస్టు 28, 2013).
-
2012-13 లో రాష్ట్ర పన్నుల ఆదాయం 66,021 కోట్లు.
-
రోశయ్య గారు చెప్పినట్లు ఇందులో 37 శాతం అంటే 24,428 కోట్లు.
-
గ్రేటర్ హైద్రాబాద్ అంటే హైద్రాబాద్ నగరం మాత్రమే కాదు. ఇందులో 54 లక్షల జనాభా నివసించే హైద్రాబాద్ తో పాటు సంగారెడ్డి, భువనగిరి మునిసిపాలిటీలు, 849 అర్బన్ గ్రామాలు కూడా ఉన్నాయి. వీటి జనాభా 19 లక్షలు. ఇవి రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల పరిధిలోనివి.
-
ఈ పన్నుల ఆదాయం కూడా మొత్తం హైద్రాబాద్ కి చెందినవి కాదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమ్మకాలు జరిపే కంపెనీలు హైద్రాబాద్ లో రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాపితంగా అమ్మకాలు జరిపినా, పన్ను (APGST) మాత్రం హైద్రాబాద్ డివిజన్ లో కడతారు.
-
రాష్ట్రం విడిపోయాక ఆయా కంపెనీలు హైద్రాబాద్ లోనే కొనసాగితే అవి సీమాంధ్రలో జరిపే అమ్మకాలు అంతర్రాష్ట్ర అమ్మకాలు అవుతాయి. కాబట్టి వాటిపైన కేంద్ర పన్నులు ఉంటాయి తప్ప తెలంగాణ రాష్ట్ర పన్నులు కాదు.
-
కంపెనీలు తమ రిజిష్ట్రేషన్ ను సీమాంధ్ర రాజధానికి మారిస్తే అవి తెలంగాణలో జరిపే అమ్మకాలపై కూడా కేంద్ర పన్నులు వర్తిస్తాయి తప్ప సీమాంధ్ర రాష్ట్ర పన్నులు కాదు.
-
కంపెనీలు తమకు ఏ పన్నులు తక్కువో బేరీజు వేసుకుంటాయి. కేంద్ర పన్నులా, తెలంగాణ పన్నులా లేక సీమాంధ్ర పన్నులా… ఇందులో ఏది తక్కువో తేల్చుకుని ఆ మేరకు రిజిస్ట్రేషన్ మార్చుకుంటాయి. కొత్తగా వచ్చే సీమాంధ్ర రాష్ట్రం తగిన సౌలభ్యం కల్పిస్తే ప్రాంతంతో సంబంధం లేకుండా కంపెనీలు తమ రిజిస్టర్డ్ కార్యాలయాల్ని మార్చుకుంటాయి.
-
కాబట్టి కొత్తగా వచ్చే ఇరు రాష్ట్రాలు కేంద్రంతో చర్చలు జరిపి తగిన రాయితీలు తెచ్చుకోడానికి పోరాడాలి తప్ప తమలో తాము తగువు పడడం సరికాదు. రాష్ట్ర విభజన వలన అదనపు రెవిన్యూ ఆదాయం ద్వారా లబ్ది పొందేదీ కేంద్రమే తప్ప తెలంగాణ కాదని ఇక్కడ అర్ధం అవుతోంది.
-
పైగా సీమాంధ్ర కొత్త రాజధాని ఏర్పడే క్రమంలో అక్కడ ఉత్పాదక కార్యకలాపాలు వేగం అవుతాయి. అంటే జి.డి.పి వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా కొత్త రాష్ట్రానికి పన్నుల ఆదాయం కూడా వేగంగా పెరుగుతుంది. ప్రారంభంలో కొన్నేళ్లపాటు సీమాంధ్ర రాజధానిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి అయితే, హైద్రాబాద్ లో పడిపోతుంది. అనంతరం స్ధిరీకరణ చెందుతుంది.
-
సీమాంధ్రకు 973 కి.మీ పొడవైన సముద్ర తీరం ఉంది. దేశంలో గుజరాత్ తర్వాత సీమాంధ్ర కోస్తా తీరమే పొడవైనది. దీన్ని అభివృద్ధి చేసుకుంటే బోలెడంత రెవిన్యూ. రామాయపట్నం రేవుకి ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనికి అనుబంధంగా అనేక వ్యాపారాలు జరుగుతాయి. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.
-
హైద్రాబాద్ ఐ.టి ఉద్యోగాలు మిస్ అవుతాయనీ, ఆ ఉద్యోగాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా కోల్పోతామని కొందరు చెబుతున్నారు. ఆ లెక్కన బెంగుళూరులోనూ తెలుగువారు అత్యున్నత ఐ.టి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఆదాయం మనకే రావాలని అడగొద్దా? మద్రాసు, ఢిల్లీ నగరాల్లోనూ తెలుగువారు ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికా, ఐరోపాల్లోనూ చేస్తున్నారు. అక్కడి ఆదాయాల్లో వాటా వద్దా? ఎద్దు ఈనిందంటే దూడని కట్టెయ్యమన్నట్లు ఈ వాదన ఉంటుంది. సీమాంధ్ర రాష్ట్రంలో ఆదాయాలు పెంచుకునే మార్గం చూడడం మాని వాళ్ళ ఆదాయం మనకి కావాలనడం అన్యాయం కాదా?
-
విభజన వల్ల ఒక తరం నష్టపోతుందని ఎ.పి.ఎన్.జి.ఓ నేత చెబుతున్నారు. అంటే ఆ తర్వాత తరాలకు నష్టం ఉండదు అన్న అంగీకారం ఇందులో ఉంది. కానీ 60 యేళ్లుగా (అంటే మూడు తరాలా?) నీళ్ళు, ఉద్యోగాలు లేక తెలంగాణ జనం ఎదుర్కొన్న నష్టం మాటేమిటి?
పెట్టుబడులు
-
శ్రీకృష్ణ కమిటీ అంటే మన సీమాంధ్ర నాయకులకు వల్లమాలిన అభిమానం. ముఖ్యంగా భూస్వామ్య-పెట్టుబడిదారులకయితే మరీనూ. తెలంగాణ డిమాండు నెరవేర్చకుండా ఇంకా ఏమేమి చెయ్యవచ్చో అధికారికంగా చెప్పింది కాబట్టి బహుశా ఆ మాత్రం అభిమానం ఉండాలేమో. కానీ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో సీమాంధ్ర నాయకులకు ఇష్టం లేని అంశాలు కూడా ఉన్నాయి. మీడియా అంతా సీమాంధ్రుల పెత్తనంలోనే ఉన్నదనీ, ప్రభుత్వంలో వారి ఆధిపత్యమే ఎక్కువనీ, సినిమా పరిశ్రమ వారిదే అనీ… ఇలా!
-
ఇవి పోను సీమాంధ్ర పెట్టుబడుల మర్మాన్ని కూడా శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. తామే హైద్రాబాద్ ని అభివృద్ధి చేశాం అని కదా సీమాంధ్ర (సూపర్) ధనికులు తరచుగా చెప్పేది. అందులో నిజం లేదని శ్రీకృష్ణ కమిటీ లెక్కలు చెబుతున్నాయి. ఉదాహరణకి
-
2010లో ప్రకటిత (announced) పరిశ్రమలు, సంస్ధలు (enterprises) లో మొత్తం పెట్టుబడులు రు. 7585 కోట్లు కాగా అందులో ఎ.పియేతర వ్యక్తుల పెట్టుబడులు రు. 4448 కోట్లు. ఎ.పి పారిశ్రామికవేత్తల పెట్టుబడులు కేవలం రు. 1925 కోట్లు మాత్రమే. అంటే మొత్తంలో 25 శాతం మాత్రమే. ఎ.పియేతరుల వాటా దాదాపు 60 శాతం వరకు ఉంది.
-
ఎ.పి పారిశ్రామికవేత్తలు అంటే మొత్తం సీమాంధ్ర పెట్టుబడిదారులే కాదు. వారిలో తెలంగాణవారు కూడా ఉండొచ్చు. కానీ సీమాంధ్రులదే అత్యధికం అనడంలో అనుమానం లేదు. కాబట్టి 2010లో హైద్రాబాద్ లో 2010లో జరిగిన అభివృద్ధిలో 60 శాతం బైటివారిదయితే 25 శాతం లోపలివారిది. మిగిలింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులు. 25 శాతం పెట్టుబడులతో హైద్రాబాద్ మాదే అని చెప్పవచ్చా?
-
పెట్టుబడి లక్ష్యం ఎప్పుడూ లాభార్జనే తప్ప అభివృద్ధి కాదు. కాకపోతే లోటులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కు విద్యుత్ ఇవ్వకుండా అధిక రేట్లకు బైటి రాష్ట్రాలకు విద్యుత్ అమ్మే పనికి లాంకో ఎందుకు పూనుకుంటుంది? పోయిన వేసవిలో విద్యుత్ లేక రాష్ట్రం అల్లాడుతున్నప్పుడు కూడా లాంకో ఓపెన్ మార్కెట్ లో బైటి రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకుంది. అది కూడా సబ్సిడీ ధరలకు కేంద్ర ప్రభుత్వం నుండి గ్యాస్ పొందుతూ. ఈ సంగతి టి.డి.పి, టి.ఆర్.ఎస్ లాంటి పార్టీలు బహిరంగంగా విమర్శలు చేసినా ఆ కంపెనీ సమాధానం ఇవ్వలేదు. ఇస్తే గుట్టు రట్టవుతుంది కదా?
-
ఇతర సంవత్సరాల్లో చూస్తే హైద్రాబాద్ పెట్టుబడుల్లో ఎ.పి ప్రైవేటు పెట్టుబడిదారుల వాటా 2006లో 16 శాతం మాత్రమే. 2007లో ఇంకా ఘోరంగా 7 శాతం కంటే తక్కువ. ఒక్క 2008 లోనే ఇది 55 శాతంగా ఉంది. 2008లో మళ్ళీ 10 శాతం మాత్రమే. 2006-10 కాలం వరకు కలిపి చూస్తే ప్రకటిత పెట్టుబడులు రు. 52673/-. అందులో ఎ.పి ప్రైవేటు పెట్టుబడిదారుల వాటా కేవలం రు. 8695/-, అనగా 16.5 శాతం. (కమిటీ లెక్క 14.1 శాతం) బైటినుండి వచ్చినవి రు. 36942/- లేదా 70 శాతం. ఐదేళ్లలో 16.5 శాతం పెట్టుబడులు పెట్టినవారు హైద్రాబాద్ మాదే అని కేకలు పెడుతుంటే, 70 శాతం పెట్టినవారు ఇంకెంత గావు కేకలు పెడుతూ అరవాలి?
-
పూర్తయిన ప్రాజెక్టులను బట్టి చూసినా ఇదే పరిస్ధితి! కింద పట్టిక చూస్తే అదే అర్ధం అవుతుంది. ఇది శ్రీకృష్ణ కమిటీ నుండి తీసుకున్నదే.
-
దీని ప్రకారం పూర్తయిన ప్రాజెక్టుల్లో ఎ.పి ప్రైవేటు కంపెనీల వాటా 25 శాతం అయితే బైటి నుండి వచ్చిన ప్రవేటు కంపెనీలది దాదాపు 40 శాతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది 34 శాతం.
-
పై పట్టిక ప్రకారం అమలులో ఉన్న ప్రాజెక్టుల్లో ఎ.పి ప్రైవేటు వారిది, ఎ.పియేతర ప్రైవేటు వారిది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది సమాన వాటా అని అర్ధం అవుతోంది. ‘మూడొంతుల పెట్టుబడితో (అంతా సీమాంధ్రులదే అనుకుంటే) మొత్తం నాదే, నేనే అభివృద్ధి చేశాను’ అనగలరా?
వలసలు
“సీమాంధ్రలో ప్రతి ఇంటి నుండి ఒకరు హైద్రాబాద్ వెళ్లారు. హైద్రాబాద్ నగరంతో వారికి విడదీయలేని, విడదీయరాని మానసిక అనుబంధం ఉన్నది. ఇప్పుడు ఉన్నట్లుండి పొమ్మంటే ఎక్కడికి పోతారు” అని ప్రశ్నిస్తున్నారు. కానీ శ్రీ కృష్ణ కమిటీ చెప్పింది అది కాదు.
కింద స్క్రీన్ షాట్ కమిటీ నివేదికలోనిదే. పేజీ 329, 330.
కమిటీ నివేదికలోని ఈ భాగం ఏం చెబుతోంది?
వలస వెళ్ళడం అనేది ప్రధాన అంశంగా ఎ.పిలో లేదు. కొన్ని ప్రాంతాలు, సామాజిక గ్రూపులు, వారిలో పేదలు ప్రధానంగా వలసపోతున్నారు. మధ్య కోస్తాంధ్రలో ప్రధానంగా వ్యవసాయం (హైద్రాబాద్ లో జరిగేది కాదది) కోసం వలసలు వెళ్ళారు. ఇతర చోట్ల వలసలు అర్బన్ ప్రాంతాలకు జరుగుతున్నా అది కేవలం హైద్రాబాద్ కే పరిమితమై జరగలేదు. రాయలసీమ, తెలంగాణాల్లో వలసలు ముఖ్యంగా రాష్ట్రం బైటికి (మద్రాస్, బెంగుళూరు) జరగ్గా, ఉత్తరాంధ్ర వలసలు విశాఖపట్నంకు జరిగాయి.
ఈ వాస్తవాల నేపధ్యంలో హైద్రాబాద్ కేంద్రంగా రెచ్చగొట్టబడుతున్న భావోద్వేగాలను రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు తిరస్కరించాలి. హైద్రాబాద్ బాధ ప్రజలది కాదు. అతి కొద్దిమంది పెట్టుబడిదారులది. అభివృద్ధి, ఆస్తుల కేంద్రీకరణ దోపిడీ సమాజాల లక్షణం. అభివృద్ధి ఎంత వికేంద్రీకరణ చెందితే ఆ మేరకు అది ప్రజాస్వామీకరణ చెందుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ అయ్యే సువర్ణావకాశం రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్ర ప్రజలకు వచ్చింది. దాన్ని కాలదన్నుకుని హైద్రాబాద్ పై కేంద్రీకరించడం అంటే ఇక ముందు జరిగే అభివృద్ధి కూడా అక్కడే జరగాలని కోరుకోవడం.




హైద్రాబాద్ రెవిన్యూ: 2. “హైద్రాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుంది గనక ఆ ఎరకు తెలంగాణ పన్నేతర ఆదాయం తగ్గుతుంది.” దీని అర్థం చెబుతారా? నాకు అర్థం అవ్వలేదు.. ప్రత్యేక తెలంగాణ వస్తే ఎందుకు హైద్రాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుంది? కలిసుంటే ఎందుకు పడిపోదు??
Only one of our relatives families is living in Hyderabad. It is not true that every family has a member in Hyderabad.
వాసవ్య గారు, ‘ఆ ఎరకు’ కాదు ‘ఆ మేరకు’ అని చదువుకోవాలి. మీ వ్యాఖ్య చూసి ఆర్టికల్ లో సవరణ చేశాను.
తెలంగాణ రావడం అంటే హైద్రాబాద్ ప్రాధాన్యం సమీప భవిష్యత్తులో తగ్గిపోవడం. దానివలన నగర విస్తరణ తగ్గుతుంది. కనుక స్ధలాల రేట్లు తగ్గుతాయి. నిర్మాణ రంగంలో వలసలుకూడా ఆ మేరకు తగ్గుతాయి. అవి
హైద్రాబాద్ నుండి కొత్త రాజధానికి మళ్లుతాయి.
సీమాంధ్రలో కొత్త రాజధాని వచ్చిన చోటుకు ప్రాధాన్యత పెరుగుతుంది కాబట్టి స్ధలాలు, పొలాల రేట్లు పెరుగుతాయి. నిర్మాణ రంగంలో కొత్త పెరుగుదల వస్తుంది. భవనాలు, రోడ్లతో పాటు ఇతర మౌలిక రంగాల్లో కూడా ఉత్పత్తి పెరుగుతుంది. కొత్త రాజధానికి అది అవసరం కదా!
అయితే ఇది కొద్ది కాలం పాటు ఉంటుంది. బహుశా ఐదారు సంవత్సరాలు లేదా పది, పన్నెండు సంవత్సరాలు. ఆ తర్వాత ఆయా ప్రభుత్వాల విధానాలను (పన్నులు, భూ విధానం గట్రా…) బట్టి ఇవి నెమ్మదిగా సర్దుకుంటాయి. హైద్రాబాద్ కి ఇప్పటికే పేరుంది కాబట్టి సర్దుకోవడం అక్కడ త్వరగా జరగవచ్చు. ఆకర్షణీయమైన విధానాలను సీమాంధ్ర ప్రభుత్వం అందిస్తే ఆ మేరకు ఉత్పత్తి వృద్ధి కొనసాగించుకోవచ్చు.
(మార్కెట్ లో మామూలుగా ఉండే సైకిల్స్ ని ఇక్కడ లెక్కలోకి తీసుకోలేదు.)
విభజన ఆందోళన, అనిశ్చితి వల్ల పెట్టుబడులు వెనక్కి పోయాయనీ, ఆగిపోయాయనీ, రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయాయనీ నిత్యం వార్తాపత్రికలు చెప్పాయి కదా. మీరు కొత్తగా అడగడం నాకు ఆశ్చర్యం కలిగించింది.
ఒక ప్రాంతం వెనకబడినదని తేల్చే లెక్కలలో “ఆ ప్రాంతం లోని అన్ని జిల్ల్లాల ఆదాయ మొత్తం సరాసరి తీసుకోవాలా? లేక అబివృద్ది చెందిన ఒకటి రెండు ప్రాంతాలను వదిలివేసి మిగిలిన జిల్లాల ఆదాయ మొత్తాల సరాసరి లెక్క కట్టాలా? …
నేను అడిగే ప్రశ్నలలో నావరకు నాకు చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు వున్నయి.. కాని చర్చ కొనసాగించండం కోసం కొన్ని డెఫినిషన్స్ పై కామన్ క్లారిటి కోసం ఈ ప్రశ్నలు అడుగుతున్నా.. అన్యలా భావించవద్దు…
“విభజన ఆందోళన, అనిశ్చితి వల్ల పెట్టుబడులు వెనక్కి పోయాయనీ, ఆగిపోయాయనీ, రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయాయనీ నిత్యం వార్తాపత్రికలు చెప్పాయి కదా.”
వార్తా పత్రికలు చెప్పాయి సరే, మరి మీరు ఏమంటారు? రియల్ బిజినెస్ పడి పోతే మంచిదానా లేక నష్టమా? పెరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
యివి ఎందుకు అడుగుతున్నానంటే, చాలా సార్లు ఒక వర్గ అభివృద్ధిని కూడా గొప్పతనంగా(గ్రేట్) గా చెప్పబడుచున్నారు… ఆ క్లారిటి కోసం అడుగుతున్నా…
ఇన్నాళ్లు ఉన్నది సమైక్యాంధ్రా కాధాండీ? ఇప్పుడు సమైక్యాంద్ర కొరకు పోరాడటం ఏంటీ? సమైక్యాంధ్రా ఉధ్యమం గురించి ఎవరైనా విదేశీయులు వింటే ఇలాగే అనిపిస్తుంది. ఇప్పుడెమో ఐకమత్యమంటారు. ఈ ఐకమత్యం మొదటినుండీ కొద్దో గొప్పో ఉన్నా ఈ పరిస్తితి వచ్చేది కాదు గదా? ఒక్క ఒప్పందమైనా వంచన లేకుండ అమలు చేసి నట్లైతే తెలుగు వారంతా ఒకటిగా ఉండి ఉండరా? ఇప్పుడు కూడా తిమ్మిని బమ్మి చేసే కాకి లెక్కలే ప్రజలకు చెపుతున్నారు సీమాంద్ర రాజకీయ నాయకులు. ప్రజలు చాలా వరకు ఈవిషయం గ్రహిస్తున్నారు.
సరాసరి లెక్క ఏది తీసుకున్నా వాస్తవానికి దూరమే. విపరీతమైన ఆదాయ అంతరాలు ఉన్న వ్యవస్ధలో సరాసరి లెక్కలతో వెనకబాటుతనం లెక్కించడం సరికాదని నా అభిప్రాయం. ప్రజాస్వామ్యం అనేది సమగ్ర దృక్పధంలో అమలు అవుతున్నప్పుడు ఈ సరాసరి లెక్కలతో పని లేదు. అలాంటి సమగ్ర ప్రజాస్వామ్యం కార్మిక రాజ్యంలోనే సాధ్యం.
ఈ లోపు ప్రాంతీయ, లింగ, కుల, మత వివక్షలను కమ్యూనిస్టులు పట్టించుకోవాల్సిందే. విప్లవం తర్వాత ఆ సంగతి చూస్తాం అంటే ప్రజలు ఒప్పుకోరు. అయితే ఇలాంటి ఉద్యమాలకు నాయకత్వం వహించే స్ధితిలో విప్లవకారులు ఉన్నపుడు అవి రాష్ట్రాల సాధనతో ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్తాయి. ఆ పరిస్ధితి లేదు గనక ఇలాంటి పాక్షిక పరిష్కార డిమాండ్లను పట్టించుకోవాల్సిన పరిస్ధితిలో కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయి.
చుక్కల్లో ఉన్న రియల్ బిజినెస్ పడిపోయి కిందివర్గాలకు అందుబాటులోకి వస్తే మంచిది. అలాగే సామాన్యుల భూములకు డిమాండ్ పెరిగి తమ స్ధలాలు, పొలాలు అమ్మకం ద్వారా వారి జీవనం పెరగడం కూడా మంచిదే. ఈ అంశాలపైన ఒకే దృష్టితో స్వీపింగ్ తీర్పులను ఇవ్వలేము. దోపిడీ వ్యవస్ధల్లోని అసమ అభివృద్ధి, దోపిడి దానికి కారణం.
What Tirupalu said is true. Even if the Gentlemen’s Agreement is ready to be implemented, a movement like Jai Andhra will start again to suppress the implementation of that agreement. The same thing happened in 1972.
అమ్మకపు పన్ని ఎక్షైజు ఎక్కువగా అక్కడనుంచే వస్తుంది రేపు విడగొడితే కొత్త ఏ పి బడ్జెట్ లో కి అంత ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది తీరం అంత డెవలప్ అవ్వాలా అది తీరం అనుకున్నారా మాగని పొలం అనుకున్నారా తీరం తీరం అంటారు ఎప్పుడన్నా చూసారా ఎలా ఉంటుందో సరిగ్గా గాలి కూడా పీల్చుకోలేరు హైదరాబాద్ ప్రజలది కాదు సరే రేపు విడిపోయాక ఉన్న పదకాలకి డబ్బులు ఎక్కడి నుంచి ఎలా వస్తాయి అది రాయండి ప్రజలది కాదన్నపుడు తెలంగాణా ప్రజలకి ఎందుకు కేంద్రానికి ఇచేయండి
రామయ పట్నం ఎక్కడుంది
@rk
‘హైద్రాబాద్ ప్రజలది కాదు’ అని అన్నది ఎవరు?
పాత ఎ.పి కి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో కొత్త ఎ,పి కి కూడా బడ్జెట్ అక్కడి నుండే వస్తుంది. రామాయపట్నం ఎక్కడుందో తెలియకుండానే “తీరం ఎప్పుడన్నా చూశారా” అని అడుగుతున్నారు!
వ్యాఖ్యలు రాసేప్పుడు మర్యాద పాటించండి. వంకర టింకరగా రాస్తే ప్రచురణ కష్టం అవుతుంది.
“కొత్త రాజధాని వచ్చిన చోటుకు ప్రాధాన్యత పెరుగుతుంది కాబట్టి స్ధలాలు, పొలాల రేట్లు పెరుగుతాయి. నిర్మాణ రంగంలో కొత్త పెరుగుదల వస్తుంది. భవనాలు, రోడ్లతో పాటు ఇతర మౌలిక రంగాల్లో కూడా ఉత్పత్తి పెరుగుతుంది”
మీరు సూచించిన ఈ సూత్రీకరణ ప్రకారం… హైదరాబాద్ తో పాటు, ఉత్తరాంధ్ర, ఆంధ్ర, రాయలసీమ, దక్షణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ రాష్ట్ర్ర రాజధానులుంటే దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ముందుంటుంది. భాజపా/ఆర్.ఎస్.ఎస్ కూడా యిదే విషయాన్ని చెబుతున్నాయి. దేశాన్ని 100 రాష్ట్ర్రాలు చేస్తేనే అభివృధని. మీరు ఏకీభవిస్తారా?
“సరాసరి లెక్క ఏది తీసుకున్నా వాస్తవానికి దూరమే. ”
సరాసరి లేకుండా ఆర్థిక పరమైన లెక్కలు వుంటాయా? దేశంలో రాష్త్ర్రాల వాట, రాష్ట్ర్రంలో జిల్లాల వాట, జిల్లాలలో గ్రామాల వాట, గ్రామాలలో వార్డుల వాట… యివ్వన్ని లెక్కలు సరాసరి ఆధారంగానే అభివృద్ది చెందిన ప్రాంతమో కాదో నిర్థారిస్తారు కదా. ప్రస్తుతం మనం సమానత్వమైన సమాజంలో లేము. ఒక్క బియ్యం గింజ పట్టుకొని మొత్తం అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి. సరాసరి చెయ్యడం తప్పనిసరి. ప్రస్తుత రాష్ట్ర్రంలో పదమూడు జిల్లాలు మాత్రమే అభివృద్ది చెందినవి అంటున్నారు. దానర్థం ఆ జిల్లాలో అందరూ ధనికులె అని అర్థం కాదు కదా. అక్కడా తిండికి గడవనోడు వుంటాడు. అంటే సరాసరి లెక్కల ద్వారానే ఆ ప్రాంతం అభివృధని చెబుతున్నారు. మరి మిగతా పది జిల్లాలు కలిపి ఒకే ప్రాంతం కాదా? వాటి సరాసరి లెక్క కట్టగూడదా??
మీరు ఎంతసేపు పెట్టుబడీదారుల పెట్టుబడుల గురించే చర్చిస్తున్నారు. మీరు చూపిన లెక్కల ప్రకారము రాష్ట్ర్ర ప్రభుత్వ వాటా కూడా వుంది కదా.. అంటే అన్ని జిల్లాల ప్రజల పన్నులూ యిక్కడికే చేరాయి కదా. అంటే సామాన్యుల వాటా కూడా ఉంది కదా! తెలంగాణా ప్రాంతంలోని హైదరాబాద్ వివక్షకు గురయినదని అనగలరా? హైదరాబాద్ గురించి మాట్లాడిన ప్రతీవాడు పెట్టుబడీదారుడనే పైశాచిక ప్రచారం జరుగడం కడు శోచనీయం.
“ఈ లోపు ప్రాంతీయ, లింగ, కుల, మత వివక్షలను కమ్యూనిస్టులు పట్టించుకోవాల్సిందే.”
1. అంటే గ్రామాలలో కులాల వారిగా పోరాటాలు (విప్లవం కోసం) చెయ్యవలసినదే అంటారు.. కమ్యూనిస్ట్ పార్టీ (అనగారిన కులం 1), కమ్యూనిస్ట్ పార్టీ (అనగారిన కులం 2) లాగా ఎవరైనా పార్టీలు పెట్టి అనగదొక్కుతున్న కులాల ప్రజలపై పోరాటాలు చెయ్యుచ్చన్నమాట. (అనగదొక్కుతున్న కులంలోని ప్రజలందరూ దొపిడీ దార్లే !!!). తరువాత విప్లవం కోసం పోరాడాలి.
2. మనకు బలం వున్న చోట (వివక్షకు గురి అవుతున్న ప్రాంతం) ప్రాంతీయతత్వ ద్వేషాలు రేపైనా (విప్లవం కోసం) వేరే ప్రాంతాల ప్రజలపై పోరాటాలు చెయ్యవలసినదే! (అనగదొక్కుతున్నప్రాంతంలోని ప్రజలందరూ దోపిడీ దార్లే). తాత్కాలిక లబ్ది (పార్టీ మనుగడ/ప్రజలను ఆకర్శించడం) కోసం విప్లవ పయనంలో యివ్వన్ని తప్పవంటారు!!!
ప్రపంచంలో వున్నది దోపీడీ వర్గం, దోపిడీకి గురవుతున్న వర్గం మాత్రమే అనే విషయాన్ని అనగారిన ప్రజలకు ప్రాంతాలకు, కులాలకు, మతాలకతీతంగా తీసుకెళ్లవలసిన తరుణంలో మాటమాటికి పెట్టుబడీ దారులని ఒక ప్రాంత ప్రజలందరినీ ఊకదంపుడు ప్రచారాలతో ఉధేశపూర్వకంగా ఆ ప్రాంతం లోని బలిహీనమైన/దోపిడీకి గురవ్తుతున్న వర్గాన్ని విస్మరించడం చూస్తుంటే కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు చారిత్రిక తప్పిదం చేస్తునాయనే బావన కలగక మానదు.
“ఈ వాస్తవాల నేపధ్యంలో హైద్రాబాద్ కేంద్రంగా రెచ్చగొట్టబడుతున్న భావోద్వేగాలను రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు తిరస్కరించాలి. హైద్రాబాద్ బాధ ప్రజలది కాదు. అతి కొద్దిమంది పెట్టుబడిదారులది”
మీరు ఈ అభిప్రాయానికి ఏ ప్రాతిపదికపై వచ్చారో తెలియడంలేదు.. మరీ ముఖ్యంగా “హైద్రాబాద్ బాధ ప్రజలది కాదు.” అన్నారు. మీకు తెలియక అన్నారో, లేక మీకు తెలిసి తాత్కాలిక ఉధ్యమ లబ్ది కోసం అన్నారో అర్థం అవ్వడంలేదు. దీనికో ఉధాహరణ.. మా అమ్మగారు రిటైర్డ్ ప్రభుత్వ ఆఫీసర్, 62 సంవత్సరాలు. ఊర్లో వుంటానికి ఇల్లు తప్ప హైదరాబాద్ లో ఎటువంటి ఆస్తులు/వ్యాపారాలు లేవు. ప్రజా/మహిళా సంఘాలలో పనిచేసియున్నారు. కాని హైదరాబాద్ తన రాష్ట్ర్రంలో భాగం కాదనదగ్గర నుండి చాలా బాధలో వున్నారు. హైదరాబాద్ పోవడం వలన మా అమ్మగారికి ఆర్థికంగా వచ్చే నష్టం ఏమీలేదు. అయినా తెలియని బాధ.
యిది ఎట్లా వుందంటే, పెద్దయిన తరువాత యిప్పటి వరకు పెంచిన నీ తల్లి కన్నతల్లి కాదు అంటే ఆ మనిషికి ఎంత బాధ వుంటుంది? చిన్నపటి నుండి.. నాది భారత దేశము, ఢిల్లీ నాదేశానికి ముఖ్యపట్నం, నాది ఆంధ్రప్రదేశ్, ముఖ్యపట్నం హైదరాబాద్, నాది ఫలనా జిల్లా, నాది ఫలానా ఊరు అనే భావజాలం చిన్నపటినుండి నూరి పోసి పెంచిన సమాజంలో పెరిగిన దాదాపు మూడు తరాల ప్రజలకు హైదరాబాద్ మన రాష్ట్ర్రం కాదంటే కొంత మనసు నొచ్చుకొనక మానదు. సామాన్యులకు తను పుట్టకు మునుపు జరిగిన ఆంధ్ర/హైదరాబాద్ పంచాయితీలు తెలియదు, కేవలం హైదరాబాద్ నా ప్రాంతం అని మాత్రమే తెలుసు.
హైదారాబాద్ అన్ని జిల్లాల ప్రజల పన్నులతో అభివృద్ది చేసిన తరువాత (జిల్లాలలో కనీసం తాగటానికి మంచినీళ్ళ వసతి కూడా అందుబాటులో లేవు), యిప్పుడు నీకు సంబంధంలేదు అంటే బాధగా వుండదా?
తెలంగాణా ప్రాంతంలోని హైదరాబద్ పై ప్రాంతీయ వివక్ష చూపించలేదు కదా? మిగతా ప్రాంతాలు కేవలం వివక్ష వల్లనే అభివృద్దికి నోచుకోలేదనటం ఎంత వరకు నిజం? ప్రాంతీయ అసమానతలు పెట్టుబడీదారి వ్యవస్థలో సహజం. అటువంటి వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి గాని తోటి ప్రజానీకాని అంటా పెట్టుబడీదార్లని ముద్రవేసి విద్వేషాలు రెచ్చగొట్టడం మంచి పద్దతి కాదు..
మీరు హైదరాబాద్ లో కూర్చొని చూస్తుంది వేరు, సామాన్య ప్రజలలో వున్న ఆవేధన వేరు.
పెద్దమనుషుల ఒప్పందాల ప్రకారం హైదరాబాదు ఆదాయం అంతా తెలంగాణకే చెందుతుంది, సీమంద్ర నుండి వచ్చే ఆదాయం అంతా వేరే లెక్కలు చెయ్యవలెను. ఏ ప్రాంతం నుండి వచ్చిన ఆదాయం ఆ ప్రాంతానికే ఖర్చు చెయ్యాలి. జై ఆంధ్ర ఉద్యమమ వరకు జామా ఖర్చులు అలానే లెక్కించారు (భార్గవ కమిటి రిపోర్ట్).
ఆ తరువాత ఆ ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కారు. ఆ ఒప్పందం కొనసాగి ఉంటె ఇప్పుడు సీమండ్రులు విభజన తరువాత హైదరాబాదు ఆదాయం కోల్పోతున్నామనే ఆలోచన ఉండేది కాదు. విభజన జరగకున్నా కూడా ఇప్పుడు ఆ ఒప్పందం అమలు చెయ్యమంటే చేస్తారా ? చెయ్యరు కదా.
green_star
వాసవ్య గారు
సీమాంధ్ర ప్రజల్లో, ఉద్యోగుల్లో వ్యాపించి ఉన్న కొన్ని వాదనలకు సమాధానంగా ఈ ఆర్టికల్ రాశాను. వారి వాదనల్లో ఉన్న అపోహలు ఎత్తి చూపడానికి ఇది రాశాను. ఇది మీరు మొట్టమొదట గుర్తించాల్సిన అంశం.
తర్వాత: మీరు నేను రాసిన అంశాల్ని వక్రీకరించారు. గతంలో మనమధ్య జరిగిన చర్చలను బట్టి నా దృక్పధం ఏమిటో మీకు తెలుసన్న అవగాహనలో నేనున్నాను. కానీ పై వ్యాఖ్యల్లో నాకు అంటగట్టిన మీ వక్రీకరణలు దాన్ని పూర్వపక్షం చేసేశాయి.
హైద్రాబాద్ పోతే కొత్త ఏ.పి కి ఆదాయం ఎలా? ఉద్యోగులకు జీతాలు ఎలా? అన్న ప్రశ్నలకు నేను ఇచ్చిన సమాధానం పట్టుకుని ‘అయితే 100 రాష్ట్రాలు చేద్దామా?’ అనడుగుతున్నారు. అలా చెయ్యడానికి మీకూ నాకూ హక్కు లేదు. ప్రజలు డిమాండ్ చేసినప్పుడు ఆ సంగతి ఆలోచిద్దాం. కానీ ఆ వంక పెట్టుకుని, 6 దశాబ్దాల వివక్ష-నిర్లక్ష్యం లకు ప్రతిస్పందనగా పుట్టిన ఒక ప్రజాస్వామిక డిమాండును అపహాస్యం చెయ్యడం ప్రజల అధికారాన్ని నిజమైన అర్ధంలో కాంక్షించేవారి లక్షణం కాదు.
సరాసరి, వాటాలు, అభివృద్ధి లాంటి అంశాల్లో మీ వాదనతో నేను ఏకీభవించడం లేదు. పైన ఓ చోట చెప్పినట్లు ఆదాయాలు, అభివృద్ధిల అసమానతలు దోపిడీ సమాజాల లక్షణం. సమ సమాజాల్లో స్వంత ఆస్తి విధానం రద్దవుతుంది కనుక ఇటువంటి లెక్కల అవసరం ఉండదు. ఇప్పటి సమాజాల్లో వీటిపైన స్వీపింగ్ తీర్పులు ఇవ్వడం సాధ్యం కాదు. ‘లెక్కకు ఏదో ఒకటి కావాలి కదా?’ అన్నది ప్రజల అవసరం నుండి పుట్టిన ఆలోచన (ఈ సందర్భంలో) కాదు. పై వర్గాల వాటాల పంపకం కోసం ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది.
తెలంగాణ, సీమాంధ్రలలో ఏది ఎక్కువగా వెనకబడింది అన్న ప్రశ్న కోసం మీరు ఈ వాదన లేవనెత్తినట్లు కనిపిస్తోంది. అదే అయితే గనుక వెనుకబాటుతనం అనేది ప్రాంతీయ లక్షణం కాదు. అది దోపిడీ సమాజాల లక్షణం. ఒకే రాష్ట్రంలో మాత్రమే కాదు. ఒకే ప్రాంతంలో, ఒకే జిల్లాలో, ఒకే మండలంలో, ఒకే గ్రామంలో, ఒకే సెంటర్ లో ఇలా అన్నీ చోట్లా అంతరాలు ఉన్నాయి. ఈ ప్రాతిపదికన ఆర్ధిక, రాజకీయ నిర్ణయాలు చెయ్యడం దోపిడి సమాజాల్లోని ధనిక వర్గాల అవసరం.
మరయితే తెలంగాణ రాష్ట్రం ఎందుకు అని మీ ప్రశ్న కావచ్చు. ఆరు దశాబ్దాలుగా వివక్షకు, నిర్లక్ష్యానికి గురయింది కనుక రాష్ట్రం అవసరం అయింది. ఈ వివక్ష, నిర్లక్ష్యాలకు కారణం రాష్ట్ర రాజకీయ, ఆర్దిక ఆధిపత్యం ప్రధానంగా సీమాంధ్ర ధనికుల చేతుల్లో ఉండడం. ఆ ఆధిపత్యం ఎలా వచ్చింది అన్నది ఈ లింక్ లో (http://wp.me/p1kSha-4NO) రాశాను. మీకు వీలయితే ఒకసారి చూడండి.
“ప్రాంతీయ అసమానతలు పెట్టుబడీదారి వ్యవస్థలో సహజం. అటువంటి వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి గాని…” అని మీరు ఇప్పుడు, రాష్ట్ర విభజన ప్రకటన అయ్యాక అంటున్నారు. ఈ మాట మీరు గతంలో రాష్ట్ర ఉద్యమం రాకముందు ఎప్పుడయినా అన్నారా? కనీసం ఆలోచించారా?
నిజానికి వివక్షకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. చేయలేదా? 1969లో చేసింది ఏమిటి? ఇప్పటికంటే తీవ్రమైన ఉద్యమం అప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నారు గానీ అప్పుడయితే పోలీసు కాల్పుల్లో చనిపోయారు. అమానుషమైన అణచివేతకు గురయ్యారు. ఎందుకని? కేవలం ‘వివక్ష చూపుతున్నారు కాబట్టి, మా రాష్ట్రం మాకు ఇవ్వండి’ అన్నందుకు. ఆ ఉద్యమ ఫలితంగా అంగీకరించిన ఒప్పందాలనైనా అమలు చేశారా? తెలంగాణలో నీటి పారుదల కల్పించే అవకాశాలను పరిశీలించి అమలు చేశారా? లేదు కదా?
పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ రూల్స్, 610 జి.ఓ ఇలా అనేక ఒప్పందాలను నిజాయితీతో అమలు చేయడం ద్వారా మళ్ళీ తెలంగాణ ఉద్యమం రగలకుండా ఉండే అవకాశాన్ని కాలదన్నింది ఎవరు? అప్పుడు సీమాంధ్ర ప్రజలు ఈ ఒప్పందాలని అమలు చేయాలని ఎందుకు నాయకుల్ని ఒత్తిడి చేయలేదు. మన కిందికి తక్షణ ప్రమాదం రాదు కాబట్టి ఏం జరిగినా పట్టించుకోకుండా మౌనంగా ఉన్నాం. కాల్పులు జరిపి చంపుతుంటే మౌనంగా ఉన్నాం. పెట్రోల్ పోసి కాల్చుకుని చంపుకుంటుంటే ‘తెలంగాణ ఇవ్వర్లే’ అన్న భరోసాతో మౌనంగా ఉన్నాం.
తీరా ఇచ్చేశాక మానసిక అనుబంధం, తల్లీ పిల్లల సంబంధం అంటూ కబుర్లు చెప్పుకుంటున్నాం. తల్లీ పిల్లల సంబంధం ఒక్క సీమాంధ్రులకే ఉంటుందా? తెలంగాణవారికి ఉండదా? తమ పై నుండి ప్రవహించే నీటిలో ఆరు దశాబ్దాలుగా వాటా దక్కనప్పుడు, తమ పక్కన కట్టే ఫ్యాక్టరీల్లో తమవారికి ఉద్యోగం దక్కనప్పుడు, పుట్టి పెరిగిన నేలపైనా పరాయి వారీగా బతుకుతున్నప్పుడు తల్లీ బిడ్డల బంధం వారికి తోచదా?
“నా దేశం, నా పట్నం, నా ప్రదేశ్, నా హైద్రాబాద్….” ఇలా మీరు రాసింది చూస్తుంటే నాకు ఆర్.ఎస్.ఎస్ వాళ్ళ “భారత మాత”, “అఖండ భారత్” నినాదాలు గుర్తుకొస్తున్నాయి. ‘కాశ్మీరు భరతమాత నుదుటి సింధూరం’ అంటూ అక్కడి ప్రజల ఘోష పట్టని ఊహాత్మక సెంటిమెంటు గుర్తుకొస్తోంది.
‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న సిద్ధాంతాన్ని నేను అక్షరాలా నమ్ముతాను. హైద్రాబాద్ అంటే కంపెనీలు, రోడ్లు, రాజధాని ఇది కాదు. అక్కడ పుట్టి పెరిగిన జనం! బెంగుళూరు, మద్రాస్, ఢిల్లీ, ముంబై, అమెరికా, ఐరోపాలాలలో తెలుగువారు నిశ్చింతగా ఉన్నట్లే తెలంగాణ వచ్చాక కూడా హైద్రాబాద్ లో సీమాంధ్రులు నిశ్చింతగా ఉంటారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను వ్యతిరేకించడం ద్వారా వాళ్ళే అనవసర భావోద్వేగాలను తెలంగాణ ప్రజల్లో రెచ్చగొడుతున్నారు.
విభజన జరిగితే హైద్రాబాద్ మన రాష్ట్రం కాకపోవచ్చు గానీ, మన తెలుగు రాష్ట్రమే. మన దేశమే. మన పౌరుగు రాష్ట్రమే. అదెక్కడికీ పోదు. ఐ.టి తదితర ఉద్యోగాలు పోతాయని కూడా నేను అనుకోవడం లేదు. మనకి ఏవో పోతాయని భావించే ముందు ఆరు దశాబ్దాలు వాళ్ళు ఏం పోగొట్టుకున్నది కూడా ఆలోచించాలి.
అన్నీ జిల్లాల ప్రజల పన్నులు హైద్రాబాద్ కి వెళ్ళడం ఏమిటండీ బాబు? ఇలాంటి ప్రశ్నలను ఉద్దేశించే నేను ఆర్టికల్ లో కొన్ని ప్రశ్నలు వేశాను. బెంగుళూరు, మద్రాసు, ఐరోపా, అమెరికాల వాటాలు వద్దా అని? అసలు అభివృద్ధి అంతా హైద్రాబాద్ లో కేంద్రీకరించినందుకు నిలదీయడం మాని కేంద్రీకరించారు కాబట్టి అది మాదే అనడం ఏమిటి? ఇప్పటికయినా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగే అవకాశం వస్తుంది కాబట్టి దాన్ని ఆహ్వానిద్దామ్ అంటేనేమో వంద రాష్ట్రాలు చేయొద్దా అంటారు.
“వివక్ష ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాడాలి గానీ…” అని కదా మీరన్నారు! సీమాంధ్రులు కూడా అదే చెయ్యాలి (చేసి ఉండాలి). హైద్రాబాద్ కే మొత్తం పన్నులు ఎందుకు తీసుకెళ్తున్నారు అని ఉద్యమాలు చేసి ఉండాలి. ఫ్యాక్టరీలు, మెడికల్ కాలేజీలు, విమానాశ్రయాలు, యూనివర్సిటీలు, సీట్లు, కంపెనీలు మొత్తం అక్కడే ఎందుకు అనుమతి ఇస్తున్నారు, విజయవాడ, విశాఖ, ఒంగోలు, కర్నూలు… మొ.న పట్నాల్లో కూడా ఎందుకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకు స్ధాపించలేదు అని ఉద్యమాలు చేసి ఉండాల్సింది. కనీసం ఇప్పుడయినా అది చెయ్యాలి. అలా చెయ్యడంలో భాగమే కొత్త రాజధాని అభివృద్ధి. మళ్ళీ రాజధాని వద్దనే అభివృద్ధి కేంద్రీకరించకుండా విస్తరించేలా కొత్త రాష్ట్రంలో చర్యలు తీసుకునేలా సీమాంధ్ర ప్రజలు ఉద్యమించాలి.
కులం విషయంలో మీ విమర్శ సినిసిజం. నాకు లేని ఉద్దేశాన్ని నాకు ఆపాదించారు. వివక్షలను కమ్యూనిస్టులు పట్టించుకోవాలి అంటే అర్ధం ఏమిటి? ఆ వివక్షల నిర్మూలన కోసం ఉద్యమాలు చెయ్యాలి అని. మీరు తీసిన అర్ధం బహుశా మీ ఉద్దేశ్యం ఏమో నాకు తెలియదు. కమ్యూనిజం అభిమాని అని చెబుతున్న మీరు ఇలాంటి అర్ధం కూడా తీయగలరన్న భావనే నాకు డిజప్పాయింట్ మెంట్ కలిగించింది.
హైద్రాబాద్ గురించి మాట్లాడిన ప్రతివాడు పెట్టుబడిదారుడే అని ఎవరూ అనగా నాకు తెలియదు. నాకూ ఆ అభిప్రాయం లేదు. కానీ హైద్రాబాద్ వాదన మాత్రం పెట్టుబడిదారుడి వాదనే. అలా ధనికుల వాదన నెత్తిన వేసుకోవద్దనే నేను సామాన్యులను కోరింది. మీరు చెప్పిన ‘బాధ, నొచ్చుకోవడం’ ఇలాంటివన్నీ దశాబ్దాల తరబడిన వివక్ష, నిర్లక్ష్యాలతో పోలిస్తే ఏ మూలకు? మూడు నాలుగు తరాలు చదువు, నీళ్ళు, ఉద్యోగాలు పోగొట్టుకోవడం కంటే మించినవి కావవి. నాలుగు రోజులు పోతే ‘ఏ హైద్రాబాద్’ అని కూడా వాళ్ళు అడగొచ్చు.’
చివరగా… (మీకు తెలియడం కోసం) నేను హైద్రాబాద్ లో లేను. తెలంగాణవాడిని కూడా కాదు. సీమాంధ్రలో ఒక పల్లెలో పుట్టి పెరిగాను. ఇంటర్ ఒక సీమాంధ్ర నగరంలో, డిగ్రీ మరో సీమాంధ్ర నగరంలోని యూనివర్సిటీలో చదివి, మరో సీమాంధ్ర పట్నంలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు అనేకమంది సీమాంధ్ర ఉద్యమ నాయకులతో పరిచయాలు స్నేహాలు ఉన్నాయి. అనేకమంది తెలంగాణ ఉద్యమ నాయకులతో కూడా స్నేహాలు, పరిచయాలూ ఉన్నాయి. నేను ఉన్న చోట కూడా సీమాంధ్ర ఉద్యమ కార్యకలాపాల్లో రెగ్యులర్ గా హాజరవుతూ వారితో చర్చలు చేస్తుంటాను. వారి భావోద్వేగాలను కూడా పంచుకుంటుంటాను. అందువలన ఇవన్నీ రాయగలుగుతున్నాను తప్ప ఊహలతో కాదు.
ఏంటోనండి,ఈ వర్గాలు,వివక్షలు, విప్లవాలు, దోపిడీ ఇవేవీ నా మట్టి బుర్ర కు అర్థం కావట్లేదు.(చాలా రోజుల్నుంచి).
ఏదో చదువుకున్నాం. అందరి లానే మన రాష్ట్ర రాజధాని బాట పట్టాం.నా కజిన్స్ నలుగురు ఐ.టి. లో ఇక్కడే స్థిరపడ్డారు. ఏ దేసం వెళ్ళీనా మన ఇది మన వూరు ,మన వాళ్ళకి దగ్గర అని ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. జాబ్స్ రాని నా లాంటి వాళ్ళు ఊళ్ళో ఉన్న కూస్త దాన్ని అమ్మి ఏదో ఉపాధి పొందారు.(దోపిడీదార్లంటే వీరేనేమో?)హైదరబద్ జనాభా లో ఎంత శాతం వీరున్నారో తెలీదు. 2007 వరుకు హాయి గా ఉన్నాం.
తరువాత మొదలైంది తిట్ల పురాణం. 70% బయటి వారి పెట్టుబడులే అనారు. నిజమె. హైదరబాద్ ఆస్తుల్లొ వ్యాపారాల్లో అత్యధికం మరఠీస్, నార్త్ వాళ్ళవే. వాళ్ళ ని ఎవ్వరూ ఏమీ అనరు.తెల్లారి లేస్తే మేమే టార్గెట్. తాగడానికి డబ్బులు లేనపుడు పక్క నున్న ఆంధ్రా వాడిని బెదిరించడం, ఎవడిదైనా ఆస్తి కనబడితే వసూళ్ళ దందాలు చేసే గల్లీ లీడర్స్,ఉన్నదీ పోయే ఉంచుకున్నదీ పొయే పరిస్థితి వచ్చింది.
10 ఇయర్స్ ఐ.టి. లో జాబ్ చేసి 2007 లో 40 లక్షలుకు కొన్న ఫ్లాట్ విలువ ఇప్పుడు 30 లక్షలు కు కొనే నాధుడు లేడని నా కజిన్ బాధ.కనీసం ఇప్పటి వరకు ప్రభుత్వ రక్షణ ఉంటుందని ఆశ. రేపు వారే ప్రభుత్వం ఐతే బ్రతకనిస్తారా?
ప్రాంతం అంటే అక్కడి ప్రజలు అంటున్నారు. హైదరబాద్ యూ.టీ. చేయాలని ఇటీవలి సర్వేలో ఇక్కడి ప్రజలు కోరారు. ప్రధాన కారనం ఇక్కడి లొకల్స్ తమకి వచే రెంట్లు, అస్తుల విలువ తగ్గుతుందేమోనని, (తగ్గడం మాట అటుంచి,డిమాండ్లో బెదిరింపు ధొరణి).
తెలంగాణ కు మద్దతుగా ఎంత మంది హైదరబాద్ ఎం.ఎల్.ఏ. లు రాజీనామా చేసారు? టీ.ఆర్.ఎస్. కు హైదరబాద్ లో పోటీ చేసే ధైర్యం లేదు. హైదరబాద్ పై హక్కులు ప్రకటించేస్తారు.
కే.సీ.ఆర్. నీళ్ళ కోసం నిరాహార దీక్ష చేయలేదేమి? 610 అమలు కోసం ఉద్యోగులు సకల జనుల సమ్మె చేయలేదేమి?ఆయనకి వోట్లు కావాలి.వీళ్ళకి సీట్లు కావాలి.
తెలంగాణ నిరుద్యోగులకు మాత్రం వెంటనే నోటిఫికేషన్లు కావాలి.రాష్ట్రం వస్తే ప్రతిభ కు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వారికి లేదు.
వ్యవసాయ మిగులు తెచ్చి ఇక్కడ పెట్టడం దోపిడీనా? సినిమాల్లోకి రాకుండా ఎందుకు ఉన్నారు? పత్రికలు పెట్టకుండా ఎవ్వరు ఆపారు? వారు ముందు అడుగు వేయడం అన్యాయమా?
మన లో లోపాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.ఏమైనా తెలంగాణా ఉద్యమం ,సమైక్యాంధ్రా ఉద్యమం చివరి సాధించేది ఏమీ ఉండదు. రాజకీయులకు మేత. ప్రజల మనసుల్లో తరాల పాటు నిలిచే విద్వెషం అంతే….
“అలా చెయ్యడానికి మీకూ నాకూ హక్కు లేదు.”
మీరు అన్నట్లు క్రొత్త రాజధానివల్ల ఆ ప్రాంతం భాగా అభివృద్ధి చెందుతుందని మీరు అన్నారు. భారత్ లో 100 రాష్ట్రాలను చేస్తేనే అభివృధి చెందుతుందనే వాదనతో మీరు ఏకీభవిస్తారా అని మాత్రమే నేను అడిగాను.. మనయిద్దరికి హక్కు వుందని కాదు. చాలా సంవత్సరాలనుండి దేశంలో తెలంగాణా వళ్లే ప్రత్యేక రాష్ట్రాలు కావాలని ప్రజలు దాదాపు 15 చోట్ల కోరుకుంటున్నట్లు రోజు పేపర్లలో చూస్తున్నాము. ఒక సిధాంత ప్రాతిపదిక అవసరమా కాదా అనేదే నా అంతర్లీన ప్రశ్నగా భావించండి.
“ఆదాయాలు, అభివృద్ధిల అసమానతలు దోపిడీ సమాజాల లక్షణం”
మీ వాదనలో బాలెన్స్ తప్పుతున్నట్లుంది. అంటే మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రాన్ని కమ్యునిజ రాజ్యంగా ప్రకటించే అవకాశమున్నట్లు కలలు కంటున్నట్లు వున్నారు. యిది తెలంగాణ ప్రజలను మరోక సారి మోసం చేయడమే! తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దోపిడీ రాజ్యం పోయి సమ సమాజం ఏర్పడుతుందని ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారో అర్థం అవ్వడం లేదు. ఒక ప్రక్క పెట్టుబడీ దారి వ్యవస్థలో దోపిడీ అనేది “ప్రాంతాలకు అతీతం” అంటున్నారు. మరో ప్రక్క ప్రత్యేక రాష్ట్రం ద్వారానే ఆరు శతాబ్ధాలు అణగదొక్కబడిన ప్రాంతం అభివృధ్ధ్ సాదిస్తుంది అంటున్నారు. మీరు కోరుకుంటున్న ప్రత్యేక రాష్ట్రంలో “పెట్టుబడీ దారి వ్యవస్థ” వుండదని మీరు భవిస్తున్నారా?
“ఈ మాట మీరు గతంలో రాష్ట్ర ఉద్యమం రాకముందు ఎప్పుడయినా అన్నారా? కనీసం ఆలోచించారా?”
సరే నాకు సామాజిక స్పృహ యిదివరకు లేదనుకుందాం. మరి ఆరు దశాబ్దాలుగా ఎంతో సామాజిక/రాజకీయ స్పృహ కలిగివున్న తెలంగాణా ఉధ్యమ కారులెవ్వరూ హైదారాబాద్ లో జరుగుతున్న కేంద్రీకరణాభివృధిని ఎందుకు ప్రశ్నించలేదు / ఉధ్యమాలు చెయ్యలేదు? మన తెలంగాణా ప్రాంతమే కదా అని ఉద్ధేశపూర్వకంగా విస్మరించారా?
“నాకు ఆర్.ఎస్.ఎస్ వాళ్ళ “భారత మాత”, “అఖండ భారత్” నినాదాలు గుర్తుకొస్తున్నాయి”
ఎక్కువమంది ప్రజలలో “నాది” అనే స్వార్థం నరనరాలలో పేరుకుపోయిన ఈ వ్యవస్థలో అందరూ ఒకే స్థాయిలో చైతన్యవంతమైయి వుండరు. యిటు వంటి ప్రత్యేక వాదాల ద్వారా “నాది”, “నా మతం”, వంటి వాటికి ప్రాణం పోసినట్లే నని నా అభిప్రాయము.
చివరిగా…
నా వరకు నేను, ప్రాంతియ అసమానతల నేపథ్యంలో యిరుప్రాంత సామాన్యమానవుల మధ్య భావోధ్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా “విప్లవ మార్గాన్ని” సుగుమం చేసుకోవచ్చనే “ఎత్తుగడ”ని నేను ఎన్నటికి ఒప్పుకోలేను. ఎందుకంటే ప్రాంతాలుగా విడిపోయినా రేపు బడా పెట్టుబడిదార్లు యిరు ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టి యిరు ప్రాంత పెట్టుబడీదార్లు కలిసి వ్యాపారాలు చేసుకుంటారు. అప్పుడు మీలాంటి వారు చూస్తూ వుండటం తప్ప ఏమీ చెయ్యలేరు. ప్రస్తుతానికి ఒక ప్రాంత పెట్టుబడిదారులకు ఆయాచిత వరం “మీలాంటి మేధవి వర్గం”
తెలంగాణ ప్రత్యక వాదాన్ని సమర్థించడం ద్వారా దేశమొత్తానికి ఒక శాస్త్రీయమైన విధి విధానాలు ఖరారు చెయ్యడం కూడా మిలాంటి వారికి కష్టతరమైన విషయంగా తరాయందని నేను భావిస్తున్నను.. అందుకే నేను 100 రాష్ట్రాలకు మీరు సమ్మతమేనా అని అడిగాను.
పస్తుత “ఎత్తుగడ” ని సమర్థించడం కోసం మీరు నమ్మని పెట్టుబడీదారి ఆర్థక లావాదేవీలపై కూడా బేరీజు వేసి లాభ నష్టాలు వేసే స్థాయికి వెళ్ళారు. ఒక తప్పు చేస్తే ఆ తప్పును కవర్ చేయడానికి ఎన్ని తప్పులు చేయాలో…
మీ విషయ పరిజ్ణాన్ని అభినందిస్తూ మీరు యిలానే విశ్లేషాత్మకమైన వార్తలు కొనసాగించాలను కోరుకుంటున్నాను.
నా వరకు నేను ఈ చర్చనుండి తప్పు కుంటుంన్నాను. నా భావ వ్యక్తీకరణలొ లోపాలుండవచ్చు. అంతే తప్ప నేను మీరు చెప్పె విషయాలపై దాదాపు ఏకభవిస్తాను (ఈ ఒక్క “ఎత్తుగడ”లో తప్ప). నేను ప్రాతీయ దురభిమానంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించట్లేదని గుర్తించాలని మనవి.
వాసవ్య గారూ,
‘భావ వ్యక్తీకరణలో లోపాలు’ కనుక వాటిని వదిలేద్దాం.
కానీ మీరు మళ్ళీ నేను చెప్పని విషయాలను నాకు ఆపాదించారు.
“క్రొత్త రాజధానివల్ల ఆ ప్రాంతం భాగా అభివృద్ధి చెందుతుందని మీరు అన్నారు.”
నేనన్నది ఇది కాదు. కొత్త రాజధాని వలన జి.డి.పి వృద్ధి వేగంగా ఉంటుందని. తద్వారా పన్నుల ఆదాయం పెరుగుతుంది కనుక హైద్రాబాద్ పోతే ఆదాయం ఎలా అన్న ఆందోళన అవసరం లేదని ఒక ఆలోచనగా చెప్పాను. ఇలా ఆపాదించినవి ఇంకా ఉన్నాయి. అవి కింద రాస్తాను. (కంటిన్యుటి పోకుండా ఇక్కడ ఆపుతున్నా.)
‘తెలంగాణ వల్లనే 15 చోట్ల డిమాండు’ అనడం కరెక్ట్ కాదు. ప్రాంతీయ అసమానతల వల్లనే ఆ డిమాండ్లు. అంతర్గత వైరుధ్యాలు లేకుండా బాహ్య వైరుధ్యాలు చేసేది ఏమీ లేదన్నది గతితర్క సూత్రం. అంటే ప్రత్యేక రాష్ట్రాల డిమాండు వచ్చిన చోట నిజంగా అలాంటి డిమాండు ఉత్పన్నం కావడానికి తగిన అంతర్గత పరిస్ధితులు లేకుండా బాహ్య కారణాల వల్ల రావు. సంఘటనలు పరస్పరం ప్రభావితం చేసుకోవడం అనే ఒక బాహ్యకారణం వల్లనే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పుట్టదు. అసమానతలు, వివక్ష, నిర్లక్ష్యం ఉన్నందునే ఆ డిమాండ్లు పుట్టాయి. తెలంగాణ డిమాండ్ కు ఒప్పుకోవడం అనేది ఒక బాహ్యకారణంగా పని చేసి అంతర్గత కారణాలకు ఉత్ప్రేరకంగా పని చేసిందని మనం అర్ధం చేసుకోవాలి. ‘ఒకటి ఇస్తే వంద ఇవ్వాలి’ అనేది ఒక ప్రజాస్వామిక డిమాండును అపహాస్యం చేయడానికి పుట్టిన వాదన. దానిని కమ్యూనిస్టులు నెత్తిన వేసుకోకూడదని నా అభిప్రాయం.
“అంటే మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రాన్ని కమ్యునిజ రాజ్యంగా ప్రకటించే అవకాశమున్నట్లు కలలు కంటున్నట్లు వున్నారు.”
ఈ అర్ధం వచ్చేట్లు నేను ఎక్కడ, ఏమి రాశాను? పైగా తెలంగాణ అన్నీ సమస్యలకు పరిష్కారం కాదని, అది పాక్షిక పరిష్కారం మాత్రమేననీ, ప్రస్తుత వ్యవస్ధ పరిధిలో అందుబాటులోకి వచ్చే ఒక ఉపశమనం మాత్రమే అనీ చెబుతూనే ఉన్నాను. మీ బ్లాగ్ లోనే ఒకసారి నేను చర్చ చేసినట్లు గుర్తు. ఆ చర్చలో ఈ అంశాన్ని వివరించానని లీలగా గుర్తుంది. మీకు పైన ఇచ్చిన లింక్ లో కూడా ఆ సంగతి చెప్పాను.
ఈ అంశంపై మీ వ్యాఖ్యలోని భాగానికి సంబంధించిన నా అవగాహన కింద లింక్ లో వివరించాను. వీలయితే చూడగలరు.
తెలంగాణ డిమాండ్‌పై అంతర్జాతీయ పెట్టుబడుల దృక్పధం ఎలా ఉంది?
“మరి ఆరు దశాబ్దాలుగా ఎంతో సామాజిక/రాజకీయ స్పృహ కలిగివున్న తెలంగాణా ఉధ్యమ కారులెవ్వరూ హైదారాబాద్ లో జరుగుతున్న కేంద్రీకరణాభివృధిని ఎందుకు ప్రశ్నించలేదు / ఉధ్యమాలు చెయ్యలేదు? మన తెలంగాణా ప్రాంతమే కదా అని ఉద్ధేశపూర్వకంగా విస్మరించారా?”
‘మొదులుకు లేదు మొగుడా అంటే పెసరపప్పు పెళ్ళామా’ అన్నట్లుంది మీరు చెప్పేది. అభివృద్ధి కేంద్రీకరణ వల్ల సీమాంధ్ర ప్రజలు కూడా నష్టపోయారని కదా నేను చెబుతున్నది. ఆ ఉద్యమాలు చేయాల్సింది సీమాంధ్ర ప్రజలు గానీ తెలంగాణ వాళ్ళు ఎలా అవుతారు? వివక్ష, నిర్లక్ష్యాల పైన పోరాడుతున్నవారిపైన సీమాంధ్ర ప్రజల పోరాట భారం కూడా వేయడం అన్యాయం కదండీ?
ప్రతి సమస్యకీ తెలంగాణ ఉద్యమాన్నే మీరు బాధ్యుల్ని చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల డిమాండ్లకు బాధ్యులూ వారే, అభివృద్ధి కేంద్రీకరణకీ బాధ్యులు వారేనా?
ప్రత్యేకవాదం అంటేనే చెడ్డది, మహా రోతది అని మీ అభిప్రాయంగా కనిపిస్తోంది. దానిని అణచివేతకు గురవుతున్న ప్రజా సమూహపు అసంతృప్తి వ్యక్తీకరణగా గుర్తించకపోవడం ఒక తప్పు. స్ధూల దృష్టితో చూస్తే వర్గ దోపిడీలో ఉన్న ప్రజలు తమకు అందుబాటులో ఉండే, తమకు అర్ధం అయ్యే దృక్పధాలతో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. వాటిని గుర్తించడం ప్రజాస్వామిక వాదుల ప్రధమ కర్తవ్యం. తెలంగాణ డిమాండు విప్లవకర డిమాండు కాదు. అది వివక్ష, నిర్లక్ష్యాలకు పరిష్కారం కోరిన ఒక ప్రజాస్వామిక డిమాండు. ప్రజాస్వామిక డిమాండ్లకు మద్దతు ఇవ్వడం కమ్యూనిస్టుల కర్తవ్యం.
<<నా వరకు నేను, ప్రాంతియ అసమానతల నేపథ్యంలో యిరుప్రాంత సామాన్యమానవుల మధ్య భావోధ్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా “విప్లవ మార్గాన్ని” సుగుమం చేసుకోవచ్చనే “ఎత్తుగడ”ని నేను ఎన్నటికి ఒప్పుకోలేను.<<
ఇది ఎవరు చెప్పారు? నేనెక్కడా ఇలా చెప్పలేదే? నాకా భావన ఉన్నట్లుగా కూడా ఎక్కడా చెప్పలేదు. ఆ అర్ధం వచ్చేలా కూడా చెప్పలేదు. నా అవగాహన గురించిన మీ ఊహ నిజం కాదు.
తెలంగాణ డిమాండు వలన రైతులకు, విద్యార్ధులకు, నిరుద్యోగులకు ఎలా పాక్షిక లబ్ది చేకూరుతుందో నేను చెప్పాను. పైన ఇచ్చిన లింక్ లో కూడా ఆ విషయం ఉంది. అంతేకాక కొత్త రాష్ట్రం వలన సీమాంధ్ర ప్రజలకు ఉన్న లాభాలు కూడా చెప్పాను. అయినా ‘పెట్టుబడిదారులకే’ నా వాదన వరం అని మీరు చెబుతున్నారు. కానీ సమైక్యాంధ్ర వల్ల తెలంగాణవారికి కొనసాగే లాభం ఏమిటో ఎవరూ చెప్పగా నేను వినలేదు. ‘అందరికీ నష్టం’ అన్న రాజకీయుల వాగుడు తప్ప.
స్టీలపై వివక్ష, నిమ్న కులాలపై వివక్ష, మైనారిటీ మతాలపై వివక్ష… ఇలాంటి వివక్షలను వ్యతిరేకించడం, వాటిపైన ఉద్యమించడం, ప్రజలను సమీకరించడం కమ్యూనిస్టులు చేస్తారు. చేయాలి కూడా. అలాగే ప్రాంతీయ వివక్షలపై కూడా ఉద్యమించాలి. వ్యవస్ధ పరిధిలోనే అయినా పాక్షిక పరిష్కారం వచ్చేట్లయితే దానికి మద్దతు ఇవ్వాలి. ఇది కమ్యూనిస్టుల కర్తవ్యాల్లో ఒకటి. అందువల్లనే తెలంగాణ, విదర్భ, జార్ఖండ్, ఉత్తరాఖండ్ లాంటి డిమాండ్లకు మద్దతు నేను ఇస్తాను. అందులో కొన్ని నెరవేరాయి. మరికొన్ని నెరవేరాల్సి ఉంది. ఈ డిమాండ్లు చేసినంతమాత్రాన, అదే సర్వ రోగ పరిష్కారం అన్న అవగాహనలో ఉన్నట్లు కాదు. ఆ వంకా, ఈ వంకా చూపి ప్రజల ప్రజాస్వామిక డిమాండ్లకు మద్దతు ఇవ్వలేకపోతే ‘కమ్యూనిజం మంచిది’ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
<<తెలంగాణ ప్రత్యక వాదాన్ని సమర్థించడం ద్వారా దేశమొత్తానికి ఒక శాస్త్రీయమైన విధి విధానాలు ఖరారు చెయ్యడం కూడా మిలాంటి వారికి కష్టతరమైన విషయంగా తరాయందని నేను భావిస్తున్నను.. అందుకే నేను 100 రాష్ట్రాలకు మీరు సమ్మతమేనా అని అడిగాను.<<
దేశంలోని వ్యవస్ధ తీరుతెన్నులపై నా అవగాహన వివిధ సందర్భాల్లో చెప్పాను. తెలంగాణ ఉద్యమం సందర్భంగా మీరు కోరిన పద్ధతిలో చెప్పకపోయినంత మాత్రాన ‘శాస్త్రీయ విధివిధానాలను ఖరారు చేయలేకపోవడం’ అంటే ఎలా? ‘శాస్త్రీయ విధివిధానాలు ఏవి?’ అన్న విషయంలోనే భేదాభిప్రాయాలు ఉంటాయి. వీలయితే ఈ లింక్ లు చూడండి.
తెలంగాణ రాష్ట్రం కోరడం వేర్పాటువాదం కాదు
‘భాషాప్రయుక్త రాష్ట్రాల’ సిద్ధాంతానికి తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకం కాదు
మీరు పైన రాసిన అంశాలను బట్టి ఈ వ్యాసాలను చూసి ఉండరు అన్న అంచనాతో లింక్స్ ఇస్తున్నాను. చూసినా పై విధంగా రాస్తే నాకది ఆశ్చర్యకారకమే.
వీలయితే చర్చను కొనసాగించండి.
chala tappudu samacharam istunnaru, hyderabad vidipotundante bada, akkada pettubadulu pettina pettubadi daruladi yentha matram kadu, eppudu udyamam chestunna , prajalu, seemandra prajalu andariki, anni vargala variki anubandam hyd tho undil anduke antha samaikyam ga udyamistunnaru. pettubadulu, rastretarulu pettarani figures tho vatakalu vandaru, yenduku pettaru hyd capital ane kada, vij, vizag loo yenduku pettaledu, anni prantala variki anyayam chesi power supply hyd ki ivvabattekada, pettubadulu hyd ki vachayi, power anni areas equal ga distribute ithe, maa vallu 12hrs power lekunda yenduku ibbandulu padutunnaru? kani yeppudu hyd ki power maku ivvakunda estunnaru ane bavane maku yeppudu kalagaledu, hyd manadii anukunnamu, eppudu maadi antunte, andiri kadupu mandi, aa manta nunchi vachindi samaikya utyamama–jai samaikyandra.
రెడ్డి గారు, కరెక్ట్ సమాచారం ఏమిటో మీరివ్వండి! పాఠకులకు ఉపయోగంగా ఉంటుంది.
shekargariki,vasavya Yagatigari,vvsn reddi tadi garlaku inthagoppa samacharanni debate chesinanduku danyavadalu. Samaikandra ante kevalam Seemandra vaaru antene saripothunda.Telangana Vaaru Anavadda. Balavanthanaga kalipi vunchuthara.Mithrulara shekargaru cheppinatluga 25% industries seemandrulu pedithe andulo yentha % jobs telangana vaariki ichharu. Anni factorylalo choodandani seemandrule kanipistharu.industries nundi vacche kalusyaniki maathram maa prajalu bali avuthunnaru. okkasari moosi down stream villages velli choodandi akkadi vaari paristhithi.okkasaraina eaa 12years udyamam jaruduthunnappudu problems gurinchi charchinchara.charcha pedithe memu yemi kolpovalasi vasthundane bayyam. Telangana Raanivvam Ane Dheema. Ealagaina chesi Rakunda addukuntamane duralochana. Vaddandi inka kalisi vundalane Aalochane cheyakandi. yela sodarabavamtho vidipovalo Alochinchandi.
Read this article:http://missiontelangana.com/hyderabad-revenue-no-riddle-this/
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖచ్చితంగా వేర్పాటు వాదమే. అలాగే ఇది ‘‘భాషా ప్రయుక్త రాష్ట్రాల
’’ సిద్దాంతానికి కూడా వ్యతిరేకమే అని నేను భావిస్తాను.
తెలంగాణ ఏర్పాటుపై అంతర్జాతీయ పెట్టుబడి దృక్పధంపై కూడా నేను మీతో ఏకీభవించలేను. అంతర్జాతీయ పెట్టుబడి కోరేది చిన్న రాష్ట్రాలనే, చిన్న ప్రభుత్వాలనే, చిన్న చిన్న కార్మిక సంఘాలనే. పెద్ద రాష్ట్రాలయితే పెద్ద పెద్ద కార్మిక సంఘాలతో వచ్చే ఉద్యమాలను అది కోరుకోదు.
Hi ashok,
మీ వ్యాఖ్యలు రెండూ స్పామ్ లో ఉన్నాయి. చూసి ఇప్పుడే ఓ.కె చేశాను.
అశోక్ గారూ, అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ వ్యతిరేక దృక్పధం ఉండడం అనేది నేను కనిపెట్టింది కాదు. వారి దృక్పధమే అలా ఉంది. వివిధ వార్తా సంస్ధలు తెలంగాణకు వ్యతిరేకంగా అభిప్రాయం కలిగి ఉన్నాయి. అలా ఎందుకు ఉన్నాయో అన్నదే నేను చెప్పాను తప్ప వారి అభిప్రాయాలను నేను రూపొందించలేదు.
చిన్న, పెద్ద రాష్ట్రాలు – vis-a-vis అంతర్జాతీయ పెట్టుబడులు గురించి మీరు చెప్పింది యాంత్రిక అన్వయింపు.
భారత దేశం 1.2 బిలియన్ల జనాభా గల దేశం. పెద్ద దేశం. అందుకని సామ్రాజ్యవాద పెట్టుబడులకు లొంగకుండా ఉందా?
క్యూబా అత్యంత చిన్న దేశం. అయినా ఐదారు దశాబ్దాలు అమెరికాను ఎదిరించి నిలవలేదా?
నేపాల్ ఎంత దేశమని? ఐనా అమెరికా-ఇండియాల కుట్రలను ఓడిస్తూ అక్కడ మావోయిస్టులు ప్రభుత్వంలోకి రాలేదా?
దేశం నుండి విడిపోవాలని కోరితే వేర్పాటువాదం. ఐనా తెలంగాణ డిమాండు వేర్పాటు వాదం అంటే చేసేదేముంది? తమిళులకు రెండు రాష్ట్రాలు, హిందీలకు నాలుగైదు రాష్ట్రాలు ఉన్నా భాషాప్రయుక్త రాష్ట్ర సిద్ధాంతానికి అనుకూలం అయితే తెలుగులకు రెండు రాష్ట్రాలు ఉంటే అనుకూలం ఎందుకు కాకుండా పోతుంది?
సూత్రీకరణలు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల కోసమే తప్ప వ్యతిరేకంగా ఉండకూడదు. ఉంటే పిడివాదం అవుతుంది.
తెలంగాణా లో వున్నా పెట్టుబడిదార్లని సీమాంద్ర కు పంపాలి,అప్పుడే దోపిడీ పెట్టుబడి లేని
స్వచమైన తెలంగాణా రాష్ట్రంగా దేశం లో నిలుస్తుంది.