యువత వేదనా భరిత నిట్టూర్పే బొద్దింకల ఆందోళన!
– —-సుమన, 25-07-2026 సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దేశంలోని నిరుద్యోగులు, విద్యార్ధులు, యువత పట్ల పరోక్షంగా మరోసారి ఏవగింపు ప్రకటించి తప్పుడు కారణాలతో వార్తలకెక్కారు. న్యాయం కోరుతూ రోడ్డెక్కిన విద్యార్థులపై అత్యంత క్రూరంగా లాఠీ చార్జ్ చేసిన వీడియోలు ఉన్నాయని చెప్పిన పిటిషనర్లతో “వీడియోలు చూసేందుకు మాకు సమయం లేదు” అంటూ తమ పిటిషన్ ను అర్జెంటుగా చేపట్టాలన్న విజ్ఞప్తిని మొరటుగా తిరస్కరించారు. బుధవారం నాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జస్టిస్…









