సైన్యం చేతిలో ఈజిప్టు భవితవ్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేరేనా?

“ఈ నియంత మాకొద్దం”టూ పద్దెనిమిది రోజుల పాటు ఎండా, వాన తెలియకుండా, రాత్రీ పగలూ తేడా చూడకుండా వీధుల్లోనే భార్యా బిడ్డలతో సహా గడిపి ఈజిప్టు పౌరుడు ఆందోళనలో పాల్గొని నియంత ముబారక్ ను దేశం నుండి సాగనంపాడు. వారి ప్రధాన కోరిక అయిన ప్రజాస్వామ్య పాలన ఇంకా దేశంలో ఏర్పడలేదు. ముబారక్ ముప్ఫై సంవత్సరాల పాటు ఎమర్జెన్సీ చట్టంతో తమని పాలించటానికి ఏ శక్తి సాయం చేసింది? దేశంలో సైన్యమే ముబారక్ కు అండదండలిచ్చి కాపాడితే,…

ఎట్టకేలకు ముబారక్ రాజీనామా, ఆనందోత్సాహాల్లో ఈజిప్టు ప్రజలు

  కేవలం నెలరోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఇద్దరు ఆఫ్రికా నియంతలు నేల కూలారు. సైన్యం ఆందోళన కారులకు వ్యతిరేకంగా మద్దతు ఇయ్యలేమని తెలియజేయటంతో ట్యునీషియా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన 27 రోజుల్లోనే ఈజిప్తు అధ్య్క్షుడు ముబారక్ సైతం అవే పరిస్ధితుల నడుమ అధికారన్ని త్యజించక తప్పలేదు. పద్దెనిమిది రోజుల ఆందోళనల అనంతరం ముబారక్ తలొగ్గాడు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సైన్యానికి బాధ్యతలు అప్పగించినట్లుగా వార్తా సంస్ధలు తెలిపాయి. ఉపాధ్యక్షుడు సులేమాన్ ఈ మేరకు…

ఎమర్జింగ్ దేశాలు ఆంటే అర్ధం ఏమిటి?

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల వర్గీకరణలో “ఎమర్జింగ్ దేశాలు” అనే కొత్త పదం ఒకటి వచ్చి చేరింది. ఈ పదం చేరక ముందు మూడు రకాల వర్గీకరణ మాత్రమే ఉండేది. అగ్ర రాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలను మొదటి ప్రపంచం అని పిలుస్తున్నాము. గతంలో రష్యా, అమెరికాలు రెండు అగ్ర రాజ్యాలు కనుక ఆ రెండు మొదటి ప్రపంచం అన్నారు. ఆ తర్వాత రష్యా పతనం కావటంతో అమెరికా ఒక్కటే మొదటి ప్రపంచంగా ఉంటూ వచ్చింది.…

ద్రవ్యోల్బణం అదుపు కోసం బ్రెజిల్ పొదుపు ప్రయత్నాలు

  ద్రవ్యోల్బణం అదుపు, కోశాగార స్ధిరీకరణ (ఫిస్కల్ కన్సాలిడేషన్) పేరుతో ప్రజల సంక్షేమం కోసం పెట్టే ఖర్చులో కోతలు విధించడానికి బ్రెజిల్ ప్రభుత్వం కూడా సిద్ధపడినట్లు కనిపిస్టోంది. పెరిగి పోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటానికి 50 బిలియన్ల రియళ్ళ (రియల్ అనేది బ్రెజిల్ కరెన్సీ) మేరకు ఖర్చులు తగ్గిస్తామని బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన పొదుపు మొత్తం  30 బిలియన్ డాలర్లకు సమానం.   ఆర్ధిక సంక్షోభం పుణ్యాన అభివృద్ధి చెందిన దేశాలతో పాటు చైనా, బ్రెజిల్,…

పదవిని వీడని ముబారక్, అమెరికా సూచన బేఖాతరు

గురువారం సాయంత్రం ముబారక్ దిగిపోనున్నాడని చాలా మంది ఊహించినప్పటికీ ఆయన సెప్టెంబరు వరకూ దిగేది లేదని ప్రకటించాడు. కొన్ని అధికారాలు ఉపాధ్యక్షునికి అప్పగిస్తానని ప్రకటించాడు. కానీ ఏ అధికారాలనేది స్పష్టం కాలేదు. బయటివారి ఒత్తిళ్ళను, నిర్దేశాలను తాను లెక్క చేయనని కూడా ముబారక్ ప్రకటించాడు. సైన్యం “పరిస్ధితులు కుదుట పడ్డాక ఎమర్జెన్సీని తప్పకుండా ఎత్తివేస్తామని ప్రకటించింది. మామూలు పరిస్ధితులు ఏర్పడటానికి సహకరించాలని మరోసారి కోరింది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ముబారక్ ప్రకటనకు ఒకింత తీవ్రంగా స్పందింఛాడు.…

ప్రతిఘటిస్తున్న ముబారక్, విస్తరణ వ్యూహంలో ఆందోళనకారులు

అన్నివైపుల నుండి వస్తున్న ఒత్తిడులను ముబారక్ ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. “ఈజిప్టు ఇంకా ప్రజాస్వామ్యానికి సిద్ధంగా లేదంటూ” ముబారక్ ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొంటున్న ఉపాధ్యక్షుడు ఒమర్ సులేమాన్ ప్రకటించండం పట్ల అమెరికా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలనూ, నిరసనలనూ ముప్ఫై సంవత్సరాలనుండీ అణచివేయటానికి ఉప్పయోగిస్తూ వస్తున్న ఎమెర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయాలన్న అమెరికా డిమాండ్ పట్ల విదేశాంగ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికా నమ్మకమైన మిత్రుడిగా ఉంటూ ప్రతికూల పరిస్ధితుల్లో ఎమర్జెన్సీ చట్టాన్ని ఎత్తివేయమనటం…

11,375 కోట్ల రూపాయలు నష్టపోయిన అనీల్ అంబానీ కంపెనీలు

  బుధవారం ప్రతికూల పుకార్ల కారణంగా అనీల్ అంబానీకి చెందిన కంపెనీలు దాదాపు 2.5 బిలియన్ల డాలర్ల మార్కెట్ కేపిటల్ నష్ట పోయినట్లుగా రాయటర్స్ వార్తా సంస్ధ గురువారం తెలిపింది. బుధవారం ఇండియా షేర్ మార్కెట్లు ఎనిమిది నెలల కనిష్ట స్ధాయికి పతనమయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావటంతో విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇండియా షేర్ల నుండి ఉపసంహరించుకుంటున్నందువలన షేర్లు అడ్డూ అదుపూ లేకుండా పతనమవుతున్నాయి. ఈ నేపధ్యంలో అనీల్ అంబానీ…

ట్యునీషియా ఆపద్ధర్మ అధ్యక్షునికి మరిన్ని అధికారాలు

ప్రజల తిరుగుబాటుతో దేశం విడిచి పారిపోయిన పాత అధ్యక్షుడి స్ధానంలో తాత్కాలిక (ఆపద్ధర్మ) అధ్యక్షునిగా అధికారాన్ని చేపట్టిన ఫోద్ మెబజాకి ఇప్పుడు పార్లమెంటుతో సంబంధం లేకుండా డిక్రీతో పాలించే అధికారాలను సంక్రమింపజేశారు. మెబాజా పదవీచ్యుతుడైన పాత అధ్యక్షుడు బెన్ ఆలీకి సన్నిహితుడుగా పేరు పొందిన వ్యక్తి. బెన్ ఆలీ పాలనలో దాదాపు పదకొండు సంవత్సరాలపాటు  ప్రధానిగా పని చేశాడు. పార్లమెంటుతో సంబంధం లేకుండా డిక్రీ ద్వారా పాలించ వచ్చు. సెనేట్ ఓటింగ్ ద్వారా అటువంటి అధికారాలను దఖలు…

ముబారక్ దిగిపోవాలన్న అమెరికాపై ఈజిప్టు మంత్రి ఆగ్రహం

అధికారాన్ని అప్పగించేందుకు వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని ముబారక్ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చిన అమెరికా గత రెండు మూడు రోజులుగా స్వరం మార్చి ముబారక్ దిగి పోవాలని డిమాండ్ చేస్తుండడంతో ఈజిప్టు విదేశాంగ మంత్రి అబౌల్ ఘీత్, అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమర్జెన్సీ పరిస్ధుల చట్టాన్ని ఎత్తివేయలన్న డిమాండ్ ను ప్రస్తావిస్తూ అమెరికా తన కోరికలను ఈజిప్టుపై రుద్దకూడదన్నాడు. జనవరి 25 నుండి ముబారక్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో రాజధాని కైరోతో పాటు వివిధ పట్టణాలలో…

శతృవుల పుకార్లతో మా కంపెనీల షేర్లు పడిపోతున్నాయ్ -అనీల్ అంబానీ

మా కంపెనీ పోటీదారులు కంపెనీకి వ్యతిరేకంగా పనిగట్టుకుని మరీ ఆధార రహితమైన పుకార్లు వ్యాపింప జేస్తున్నారనీ అందుకే మా గ్రూపు (అడాగ్) కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పడి పోతున్నాయనీ అనీల్ అంబానీ తెలిపినట్లుగా రాయటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అ పోటీదారుల పేర్లను అనీల్ వెల్లడించలేదు. మా కంపెనీల షేర్లను అస్ధిరం కావించటం ద్వారా మార్కెట్లో భయాందోళనలను సృష్టించాలని చూస్తున్నారని అనిల్ ఆరోపించాడు.   కొత్త సంవత్సరం ప్రారంభం ఐనప్పటునుండి ఇండియా షేర్ మార్కెట్ లో…

మన్మోహన్ ప్రభుత్వ ఖాతాలో మరో భారీ కుంభకోణం

గత నాలుగు సంవత్సరాలుగా అనేక చిన్నా పెద్దా కుంభకోణాలతో యమ బిజీగా ఉన్న మన్మోహన్ ప్రభుత్వం మరో భారీ కుంభకోణానికి తెర లేపి రెడ్ హేండెడ్ గా దొరికిపోయింది. ఈసారి చాలా ముందుగానే బయట పడటంతో దేశ ఖజానా మీదనే కన్నేసిన ఓ భారీ బందిపోటు దోపిడీ తప్పిపోయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) వాణిజ్య విభాగంమైన ఆంత్రిక్స్ సంస్ధ బెంగుళూరు కేంద్రంగా గల ఒక ప్రైవేటు కంపెనీకి అరుదైన ఎస్-బ్యాండు స్పెక్ట్రంలో కొంత భాగాన్ని…

అమెరికా సెక్యూరిటీ సంస్ధ హెచ్.బి.గ్యారీపై ఎనోనిమస్ హ్యాకర్ల దాడి

ఎనోనిమస్ హ్యాకర్లు మరోసారి తమ ప్రతాపం చూపారు. ఇంటర్నెట్ లో తన కార్యకలాపాలను నిర్వహించే ఈ గ్రూపు సభ్యులు తాజాగా అమెరికా సెక్యూరిటీ సంస్ధ ” హెచ్.బి.గ్యారీ ఫెడరల్ “ వెబ్ సైట్లపై తమ ప్రతాపం చూపారు. ఆ సంస్ధ ఉన్నతాధికారుల్లో ఒకరైన ఏరన్ బార్, తాము ఎనోనిమస్ సభ్యుల్లో సీనియర్లను గుర్తించామని గత వారాంతం ప్రకటించటమే వీరి దాడికి కారణంగా తులుస్తోంది. ఎనోనిమస్ సంస్ధలో ప్రపంచ వ్యాపితమ్గా వేలమంది కంప్యూటర్ నిపుణులు సభ్యులుగా ఉన్నారని వివిధ…

నిజమే నేను తప్పు చేశాను -ఫ్రాన్స్ విదేశీ మంత్రి మేరీ

“ట్యునీషియా వ్యాపారవేత్త సొంత విమానంలో ప్రయాణం చేయటం నా తప్పే” అంటూ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఇప్పుడు లెంపలు వేసుకుంటోంది. ఓ పక్కన టునీషియా ప్రజలను రెండున్నర దళాబ్దాల పాటు నియంతలా పాలించిన అధ్యక్షుడు బెన్ ఆలీకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తూ పోలీసుల చేతిలో అనేక మంది చనిపోతుండగా అతని సన్నిహితుడయిన వ్యాపారవేత్తకి చెందిన ప్రైవేటు విమానంలో విహారయాత్రకు ట్యునీషియా బయలుదేరి రావటంతో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఎలియట్ మేరీ ప్రపంచ…

జులియన్ అస్సాంజ్ అప్పగింత కేసులో వాదనలు ప్రారంభం

లైంగిక అత్యాచారం కేసులో జులియన్ ను ఇంగ్లండ్ నుండి స్వీడన్ కు అప్పగించాలంటూ స్వీడన్ పోలీసులు బనాయించిన కేసులో వాదనలు సోమవారం ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యాయి. జులియన్ లాయర్లు రెండు ప్రధాన అంశాల మీద ఆధారపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి సాంకేతిక కారణాలు కాగా రెండోది మానవ హక్కుల ఉల్లంఘన. స్వీడన్ పోలీసులు ఇంతవరకు జులియన్ పైన ఛార్జ్ ఏ నేరమూ మోపలేదు. లైంగిక అత్యాచారం ఆరోపణలపై అతనిని ప్రశ్నించటానికి మాత్రమే తమకు అప్పంగించాలని స్వీడన్ పోలీసులుకోరుతున్నారు.…

ట్యునీషియా పోలీసుల కాల్పుల్లో ఇద్ధరు పౌరుల మృతి

ట్యునీషియాలో పోలీసు కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు చనిపోయారు. వాయవ్య ప్రాంతంలో ఉన్న కెఫ్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల పెత్తనానికి వ్యతిరేకంగా స్ధానికులు పోలీసు స్టేషన్ ముందు గుమిగూడి నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. అక్కడి పోలీస్ చీఫ్ నిరసనకారులలోని ఒక మహిళను చెంపపై కొట్టాటంతో పరిస్ధితి విషమించినట్లు బి.బి.సి తెలిపింది. మహిళపై చేయి చేసుకున్నాక ప్రజలు కోపంతో స్టేషన్ పై రాళ్ళు, పెట్రోల్ బాంబులు విసరటంతో పోలీసులు కాల్పులు…