మిలియన్ మార్చ్ లో అపశృతులు, పోలీసులూ, ప్రభుత్వానిదే బాధ్యత

తెలంగాణ వాదులు గురువారం, మార్చి 10 తేదీన తలపెట్టిన “మిలియన్ మార్చ్” విజయవంతం అయిందని తెలంగాణ జెఏసి ప్రకటించింది. మార్చ్ ను అడ్డుకోవడానికి పోలీసులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ప్రజలు ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. అయితే కార్యకర్తలు టాంక్ బండ్ మీద ఉన్న కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. మార్చ్ ను అడ్డుకోవడానికి పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోకపోయినట్లయితే ప్రశాంతంగా జరిగి ఉండేదని తెలంగాణ జెఏసి ఛైర్మన్ కోదండరాం అన్నారు. జెఏసి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు జెఏసి ఆఫీసు…

తెలంగాణవాదుల మిలియన్ మార్చ్ ఆపటానికి ముందస్తు అరెస్టులు

మార్చి 10 తేదీన తెలంగాణ పొలిటికల్ జెఏసి తలపెట్టిన “మిలియన్ మార్చ్” ను అడ్డుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. తెలంగాణ ప్రాంతం అంతటా ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను లక్షమందికి పైగా ముందస్తుగా అరెస్టు చేశారని పొలిటికల్ జె.ఎ.సి ఛైర్మన్ కోదండరాం తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉంటుందనీ, రాజకీయ ఆకాంక్ష తెలపటానికి…

అమెరికాలో కార్మికుల హక్కులపై దాడికి వ్యతిరేకంగా ఈజిప్టు తరహా ఉద్యమం

  అమెరికాలో విస్ కాన్సిన్ రాష్ట్రంలో ఈజిప్టు తరహాలో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నర్సులు మొదలయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ మూడు వారాలనుండీ ఉద్యమం నిర్వహిస్తున్నప్పటికీ పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు అక్కడ ఏమీ జరగనట్లుగా నాల్రోజుల క్రితం వరకూ నటిస్తూ వచ్చాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ప్రత్యక్షంగా కారణమైన అమెరికాలోని ప్రైవేటు బహుళజాతి గుత్త సంస్ధలపై చర్య తీసుకోవటం అటుంచి ‘స్టిములస్ ప్యాకేజీ’ పేరుతో రెండు ట్రిలియన్లకు పైగా ప్రజల సొమ్మును వాటికి ధారపోసిన సంగతి…

గడ్డాఫీ రాజీ ప్రతిపాదన తిరస్కరణ, పోరాటం తీవ్రం

లిబియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతున్నది. గడ్డాఫీ సేనలు తిరుగుబాటుదారులను వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుండడంతో ఇరుపక్షాల మధ్య పోరు తీవ్రత పెరిగింది. బిన్ జావాద్ పట్టణాన్ని సోమవారం గడ్డాఫీ బలగాలు వైరి పక్షం నుండి స్వాధీనం చేసుకున్నాయి. అక్కడి నుండి ఆయిల్ పట్టణం రాస్ లానుఫ్ ను వశం చేసుకోవాలని చూస్తున్నాయి. మార్గ మధ్యంలో తిరుగుబాటు బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. అడపా దడపా గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ పై విమాన దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా గడ్డాఫీనుండి తిరుగుబాటుదారులకు రాజీ…

గ్రీసు రేటింగ్ ను తగ్గించిన మూడీస్, కొనసాగుతున్న యూరప్ అప్పు సంక్షోభం

మూడీస్ రేటింగ్ సంస్ధ గ్రీకు సావరిన్ అప్పు రేటింగ్ ను మరోసారి తగ్గించింది. ఇప్పటివరకూ Ba1 రేటింగ్ ఉండగా దానిని B1కు తగ్గించింది. ట్రెజరీ బాండ్లు జారీ చేయడం ద్వారా దేశాల ప్రభుత్వాలు చేసే అప్పును సావరిన్ అప్పు అంటారు. సావరిన్ బాండ్లను ప్రభుత్వాలు వేలం వేస్తాయి. బాండ్లు జారీచేసే దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై బాండ్ల కొనుగోలుదారులకు (మదుపుదారులు) ఉన్న నమ్మకాన్ని బట్టి బాండ్లపై ప్రభుత్వాలు చెల్లించే వడ్డీ రేటు నిర్ణయమవుతుంది. ప్రభుత్వాలు బాండ్ల విలువ మొత్తాన్ని…

లిబియాలో కొనసా…గుతున్న అంతర్యుద్ధం

  లిబియాలో తిరుగుబాటుదారులకు గడ్డాఫీ బలగాలకు మధ్య యుద్ధం నిర్ణయాత్మక దశకు చేరే స్ధితి కనిపించడం లేదు. ఇరుపక్షాల మధ్య పట్టణాలు చిక్కుతూ, జారుతూ ఉన్నాయి. మూడు లక్షల జనాభా గల మిస్రాటా పట్టణం దగ్గర భీకర పోరు నడుస్తోంది. “బిన్ జావాద్” పట్టణం ఆదివారం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉండగా సోమవారం అది గడ్డాఫీ బలగాల ఆధీనంలోకి వచ్చింది. తిరుగుబాటుదారులు చేతిలో ఉన్న మరో పట్టణం స్వాధీనం చేసుకోవడానికి గడ్డాఫీ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. గడ్డాఫీ బలగాలకు యుద్ధ…

ఇండియా ప్రధానికి బ్రిటన్ ప్రధాని వాణిజ్య పాఠాలు

  బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ భారత దేశ ప్రధాన మంత్రికి విదేశీ వాణిజ్యం, దానికి సంబంధించిన విధాన నిర్ణయాలపై పాఠాలు నేర్పటానికి పూనుకున్నాడు. ఇద్దరి మధ్య వేలకొద్దీ కిలోమీటర్ల దూరం ఉండడంతో కరెస్పాండెన్స్ కోర్సును కామెరూన్ పాఠాలు చెప్పడానికి ఎన్నుకున్నాడు. బ్రిటన్, ఇండియా లకు చెందిన కంపెనీల మధ్య ఇండియాలో ఉన్న “కైర్న్ ఇండియా” కంపెనీ అమ్మటానికి ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీలో భారత ప్రభుత్వ రంగ సంస్ధకు వాటాలుండడంతో ఇక్కడి ప్రభుత్వ అనుమతి…

లిబియా అంతర్యుద్ధం – లిబియా ఆయిల్ కోసం అమెరికా, ఐరోపా కుతంత్రాలు

ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో ప్రజాస్వామిక సంస్కరణల కోసం జరిగిన ప్రజా ఉద్యమాలు విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో  లిబియా ప్రజలు 41 సంవత్సరాల నుండి ఏలుతున్న గడ్డాఫీని వదిలించుకోవడానికి నడుం బిగించారు. ఫిబ్రవరి 16 న లిబియాలోని రెండో పెద్ద పట్టణం బెంఘాజీ నుండి తిరుగుబాటు ప్రారంభమైంది. బెంఘాజీని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తిరుగుబాటుదారులు కొద్దిరోజుల్లోనే లిబియా తూర్పుప్రాంతాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన పట్టణాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. రాజధాని ట్రిపోలిలో…

తెలంగాణ ఉద్యోగుల “సహాయ నిరాకరణ” ఉద్యమం విరమణ

తెలంగాణ ఉద్యోగులు 16 రోజులనుండి చేస్తున్న “సహాయ నిరాకరణ” ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నుండి విధుల్లో చేరాలని తెలంగాణ ఎన్జీఓల సంఘం నాయకుడు స్వామి గౌడ్ ఉద్యోగులను కోరాడు. అయితే నిజామాబాద్ జిల్లాలో ఒక సెక్షన్ ఉద్యమం విరమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. “సహాయ నిరాకరణ” ఉద్యమం విరమించినందుకు ఆగ్రహంతో స్వామి గౌడ్ దిష్టి బొమ్మను కూడ ఆ జిల్లాలో దహనం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసౌకర్యాన్ని తప్పించడానికే పది లక్షలకు పైగా విధ్యార్ధులకు మార్చి…

“స్టక్స్ నెట్” వైరస్ సృష్టికర్తలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే -పరిశోధకులు

ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడానికి అమెరికా, దేశాలు “స్టక్స్ నెట్” కంప్యూటర్ వైరస్ సృష్టించారని సెక్యూరిటీ నిపుణుడు రాల్ఫ్ లాంగ్నర్ తేల్చాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఒక కార్ఫెన్స్ లో మాట్లాడుతూ లాంగ్నెర్ ఈ విషయం వెల్లడించాడు. ఈ వైరస్ సృష్టించడంలో చోదక శక్తి మాత్రం అమెరికా అని ఆయన చెప్పాడు. ఇజ్రాయెల్ సహాయంతో అమెరికా ఈ వైరస్ ను ఇరాన్ లో అణు ఇంధనాన్ని శుద్ధి చేయడానికి వినియోగించిన కంప్యూటర్ వ్యవస్ధను నాశనం చేయడానికి సృష్టించిందని…

ఈజిప్టు పోలీసులపై ఆందోళనకారుల దాడి

  ఈజిప్టులోని అలెగ్జాండ్రియా పట్టణంలో ఈజిప్టు పోలీసుల ప్రధాన కార్యాలయంపై ప్రజలు దాడి చేశారు. పోలీసులు ముబారక్ కాలం నాటి డాక్యుమెంట్లను నాశనం చేస్తున్నారని తెలియడంతో ఆందోళనకారులు వారిని అడ్డుకోవడానికి కార్యాలయం పైకి వెళ్ళారు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు కార్యాలయం కింది అంతస్ధులోకి జొరబడి పోలీసులతో ఘర్షణకు దిగారు. సైన్యం వచ్చి పోలీసు కార్యాలయాన్ని స్వాధీనం చేసేవరకూ ఘర్షణ కొనసాగింది. ఈజిప్టు పోలీసులు ముబారక్ పాలననాతి తమ చర్యల ద్వారా ప్రజల్లో…

లిబియా తిరుగుబాటుదారుల పురోగమనం, చర్చలకు ససేమిరా

  లిబియా తిరుగుబాటుదారులు పురోగమిస్తున్నారు. గడ్డాఫీ బలగాలకూ, తిరుగుబాటుదారులకూ మధ్య యుద్దం మెల్లగా ఊపందుకుంటోంది. రాజధాని ట్రిపోలిలో శుక్రవారం నాదు మధ్యాహ్న ప్రార్ధనల అనంతరం ప్రదర్శనకు తిరుగుబాటుదారులు పధక రచన చేశారు. ప్రదర్శన జరగకుండా అడ్డుకోవడానికి గడ్డాఫీ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజధానీ ట్రిపోలీకి తూర్పున గల శివారు ప్రాంతం “టజౌరా” లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొని ఉన్నాయి. విదేశీ విలేఖరులను వారున్న హోటల్ నుండి బైటికి రాకుండా గడ్డాఫీ బలగాలు అడ్దుకున్నాయి.…

ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా ధామస్ నియామకాన్ని రద్దుచేసిన సుప్రీం కోర్టు

  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ హెచ్ కపాడియా ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా పి.జె.ధామస్ నియామకాన్ని రద్ధు చేస్తూ తీర్పునిచ్చారు. కేరళలొ సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారిగా ఉండగా 1992లో పామాయిల్ ను అధిక ధరలకు దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న పి.జె.ధామస్ ను సి.వి.సి గా నియమించడం చెల్లదని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ “సుప్రీం తీర్పు ప్రధానికీ, ఆయన ప్రభుత్వానికీ పెద్ద దెబ్బ” అని పేర్కొంది. సి.వి.సి ప్రతిష్ట సుప్రీం…

తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసిన కావూరి వ్యాఖ్యలు

బుధవారం నాడు తెలంగాణ లాయర్లు తనకు వినతి పత్రం ఇవ్వడానికి తన ఇంటికి వచ్చిన సందర్భంగా ఏలూరు ఎం.పి కావూరి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలంగాణ + సీమాంధ్ర = ఆంధ్ర ప్రదేశ్ ఎం.పిలు, ఎం.ఎల్.ఏలు, ఎం.ఎల్.సిలపై విరుచుకు పడటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా పరిణామాలు ఒకింత వేగం పుంజుకోవడానికి దోహదం చేసింది. గురువారం జరిగిన, జరుగుతున్న పరిణామలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ లాయర్లు తమ ఇంటిని ముట్టడించారని కావూరి ఆరోపణ. కాదు,…