టాంక్ బండ్ విగ్రహాల ధ్వంసంపై సో-కాల్డ్ మేధావుల (అ)ధర్మాగ్రహం

మిలియన్ మార్చ్ సందర్భంగా తెలుగుజాతి మహనీయుల విగ్రహాలు ధ్వంసం కావడం నిస్సందేహంగా ఖండనార్హమే. కానీ ఏనాడూ ప్రజల ఈతి బాధల గురించి కించిత్ ఆందోళన సైతం ప్రకటించనివారు, వేలకొద్దీ జరిగిన రైతుల ఆత్మహత్యలపై ఎన్నడూ స్పందించనివారు, సోంపల్లి, కాకరాపల్లి ప్రజల కూడు, గూడు నాశనం చేయడమేకాక అదేమని అడిగినందుకు కాల్చి చంపడం ద్వారా సమాధానం ఇచ్చిన ప్రభుత్వాన్ని మర్యాదకు కూడా ప్రశ్నించని వారు ఈ నాడు మేధావులమంటూ విగ్రహాల ధ్వంసంపై ధర్మాగ్రహం ప్రకటించడం ఏ కోవలోకి వస్తుందో…

లిబియా నిషిద్ధ గగనతలానికి అరబ్ లీగ్ ఆమోదం, గడ్డాఫీ బలగాల పురోగమనం

లిబియా అంతర్యుద్ధంలో గడ్డాఫీ ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదారులను తూర్పువైపుకి నెట్టుకుంటూ వెళ్తున్న నేపధ్యంలో కైరోలో శనివారం సమావేశమైన అరబ్ లీగ్ దేశాలు లిబియా భూభాగంపై “నిషిద్ధ గగనతలం” అమలుకు ఆమోదముద్ర వేశాయి. సిరియా, అల్జీరియా మినహా అన్ని దేశాలూ “నో-ఫ్లై జోన్” ప్రతిపాదనను ఆమోదించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిని లిబియాపైన “నో-ఫ్లై జోన్” అమలు చేయాల్సిందిగా కోరుతూ అరబ్ లీగ్ తీర్మానించింది. లిబియాలో ప్రస్తుత సంక్షోభం ముగిసే వరకూ నో-ఫ్లై జోన్ అమలు చేయాలని తీర్మానంలో…

జపాన్ ను అతలాకుతలం చేసిన భూకంపం, సునామీలు

శుక్రవారం ఈశాన్య జపాన్ సముద్ర అంతర్భాగాన సంభవించిన భూకంపం, దానివలన ఏర్పడిన సునామీలు జపాన్ ఈశాన్య ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. అతి వేగంగా దూసుకొచ్చిన సునామీ ప్రజలను కోలుకోకుండా దెబ్బతీశాయి. సునామీ ధాటికి పెద్ద పెద్ద నౌకలు సైతం తీరాన్ని దాటి ఒడ్డున ఉన్న పట్టణాల్లోని భవనాలను ఢీకొట్టాక గాని ఆగలేదు. పడవలు, కార్లు, బస్సులు లాంటి వాహనాలు ఒకదానిపై ఒకటి చేరి ఇతర శిధిలాలతో కలిసి చెత్తకుప్పలను తలపిస్తున్నాయి. విస్తారమైన ప్రాంతాలు సునామీ ద్వారా కొట్టుకువచ్చిన…

యెమెన్ నిరసనకారులపై పోలీసుల కాల్పులు, ఆరుగురు మృతి

ట్యునీషియా విప్లవం స్ఫూర్తితో యెమెన్ రాజుకు వ్యతిరేకంగా వారాల తరబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన పాటిస్తున్న ఉద్యమకారులపై  మార్చి 12 తేదీన పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురిని చంపేశారు. 1250 మంది గాయపడ్డారనీ 250 మంది తీవ్రంగా గాయపడ్డారనీ డాక్టర్లు తెలిపారు. రాజధాని సనా లో ప్రజాస్వామిక సంస్కరణలను డిమాండ్ చేస్తూ యెమెన్ ప్రజలు అనేక వారాలనుండి “విమోచనా కూడలి” లో నిరసన శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. 32 సంవత్సరాలనుండి అధికారంలో ఉన్న యెమెన్ అధ్యక్షుడు…

పెళ్ళి మాటున జన సమీకరణ, మిలియన్ మార్చ్ కోసం న్యూడెమొక్రసీ ఎత్తుగడ

మిలియన్ మార్చ్ కోసం పోలీసులు కనీ వినీ ఎరుగని రీతిలో బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. “ప్రజా జీవనానికి ఆటంకం ఏర్పడుతుందనే మార్చ్ కు అనుమతి ఇవ్వలేదు తప్ప వేరేదానికి కాదు” అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మార్చ్ అనంతరం ప్రకటించిన విషయం వార్తా ఛానెళ్ళలో ప్రసారం కావడం కూడా అందరూ చూశారు. అంటే ముఖ్యమంత్రి ఆదేశం మేరకే పోలీసులు తెలంగాణ అంతటా ఎవరూ హైద్రాబాద్ కు రాకుండా నిర్బంధించారనేది అర్ధం అవుతోంది. ముఖ్యమంత్రి నిర్ణయం…

తిరుగుబాటుదారులనుండి ఆయిల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు

లిబియా రాజధానికి పశ్చిమంగా 48 కి.మీ దూరంలో ఉన్న జావియా పట్టణాన్ని ఈ వారం మొదట్లో తిరుగుబాటుదారుల నుండి స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు, శనివారం నాటికి ట్రిపోలీకి తూర్పు దిశలో 600 కి.మీ దూరంలో ఉన్న ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ ను స్వాధీనం చేసుకున్నారు. రాస్ లానుఫ్ లో ఉన్న తిరుగుబాటు బలగాలను రాసులానుఫ్ పట్టణ శివార్లనుండి 20 కి.మీ తూర్పుకు నెట్టివేసినట్లుగా తిరుగుబాటుదారుల నాయకులు విలేఖరులకు తెలిపారు. గడ్డాఫీ మంత్రివర్గంలో హోం మంత్రిగా…

జపాన్ అణువిద్యుత్ కేంద్రంలో పేలుడు, అణు ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

అప్ డేట్: ఫుకుషిమా అణువిద్యుత్ ప్లాంటు చుట్టూ 10 కి.మీ లోపు ఖాళీ చేయించిన జపాన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిధిని 20 కి.మీ కు పెంచినట్లుగా ప్రభుత్వ ఛీఫ్ కేబినెట్ సెక్రటరీ చెప్పాడు. 6:24  pm ఇండియా టైమ్. మానవ చరిత్రలో మొదటి సారి, ఇప్పటి వరకు చివరిసారి కూడా అణు  బాంబు ఫలితాన్ని చవిచూసిన జపాన్, శుక్రవారం సంభవించిన అతిపెద్ద భూకంపం ధాటికి మరో అణు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. జపాన్ రాజధాని టోక్యో నగరానికి…

తెలుగునాట మరో కుటుంబ పార్టీ ఆవిర్భావం

పార్టీ పేరు: వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని ఆవిర్భవింప జేసినవారు: వై.ఎస్.ఆర్ తనయుడు పార్టీ జెండాను ఆవిష్కరించినవారు: వై.ఎస్.ఆర్ సతీమణి విజయమ్మ పార్టీలోని ముఖ్య నాయకులు: వై.ఎస్.ఆర్ ద్వారా పదవులు పొందినవారు పార్టీ జెండాపై ఉన్నది: వై.ఎస్.ఆర్ బొమ్మ ఇదీ క్లుప్తంగా తెలుగునాట కొత్తగా ఆవిష్కృతమయిన రాజకీయ పార్టీ ప్రొఫైల్. ఇప్పటి వరకూ భారతదేశంలో పుట్టిన పార్టీలన్నీ తమ జెండాపై దేశ సంస్కృతికి సంబంధించిన గుర్తుగానీ, దేశ ప్రజల జీవన విధానానికి సంబంధించిన గుర్తుగానీ, దేశ చరిత్రను…

గడ్డాఫీ బలగాల పురోగమనం, విదేశీసాయం కోసం తిరుగుబాటుదారుల ఎదురుచూపు

గడ్డాఫీ బలగాలు ప్రతిదాడులను తీవ్రం చేస్తూ మెల్లగా పురోగమిస్తున్నాయి. రాస్ లానుఫ్ ఆయిల్ పట్టణాని స్వాధీనం చేసుకునే వైపుగా కదులుతున్నాయి. మరో ఆయిల్ పట్టణం బ్రెగా సరిహద్దుల్లో బాంబుదాడులు చేశాయి. రాస్ లానుఫ్ లో పోరు తీవ్రంగా జరుగుతోంది. వాయు, సముద్ర మార్గాల్లొ గడ్డాఫీ బలగాలు రాస్ లానుఫ్ లోని తిరుగుబాటుదారులపై దాదులు చేస్తున్నారు. గడ్డాఫీ బలగాల యుద్ధవిమానాల దాడులను తిరుగుబాటు బలగాలు ఎదుర్కొనలేక పోతున్నాయి. పశ్చిమ దేశాలు లిబియా భూభాగంపై “నిషిద్ధ గగనతలం” ప్రకటించి అమలు…

జపాన్ ను వణికించిన భారీ భూకంపం, ముంచెత్తిన సునామీ

[అప్ డేట్: జపాన్ సునామీలో మరణించిన వారి సంఖ్య: 300 దాటింది] జపాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతానికి సమీపంలో సమద్ర గర్బాన భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్బాన భూకంపం సంభవించడం వలన అది భారీ సునామీగా పరిణమించి జపాన్ తీరప్రాంతాన్ని ముంచెత్తింది. రిక్టర్ స్కేల్ పై 8.9 గా నమోదైన ఈ భూకంపం, జపాన్ లో 140 సంవత్సరాల క్రితం భూకంపం రికార్డులు నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుండి అత్యంత భారీ భూకంపంగా జపాన్ తెలిపింది.…

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ పక్షపాతం మిలియన్ మార్చ్ విధ్వంసానికి కారణాలు

తెలంగాణ పొలిటికల్ జె.ఏ.సి ఛైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారన్న వార్త తెలియడంతోనే టాంక్ బండ్ పై ఉన్న ఆందోళనకారులు ఆయన విడుదల డిమాండ్ చేస్తూ విగ్రహాల ధ్వంసం ప్రారంభించారని తెలుస్తోంది. ఆ తర్వాత కోదండరాంను విడుదల చేశాక “కోదండరాంను విడుదల చేశార”న్న సమాచారంతో కే.సి.ఆర్ హడావుడిగా టాంక్ బండ్ వద్దకు చేరుకున్నప్పటికీ కే.సి.ఆర్ మాటకూడా వినకుండా విగ్రహలు ధ్వంసం చేయడం వారు కొనసాగించారని “ది హిందూ” పత్రిక తెలియజేసింది. సంఘటనల క్రమం ఐదువందల మంది ఐ.ఎఫ్.టి.యు…

విగ్రహాలు కూల్చింది మేం కాదు -ఐ.ఎఫ్.టి.యు

గురువారం “మిలియన్ మార్చ్” సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు కార్యకర్తలు టాంక్ బండ్ మీద విగ్రహాలు కూల్చివేశారని డిజిపి ప్రకటించడం సరికాదని ఐ.ఎఫ్.టి.యు నాయకులు ఓ విలేఖరితో మాట్లాడుతూ ఖండించారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా డిజిపి ప్రకటన జారీ చేయడం తగదని ఐ.ఎఫ్.టి.యు జాతీయ అధ్యక్షుడు ప్రదీప్ హైద్రాబాద్ లో ఈటివితో మాట్లాడుతూ నిరసన వ్యక్తం చేశారు. టాంక్ బండ్ ప్రదర్శనలో అన్ని పార్టీలు, సంఘాల వారు పాల్గొన్నారనీ, పైగా ఐ.ఎఫ్.టి.యు కార్యకర్తలు ప్రతిజ్గ్న చేసిన వెంటనే తిరిగి వచ్చారు తప్ప…

విమోచనా కూడలిలో ఆందోళనకారులను బలవంతంగా తొలంగించిన సైన్యం

ముబారక్ దేశం విడిచి పారిపోయినప్పటికీ కైరో నగరం లోని విమోచనా కూడలిలో కొన్ని వందలమంది ఆందోళనకారులు తమ బైఠాయింపును కొనసాగించారు. ముబారక్ నుండి అధికారం చేపట్టిన సైన్యం ప్రజలు డిమాండ్ చేసినట్లుగా ప్రజాస్వామిక సంస్కరణలు చేపట్టే వరకూ తాము ఆందోళన విరమించేది లేదని వీరు ప్రతిన బూనారు. వీరిని తొలగించడానికి సైన్యం ప్రారంభంలో ప్రయత్నించినప్పటికీ వారు వెళ్ళలేదు. అయితే మార్చి 9 తేదీన కొన్ని డజన్ల మంది గుర్తు తెలియని వ్యక్తులు విమోచనా కూడలిలో మిగిలి ఉన్న…

కందుకూరు పట్టణంలో పి.డి.ఎస్.యు విద్యార్ధుల ధర్నా -ఫొటో

పి.డి.ఎస్.యు విద్యార్ధి సంఘం ప్రకాశం జిల్లా శాఖ 2010 జులై నెలలో హైస్కూల్  విద్యార్ధుల సమస్యలపై ఆందోళన నిర్వహించింది. కందుకూరు పట్టణంలోని హైస్కూల్ భవనం కూలిపోయే దశలో ఉంది. క్లాస్ రూమ్ లు చాలావాటికి పై కప్పులు లేవు. పెంకులతో నిర్మించిన పైకప్పు కొన్ని క్లాసుల్లో ఏ క్షణంలోనైనా కూలిపోయేటట్లు ఉన్నాయి. స్కూల భవనానికి మరమ్మతులు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్ధులు కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అప్పటి…

లిబియా తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించిన ఫ్రాన్స్

యూరోపియన్ పార్లమెంటు లిబియాలోని తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించడాన్ని ప్రోత్సహిస్తున్న నేపధ్యంలో ఫ్రాన్సు మొదటిసారిగా అందుకు అనుగుణమైన చర్యను తీసుకొంది. లిబియా తూర్పు ప్రాంతంలోని బెంఘాజీ పట్టణం కేంద్రంగా ఏర్పడిన “లిబియా జాతీయ కౌన్సిల్” ను అధికారిక స్టేట్ బాడీగా ఫ్రాన్సు గుర్తించింది. యూరోపియన్ పార్లమెంటు దేశాల ప్రభుత్వాలను కాకుండా రాజ్యాన్ని గుర్తిస్తాయి. అందువలన అది తన సభ్య దేశాలను తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాల్సిందిగా కోరింది. తిరుగుబాటుదారులు బెంఘాజీ కేంద్రంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కౌన్సిల్ తో సంబంధాలు…