ముంబైకి రిలయన్స్ ఎగేసిన బాకీ రు 1577 కోట్లు!

ముంబై మునిసిపాలిటీకి ఐదేళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ చెల్లించవలసిన బాకీని చెల్లించని ఉదంతం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డవలప్మెంట్ ఆధారిటీ (ఎం‌ఎం‌ఆర్‌డి‌ఏ) కి చెందిన రెండు స్ధలాలను లీజుకు తీసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ, లీజు ద్వారా తలెత్తిన చెల్లింపులను ఎగవేసినట్లు లేదా ఇంతవరకు చెల్లించనట్లుగా ఒక ఆర్‌టి‌ఐ కార్యకర్త వెల్లడి చేశాడు. అక్రమ కట్టడం పేరుతో, ఆక్రమణ పేరుతో పేదల గుడిసెలను పెద్ద ఎత్తున తొలగించి…

అమెరికా ప్రబల శత్రువు రష్యాయే -సిఐఎ

రష్యా పైన మరో అత్యున్నత అమెరికా అధికారి వ్యసనం వెళ్లగక్కాడు. అమెరికాకు అన్ని విధాలుగా సవాలుగా పరిణమించిన దేశం ఒక్క రష్యా మాత్రమే అని సెంట్రల్ ఇంటలిజెన్స్ ఎజన్సీ డైరెక్టర్ బ్రెన్నన్ వ్యాఖ్యానించాడు. ఏ రంగంలో తీసుకున్నా రష్యా దేశం ఈ రోజు గట్టి స్దానంలో నిలవడానికి ముఖ్య కారణం ఆ దేశ అధ్యక్షుడు పుటిన్ అని బ్రెన్నన్ తన అక్కసు వెళ్లబోసుకున్నాడు. సిబిసి వార్తా సంస్దకు ఇంఠర్వ్యూ ఇస్తూ బ్రెన్నన్ ఈ వ్యాఖ్యలు చేసాడు. “అన్ని…

ఏ‌పిని ప్రత్యేకం చేయడం -ద హిందు ఎడిట్…

‘ప్రత్యేకం’ అయినది ఏ విధంగా ప్రత్యేకం అవుతుంది? విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం నుండి ఆపన్న హస్తం అందించాల్సిన అగత్యం ఏర్పడింది అనడం ఎన్నడూ సందేహం కాలేదు. కానీ రాష్ట్రం ఏ రీతిలో ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నదన్న అంశంలోనే కృషి జరగవలసి వచ్చింది. దానిని ప్రత్యేక తరగతి హోదా కలిగిన రాష్ట్రంగా ప్రకటించవచ్చా లేక ప్రత్యేక తరగతి హోదాకు తప్పనిసరిగా నెరవేర్చవలసిన అవసరాలను తీర్చే బాధ్యత లేని ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ వరకు…

బ్రెక్సిట్ ప్రభావం అంతేమీ లేదు!

బ్రెక్సిట్ కి ఓటు వేస్తె ప్రపంచం తల కిందులు అయిపోతుంది అన్నంతగా పశ్చిమ ప్రభుత్వాలు, కార్పొరేట్ మీడియా ప్రచారం చేసింది. కానీ ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తల కిందులు కావటం అటుంచి ఉన్న వంకర సరి అవుతున్నట్లుగా కనిపిస్తున్నది. పడిపోతుంది అనుకున్న పారిశ్రామిక ఉత్పత్తి ఊహించని విధంగా పెరుగుదల నమోదు చేయగా మొత్తంగా బ్రిటన్ జీడీపీ కూడా కాస్త దారిలో పడినట్లు కనిపిస్తున్నది. జూన్ 23 తేదీన జరిగిన బ్రెక్సిట్ ఓటు వలన…

సింగూరు తీర్పు: స్తంభనలో భారత సమాజాభివృద్ధి -5

అటూ ఇటూ కాని భారత సమాజం ఇప్పుడు ఇండియాకి వద్దాం. భారత దేశంలో కూడా సమాజం పైన చెప్పినట్లుగా క్రమానుగత పరిణామం జరిగిందా అన్నది పరిశీలించవలసిన ప్రధానాంశం. అభివృద్ధి చెందిన దేశాలకు మల్లే ఇండియాలో కూడా సమాజం తన సహజ రీతిలో అభివృద్ధి చెందనిస్తే, పరిణామం జరగనిస్తే ఇప్పుడు ఉన్నట్లుగా ఇండియా ఉండేది కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో చోటు చేసుకోని పరిణామం ఇండియా లాంటి అనేక మూడో ప్రపంచ దేశాల్లో చోటు చేసుకుంది. అదే బ్రిటిష్…

సింగూరు తీర్పు: అభావం అభావం చెందుతుంది -4

ఇపుడు మళ్ళీ వ్యవసాయ సమాజం, పారిశ్రామిక సమాజంగా పరిణామం చెందే విషయానికి వద్దాం. పశ్చిమ దేశాల్లో లేదా పెట్టుబడిదారీ వ్యవస్ధ అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ సమాజం స్ధానంలోకి పరిశ్రమల సమాజం ఎలా వచ్చింది? ఉన్నట్లుండి హఠాత్తుగా వ్యవసాయం అదృశ్యం అయిపోయి పరిశ్రమలు వచ్చేశాయా? భూస్వాములు, ధనిక రైతులు హఠాత్తుగా పెట్టుబడిదారులుగా మారిపోయి, రైతులు-కూలీలేమో కార్మికులుగా మారిపోయారా? సమాధానం దొరకని సాధారణ తాత్విక ప్రశ్నలు కొన్ని మనకు అప్పుడప్పుడు ఎదురవుతు ఉంటాయి. కోడి ముందా, గుడ్డు ముందా?…

image

రిలయన్స్ జియో సూట్ బూట్ కి సర్కార్ -కార్టూన్

మోడీ ప్రభుతల్వాన్ని ‘సూట్ బూట్ కి సర్కార్’ గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ సారి పార్లమెంటులో విమర్శించారు. అప్పటి నుండి రాహుల్ విమర్శను నిజం చేయడానికి ప్రధాన మంత్రి మోడీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. కోట్ల రూపాయల ఖరీదు చేసే కోటు ధరించి అమెరికా అధ్యక్షుడిని కలుసుకోవడం దగ్గరి నుండి, దాదాపు ప్రతి ముఖ్యమైన విదేశీ పర్యటనలోను పారిశ్రామికవేత్త అదానీ ని వెంట బెట్టుకు వెళ్లడం వరకు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ…

సింగూరు తీర్పు: అభివృద్ధి వైరుధ్యం -3

ముందు ‘అభివృద్ధి వైరుధ్యం’ ఏమిటో స్పష్టంగా పరిశీలించాలి. ఒక జడ్జి దృష్టిలో “అసలు పారిశ్రామికీకరణ యొక్క లక్ష్యమే ప్రజలకు ఉపయోగపడడం.” చారిత్రక దృష్టితో చూసినప్పుడు ఈ అవగాహనలో తప్పు లేదు. కానీ జడ్జిలు చారిత్రక దృష్టి కలిగి ఉండటానికి చట్టాలు ఒప్పుకోవు. వారి ముందు ఉన్న కేసు, సాక్షాలు, చట్టాలు… ఈ అంశాలను మాత్రమే చూస్తూ వాళ్ళు తీర్పు ఇవ్వాలి. కనుక జడ్జి దృష్టిలో ఉన్నట్లు కనిపిస్తున్న చారిత్రకతను పక్కనబెట్టి సింగూరు భూముల స్వాధీనం – రైతుల…

సింగూరు తీర్పు: వ్యవసాయమా, పరిశ్రమలా? -2

రైతులు కలకత్తా హై కోర్టుకు వెళ్ళినప్పటికి టాటా కంపెనీ ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగించింది. జనవరి 18, 2008 తేదీన తీర్పు ప్రకటిస్తూ కలకత్తా హై కోర్టు టాటా కంపెనీకి వత్తాసు వచ్చింది. సింగూరు భూముల స్వాధీనం చట్టబద్ధమే అని ప్రకటించింది. దానితో రైతులు, వారి తరపున కొన్ని ఎన్‌జి‌ఓ సంస్థలు హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మమతా బెనర్జీ మరోసారి కారు ఫ్యాక్టరీ ముందు నిరవధిక ధర్నాకు దిగడంతో…

విరుద్ధ దృష్టితో ఒకే తీర్పు ఇచ్చిన ఇద్దరు జడ్జిలు -1

పశ్చిమ బెంగాల్ లో పాతికేళ్ళ అవిచ్ఛిన్న లెఫ్ట్ ఫ్రంట్ పాలనకు చరమగీతం పలికేందుకు దారి తీసిన సింగూరు భూములను బలవంతంగా లాక్కున కేసులో నిన్న (ఆగస్టు 31) సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. నానో కారు తయారీ కోసం టాటా మోటార్ కంపెనీకి అప్పగించడానికి వామపక్ష ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం సింగూరు రైతుల నుండి గుంజుకున్న వ్యవసాయ భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. పశ్చిమ బెంగాల్ లో బలం…

మేము చర్య తీసుకున్నాం, మీరేం చేశారు? -కేజ్రీవాల్

ఢిల్లీ రాష్ట్ర మంత్రి ఒకరు పరాయి మహిళలతో అనైతిక చర్యలకు పాల్పడుతూ అడ్డంగా దొరికి పోయారు. ఆయన లీలలు ఫోటోలు, వీడియోలుగా వెల్లడై పత్రికలూ, న్యూస్ చానెళ్లలో ప్రత్యక్షం అయ్యాయి. ఆ దొరికిపోయిన మంత్రి మహిళా మంత్రి కావడం మరింత విపరీతం అయింది. ఆయన పేరు సందీప్ కుమార్! ఇప్పుడు ఈ వార్త బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మంచి అవకాశంగా లభించింది. లేదా ఒక బంపర్ అవకాశంగా ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఆ పార్టీల నేతలు చేస్తున్న…

ఇంతకు మించిన దుఃఖం ఉంటుందా? -కత్తిరింపులు

భార్య చనిపోతే ఆమె శవాన్ని ఏకాఎకిన భుజాన వేసుకుని 60 కి.మీ దూరం లోని ఇంటికి కాలి నడకన బయలుదేరిన భర్త! జబ్బు పడిన కొడుకుకి వైద్యం చేయించడం కోసం అతన్ని భుజం మీద వేసుకుని, వైద్యం అందక తన భుజం మీదనే ప్రాణాలు వదిలాడని తెలియక  డాక్టర్ల మధ్య పరుగులు పెట్టిన తండ్రి! పురుటి నొప్పులు పడుతున్న కూతురిని సైకిల్ వెనక సీటుపై కూర్చో బెట్టుకుని వెళ్ళి, ప్రసవం అయ్యాక పసికందుతో సహా అదే సైకిల్…

ప్రశ్న: డ్రైవర్ల కక్కుర్తి ఉబర్ కక్కుర్తి ఒకటే కదా?

– [ముంబై ఆటో సమ్మె గురించి రాసిన గత ఆర్టికల్ పైన విశేషజ్ఞ గారు లేవనెత్తిన ప్రశ్నలను చర్చగా చేస్తూ ఈ ఆర్టికల్ రాస్తున్నాను. పాఠకులు గుర్తించగలరు. -విశేఖర్] విశేషజ్ఞ గారు: ఇది నాకు అర్ధం కాలేదు. ఆటోవాళ్ళుకూడా తమ లాభాలు పెంచుకొనే ఉద్దేశ్యంతోనే ప్రతి చిన్నదానికీ, డబల్ ఛార్జీలు, ట్రిపుల్ ఛార్జీలు, లాంగ్‌రూటుకు మాత్రమే ‘సై’ అనడాలు చేస్తున్నారుకదా. వీళ్ళు చేసేది ఓలా, ఊబర్‌లకన్నా ఏవిధంగా ప్రజలకు ప్రయోజనకరం? ఇద్దరి ఉద్దేశ్యమూ, లాభార్జనే ఐనప్పుడు ఓలా,…

ఉబర్ దోపిడీపై ముంబై ఆటోల తిరుగుబాటు -వివరణ

బహుళజాతి ట్యాక్సీ అగ్రిగేటర్ కంపెనీ ‘ఉబర్’ సాగిస్తున్న దోపిడీ పై ముంబై ఆటో రిక్షా కార్మికులు తిరుగుబాటు ప్రకటించారు. ఆటో యజమానులు, కార్మికులు ఉమ్మడిగా బుధవారం పగటి పూట (12 గం) సమ్మె ప్రకటించారు. సమ్మె దిగ్విజయంగా నడుస్తోందని ఆటో కార్మికసంఘాలు ప్రకటించాయి. సమ్మెలో లక్షకు పైగా అఆటోలూ పాల్గొంటున్నాయని సమ్మెదారులు (ముంబై ఆటో రిక్షా యూనియన్) ప్రకటించారు (-ద హిందూ బిజినెస్ లైన్). ఫలితంగా నగర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పత్రికలూ తెలిపాయి. సమ్మెకు ప్రత్యామ్నాయ…

పిప్పర్మెంట్లతో కేంద్రం సరి, సమ్మెకే కార్మిక సంఘాల నిర్ణయం!

దేశ వ్యాపిత సమ్మె మరో రెండు రోజులు ఉందనగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి పిప్పర్మెంట్ బిళ్ళలు ఆశ చూపిస్తూ ముందుకు వచ్చింది. అనేక నెలలు ముందే కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపు ఇచ్చినప్పటికీ వారి పిలుపుకి స్పందించడానికి ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వానికి తీరిక దొరక లేదు. విదేశీ కంపెనీలు, పరిశ్రమల కోసం కార్మిక చట్టాలను కాలరాసిన మోడి ప్రభుత్వం కార్మికుల కోసం మాత్రం కేవలం రెండంటే రెండు రోజుల ముందు స్పందించి వారిని అపహాస్యం చేసింది.…