శాంతి చర్చలకు రష్యా, ఉక్రెయిన్ అంగీకారం
రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించాడు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ప్రతినిధి/ప్రెస్ సెక్రటరీ సెర్గీ నికిఫోరోవ్ శనివారం పత్రికలకు చెప్పాడు. “చర్చలను మేము తిరస్కరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. శాంతి, కాల్పుల విరమణలపై చర్చించడానికి ఉక్రెయిన్ ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నది. ఇది మా శాశ్వత అభిప్రాయం. రష్యన్ అధ్యక్షుడి ప్రతిపాదనను మేము అంగీకరించాం” అని ప్రెస్ సెక్రటరీ తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రకటించాడు (టాస్ న్యూస్ ఏజన్సీ,…