బ్లాక్ మనీ: హస్తిమశకాంతరం -కార్టూన్
“హస్తిమశకాంతరం” అని తెలుగులో ఒక పదబంధ ప్రయోగం ఉంది. హస్తి అంటే ఏనుగు; మశకం అంటే దోమ. ఏనుగుకు, దోమకు ఉన్నంత తేడా అని దీని అర్ధం. మొన్న మన ఆర్ధిక మంత్రి గారు, సగర్వంగా -ప్రధాన మంత్రి మోడి ప్రశంసల మధ్య- ప్రకటించిన నల్ల డబ్బుకీ, ఎన్నికలకు ముందు మోడి ప్రకటించిన నల్ల డబ్బు అంచనాకు మధ్య ఉన్న తేడాను ఈ పదబంధంతో చెప్పవచ్చు. తమ ఐడిఎస్ (ఆదాయ ప్రకటన పధకం) స్కీం ద్వారా 65…














