పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు, పలువురు దుర్మరణం

ఆదివారం పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపి పలువురిని పొట్టన బెట్టుకుంది. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాలపైకి పాలస్తీనీయులు రావడంతో ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ సైన్యం, సిరియా, గాజాలతో ఉన్న సరిహద్దులోని గ్రామాల్లో కాల్పులు జరిపింది. కడపటి వార్తల ప్రకారం పన్నెండు మంది చనిపోయారని బిబిసి, రాయిటర్స్ వార్తా సంస్ధలు తెలిపాయి. ఇజ్రాయెల్ యధావిధిగా ఇరాన్‌ని ఆడిపోసుకుంది. ఇరాన్ రెచ్చగొడినందువల్లనే పాలస్తీనియులు తాము ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాల్లోకి చొచ్చుకు వచ్చారని ఆరోపించింది. పనిలొ పనిగా…

లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు స్ట్రాస్ కాన్

చివరికి ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు కూడా తానూ మ(మృ)గాడినే అని నిరూపించుకున్నాడు. ఫ్రాన్సు దేశీయుడు, అంతర్జాతీయ ద్రవ్య సంస్ధ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ -ఐ.ఎం.ఎఫ్) అధ్యక్షుడు ‘డొమినిక్ స్ట్రాస్ కాన్’ ఒక లగ్జరీ హోటల్ లోని మెయిడ్ పై అత్యాచారానికి పూనుకున్నాడన్న నేరంపై న్యూయార్కులోని కెన్నెడీ విమానాశ్రయంలో అరెస్టు అయ్యాడు. ఫ్రాన్సులో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ తరపున నికొలస్ సర్కోజీపై నిలబడి గెలుస్తాడని అందరూ భావిస్తున్న దశలో తాజా సంఘటన జరిగింది. 2007 నుండీ…

రంగనాయకమ్మ గారు – జానకి విముక్తి – మార్క్సిజం

(పుస్తకం బ్లాగ్ లో జానకి విముక్తి నవల పైన సమీక్ష రాశారు. సమీక్షపైన అర్ధవంతమైన చర్చ జరుగుతోంది. అక్కడా కామెంటు రాయడం మొదలుపెట్టి అది కాస్తా ఎక్కువ కావడంతో ఇక్కడ నా బ్లాగ్ లో పోస్టుగా రాస్తున్నా.) “ఒక మంచి డాక్టర్ కావాలంటే ముందు వారు మార్క్సిస్టు అయి ఉండాలి. ఒక మంచి తండ్రి కావాలంటే ముందు మార్కిస్టు అయి ఉండాలి. …” అని రంగనాయకమ్మగారు తన ‘పెట్టుబడి పరిచయం’ పుస్తకం వెనక అట్టమీద రాస్తారు. మార్క్సిజాన్ని…

లిబియా తిరుగుబాటు ప్రభుత్వ గుర్తింపుకు అమెరికా నిరాకరణ, కొనసాగుతున్న పౌరుల మరణాలు

లిబియా తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక ప్రభుత్వం “నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్” (ఎన్.టి.సి) ను అధికారిక ప్రభుత్వంగా గుర్తించడానికి అమెరీక నిరాకరించింది. రెబెల్ కౌన్సిల్‌లోని సీనియర్ సభ్యుడొకరు అమెరికా గుర్తింపు పొందడానికి అధ్యక్ష భవనంలొ చర్చలకు హాజరయ్యాడు. రెబెల్ కౌన్సిల్ కోరికను అధ్యక్ష భవనం తిరస్కరించింది. మరో వైపు శుక్రవారం రాత్రి నాటో విమానాలు జరిపిన బాంబు దాడుల్లో బ్రెగా పట్టణంలో ప్రభుత్వ, తిరుగుబాటు వర్గాల మధ్య శాంతి చర్చలు జరిపే నిమిత్తం వచ్చి ఉన్న 11…

అబ్బోత్తాబాద్‌ దాడిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలి, డ్రోన్ దాడులు ఆపాలి -పాక్ పార్లమెంటు

పాకిస్ధాన్ పార్లమెంటు ఊహించని విధంగా ఓ ముందడుగు వేసింది. అది సంకేతాత్మకమే (సింబాలిక్) అయినప్పటికీ ఇప్పటి పరిస్ధితుల్లో అది ప్రశంసనీయమైన అడుగు. దాదాపు పది గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చలో అమెరికన్ కమెండోలతో కూడిన హెలికాప్టర్లు మే 2 తేదీన అనుమతి లేకుండా పాకిస్ధాన్ గగనతలం లోకి జొరబడి అబ్బొత్తాబాద్ లో సైనిక చర్య చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే మానవ రహిత డ్రోన్ విమానాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం లేకుండా మిలిటెంట్లను…

సిరియాపై భద్రతా సమితిలో చర్చించడానికి ఒప్పుకోం -చైనా, రష్యా

సిరియాలో జరుగుతున్న ఆందోళనల విషయాన్ని భద్రతా సమితిలో చర్చించడానికి అంగీకరించేది లేదని చైనా, రష్యాలు తెగేసి చెబుతున్నాయి. వీటో అధికారం గల ఈ రెండు దేశాలు ఓటింగ్‌లో పాల్గొనకుండా విరమించుకోవడంతో లిబియా దేశంపై “నిషిద్ధ గగన తలం” అమలు చేయడానికీ, లిబియా పౌరులను రక్షించడానికి “అవసరమైన అన్ని చర్యలూ” తీసుకోవడానికీ బ్రిటన్, ఫ్రాన్సులు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. తీరా తీర్మానం ఆమోదం పొందాక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు లిబియా పౌరులను రక్షించే పేరుతో గడ్దాఫీని చంపడానికి…

పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల భారీ ఓటమి

1977 నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా ఏలుతూ వచ్చిన వామపక్ష కూటమి ఎల్.డి.ఎఫ్ 2011 ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యింది. కేరళలో మాత్రం కొద్దిలో అధికారానికి దూరమయ్యింది. ముఠా తగాదాలను అధిగమించినట్లయితే కేరళలో అధికారం నిలిచేదని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలు పార్లమెంటరీ రాజకీయాలు చేపట్టడంతోటే కమ్యూనిస్టు సిద్ధాంతాలనుండి వైదొలిగాయని భారత దేశంలోని మార్క్సిస్టు, లెనినిస్టు పార్టీలు ఎప్పటినుండో వాదిస్తూ వచ్చాయి. 1968 లో సి.పి.ఎం పార్టీ నయా రివిజనిజాన్ని చేపట్టిందని నిర్ణయించుకున్న అనేక…

ఇరాక్‌పై దాడికోసమే అబద్ధాలతో రిపోర్టు తయారు చేశాం -ఇంగ్లండ్ ఇంటలిజెన్స్ మాజీ అధికారి

ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ “సామూహిక విధ్వంసక మారణాయుధాలు” కలిగి ఉన్నాడనీ, వాటివలన ఇంగ్లండు భద్రతకు ముప్పు అనీ నిర్ధారిస్తూ తయారు చేసిన నివేదిక (డొసియర్) వాస్తవాలపై ఆధారపడిన నివేదిక కాదనీ, తమకు వచ్చిన ఆదేశాల మేరకు ఇరాక్‌పై దాడిని అనివార్యం చేస్తూ లేని సాక్ష్యాలతో తయారు చేశామనీ నివేదిక రచయితల్లో ఒకరైన బ్రిటన్ ఇంటలిజెన్స్ మాజీ సీనియర్ అధికారి ఇంగ్లండ్ ప్రభుత్వం నియమించిన చిల్కాట్ కమిషన్ ముందు సాక్ష్యం ఇస్తూ చెప్పాడు. సెప్టెంబరు 2002…

లాడెన్ హత్య చట్టబద్ధమేనని నిరూపించుకోవడానికి అమెరికా తంటాలు

నిరాయుధుడుగా ఉన్న లాడెన్‌ను పట్టుకుని న్యాయస్ధానం ముందు నిలబెట్టకుండా హత్య చేసినందుకు అమెరికాపై నిరసనలు మెల్లగానైనా ఊపందుకుంటున్నాయి. లాడెన్ హత్య “హత్య” కాదనీ అమెరికా కమెండోలు చట్టబద్దంగానే అతన్ని చంపారని సమర్ధించుకోవడానికి అమెరికా తంటాలు పడుతోంది. తాజాగా అమెరికా అటార్నీ జనరల్ ఎరిక్ హోల్డర్ లాడేన్ హత్య చట్టబద్ధమేనని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. లాడెన్ విషయంలో జరిగిన ఆపరేషన్ “కిల్ ఆర్ కేప్చర్” (చంపు లేదా పట్టుకో) ఆపరేషనే ననీ లాడెన్ లొంగుబాటుకు అంగీకరించినట్లయితే పట్టుకునేవారని…

సముద్రాల ప్రైవేటీకరణ యోచనలో యూరోపియన్ యూనియన్

అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలను శాసిస్తున్న బహుళజాతి సంస్ధలు తమ కంటికి కనబడినదల్లా తమదే అంటున్నాయి. భూమిపై ఉన్న సమస్త సంపదలను స్వాయత్తం చేసుకున్న ఈ సంస్ధలు ఇప్పుడు భూ గ్రహం పై మూడు వంతుల భాగాన్ని ఆక్రమించుకుని ఉన్న సప్త సముద్రాలపై కన్నేశాయి. సముద్ర జలాల్లొ ఉండే మత్స్య సంపద మొత్తాన్ని వశం చేసుకొవడానికి పావులు కదుపుతున్నాయి. దానిలో భాగంగా యూరోపియన్ యూనియన్ చేత సముద్ర సంపదలను ప్రవేటీకరించేందుకు ఒత్తిడి తెస్తున్నాయి. ముఖ్యంగా సముద్రంలో దొరికే…

బిన్ లాడెన్ హత్య ఆల్-ఖైదాపై ప్రభావం చూపుతుందా?

ఆల్-ఖైదాకు సంకేతాత్మకంగా నాయకత్వం వహిస్తూ వచ్చిన ఒసామా బిన్ లాడెన్ ను చంపేశామని అమెరికా అధ్యక్షుడు విజయ గర్వంతో ప్రకటించుకున్నాడు. హాలివుడ్ సినిమాల్లొ చూపినట్టు బిన్ లాడెన్ స్ధావరంగా చెబుతున్న ఇంటిలోకి అమెరికన్ కమేండోలు వెళ్ళడం అక్కడ ఉన్న ముగ్గురు యువకులను (ఒకరు లాడెన్ తనయుడుగా భావిస్తున్నారు) రక్తపు మడుగులో మునిగేలా కాల్చి చంపడం, బిన్ లాడెన్ తో ఉన్న అతని భార్యను మోకాలిపై కాల్చి అనంతరం లాడెన్ కంటిలోనా, గుండెపైనా కాల్చి చంపడం… వీటన్నింటినీ అమెరికా…

పాకిస్ధాన్ సైనికాధికారులను “మోస్ట్ వాంటెడ్” జాబితాలో చేర్చిన ఇండియా

భారత ప్రభుత్వం గత మార్చి నెలలో పాకిస్ధాన్ ప్రభుత్వానికి సమర్పించిన వాంటెడ్ వ్యక్తుల జాబితాలో ప్రస్తుతం సైన్యంలో అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారి పేర్లు ఉన్న సంగతి వెల్లడయ్యింది. ఇండియా తన భూభాగంపై జరిగిన టెర్రరిస్టు దాడుల వెనక పాకిస్ధాన్ సైనికాధికారులు, మిలట్రీ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ పాత్ర ఉందని చాలా కాలంనుండి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇండియా హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి జి.కె.పిళ్ళై మార్చి నెలలో పాకిస్ధాన్ హోమ్ కార్యదర్శి ఖమర్ జమాన్ చౌదరితో…

లిబియా విభజన వైపుగా యూరోపియన్ యూనియన్ చర్యలు?

లిబియాలో అంతర్యుద్ధాన్ని అడ్డు పెట్టుకుని ఆ దేశాన్ని రెండుగా విభజించేవైపుగా యూరోపియన్ యూనియన్ చర్యలు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న లిబియా తూర్పు ప్రాంతానికి కేంద్రంగా ఉన్న బెంఘాజీ పట్టణంలో తన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నది. బెంఘాజీ లిబియాలో రెండవ అతి పెద్ద పట్టణం. తిరుగుబాటుదారులుగా చెప్పబడుతున్న వారు ఇక్కడినుండే తమ చర్యలను ప్రారంభించారు. ఒకప్పుడు గడ్డాఫీ సైన్యంలో అధికారులుగా ఉన్న వారిని అమెరికా ఆకర్షించి గడ్డాఫీపై కొద్ది సంవత్సరాల క్రితం తిరుగుబాటు చేయించింది. అది విఫలమయ్యింది.…

అమెరికా వెతికిందెక్కడ? లాడెన్ దొరికిందెక్కడ?

సెప్టెంబర్ 11, 2001 న న్యూయార్కు నగరంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కార్యాలయం ఉన్న జంట టవర్లను ముస్లిం టెర్రరిస్టులుగా చెప్పబడుతున్నవారు అమెరికా విమానాలతో ఢీ కొట్టారు. విమానాలు ఢీకొట్టాక రెండు టవర్లు ఒక పద్ధతి ప్రకారం కూలిపోయిన దృశ్యాన్ని ప్రపంచం అంతా వీక్షించింది. కొన్ని గంటల్లోనే టవర్లను ఢీకొన్న విమానాలను నడిపినవారిని ఆ పనికి పురమాయించిందెవరో అమెరికా కనిపెట్టి ప్రకటించింది. ఆఫ్ఘనిస్ధాన్‌లో తాలిబాన్ ప్రభుత్వ రక్షణలొ ఉన్న ఒసామా బిన్ లాడెన్ ఆదేశాల ప్రకారమే టవర్లను…