అమెరికా ఇప్పుడు టాప్‌లో ఉన్న 1 శాతం ధనికులదే -నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ -2
అమెరికాలో పెరుగుతున్న అసమానతలను పూర్తిగా ఎలా వివరించాలో ఆర్ధిక పండితులకు అర్ధం కావడం లేదు. సరఫరా డిమాండ్ లకు సంబంధించిన సాధారణ అంశాలు పని చేశాయన్నది నిజమే. శ్రామికులు అవసరంలేని సాంకేతిక పరిజ్ఞానం “మంచి” మధ్యతరగతి వారికి, బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్‌ను బాగా తగ్గించివేశాయి. ప్రపంచీకరణ ప్రపంచ వ్యాపిత మార్కెట్ ను సాధ్యం చేసింది. ఫలితంగా అమెరికాలోని ఖరీదైన నైపుణ్య రహిత కార్మికుల బదులు తక్కువ వేతనాలకు లభ్యమయ్యే విదేశీ నైపుణ్య రహిత కార్మికులు…