‘ఆడలేక మద్దెల ఓడు’: అమెరికా సమస్యలకు జపాన్, యూరప్‌లే కారణమంటున్న ఒబామా

“ఆడలేక మద్దెల ఓడు” అన్నట్టుంది అమెరికా అర్ధిక సమస్యలకి బారక్ ఒబామా చూపుతున్న కారణాలు. జపాన్, యూరప్ ల వలన అమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేక పోతున్నదని బారక్ ఒబామా చెబుతున్నాడు. జపాన్ భూకంపం, యూరప్ అప్పు సంక్షోభాలే అమెరికా ఆర్ధిక వృద్ధికి ఆటంకంగా పరిణమించాయని ఒబామా తాజా పరిశోధనలో కనిపెట్టారు. ఇంతవరకూ ఏ ఆర్ధిక వేత్తగానీ, విశ్లేషకులు గానీ చేయనటువంటి విశ్లేషణ ఇది. అమెరికా ప్రభుత్వం తాజాగా శుక్రవారం వెలువరించిన గణాంకాలు అమెరికా…

తాజా వార్త: దేశం విడిచి వెళ్ళిన యెమెన్ అధ్యక్షుడు సలే

శుక్రవారం నాటి రాకెట్ దాడిలో గాయపడిన యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే మెరుగైన వైద్యం కోసం సౌదీ అరేబియాకు వెళ్ళినట్లుగా బిబిసి ప్రకటించింది. అధ్యక్షుడు సలేతో పాటు అతని కొలువులోని ప్రధాని తదితర ముఖ్య అధికారులంతా దేశం విడిచి వెళ్ళినట్లు తెలిపింది. అయితే ఆయన వైద్యం కోసమే వెళ్ళాడా లేక ప్రజల డిమాండ్ ను నెరవేర్చాడా అన్నది వెంటనే తెలియరాలేదు. శుక్రవారం గాయపడ్డాక అధ్యక్షుడు సలే మళ్ళీ ప్రజలకు టీవిలో కనిపించలేదు. ప్రభుత్వ టెలివిజన్ ఆడియో…

రాకెట్ దాడిలో యెమెన్ అధ్యక్షుడికి గాయాలు, ప్రజాందోళనలు తీవ్రతరం

తిరుగుబాటు తెగలు శుక్రవారం అధ్యక్ష భవనంపై చేసిన రాకెట్ దాడిలో అధ్యక్షుడు, ఆలి అబ్దుల్లా సలే గాయపడ్డాడు. ఆయనతో పాటు ప్రభుత్వంలోని ఇతర ముఖ్య అధికారులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన తర్వాత అధ్యక్షుడికి ఏమీ కాలేదని, కొద్ది గంటల్లో ప్రజలముందుకు వస్తాడని చెప్పినప్పటికీ అది జరగలేదు. దాడి జరిగిన ఆరు గంటల అనంతరం ప్రభుత్వ టివీలో రికార్డు చేయబడిన ఉపన్యాసం వినిపించారు. సలే కష్టంగా మాట్లాడాడని, మద్య మధ్యలో ఊపిరి భారంగా తీసుకున్నాడని విలేఖరులు తెలుపుతున్నారు.…

తాలిబాన్, ఆల్-ఖైదా లది టెర్రరిజమా, స్వాతంత్ర్య పోరాటమా?

‘ఏసియా టైమ్స్’ ఆన్‌లైన్ ఎడిషన్‌కి సంపాదకుడుగా ఉన్న పాకిస్ధాన్ విలేఖరి సలీమ్ షాజద్ కిడ్నాప్‌కి గురై, ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడ్డాడు. అతని శరీరంపై చిత్ర హింసలకు గురైన ఆనవాళ్ళు తప్ప బలమైన గాయమేదీ కనిపించలేదు. తుపాకితో కాల్చిన గుర్తులసలే లేవు. ఎటువంటి గాయాలు కనిపించకుండా చంపగల నేర్పరితనం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు ఉందని తెలుగు ప్రజలకు తెలుసు. షాజద్ హత్య ద్వారా ఆ నేర్పరితనం ఐ.ఎస్.ఐ గూఢచారులకు కూడా ఉందని వెల్లడయ్యింది. షాజద్‌ని చంపింది…

అమెరికా ‘స్పెల్లింగ్ బీ ఛాంపియన్’ పోటీల్లో భారత బాలిక ‘సుకన్య’ జయకేతనం

వరుసగా రెండో సంవత్సరం భారత దేశానికి చెందిన బాలిక అమెరికా స్పెల్లింగ్ ఛాంపియన్ పోటీల్లో విజయం సాధించి భారత ప్రతిష్టను చాటించి. బెంగాల్‌కి చెందిన “సుకన్య రాయ్” ‘cymotrichous’ పదానికి ఖచ్చితంగా స్పెల్లింగ్ చెప్పడం ద్వారా 2011 అమెరికా నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్‌షిప్ ను గెలుచుకుంది. ఎనిమిదో క్లాసు గానీ 15 సంవత్సరాల వయసుగానీ దాటని వారు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. పెన్సిల్వేనియాలో “అబింగ్‌టన్ హైట్స్ మిడిల్ స్కూల్” లో సుకన్య ఎనిమిదవ గ్రేడు…

అప్పు పరిమితి పెంచకపోతే అమెరికా దివాళా ఖాయం -మూడీస్

రిపబ్లికన్, డెమొక్రట్ పార్టీలు అమెరికా అప్పు పరిమితి పెంచే విషయంలో త్వరగా ఒక ఒప్పందానికి రాకపోతే అమెరికా దివాళా ఖాయమని మూడీస్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. అమెరికా సావరిన్ అప్పు బాండ్లకు ప్రస్తుతం టాప్ రేటింగ్ ఉందనీ, ఇరు పార్టీలు త్వరగా ఒక అంగీకారానికి రావాలనీ లేకుంటే ఇపుడున్న టాప్ రేటింగ్ కోల్పోవాల్సి ఉంటుందనీ ఆ సంస్ధ హెచ్చరించింది. ప్రస్తుతం ట్రెజరీ బాండ్ల అమ్మకం ద్వారా అమెరికా ప్రభుత్వం సేకరించగల అప్పుపై 14.3 ట్రిలియన్ డాలర్ల మేరకు…

నేను చూసిన ఆటగాళ్ళలో సచినే గొప్ప బ్యాట్స్ మెన్ -వివ్ రిచర్డ్స్

వెస్ట్ ఇండీస్ కి చెందిన లెజెండరీ బ్యాట్స్ మెన్ వివ్ రిచర్డ్స్ సచిన్ అభిమానుల జాబితాలో చేరాడు. “నేను డాన్^ని చూడలేదు. కానీ నా దృష్టిలో నా క్రికెట్ కెరీర్ లో నేను చూసిన బ్యాట్స్ మేన్ లలో సచినే గొప్ప బ్యాట్స్ మెన్. అతనికంటే గొప్ప బ్యాట్స్ మేన్ ను నేను చూడలేదు” అని తెలిపాడు. “సచిన్ కంటే గొప్ప బ్యాంట్స్ మేన్ ఎవరైనా ఉన్నట్లయితే అతనింకా రాలేదు” అని క్రికెట్ లెజండ్ వివ్ రిచర్డ్స్…

ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నించింది -అన్నా హజారే

భారత దేశంలోని ప్రఖ్యాత యోగా గురువు బాబా రామ్ దేవ్ జూన్ 4 తారీఖునుండి ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. విదేశీ బ్యాంకుల్లో భారత దేశ రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు రహస్యంగా దాచుకున్న నల్ల ధనాన్ని భారత దేశానికి తిరిగి తెప్పించాలని ఆయన ప్రధాన డిమాండు. బాబా రామ్ దేవ్ తన దీక్షను ప్రారంభించడానికి బుధవారం ఢిల్లీకి ప్రయాణం కట్టగా ప్రధాని మన్మోహన్ సింగ్ దీక్ష ఆలోచనని విరమించుకోవాలని స్వయంగా రామ్ దేవ్‌కి విజ్ఞప్తి చేశాడు.…

గూగుల్ చైనాల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం

గత సంవత్సరం చైనానుండి గూగుల్ తన వ్యాపారాన్ని ఉపసంహరించుకున్నంత పని చేసిన గూగుల్ చైనా ప్రభుత్వంతో తన ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొనసాగిస్తోంది. గత సంవత్సరంలో వలే నేరుగా చైనా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపనప్పటికీ గూగుల్‌కి చెందిన జి-మెయిల్ ఎకౌంట్ల ఐ.డి లను పాస్ వర్డ్ లను దొంగిలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ ఇవి చైనా లోని జినాన్ నుండి జరుగుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. ఫిషింగ్ ప్రక్రియ ద్వారా జిమెయిల్ వినియోగదారుల ఐ.డి, పాస్ వర్డులను సంపాదించి…

ఇ.కొలి: యూరప్‌నుండి కూరగాయల దిగుమతిని నిషేధించిన రష్యా

కీర దోసకాయల ద్వారా  ఇ.కొలి జబ్బు యూరప్ అంతటా విస్తురిస్తుండడంతో రష్యా యూరప్ నుండి గిగుమతి అయ్యే కూరగాయలన్నింటిని నిషేధించింది. దిగుమతి అయ్యే కూరగాయలు వేటినీ వాడవద్దని తన ప్రజలకు సూచించింది. దిగుమతి ఐన కూరగాయలకు బదులు రష్యాలో పండిన కూరగాయలను మాత్రమే వాడాలని హెచ్చరించింది. కూరగాయల భద్రతకు యూరప్ అనుసరిస్తున్న విధానాలను, ఆరోగ్య చట్టాన్ని రష్యా విమర్శించింది. ఈ పద్ధతినే అనుసరించాలని యూరప్ దేశాలు గత కొద్ది సంవత్సరాలుగా రష్యా పైన ఒత్తిడి తెస్తున్నాయి. యూరప్…

సెల్ ఫోన్‌తో కేన్సర్ -ప్రపంచ ఆరోగ్య సంస్ధ

ప్రపంచం మొత్తం ఇష్టంగా వాడుతున్న సెల్ ఫోన్‌తో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (World Health Organisation – WHO) హెచ్చరించింది. ఈ విషయం నిర్ధారించడానికి సంస్ధ ప్రత్యేక పరిశోధనలేవీ చేయనప్పటికీ ఇప్పటికే ప్రపంచంలోని వివిధ సంస్ధలు చేసిన పరిశోధనలను క్రోడీకరించిన డబ్ల్యు.హెచ్.ఓ సెల్ ఫోన్ ని అతిగా వాడ్డం వల్లా, చెవికి దగ్గరగా పెట్టుకుని వాడడం వలనా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రమాదానాన్ని నివారించడానికి సెల్ ఫోన్‌ని చెవి…

పాకిస్ధాన్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ సంస్ధల్లోకి చొచ్చుకెళ్ళిన ఆల్-ఖైదా; విలేఖరి పరిశోధన

ఆదివారం కిడ్నాప్‌కి గురై మంగళవారం శవమై తేలిన విలేఖరి సలీం షాజద్ మరణంపై ఇపుడు అంతర్జాతీయ స్ధాయిలో దృష్టి కేంద్రీకృతమై ఉంది. షాజద్ కొన్ని రోజులుగా పాకిస్ధాన్ నౌకాదళ అధికారులతో కలిసి విస్తృతంగా సమాచారం సేకరించాడు. మే 22 న కరాచిలోని గట్టి భద్రతా ఏర్పాట్లు ఉండే నౌకాదళ స్ధావరంపై జరిగిన ఆల్-ఖైదా దాడిగురించి వివరాలు సేకరించాడు. మిలిటెంట్ల సమాచారాన్నీ సేకరించాడు. ఆయన జరిపిన పరిశోధనలో ఆల్-ఖైదా పాకిస్ధాన్ నౌకాదళంలో జొరబడిన సంగతి తెలిసింది. ఆల్-ఖైదా చొరబాటు…

ఆల్-ఖైదా, పాక్‌ నేవీ ల సంబంధాలు వెల్లడించిన పాక్ విలేఖరి దారుణ హత్య

(విలేఖరి పరిశోధన అనంతరం తన మరణానికి ముందు రాసిన ఆర్టికల్ అనువాదం దీని తర్వాత పోస్టులో చూడండి) పాకిస్తాన్ గూఢచార సంస్ధకు ఆల్-ఖైదా, తాలిబాన్ లాంటి సంస్ధలతో దగ్గరి సంబంధాలున్నాయని భారత ప్రభుత్వం చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఒసామా హత్య తర్వాత ఆరు సంవత్సరాల పాటు ఒసామా పాక్‌లో తలదాచుకోడానికి కారణం పాక్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ లతో మిలిటెంట్ సంస్ధలకు సంబంధాలుండడమే కారణమని అమెరికా కూడా ఆరోపించింది. ఆ తర్వాత పాక్ మంత్రి మిలట్రీ, ఐ.ఎస్.ఐ సంస్ధల…

ఫుకుషిమా అణు ప్రమాదాన్ని జపాన్ తక్కువ అంచనా వేసింది -ఐక్యరాజ్య సమితి

మార్చి 11 న సంభవించిన భూకంపం, ఆ తర్వాత పెద్ద ఎత్తున విరుచుకుపడిన సునామీ వలన ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రానికి జరిగిన ప్రమాదాన్ని జపాన్ ప్రభుత్వం తక్కువ అంచనా వేసిందని ఐక్యరాజ్య సమితి అణు ఇంధన సంస్ధ ఐ.ఎ.ఐ.ఎ తన ప్రాధమిక నివేదికలో పేర్కొన్నది. సముద్రం ఒడ్డున నిర్మించిన ఫుకుషిమా కేంద్రానికి సునామీ వలన ఏర్పడగల ప్రమాదాన్ని అంచనా వేయడంలోనూ, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ జపాల్ విఫలమైందని ఆ సంస్ధ తెలిపింది. నివేదికను…

భారత పాలకుల్ని నిరాశపరుస్తూ తగ్గుదల నమోదు చేసిన ఆర్ధిక వృద్ధి రేటు

గత 2010-11 ఆర్ధిక సంవత్సరంలో జనవరి 2011 నుండి మార్చి 2011 వరకు ఉన్న చివరి క్వార్టర్ లో భారత దేశ ఆర్ధిక (జిడిపి) వృద్ధి రేటు అంతకు ముందరి ఐదు క్వార్టర్లలో అతి తక్కువ వృద్ధిని నమోదు చేసింది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం వలన వినియోగం తగ్గడం, పెట్టుబడులు కూడా మందగించడం ఈ తగ్గుదలకు కారణమని విశ్లేషకు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం ఇంకా లొంగిరాక పోవడంతో మరిన్ని సార్లు వడ్డీ…