ఇ.యు షరతులు, పొదుపు ఆర్ధిక విధానాలపై గ్రీసు కార్మికుల సమర శంఖం

“ఈ ఆర్ధిక విధానాలు, పొదుపు చర్యలకు అనుకూలంగా ఓటు వేయాలంటే పులికి ఉండే క్రూరత్వం కలిగి ఉంటేనే సాధ్యం.” ఈ మాట అన్నది గ్రీకు పార్లమెంటు సభ్యుడు, జార్జి లియానిస్. ఈయన పాలక పార్టీ ఐన సోషలిస్టు పార్టీ సభ్యుడు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ ద్రవ్యనిధి సంస్ధ (IMF) లు సహాయం పేరుతో గ్రీసు కి ఇవ్వనున్న అప్పు కోసం గ్రీసు ప్రభుత్వం అమలు చేయవలసిన కఠినమైన పొదుపు ఆర్ధిక విధానాలు, చర్యలను ఉద్దేశిస్తూ ఆయన ఈ…

మన్మోహన్ సింగ్ పాలనపై సన్నగిల్లిన వ్యాపారుల విశ్వాసం

వరుస కుంభకోణాలతో తీసుకుంటున్న మన్మోహన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై భారత వ్యాపారులకు, పెట్టుబడుదారులకు విశ్వాసం సన్నగిల్లుతోంది. ఎకనమిక్ టైమ్స్ (ఇ.టి) పత్రిక, ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ – FICCI) సంస్ధలు జరిపిన సర్వేలో ఈ ఫిషయం తేలిందని రాయిటర్స్ పత్రిక ప్రకటించింది. దేశీయ పెట్టుబడిదారులు, వ్యాపారుల విశ్వాసం సన్నగిల్లినందువలన అది విదేశీ పెట్టుబడుదారులకు భారత పాలకులపై గల విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సర్వేలు సోమవారం ప్రచురించబడిన…

రద్దయిన ‘ప్లేబాయ్’ ముసలోడి ‘దసరా పండగ’

అమెరికాలో జరిగే కొన్ని పెళ్ళిళ్ళు ఊహించలేనంత వింతగా ఉంటాయి. ప్రఖ్యాత బ్రిటిష్-అమెరికన్ నటి ఎలిజబెత్ టేలర్ ఎనిమిది పెళ్ళిళ్ళు, ఏడుగురు భర్తలతో (ఒక భర్తకు విడాకులిచ్చి ఆ తర్వాత మళ్ళీ అతన్ని పెళ్ళి చేసుకోవడంతో పెళ్ళిళ్ళ కంటే భర్తల సంఖ్య ఒకటి తగ్గింది) నిరంతరం వార్తా సంస్ధలను ఆకర్షించింది. ముసలి తనంలో సైతం యువకుల్ని భర్తగా పొందిన ఆమె నటనా వృత్తిలో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించింది. అదే విధమైన వార్తతో ప్లేబాయ్ పత్రిక అధిపతి “హగ్ హెఫ్నర్”…

కొడుకు చేసిన తప్పుకి తల్లిని నగ్నంగా ఊరేగించిన పాకిస్తాన్ గ్రామస్దులు

కొడుకు చేసిన తప్పుకి అతని తల్లి కక్షిదారుల చేతిలో అవమానం ఎదుర్కోవలసి వచ్చింది. పాకిస్ధాన్ లోని “ఖైబర్ పక్థూన్‌ఖ్వా” రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని పాకిస్ధాన్ పోలీసులు చెబుతున్నారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణతో అతన్ని చంపడానికి ఆయుధాలతో వెళ్ళిన సంబంధీకులు నలుగురు, అతను ఇంటివద్ద లేక పోవడంతో అతని తల్లిని వివస్త్రను గావించి గ్రామంలో ఊరేగించారు. నిందితుల వద్ద ఆయుధాలు ఉండడంతో…

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బరిలో ఫ్రాన్సు, మెక్సికో అభ్యర్ధులు

ఐ.ఎం.ఎఫ్ అధిపతి పదవికి అంతిమంగా ఇద్దరిని ఆ సంస్ధ షార్ట్ లిస్ట్ చేసింది. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టిన్ లాగార్డే తో మెక్సికో సెంట్రల్ బ్యాంకు అధిపతి అగస్టిన్ కార్‌స్టెన్స్ ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి కోసం పోటీ పడుతున్నాడు. ఐ.ఎం.ఎఫ్ ఎం.డి పదవికి పోటీ జరగడం ఇదే మొదటి సారి. ఇప్పటివరకూ బ్రెట్టన్ వుడ్స్ కవలలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ల ఉన్నత పదవులను అమెరికా యూరప్ లు పంచుకునేవి. ప్రపంచ బ్యాంకు…

అమెరికా సెనేట్ వెబ్ సైట్ లోకి చొరబడ్డ హ్యాకర్లు

అమెరికా ప్రభుత్వ వెబ్ సైట్లపై మరే దేశమైనా దాడి చేసినట్లయితే దాన్ని “యుద్ధ చర్య” గా భావించి సాయుధంగానే ప్రతిస్పందిస్తామని అమెరికా ప్రకటించిన వారం రోజుల లోపే అమెరికా ఎగువ సభ లేదా పెద్దల సభ లేదా సెనేట్ కి చెందిన వెబ్ సైట్ పై హ్యాకర్లు దాడి చేసి అమెరికాకి పరోక్షంగా సవాలు విసిరారు. సెనేట్ వెబ్ సైట్ లోకి చొరబడడమే కాకుండా రహస్యం కాని మామూలు ఫైళ్ళను ఇంటర్నెట్ లో ప్రదర్శించింది. తాము సెనేట్…

ఒబామాపై నమ్మకం లేక లాడెన్ శవం వెతకడానికి సిద్ధపడ్డ అమెరికా గజ ఈతగాడు

కాలిఫోర్నియాకి చెందిన 59 ఏళ్ళ గజ ఈతగాడు బిల్ వారెన్ బిన్ లాడెన్ శవం కోసం సముద్రాన్ని గాలించడానికి సిద్ధపడ్డాడు. ఆల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ నిజంగా చనిపోయాడో లేదో ప్రపంచానికి తెలియజేయడానికి తాను ఈ పనికి పూనుకున్నానని వారెన్ చెబుతున్నాడు. “నేను దేశ భక్తి గల అమెరికన్ ని. నిజం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ పనికి సిద్ధపడ్డాను” అని ఆయన న్యూయార్క్ పోస్ట్ పత్రికతో మాట్లాడుతూ చెప్పినట్లుగా ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ…

‘ఐ పాడ్ 2’ కోసం కిడ్నీ అమ్ముకున్న చైనా యువకుడు

అయినవారి కోసం కిడ్నీ దానం చేయడం చూశాం. పని దొరక్క కడుపు నింపు కోవడానికి రక్తదానం, కిడ్నీ దానం చేస్తున్న చేనేత కార్మికులను చూస్తున్నాం. కూతురి పెళ్ళి కోసం కట్నం చెల్లించే స్తోమత లేక కిడ్నీ అమ్ముకుంటున్న తల్లి దండ్రుల్నీ చూశాం. కానీ వినియోగ సంస్కృతి వెర్రితలలు వేస్తున్న ఫలితంగా అభివృద్ధి చెందిన టెక్నాలజీ మన ముందుంచిన ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరంపై మోజుతో కిడ్నీ అమ్ముకున్న యువకుడి విషయం తెలిస్తే యువత ఎంత ప్రమాదంలో ఉన్నదీ అర్ధమై…

కేవలం కండోమ్‌లు పంచి సరిపెట్టుకోకుండా మాకు మా జీవితాల్నివ్వండి -నళిని

“కండోమ్‌లు పంచి పెట్టడంతోనే మీ భాధ్యత ముగిసిందనో, మా సమస్యలు తీరిపోతాయనో భావించడం సరికాదు. మా జీవితాల్ని మాకు తిరిగి ఇవ్వండి” అని కోరారు కేరళకు చెందిన రచయిత్రి, ఒకప్పటి సెక్స్ వర్కర్ నళిని జమీలా. సెక్స్ వర్కర్లకి సంబంధించి ప్రభుత్వ విధానాల పట్ల అనేక మంది సెక్స్ వర్కర్ల అభిప్రాయాలను నళిని ఒక్క వాక్యంలో విడమర్చి చెప్పింది నళిని. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంకి సంబంధించిన నాలుగవ పంచవర్ష ప్రణాళిక రూప కల్పన కోసం బెంగుళూరులో…

వాడి పారేసిన అణు ఇంధనంతో అమెరికాకి పొంచిఉన్న పెనుప్రమాదం -నిపుణుడు

జపాన్ లో సంభవించిన భూకంపం, సునామీల వలన ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రానికి వాటిల్లిన ప్రమాదం అణు విద్యుత్ వలన ఏర్పడనున్న వైపరీత్యాలపై మరొకసారి దృష్టి సారించవలసిన అగత్యం ఏర్పడింది. అణు ప్రమాదాల వలన ప్రజలపై కలిగే ప్రభావాలకంటే అణు రియాక్టర్ల మార్కెట్ ను కాపాడుకునే విషయానికే ప్రాధాన్యం ఇస్తున్న నేటి ప్రభుత్వాలు అణు ప్రమాదాల వల్ల సంభవించిన అసలు నష్టాల్ని వెల్లడించడంలో నిజాయితీగా వ్యవరించడం లేదని ఆ పరిశ్రమతో సంబంధం ఉన్న అమెరికా నిపుణుడు…

ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికోసం ముగ్గురు మిగిలారు

రేప్ ప్రయత్నం నేరంపై స్ట్రాస్ కాన్ అరెస్టు ఐన తర్వాత ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టరు పోస్టుకి పోటీ ఏర్పడింది. ఇప్పటివరకూ అమెరికా ప్రపంచ బ్యాంకు అధిపతిని నియమించుకుంటే, యూరప్ ఐ.ఎం.ఎఫ్ అధిపతిని నియమించుకునేవి. ఇప్పుడు ఎమర్జింగ్ దేశాలైన చైనా, ఇండియా, దక్షీణాఫ్రికాలు పోటీ పడుతున్నాయి. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టీన్ లాగార్డే ఈ పదవికి ఎన్నిక కావచ్చని అంచనా వేస్తుండగా ఆమెకు పోటీ ఎదురవుతోంది. ఇండియా ఆమె అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వలేదు. చైనా ఏమీ చెప్పడం లేదు.…

భారతదేశ ఆర్ధికవృద్ధికి ఫ్యాక్టరీలు, సాఫ్టువేర్, వ్యవసాయం లలొ ఏది కీలకం?

ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ గా పరిగణింపబడుతున్న భారత దేశం చైనా తర్వాత అత్యధిక వేగంతో ఆర్ధిక వృద్ధి (జిడిపి పెరుగుదల రేటు) సాధిస్తున్న దేశంగా గుర్తింపు పొందింది. భారత దేశంలో సేవల రంగం (ప్రధానంగా సాఫ్టువేర్, ఆ తర్వాత బ్యాంకింగ్, ఇన్సూరెన్సు లు కూడా సేవల రంగం కిందికే వస్తాయి) అభివృద్ధి చెందింది. ప్రధానంగా సావ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందిన ఫలితంగా కంప్యూటర్ రంగంలో ఔట్ సోర్సింగ్ కి ఇండియా కేంద్రంగా మారింది. నూతన ఆర్ధిక…

కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా, మన్మోహన్ ల నేతృత్వంలో గ్రూపులున్నది నిజమేనా?

భారత దేశం ఎమర్జింగ్ ఎకానమీగా చెలామణి అవుతోంది. చైనా తర్వాత అత్యధిక జిడిపి వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే చైనా అధిగమించాలని కలలు కంటోంది. చైనాకు పోటీదారుగా చెప్పుకుంటున్నప్పటికీ చైనా వివిధ రంగాల్లో సాధిస్తున్న ఆర్ధిక ప్రగతితో పోలిస్తే ఇండియా ప్రగతి చాలా దూరంలోనే ఉంది. చైనా ప్రపంచంలో అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ కాగా ఇండియా 11 వ స్ధానంలొ ఉంది. ఆసియాలో చూస్తే చైనా మొదటి స్ధానంలో ఉండగా…

పోస్కో (POSCO) కంపెనీ కోసం ప్రభుత్వాల పచ్చి అబద్ధాలు, అరాచకాలు

పోస్కో కంపెనీ ప్రాజెక్టు: ఇది దక్షిణ కొరియాకి చెందిన బహుళజాతి కంపెనీ. భారత దేశంలో సంవత్సరానికి నాలుగు మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేస్తానని 2005 లో భారత దేశంలో ఒప్పందం కుదుర్చుకుంది. 12 బిలియన్ డాలర్ల (రు. 52,000 కోట్లు) పెట్టుబడి ఈ ప్రాజెక్టు రూపంలో ఇండియాకి వస్తుంది. ఇండియాకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకే కంపెనీకి ఇంత పెట్టుబడి మరి దేనికీ రాలేదు. ప్రాజెక్టు కట్టడం కోసం ఇది ఒడిషాలోని జగత్‌సింగ్ పూర్…