రేటింగ్‌లతో ఆర్ధిక పతనాలకు కారణమవుతున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు -కార్టూన్

స్టాండర్డ్ & పూర్ (ఎస్ & పి), ఫిఛ్, మూడీస్… ఈ మూడు సంస్ధలు ప్రపంచంలో అత్యధిక రేటింగ్ ఉన్న “రేటింగ్ ఏజన్సీలు.” ఇవి వివిధ దేశాల, ముఖ్యంగా మార్కెట్ ఎకానమీని చేపట్టిని దేశాల సావరిన్ అప్పులకు రేటింగ్ ఇస్తాయి. సావరిన్ అప్పులనే ట్రెజరీ బాండ్స్ అంటారు. వివిధ దేశాల ప్రభుత్వాలు మార్కెట్ నుండి, అంటే ప్రవేటు పెట్టుబడిదారులనుండి అప్పులు సేకరించడం కోసం ట్రెజరీ బాండ్లు జారీ చేస్తాయని తెలుసుకున్నాం. వివిధ దేశాల ట్రెజరీ బాండ్లలో తమ…

నార్వే బాంబు పేలుళ్ళు, ఉన్మాది కాల్పులు -ఫొటోలు

4.8 మిలియన్ల జనాభా ఉన్న నార్వే శుక్రవారం బాంబు పేలుళ్ళు, ఉన్మాది కాల్పులతో అట్టుడికింది. రాజధాని ఓస్లో నగరంలో ప్రధాన మంత్రి కార్యాలయం సమీపంలో బాంబులు పేలి 7 గురు చనిపోయారు. బాంబు పేలుళ్ళకు కారణమైన వ్యక్తే సమీపంలోని ఉటావో ద్వీపంలో సభ జరుపుకుంటున్న పాలక పార్టీ యువజన సంఘం స్ధలం వద్ద విచక్షణా రహితంగా కాల్పులకు దిగి 84 మందికి పైగా టీనేజి యువతీ యువకుల్ని చంపాడు. ఓస్లోలో బాంబు పేలుడు శక్తిని బట్టి చూస్తే…

నార్వేని కుదిపేసిన బాంబు పేలుళ్ళు, కాల్పులు; 87 మంది దుర్మరణం

నార్వే రాజధాని ఓస్లోను బాంబు పేలుళ్ళు కుదిపేశాయి. గంట నుండి రెండు గంటల వ్యవధిలో వరుసగా జరిగిన రెండు సంఘటనల్లో మొత్తం 87 మంది ప్రజలు దుర్మరణం పాలయ్యారు. ప్రపంచంలోనే అత్యంత భద్రత గల ప్రాంతంగా భావించే దేశాల్లో ఒకటైన నార్వే రాజధానిలో ఈ ఘటన జరగడం నార్వే వాసులను షాక్ కి గురిచేసింది. శుక్రవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు చనిపోగా, ఒకటి లేదా రెండు గంటల అనంతరం సమీపంలోని ఉటోయా ద్వీపంలో పోలీసు…

మృతవీరుడి మరణం పట్ల శంకరుడిని నిలదీస్తూ, నిరసిస్తూ హృదయాన్ని పిండేసే పాట -వీడియో

మిత్రులు కొణతం దిలీప్ గారి బ్లాగ్ నుండి సంగ్రహించిన వీడియో ఇది. తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు తమను తాము దహించుకుంటున్న రోజుల్లో 28 ఏప్రిల్, 2010 తేదీన అటువంటి ఒక యువకుడి ఆత్మాహుతి పట్ల నిరసన తెలుపుతూ జరిగిన సభలో శంకరుడినే ప్రశ్నిస్తున్న కళాకారుడి హృదయం ఈ పాట. కొన్ని వందల తల్లుల కడుపు శోకానికి అక్షర రూపం ఈ పాట. అంతమంది తల్లుల గర్భశోక ధ్వని రూపం కూడా ఈ పాట. పాషాణ హృదయులనైనా…

“రిలయన్స్ ఇండస్ట్రీస్”లో 30 శాతం షేర్లు “బ్రిటిష్ పెట్రోలియం” కు అమ్మడానికి కేంద్రం ఆమోదం

మొదట దేశంలోని విలువైన సహజ వనరులను స్వదేశీ ప్రవేటు పెట్టుబడిదారులకు అప్పగించడం, ఆ అర్వాత స్వదేశీ పెట్టుబడుదారులను తమ కంపెనీలో గణనీయమొత్తంలో షేర్లను విదేశీ బహుళజాతి సంస్ధలకు అమ్ముకోవడానికి ఆమోద ముద్ర వేయడం, తద్వారా భారత దేశ ఆయిల్, గ్యాస్ తవ్వకాల రంగంలోని దేశీయ మార్కెట్లను విదేశీ మార్కెట్ల ప్రవేశానికి గేట్లు బార్లా తెరవాలన్న పశ్చిమ దేశాల డిమాండ్లను నెరవేర్చడం భారత ప్రభుత్వం ఒక ఎత్తుగడగా అభివృద్ధి చేసినట్లు కనిపిస్తోంది. కాకుంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల వద్ద…

తెలంగాణ రాష్ట్రం కోరడం వేర్పాటువాదం కాదు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడాన్ని వేర్పాటువాదంగా కొంతమంది సంభోదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వేరుపడాలని కోరుతున్నారు గనక అది ‘వేర్పాటు వాదమే’ అని వారి వాదనగా ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం చూసినా ఒక రాష్ట్రం నుండి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడడం వేర్పాటు వాదం కాజాలదు. దేశం నుండి విడిపోయి కొత్త దేశంగా ఏర్పడాలని కోరుకోవడం వేర్పాటువాదం అవుతుంది తప్ప రాష్ట్రాలుగా విడిపోవడం వేర్పాటువాదం కాదు. కాశ్మీరు ప్రజలు తమది ప్రత్యేక…

తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలది, ఉద్యమాన్ని చూపి రౌడీ చర్యలకు దిగడం కట్టిపెట్టాలి

ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్‌లొ కె.సి.ఆర్ అల్లుడు హరీష్ రావు వేసిన వీరంగం ఖండనార్హం. ఏపి భవన్‌లో ఛానెళ్ళ కెమెరాల సాక్షిగా ఆయన చేసిన అరాచకం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. ఫర్నిచర్‌ని కాళ్ళతో తన్నుకుంటూ, పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, తలుపుల్ని బాదుతూ అంతిమంగా అక్కడ అందుబాటులో ఉన్న అధికారిని రెండు చెంపలపైన కొట్టడం ఒక రాజకీయనాయకుడు, అందునా వెనకబడిన ప్రాంతం హక్కుల కోసం ఉద్యమిస్తున్నామని చెబుతున్న పార్టీకి చెందిన నాయకుడు, చేయకూడని పని. చట్ట…

రెండు తలల పాము -ఫోటో

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక జంతు ప్రదర్శనశాలలో ఈ రెండు తలల పాముని ప్రదర్శనకు ఉంచారు. పరిమిత రోజుల పాటు మాత్రమే ప్రదర్శనకు ఉంచుతారని జూ నిర్వాహకులు తెలిపారు. ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్సె (ఎ.ఎఫ్.పి) వార్తా సంస్ధకి చెందిన ఫోటో జర్నలిస్టు జులై 8 తేదీన ఈ ఫోటోని తీశాడు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని యాల్టా నగరంలో స్కాజ్కా జూ లో దీనిని ఉంచారు. ప్రకృతి విచిత్రాలలో ఇదీ ఒకటి కాబోలు.

యెడ్యూరప్పకు పులిమీద పుట్ర, అవినీతి కేసులో విచారణకు కోర్టు అనుమతి

కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కు కూడా అక్రమ మైనింగ్ కుంభకోణంలో పాత్ర ఉందని నిర్ధారిస్తూ తయారు చేసిన నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించనున్న నేపధ్యంలో ఆయనపై మరో సమ్మెట దెబ్బ పడింది. యెడ్యూరప్పపై అవినీతి కేసులు నమోదు చేసి విచారించాలన్న క్రింది కోర్టు తీర్పుపై మార్చిలో విధించిన స్టేను హై కోర్టు గురువారం ఎత్తి వేసింది. స్తే ఎత్తి వేస్తూ ముఖ్యమంత్రిపై అవినీతి పాల్పడ్డాడన్న కేసు నమోదు చేసి విచారణ చేయడానికి…

ఒక సి.ఎం, 8 నేతలు, 500 అధికారులు, రు.1827 కోట్లు.. ఇదీ మైనింగ్ కుంభకోణం!

ఇది కుంభకోణాల యుగం. నిజానికి నల్లదొరల పాలన అంతా కుంభకోణాల మయమే. తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వచ్చారు తప్ప స్వాతంత్ర్యం వలన భారత ప్రజా కోటికి ఒరిగిందేమీ లేదన్నది నిష్టర సత్యంగా నానాటికీ రుజువౌతోంది. ఎవరూ గట్టి ప్రయత్నం చేయకుండానే రాజకీయ నాయకులు తమ మధ్య రగిలే కుమ్ములాటలవలన, రాజకీయ విభేధాల వలన తమ అవినీతి కార్యకలాపాలను బయట పెట్టుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్ధుల అలవిగాని సంపదల గుట్టుమట్టులని బైట పెట్టడం అనేది ఎన్నికల రాజకీయాల్లో…

కర్ణాటక ముఖ్యమంత్రి, మంత్రులు, గనుల యజమానులే గనుల మాఫియా సృష్టికర్తలు -లోకాయుక్త

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, అధికారులు, గనుల యజమానులు అంతాకలిసి బళ్లారి ఇనుప గనుల్లో మాఫియా లాంటి వ్యవస్ధను సృష్టించారని కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె వెల్లడించారు. సుప్రీం కోర్టులో మాజీ న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో పాటు గనుల యజమానులు అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 1800 కోట్ల రూపాయల నష్టం కలగజేశారని వెల్లడించారు. మార్చి 2009 మే 2010 వరకూ 14 నెలల…

‘ఓటుకు నోటు’ కేసులో రెండవ అరెస్టు, ఈ సారి బిజెపి వంతు?

సుప్రీం కోర్టు జోక్యంతో “ఓటుకు నోటు” కేసు ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురు బి.జె.పి ఎం.పిలు యు.పి.ఎ-1 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఓటింగ్ నుండి నిష్క్రమించడానికి కాంగ్రెస్ పార్టీవారు తమకు కోటి రూపాయలు ఇచ్చారంటూ, విశ్వాస పరీక్షరోజే ఆరోపించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్‌కు సయాయకుడుగా ఉన్న సంజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు.…

జనారణ్యంలోకి చొరబడ్డ చిరుతతో ఫారెస్టు గార్డుల ఘర్షణ -ఫోటోలు

ప్రకృతిపై మనిషి సాగించిన పోరాటంలో మనిషిదే అంతిమ విజయం. విజయంతో సంతృప్తి చెందిన మనిషి ధన ధాహంతో ప్రకృతి వినాశనానికి పూనుకుంటున్నాడు. దానితో జనారణ్యం సహజారణ్యంలోకి చొచ్చుకెళ్తోంది. ఫలితంగా జంతువులకు తమ సహజ నివాసంలో జాగా లేక జనారణ్యంలోకి రాక తప్పడం లేదు. రియల్ ఎస్టేట్ రంగ కాసుల దాహం కావచ్చు, అడవుల్లో దొరికే సహజ ఖనిజ వనరులపై బిలియనీర్ల కన్నుపడటం వలన కావచ్చు, అడవుల్లో జంతుజాలానికి నిలవ నీడ లేకుండా పోయింది. ఖనిజాల కోసం, గనుల…

భారత అణుప్రమాద పరిహార చట్టం ఐ.ఎ.ఇ.ఎ నిబంధనలకు లోబడాలి, అమెరికా కొత్త మెలిక

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. భారత్, అమెరికాల పౌర అణు ఒప్పందంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం అమలు దిశలో మలి దశగా ఈ పర్యటనను పత్రికలు గత కొన్ని రోజులుగా పేర్కొంటూ వచ్చాయి. అమెరికా, భారత్‌కు అణు రియాక్టర్‌లు, అణు పదార్ధం (శుద్ధి చేయబడిన యురేనియం) సరఫరా చేయడానికి అమెరికా తాజాగా మరొక మెలిక పెట్టింది. భారత పార్లమెంటు ఆమోదించిన ‘అణు ప్రమాద పరిహార…

చైనాలొ తేనెటీగల్ని ఆకర్షించి, వొంటినే తేనెతుట్టెగా మలిచే పోటీ -ఫోటోలు

తేనెటీగల దండు వస్తుంటేనే చూసి పారిపోతాం మనం. అవి మన శరీరంలో నాటే కొండీలు యమ బాధని కలిగిస్తాయి. కాని చైనాలో ఏకంగా తమ శరీరాలనే తేనెతుట్టెలుగా మార్చే పోటీ జరగడం విశేషం. చూడడం తర్వాత సంగతి, తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడిచే ఈ పోటీ దృశ్యాలను చూసి తీరవలసిందే మరి. చైనా లోని హూనాన్ రాష్ట్రంలో “షావో యాంగ్” ఊరిలో ఈ తేనెటీగల్ని ఆకర్షించే పోటీ జరిగింది. ఈ పోటీలో పాల్గొనేవారు తాము పెంచుకున్న రాణి తేనెటీగల్ని…