11వ సారి వడ్డీ రేట్లు పెంచిన ఆర్.బి.ఐ, షేర్ మార్కెట్లు బేజారు

ఆర్.బి.ఐ జులై ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా పదకొండవసారి తన వడ్డీ రేట్లు పెంచింది. ఊహించినదాని కంటె ఎక్కువగా పెంచడంతో షేర్ మార్కెట్లు బేజారెత్తాయి. అమ్మకాల ఒత్తిడికి గురై సెన్సెక్స్ సూచి 1.87 శాతం పతనమైంది. అమెరికా సమయానికి అప్పు చెల్లింపులు చేయలేకపోవచ్చన్న అనుమానాలు ఒకవైపు పెరుగుతుండగా ఆర్.బి.ఐ వడ్డీ రేట్ల పెంపుదలలో తీవ్రతను చూపడంతో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని అందరూ అంచనా వేస్తుండగా ఆర్.బి.ఐ గవర్నరు మరొకసారి మార్కెట్…

నార్వే ఊచకోత నిందితుడికి ఇంగ్లండ్‌ రైటిస్టు తీవ్రవాదులతో సంబంధాలు?!

నార్వే ఊచకోతతో యూరప్ ఉలిక్కిపడింది. తమ దేశాల్లొ రైటిస్టుల గురించి ఆరా తీయడం ప్రారంభిస్తున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జంట దాడుల్లో 92 మందిని ఊచకోత కూసిన ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్, తనకు ఇంగ్లండులోని రైటిస్టు తీవ్రవాద సంస్ధలతో సంబంధాలున్నాయని చెప్పడంతో స్కాట్లండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా “ఇంగ్లీష్ డిఫెన్సు లీగ్” (ఇ.డి.ఎల్) సంస్ధతొ తనకు గట్టి సంబంధాలున్నాయని బ్రీవిక్ తెలిపాడు. ఇ.డి.ఎల్ సంస్ధ కూడా ముస్లిం వ్యతిరేక సంస్ధ. వలసదారులను వ్యతిరేకిస్తుంది. బహుళ సంస్కృతి…

నార్వే హత్యాకాండ నిందితుడితో ఇండియా కనెక్షన్!

జులై 22 తేదీన నార్వేలో సమ్మర్ క్యాంప్ కోలాహలంలో మునిగి ఉన్న టీనేజి యువతీ యువకులు 85 మందిని ఊచకోత కోసిన ముస్లిం ద్వేషి, మితవాద క్రిస్టియన్ తీవ్రవాది ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ తో ఇండియాతో గల కనెక్షన్ ఒకటి బైటపడింది. ఆందోళన పడవలసిన కనెక్షన్ కాదు గాని, అనూహ్యమైన కనెక్షన్. బ్రీవిక్ వెబ్‌సైట్ లో ఉంచిన మానిఫెస్టోలో పేర్కొన్న తీవ్రవాద సంస్ధ సభ్యులు ధరించడానికి బ్యాడ్జిని తయారు చేయడానికి ఆయన భారత దేశానికి చెందిన ఒక…

కాంగ్రెస్ పార్టీ ఓ సర్కస్‌లా తయారయ్యింది -కాంగ్రెస్ నాయకుడు మణి శంకర్ అయ్యర్

కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపుల ఘర్షణ వీధికెక్కుతున్నట్లు కనిపిస్తోంది. రాహుల్, దిగ్విజయ్, సోనియాల పర్యవేక్షణలోని నెహ్రూ/ఇందిరా స్కూల్ ఆర్ధిక విధానాలకీ, మన్మోహన్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, పి.చిదంబరం, కపిల్ సిబాల్ తదితరుల అమెరికా/ఎల్.పి.జి (లిబరలైజేషన్, ప్రవేటైజేషన్, గ్లోబలైజేషన్) స్కూల్ ఆర్ధిక విధానాలకి ఘర్షణ, ఐక్యతలు కొనసాగుతున పరిస్ధితి అందరూ ఎరిగినదే. లోలోపలి సమావేశాల్లోనూ, మంత్రుల నియామకాలు, తొలగింపుల రూపంలోనూ వీరి ఘర్షణ వ్యక్తమవుతూ వస్తున్నది. ఐతే నెహ్రూ స్కూల్ సీనియర్ నాయకులను సుదీర్ఘకాలం పాటు పక్కనబెడుతుండడంతో వారు…

టెలికం (2జి) కుంభకోణంలో మన్మోహన్, చిదంబరంలు రాజీనామా చేయాలి -బి.జె.పి

మాజీ టెలికం మంత్రి ఎ.రాజా 2జి స్పెక్ట్రం లైసెన్సులను చౌకరేట్లకు జారీ చేసిన నిర్ణయంలో ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం పాత్ర కూడా ఉందనీ, వారికి తెలియకుండా ఏ నిర్ణయమూ జరిగే అవకాశం లేదనీ ఢిల్లీలోని సి.బి.ఐ ప్రత్యేక కోర్టుకు విన్నవించుకున్న నేపధ్యంలో వారిద్దరూ వెంటనే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే ఫోన్‌ను ట్యాప్ చేయడం, అక్రమ మైనింగ్ కుంభకోణంలో కర్ణాటక సి.ఎం…

కోర్టులో మన్మోహన్, చిదంబరం పేర్లను ప్రస్తావించిన మాజీ టెలికం మంత్రి ఎ.రాజా

ఎ.రాజా. టెలికం కుంభకోణానికి కేంద్ర బిందువు. తానొక్కడే ఎందుకు బలికావాలనుకొన్నాడో ఏమో! నేరుగా ప్రధాని మన్మోహన్‌నే కోర్టుకి లాగినంతపని చేశాడు. సుప్రీం కోర్టుతో పాటు కోర్టులన్నీ ఇదే రీతిలో తన పని తాను చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మన్మోహన్ కూడా బోను ఎక్కవలసి రావచ్చు. కర్టాక టూరిజం శాఖ మంత్రి జనార్ధన రెడ్డి అక్రమ మైనింగ్ జరిపినందుకు చూస్తూ ఊరకున్న ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా బాధ్యుడే నని కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే తన నివేదికలో తేల్చాడు.…

కృష్ణ నాయకత్వంలో ఎంక్వైరీ కమిటీ వేసుకోండి -ఫోన్ ట్యాపింగ్‌పై ప్రధానికి యెడ్యూరప్ప సవాల్

ఇద్దరు వెధవలు కొట్లాడుకుంటూ తిట్టుకుంటున్నారట. “నువ్వు వెధవాయ్‌వి” అని ఒకడంటే, “నాకంటె నువు పెద్ద వెధవాయ్‌వి కదా” అని మరొకడు. చూసేవారికీ, వినేవారికీ ఇద్దరూ వెధవాయ్‌లేనని అర్ధమైపోతుంది. అలానే ఉంది కాంగ్రెస్, బి.జె.పి నాయకుల వ్యవహారం. కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డె అక్రమ మైనింగ్‌లో సి.ఎం యెడ్యూరప్పకి పరోక్షంగా బాధ్యత ఉందని తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అది కాకుండా లోకాయుక్త తన ఫోన్ ట్యాపింగ్ చేసారని ఆరోపించాడు. రెండింటికి బాధ్యత వహిస్తూ యెడ్యూరప్ప రాజీనామా…

బి.జె.పి నోట సెక్యులరిజం మాట

దేశంలో సెక్యులరిస్టు శక్తులకు నిరాశ కలిగించే పరిణామాలు జరుగుతున్నాయంటూ భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అది కూడా ఒక ముస్లిం వ్యక్తిని ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా తొలగించినందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన తొలగింపు దేశంలోని సెక్యులరిస్టు శక్తులకు నిరాశను కలిగించిందని వాపోయింది. లక్నోలోని దారుల్ ఉలూమ్‌కు మొహతామిమ్ (వైస్ ఛాన్సలర్‌)గా జనవరిలో నియమితుడయిన మౌలానా గులామ్ మొహమ్మద్ వాస్తన్విని తొలగిస్తూ యూనివర్సిటీ గవర్నింగ్ బాడీ ఐన మజ్లిస్-ఎ-షూరా  ఆదివారం నిర్ణయం తీసుకుంది.…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ ప్రారంభం -కార్టూన్

వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బారక్ ఒబామా పోటీ చేయనుండడం, ఆఫ్ఘన్ యుద్ధం పట్ల అమెరికన్లలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతుండడంతో పాటు ఒసామా బిన్ లాడెన్ హత్య (?) కూడా కలిసి రావడంతో ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఈ సంవత్సరం 10,000 మంది అమెరికా సైనికుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఒబామా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ ప్రారంభం అయ్యిందని కూడా పత్రికలు రాస్తున్నాయి. ఆర్ధిక బలహీనత నేపధ్యంలో ఆఫ్ఘన్ యుద్ధం అమెరికాకి నానాటికీ భారంగా మారింది. వ్రతం చెడ్డా…

“దారుణమే, కాని అవసరం” -నార్వే బాంబు పేలుళ్ళు, కాల్పుల నిందితుడు

నార్వే రాజధాని ఓస్లోలో ప్రధాని కార్యాలయం వద్ద బాంబు పేలుళ్ళకు పాల్పడి 7 గురినీ, కాల్పులు జరిపి 85 మందినీ చంపిన నేరంలో అనుమానితుడిగా అరెస్టయిన ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్ తానే ఆ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడని అతని లాయర్ ‘గీర్ లిప్పెస్తాద్’ తెలిపాడు. తన చర్యలు “దారుణమే, కాని అవసరం” అని బ్రీవిక్ పేర్కొన్నట్లుగా ఆయన తెలిపాడు. మృతుల కోసం ఉటోవా ద్వీపంలో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మరింతమంది నీటిలో మునిగి పోయి ఉండవచ్చన్న అనుమానంతో…

నార్వే బాంబు పేలుళ్ళ నిందితుడికి నచ్చిన కొటేషన్

ఓ నమ్మకం కలిగిన ఒక వ్యక్తి, కేవలం ప్రయోజనాలు మాత్రమే కలిగి ఉన్న లక్షమంది బలగంతో సమానం -ఇంగ్లీష్ తత్వవేత్త జాన్ స్టువర్డ్ మిల్. One person with a belief is equal to the force of 100,000 who have only interests. -English Philosopher John Stuart Mill. నార్వే రాజధాని ఓస్లోలో బాంబు పేలుళ్లకు పాల్పడి 7 గురినీ, సమీపంలోని ఉటావో ద్వీపంలో విచక్షణా రహిత కాల్పులకు పాల్పడి 84…

రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందుతున్నది బ్యూరోక్రట్లు, రాజకీయ నాయకులే -సుప్రీం కోర్టు

రిజర్వేషన్ కోటాల వలన సమకూరుతున్న ఫలితాలను ఆ వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారులు మాత్రమే లబ్ది పొందుతున్నారని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. అవి ఎవరికైతే ఉద్దేశించబడ్డాయో వారికి అసలు రిజర్వేషన్ల సంగతే తెలియడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ కె.వి.రవీంద్రన్, జస్టిస్ ఎ.కె.పట్నాయక్ లతో కూడిన సుప్రీం కోర్టు బెంచి ఈ వ్యాఖ్యానాలు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు), ఢిల్లీ యూనివర్సిటీలలో జరిగే అడ్మిషన్లలో ఒ.బి.సి రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయడం…

ముంజేతులు లేవు, ఐనా స్పిన్ బౌలింగ్‌లో ఘనాపాటి ఈ బాలుడు -వీడియో లింక్

బ్రిటన్‌కి చెందిన కీరన్ టంగ్-గిబ్స్ కి పుట్టుకతోనే ముంజేతులు లేవు. ఒక చేతికి మోచేయి తర్వాత కొద్ది భాగం ఉండగా, రెండో చేతికి మోచేయి కూడా లేదు. అయినా ఒక చేతికి ఉన్న మోచేయిలో క్రికెట్ బంతిని ఇరికించుకుని ఖచ్చితంగా లైన్ అండ్ లెంగ్త్ ప్రకారం స్పిన్ ని జతచేసి మరి బంతులు విసురుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అవే చేతుల్తో బ్యాటింగ్ చేయగలుగుతూ అంగ వైకల్యాన్ని గేలి చేస్తున్నాడు. బ్రిటన్ దేశానికి ఆడాలని కలలు గంటున్న ఈ…

కుట్రదారులు కావలెను -కార్టూన్

“ప్రపంచీకరణ” ప్రపంచాన్ని కుగ్రామంగా చేసి అందరికీ లాభం సమకూర్చుతుందని చెప్పారు. ఆచరణలో ఏం జరిగింది? పెట్టుబడుల ప్రపంచీకరణ జరిగింది కానీ శ్రమ జీవులకీ, వేతన జీవులకీ అది ఒఠ్ఠి బూటకంగా మిగిలింది. పశ్చిమ దేశాల పెట్టుబడులు, ఎమర్జింగ్ దేశాలతో సహా మూడవ ప్రపంచ దేశాల పెట్టుబడులు ఏకమై మూడో ప్రపంచ ప్రజలనూ, వారి వనరులనూ కొల్లగొడుతున్నాయి. ఈ ఆటలో పశ్చిమ దేశాల బహుళజాతి గుత్త సంస్ధలు మాస్టర్లు కాగా, మూడో ప్రపంచ దేశాల బడా కంపెనీలు వారికి…