అమెరికా ఆర్ధిక వృద్ధి అనుకున్నదానికంటే ఘోరం

అమెరికా ఆర్ధిక వృద్ధిలో తగ్గుదల అనుకున్నదానికంటే ఎక్కువగా ఉందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండవ క్వార్టర్‌లో (ఏప్రిల్ నుండి జూన్ 2011 వరకు) అమెరికా ఆర్ధిక వ్యవస్ధ 1.3 శాతం మాత్రమే వృద్ధి చెందింది. ఇది కూడా వార్షిక రేటు మాత్రమే. క్వార్టరులో చూస్తే 0.35 శాతమే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ రెండో క్వార్టర్ లో వృద్ధి చెందింది. ఇంకా ఘోరం ఏమిటంటే, మొదటి క్వార్టర్ లో (జనవరి నుండి మార్చి 2011 వరకు) అమెరికా…

మీడియా రారాజు రూపర్డ్ మర్డోక్, మీడియాతోనే ఇబ్బందిపడుతున్న వేళ -కార్టూన్

స్టార్ ఛానెళ్ల అధినేత, “న్యూస్ ఆఫ్ ది వరల్డ్”, “ది సన్” లాంటి టాబ్లాయిడ్ పత్రికలతో బ్రిటన్‌లో అత్యధిక సర్క్యులేషన్ సాధించిన మీడీయా రారాజు రూపర్డ్ మర్డోక్ ఇప్పుడు ఆ మీడియాతోనే ఇబ్బందిపడిపోతున్నాడు. పత్రికకు అగ్ర స్ధానం సంపాదించడానికీ, ఆ తర్వాత అగ్ర స్ధానన్ని నిలబెట్టుకోడానికి అనేక అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన రూపర్డ్ మర్డోక్ తాను కూడా అందుకు అతీతుడను కానని అర్ధమై, తన ముఖం ఎలాంటిదో అద్దంలో ప్రతిబింబుస్తుండడంతో అసహనానికి లోనవుతున్నాడు. హత్యకు గురైన బాలిక…

రాజీనామాకి యెడ్యూరప్ప షరతులు, కర్ణాటక బి.జె.పిలో ప్రతిష్టంభన

కర్ణాటక ముఖ్యమంత్రి తనపై లోకాయుక్త నివేదికలో అక్రమ మైనింగ్ కుంభకోణంలో భాగస్వామ్యం వహించిన ఆరోపణలు చేయడంతో హైకమాండ్ ఆదేశాల మేరకు రాజీనామా చేస్తానని యెడ్యూరప్ప అంగీకరించినా, తీరా కేంద్ర పరిశీలకులు వచ్చాక మొండికేశాడు. కొన్ని షరతులు విధించి అవి నెరవేరితేనే రాజీనామా చేస్తానని చెబుతున్నాడు. తన మద్దతుదారులను పెద్ద సంఖ్యంలో తన అధికారిక నివాసం వద్దకు పిలిపించుకుని వారి చేత ఆందోళన చేయిస్తునాడు. యెడ్యూరప్పను కొనసాగనివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనితో కర్ణాటక వచ్చిన కేంద్ర బృందం…

లిబియా తిరుగుబాటు సైన్యాధ్యక్షుడి హత్య, బ్రిటన్‌లో అంతర్మధనం?!

లిబియాలో తిరుగుబాటు ఆరంభం ఐనప్పటి ప్రారంభ దశలోనే తిరుగుబాటుదారుల పక్షం చేరిపోయి వారితో కలిసి గడ్డాఫీ బలగాలపై పోరాటం చేస్తున్న అత్యున్నత మిలట్రీ అధికారి జనరల్ అబ్దుల్ ఫతా యూనెస్, దారుణంగా హత్యకు గురికావడం లిబియాతో పాటు లిబియా తిరుగుబాటుకి మద్దతు తెలిపిన బ్రిటన్, ఫ్రాన్సు దేశాలకు కూడా కలవరపాటుకి గురిచేసింది. ఆయిల్ పట్టణం బ్రెగా వద్ద ఫ్రంట్ లైన్ యుద్ధంలో పాల్గొంటున్న అబ్దుల్ ఫతాను గురువారం తిరుగుబాటుదారుల రాజధాని బెంఘాజికి వెనక్కి పిలిపించిన తర్వాత అక్కడ…

ఇండియా జి.డి.పి వృద్ధి రేటు Vs. ద్రవ్యోల్బణం -కార్టూన్

రెండంకెల జి.డి.పి వృద్ధి రేటు కోసం భారత ప్రభుత్వ ఆర్ధిక విధానాల రూపకర్తలు మన్మోహన్, ప్రణబ్, అహ్లూవాలియా, చిదంబరం తదితరులు కలలు కంటుండగా అధిక స్ధాయిలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం వారి కలలను కల్లలుగా మారుస్తోంది. 9 శాతం జిడిపి వృద్ధి రేటుకి మురిసిపోయే మన పాలకులు ఆహార, ఎనర్జీ ద్రవ్యోల్బణాల వలన దేశ ప్రజానీకం జీవనం దుర్భరంగా మారిందన్న సంగతిని పట్టించుకోరు. ఆర్ధిక గణాంకాలతో ఓ ఊహా ప్రపంచం నిర్మించుకుని సంతుష్టి చెందడమే తప్ప నిజ జీవితంలో…

బళ్లారి ఇనుప ఖనిజ తవ్వకాలతో పర్యావరణ హాని, తవ్వకాలను సస్పెండ్ చేసిన సుప్రీం కోర్టు

ఇనుప ఖనిజాన్ని విచక్షణా రహితంగా తవ్వి తీస్తుండడం వలన పర్యావరణానికి తీవ్ర హాని సంభవిస్తున్నదని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నివేదిక సపర్పించడంతో బళ్లారిలో ఇనుప ఖనిజ తవ్వకాలను సస్పెండ్ చేస్తున్నట్లుగా సుప్రీం కోర్టు ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. “తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకూ బళ్లారిలో ఇనుప ఖనిజం తవ్వకాలను నిలిపివేయాలని ఈ కోర్టు భావిస్తునది” అని ఛీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా నేతృత్వంలోని ప్రత్యేక కోర్టు ప్రకటించింది. దేశంలోని ఉక్కు పరిశ్రమ అవసరాలు తీర్చడానికి…

వరుసగా నాల్గవరోజు నష్టపోయిన భారత షేర్ మార్కెట్లు

భారత షేర్ మార్కెట్లు వరుసగా నాల్గవ రోజు కూడా నష్టపోయాయి. బి.ఎస్.ఇ సెన్సెక్స్ 12.32 పాయింట్లు (0.07 శాతం) నష్టపోయి 18197.20 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 5.75 పాయింట్లు (0.1 శాతం) నష్టపోయి 5482 వద్ద ముగిసింది. ఫండ్లు, మదుపుదారులు రియాల్టీ, మెటల్, ఆయిల్ & గ్యాస్, విద్యుత్ రంగాల షేర్లను అమ్మడంతో షేర్ మార్కెట్లు నష్టాలకు గురయ్యాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ నుండి అందుతున్న బలహీన సంకేతాలు, భారత దేశంలో ద్రవ్యోల్బణ కట్టడికి మరిన్ని…

లోకాయుక్త హెగ్డె క్షమాపణ చెప్పాలి -రెడ్డి బ్రదర్ డిమాండ్

రెడ్డి బ్రదర్స్ లలో ఒకరైన కర్ణాటక రెవిన్యూ మంత్రి కరుణాకర రెడ్డి తనపైన అక్రమ మైనింగ్ ఆరోపణలు చేసినందుకు లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. తనపైన లోకాయుక్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేనందున క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు  ఓబులాపురం మైనింగ్ కంపెనీ డైకెక్టరుగా తాను 2004 లోనే రిటైర్ అయ్యాననీ, ఆ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రికార్డులు కూడా ఉన్నాయనీ కరుణాకర రెడ్డి తెలిపాడు.…

భారత పర్యటనలో పాక్ యువ విదేశాంగ మంత్రి హైనా రబ్బాని -ఫోటోలు

ముంబై టెర్రరిస్టు దాడుల వలన ఇండియా, పాకిస్ధాన్ ల మధ్య మూడేళ్ళ క్రితం నిలిచిపోయిన శాంతి చర్చలు గత కొద్ది నెలలుగా కొంత కదలికలోకి వచ్చాయి. కొద్ది వారాల క్రితం భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు పాకిస్ధాన్ పర్యటించి ఇరు దేశాల విదేశాంగ మంత్రుల చర్చలకు ప్రాతిపదిక తయారు చేసి వచ్చారు. ఆ తర్వాత నిరుపమా రావు నుండి పాక్ ప్రభుత్వం స్ఫూర్తి పొందిందో ఏమో తెలియదు గాని యువ రాజకీయ నాయకురాలు ‘హైనా రబ్బాని…

సొంత ‘లోక్‌పాల్ డ్రాఫ్టు’ ను ఆమోదించిన కేంద్ర కేబినెట్, తిరస్కరించిన అన్నా హజారే బృందం

కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు తయారు చేసిన లోక్ పాల్ డ్రాఫ్టును కేంద్ర ప్రభుత్వ కేబినెట్ గురువారం ఆమోదించింది. అన్నా హజారే నేతృత్వంలో పౌర సమాజ నాయకులు ఉద్యమం చేపట్టిన తర్వాత వారి డిమాండ్ మేరకు లోక్ పాల్ చట్టాని తెస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేసిన కేంద్ర ప్రభుత్వం మూడు నెలల అనంతరం లోక్ పాల్ చట్టం తెచ్చే వైపుగా మొదటి అడుగు వేసింది. అన్నా హజారే బృందం తయారు చేసిన జన్‌లోక్ పాల్ బిల్లులో సూచించిన…

వెంటనే రాజీనామా చేయండి -యెడ్యూరప్పకు బి.జె.పి ఆదేశం

అక్రమ మైనింగ్‌ను అనుమతించి ముడుపులు అంగీకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ఎట్టకేలకు రాజీనామా చేయనున్నాడు. అధికారం చేపట్టినప్పటినుండి నిరంతరం గండాలతో నెట్టుకుంటూ వచ్చిన బి.ఎస్.యెడ్యూరప్ప ముఖ్యమంత్రిత్వం ముగింపుకు వచ్చింది. సి.ఎం నేరుగా అక్రమ మైనింగ్ కుంభకోణంలో భాగం పంచుకున్నాడని లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె నివేదిక స్పష్టం చేయడంతో బి.జె.పి నాయకత్వం యెడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని గురువారం ఆదేశించింది. లోకాయుక్త నివేదిక దృష్ట్యా కర్ణాటకలో నాయకత్వాన్ని మార్చాలని నిర్ణయించి ఆ మేరకు ఆదేశాలు జారీ…

లగడపాటి తెలంగాణని వ్యతిరేకిస్తున్నది ఆస్తుల కోసం కాదట!

తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు, ‘సీమాంధ్రులు కూడా’ కూడా కాదు, దేశ ప్రజలంతా తెలుసుకోవలసిన విలువైన విషయం బెజవాడ ఎం.పి, లాంకో యజమాని, లగడపాటి రాజగోపాల్ గారు బుధవారం తెలియజేశారు. “ఆస్తులు కాపాడుకోవడానికే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. అది కరెక్టు కాదు. నేను తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ని వ్యతిరేకిస్తున్నది నా ఆస్తులను కాపాడుకోవడానికి కాదు. దేశ సమగ్రతను కాపాడడం కోసం” అని సగర్వంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పని చేస్తున్న జవాన్ స్ధాయిలో…

మరొకసారి వెల్లడైన కావూరి సాంబశివరావు దురహంకారం

కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 9, 2009 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు ఏలూరు ఎం.పి. కావూరు సాంబశివరావు గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసో లేదో కానీ ఆ తర్వాత ఆయన చేస్తూ వచ్చిన దురహంకార పూరిత వ్యాఖ్యలు ఆయన ప్రతిష్ట ఎంత నేలబారుదో వెల్లడి చేశాయి. కొద్ది నెలల క్రితం తెలంగాణ లాయర్లు ఆయనకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళినపుడు పోలీసులు సృష్టించిన హడావుడి ఉద్రిక్తతకు దారితీసింది. అప్పుడు కావూరివారు “రెండు కాకపోతే…

అప్పు పరిమితి పెంపుపై ఒప్పందం శూన్యం, టాప్ క్రెడిట్ రేటింగ్ కోల్పోనున్న అమెరికా?

అమెరికా అప్పు పరిమితిని 14.3 ట్రిలియన్ డాలర్లనుండి పెంచడానికి ఒబామాకి, రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి మధ్య ఒప్పందం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆగస్టు 2 లోపు అప్పు పరిమితి పెంచడంపై నిర్ణయం తీసుకోనట్లయితే అమెరికా అప్పు చెల్లించలేని పరిస్ధితి వస్తుందని ట్రేజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ ఇప్పటికె పలుమార్లు హెచ్చరించాడు. దీనితో అమెరికా సావరిన్ అప్పు రేటింగ్ (క్రెడిట్ రేటింగ్) ను, మూడు క్రెడిట్ రేటింగ్ సంస్ధల్లో ఏదో ఒకటి…

లేదు లేదంటూనే ప్రధాని, చిదంబరంలను మళ్ళీ కోర్టులో ప్రస్తావించిన ఎ.రాజా

సోమవారం కోర్టులో తాను ప్రధాని మన్మోహన్, మాజీ అర్ధిక మంత్రి, ప్రస్తుత హోం మంత్రి చిదంబరం లకు వ్యతిరేకంగా ఆరోపణలను చేశాననడం మీడియా సృష్టి అవి చెబుతూ, మీడియాను చేస్తే సరిగా రిపోర్టు చేయమనండి లేదా బైటికి పంపించండి అని మంగళవారం జడ్జిని కోరిన మాజీ టెలికం మంత్రి ఎ.రాజా, మళ్ళీ మన్మోహన్, చిదంబరం ల పేర్లను తన వాదనలో ప్రస్తావించాడు. సోమవారం కంటే ఈ సారి కాసింత నేరుగానే వారిపై ఆరోపణలు సంధించే ప్రయత్నం చేశాడు.…