నానో ఛిప్? సారీ! -ఆర్‌బి‌ఐ

అదిగో పులి అనే వాడు ఒక్కడుంటే, ఇదిగో తోక అని వేల మంది కేకలు వేస్తున్నారు. సోషల్ నెట్ వర్క్ యుగంలో ఇది వేలం వెర్రి అయిపోయింది. ఎవరో ఏదో గొప్ప పని చేసేశారనీ, అదేదో అద్భుతం జరిగిపోతోందనీ, ఇంకేదో జరగరాని ఘొరం జరిగిపోయిందని ఒక బొమ్మ, ఒక చాత్రం (పిట్ట కధ)… ఎవరు పోస్ట్ చేసినా సరే, వెనకా ముందూ చూడకుండా షేర్ చేసెయ్యడం, బైట నలుగురికీ చెప్పి అబ్బురపరిచి తానూ అబ్బురపడిపోవడం…! పొద్దుట్నుంచి ఒకటే…

గెలుపు బాటలో ట్రంప్, మార్కెట్లలో రక్తపాతం!

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డోనాల్డ్ అమెరికా ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలుపు బాటలో దూసుకుపోతున్నాడు. ఎన్నికల ముందు జరిగిన సర్వేలు అన్నింటిలో హిల్లరీ క్లింటన్ పై చేయి సాధిస్తే అసలు ఫలితాల్లో మాత్రం హిల్లరీ ప్రత్యర్థి ట్రంప్ పై చేయి సాధిస్తున్నాడు. ఈ ఫలితాలతో ఆసియా షేర్ మార్కెట్లలో ఊచకోత మొదలయింది. రక్తపాతం జరుగుతోంది. (షేర్ మార్కెట్లు భారీగా కూలిపోతే దాన్ని బ్లడ్ బాత్ గా పశ్చిమ పత్రికలు చెబుతాయి.) కడపటి…

కొత్త రు 500, రు 2000 నోట్లు?

SO, IT IS NOT SO GOOD NEWS! అవినీతి నిర్మూలన కోసం అంటూ మోడి ప్రకటించిన నోట్ల రద్దు చర్య అసలు స్వరూపం ఏమిటో అర్ధం అవుతున్నది. పత్రికలు పెద్దగా చెప్పని విషయం ఏమిటంటే త్వరలో కొత్తగా రు 500 నోటు, రు 2000 నోటు ఆర్‌బి‌ఐ ముద్రించబోతున్నదట. ఆ సంగతి కూడా ప్రధాన మంత్రి గారే చెప్పారా లేక ఎవరు చెప్పారన్నది తెలియడం లేదు. ఇండియా టుడే ఇంటర్నెట్ వర్షన్ అది కూడా మోడియే…

రు 500, రు 1000 నోట్లు రద్దు -ప్రధాని మోడి

ఎన్‌డి‌ఏ/బి‌జే‌పి/నరేంద్ర మోడి ప్రభుత్వం ఒకింత సంచలన నిర్ణయం ప్రకటించింది. రెండు పెద్ద కరెన్సీ నోట్లను ఈ రోజు అర్ధ రాత్రి నుండి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జాతిని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ప్రధాన మంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారని పత్రికలు, ఛానెళ్లు హోరెత్తిస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని చోట్ల నవంబర్ 11 వరకు రు 500/-, రు 1000/- లను అనుమతిస్తారని ఆ తర్వాత అన్ని చోట్లా నిషేధం అమలు అవుతుందని ప్రధాన మంత్రి ప్రకటించినట్లు తెలుస్తున్నది.…

అమెరికా ఎన్నికలు: స్టాక్ మార్కెట్లలో టెన్షన్!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
  45 వ అధ్యక్షుడిని లేదా అధ్యక్షురాలిని ఎన్నుకునేందుకు అమెరికా ఈ రోజు ఉద్యుక్తం అవుతున్నది. ఈ ఆర్టికల్ రాసే సమయానికి 35 మిలియన్ల మంది ఓటు వేశారని, ఇంకా 70 మిలియన్ల ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉన్నదని పత్రికలు చెబుతున్నాయి. 65 శాతం వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్నదని అంచనా వేసినందున మరో 30-35 మిలియన్ల వరకు ఓటర్లు పోలింగ్ బూత్ లకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది.…

అమెరికా ఆయుధ కొనుగోళ్లు రద్దు -ఫిలిప్పైన్స్

  ఇటీవల అధికారం చేపట్టినప్పటి నుండి అమెరికాపైనా అధ్యక్షుడు ఒబామా పైనా బహిరంగానే విరుచుకుపడుతున్న ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టె తాజాగా మరో సారి విరుచుకు పడ్డాడు. ఇప్పటి వరకు దూషణలకు, సవాళ్లకు పరిమితమైన ఆయన ఇప్పుడు ఏకంగా చర్యల లోకి దిగినట్లు కనిపిస్తున్నది.  ఫిలిప్పైన్స్ పోలీసుల వినియోగం కోసం అమెరికా నుండి భారీ మొత్తంలో రైఫిల్స్ కొనటానికి గతంలో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన బెట్టి మరో దేశం నుండి రైఫిల్స్ కొనుగోలు చేస్తామని డ్యుటెర్టె…

మీడియా స్వేచ్ఛపై అశుభకర ప్రతిబంధకం -ద హిందు…

హిందీ టెలివిజన్ చానెల్ ఎన్‌డి‌టి‌వి ఇండియా ను నవంబర్ 9 తేదీన 24 గంటల పాటు ప్రసారం కాకుండా నిలిపివేయాలని నిర్దేశిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశం మీడియా స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించడమే. జాతీయ భద్రత అంశానికి సంబంధించినంతవరకు భిన్నాభిప్రాయాన్ని సహించనట్లు కనిపించే ప్రభుత్వం నుండే ఈ సస్పెన్షన్ ఆదేశం వెలువడడంలో పాత్రికేయ రచనాంశాల పైన నిబంధనలు విధించే వైపుగా మొగ్గు చూపే కలత పూర్వక ధోరణి తొంగి చూస్తున్నది. పఠాన్ కోట్…

న్యాయ వ్యవస్ధ లేకుండా చేస్తారా? -సుప్రీం కోర్టు

సాక్షాత్తు సుప్రీం కోర్టు కొరడా ఝళిపిస్తేనే దిక్కు లేకపోతే సామాన్య ప్రజల విన్నపాలకి దిక్కెవ్వరు? “కర్ణాటక హై కోర్టులో మొత్తం ఒక అంతస్ధు అంతా తాళాలు వేసేశారు. ఎందుకంటే అక్కడ జడ్జిలు లేరు మరి. ఒకప్పుడు జడ్జిలు ఉన్నా కోర్టు రూములు ఖాళీగా లేని పరిస్ధితి ఉండేది. ఇప్పుడు కోర్టు రూములు ఉన్నాయి గాని, జడ్జిలు లేకుండా పోయారు. ఇప్పుడు మీరు కోర్టు రూములు మూసేసి న్యాయానికి తలుపులు వేసేస్తున్నారు” అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ…

స్టేటస్!

గత పది రోజుల నుండి టపాలు లేకపోవడంతో మిత్రులు ఆందోళన తెలియజేస్తున్నారు. రాయడం లేదేమని అడుగుతున్నారు. నేను మళ్ళీ అనారోగ్యం పాలయ్యానేమోనని ఎంక్వైరీ చేస్తున్నారు. చొరవ చేసి అడుగుతున్న వారి వెనుక మరింత మంది పాఠకుల ఆందోళన ఉంటుందని నేను ఊహించగలను. మొదటి విషయం: నేను ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదు. రోజూ ఆఫీస్ కి వెళ్ళి వస్తున్నాను. రెండవది: బ్లాగ్ అప్ డేట్ కాకపోవడానికి కారణం నేను మరొక రాత పనిలో ఉండటమే. ఈ అక్టోబరుతో…

బషర్ ఇంటర్వ్యూ: ఇలాంటి నేత మనకి లేడు! -వీడియో

సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ని ఒక రాక్షసుడిగా చిత్రీకరించడానికి అమెరికా, పశ్చిమ రాజ్యాలు చెప్పని అబద్ధం లేదు; చేయని కృషి లేదు; తిట్టని తిట్టు లేదు. అదంతా ఒట్టి అబద్ధం అని ఈ ఇంటర్వ్యూ చూస్తే అర్ధం అవుతుంది. అంతే కాదు, ఇలాంటి దేశ భక్తియుత నాయకుడు భారత దేశంలోని రాజకీయ పార్టీల్లో ఒక్కరంటే ఒక్కరూ లేరే అని తప్పనిసరిగా అనిపిస్తుంది. సిరియా కిరాయి తిరుగుబాటు క్రమంలో సిరియా అధ్యక్షుడిని నేరుగా చంపేందుకే దాడి జరిగింది.…

నాటోతో తలపడుతున్న టర్కీ ప్రధాని?

  టర్కీలో జులై 15 నాటి మిలట్రీ కుట్రలో పాత్ర పోషించిన వారి పైన లేదా పాత్ర పోషించారని అనుమానించబడుతున్న వారి పైన విరుచుకుపడటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. కుట్రలో పాల్గొన్నారన్న అనుమానంతో 1700 మంది వరకు పోలీసులను కొద్దీ రోజుల క్రితం సస్పెండ్ చేయడమో లేదా డిస్మిస్ చేయడమో చేసిన టర్కీ ప్రధాని రెసిపీ తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా నాటో దేశాలలోని రాయబారులను కూడా టార్గెట్ చేసుకున్నాడు. నాటో సభ్య దేశాలలో మిలట్రీ కూటమి రాయబారులుగా…

సర్జికల్ స్ట్రైక్: దిష్టి బొమ్మదే క్రెడిట్! -కార్టూన్

  “ఛాతీలు గుద్దుకోవద్దని ప్రధాని మోడీ ఆదేశించారు.” వారం పది రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశం నుండి బైటికి వచ్చాక కేబినెట్ మంత్రులు చెప్పిన మాట ఇది.  కానీ అప్పటి నుండి ఛాతీలు గుద్దుకోవడం, భుజాలు చరుచుకోవడం పెరిగిందే గానీ తగ్గలేదు. నిన్నటికి నిన్న రక్షణ మంత్రి మనోహర్ పర్రికర్ తన ఛాతీ తాను గుద్దు  కోవడంలో కొత్త పుంతలు తొక్కారు. ఆయన తెలివిగా తనతో పాటు ప్రధాని మోడీని కూడా కలిపి సర్జికల్ స్ట్రైక్స్…

యెమెన్ లో సౌదీ యుద్ధాన్ని ఆపండి! -ద హిందూ..

[Stop the Saudis war in Yemen సంపాదకీయానికి (అక్టోబర్ 13, 2016) యధాతధ అనువాదం.] *** యెమెన్ లో 18 నెలలుగా సౌదీ అరేబియా సాగిస్తున్న మిలటరీ ఆపరేషన్, జనావాస కేంద్రాలపై దాడులతోనూ, మూకుమ్మడి చావుల తోనూ నిండిపోయింది. ఇటీవలి ప్రమాణాల ప్రకారం చూసినా కూడా సనాలో సంతాపం కోసం జనం చేరిన హాలుపై అక్టోబర్ 8 తేదీన, 140 మంది మరణానికీ 500 కు పైగా గాయపడేందుకూ -వారిలో అనేకమంది పౌరులు- దారి తీసేట్లుగా…

సో మెనీ పు.. -యు‌ఎస్ ఎన్నికలపై లావరోవ్ వ్యాఖ్య (నవ్వుకోండి!)

అమెరికా వార్తా ఛానెల్ సి‌ఎన్‌ఎన్ (కేబుల్ న్యూస్ నెట్ వర్క్) రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్ ని ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో లావరోవ్ ఎంతో సీరియస్ గా చేసిన ఓ వ్యాఖ్యకు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ ప్రశ్న అమెరికా ఎన్నికల ప్రచారానికి సంబంధించినది. ఇంటర్వ్యూ వీడియోను కింద చూడవచ్చు! వీడియో చూసే ముందు పూర్వ రంగం కాస్త తెలుసుకుని ఉండటం అవసరం. రష్యాలో రెండేళ్ల క్రితం ‘పు__ రైట్ మూవ్మెంట్’ పేరుతో…

యెమెన్ పై అమెరికా మిసైల్ దాడి, ఆత్మరక్షణ కోసం(ట)!

  ఎర్ర సముద్రంలో తిష్ట వేసిన మూడు అమెరికా యుద్ధ నౌకలు ఈ రోజు (గురువారం, అక్టోబర్ 13) యెమెన్ పైన క్షిపణి దాడి చేశాయి. యెమెన్ కు చెందిన రాడార్ నిర్వహణ స్ధలాలను లక్ష్యం చేసుకుని అమెరికా మిలట్రీ ఈ దాడులు చేసింది దాడిలో మూడు రాడార్ నిర్వహణ వసతులు ధ్వంసం అయ్యాయని అమెరికా సగర్వంగా చాటింది.  అమెరికా దాడులకు కారణం?  ఆత్మ రక్షణ! యెమెన్ చాలా చిన్న దేశం. అత్యంత పేద దేశం. సహజ…