నోట్ల రద్దు: టాటా, బిర్లాలకు $9 బిలియన్ల క్షవరం!

  నోట్ల రద్దు వల్ల టాటా, బిర్లా, మహేంద్ర.. ఈ మూడు బడా పారిశ్రామిక గ్రూపులకు 9 బిలియన్ డాలర్లు క్షవరం అయిపొయింది. ఈ క్షవరం నల్ల ధనం రద్దు కావడం వల్ల జరిగిన నష్టం కాదు. నోట్ల రద్దు దరిమిలా జీడీపీ పడిపోతుందనీ, అమ్మకాలు తగ్గిపోతాయనీ… ఇత్యాది భయాలతో షేర్ హోల్డర్లు ఆ కంపెనీల లోని షేర్లను అమ్మేయటం వలన సంభవించిన నష్టం. ప్రధాన మంత్రి మోడీ డీమానిటైజేషన్ ప్రకటించిన దగ్గరినుండి షేర్ల సూచి సెన్సెక్స్…

సర్జికల్ స్ట్రైక్: దిష్టి బొమ్మదే క్రెడిట్! -కార్టూన్

  “ఛాతీలు గుద్దుకోవద్దని ప్రధాని మోడీ ఆదేశించారు.” వారం పది రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశం నుండి బైటికి వచ్చాక కేబినెట్ మంత్రులు చెప్పిన మాట ఇది.  కానీ అప్పటి నుండి ఛాతీలు గుద్దుకోవడం, భుజాలు చరుచుకోవడం పెరిగిందే గానీ తగ్గలేదు. నిన్నటికి నిన్న రక్షణ మంత్రి మనోహర్ పర్రికర్ తన ఛాతీ తాను గుద్దు  కోవడంలో కొత్త పుంతలు తొక్కారు. ఆయన తెలివిగా తనతో పాటు ప్రధాని మోడీని కూడా కలిపి సర్జికల్ స్ట్రైక్స్…