పాక్‌పై అమెరికా దాడి చేస్తే ఆఫ్ఘనిస్ధాన్ పాక్ పక్షమే నిలుస్తుంది -ఆఫ్ఘన్ అధ్యక్షుడు

“పరిస్ధితులు అనుకూలించక అమెరికా పాకిస్ధాన్ పైన దాడి చేసినట్లయితే, దైవం నివారించుగాక, ఆఫ్ఘనిస్ధాన్ నిస్సందేహంగా పాకిస్ధాన్ కే మద్దతుగా నిలుస్తుంది” అని ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ వ్యాఖ్యానించాడు. అమెరికా, పాక్ పై దాడి చేయడం ప్రస్తుత పరిస్ధితుల్లొ పూర్తిగా అసంగతం అయినప్పటికీ మాటమాత్రంగానైనా ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు పొరుగు దేశం పక్షానే నిలుస్తానని చెప్పడం సంతోషించ దగిన విషయం. కనీసం మాటల్లోనైనా ఆఫ్ఘన్ అధ్యక్షుడు పొరుగు దేశం పక్షాన నిలిచాడు. నిజానికి ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాల మధ్య…

సరిహద్దులో భారత్ హెలికాప్టర్ ను బలవంతంగా దింపిన పాకిస్ధాన్ ఫైటర్ జెట్లు

భారత హెలికాప్టర్ ఒకటి పాకిస్ధాన్ గగనతలంలోకి చొరబడడంతో పాకిస్ధాన్ మిలట్రీకి చెందిన ఫైటర్ జెట్ విమానాలు దానిని బలవంతంగా కిందికి దింపాయి. హెలికాప్టర్ లో నలుగుతు భారత్ మిలట్రీ అధికారులు ఉన్నారు. పాకిస్ధాన్ గగనతలంలోకి జరిగిన చొరబాటు ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదనీ, దట్టంగా మంచు కమ్మడంతో జరిగిందనీ భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు. నలుగురు అధికారులు ప్రస్తుతం పాకిస్ధాన్ కస్టడీలో ఉన్నారు. నలుగురు క్షేమంగా ఉన్నారని పాకిస్ధాన్ అధికారులు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట…

నరేంద్ర మోడిపై ఛార్జి షీటు దాఖలుకు పుష్కల అవకాశాలు

గుజరాత్ మారణకాండలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎం.పి జాకియా జాఫ్రి కేసులో నిజా నిజాలను వెల్లడించడానికి సుప్రీం కోర్టు నియమించుకున్న అమికస్ క్యూరీ ‘రాజు రామచంద్రన్’ నివేదిక పుణ్యమాని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిపైన ఛార్జి షీటు దాఖలు చేసి విచారించడానికి అవకాశాలు పెరిగాయి. అమికస్ క్యూరి నివేదికలో పొందుపరిచిన వివరాల ఆధారంగా 2002లో జరిగిన ముస్లింల మారణకాండకు బాధ్యుడిగా నరేంద్రమోడిపైన ఛార్జిషీటు దాఖలు చేయడం కోసం తగిన పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. నివేదిక ఇంకా రహస్యంగా ఉన్నప్పటికీ…

ఇప్పుడిక ప్రజలపై బాదుడే ప్రణాళికల లక్ష్యం

చైనాలో మావో సేటుంగ్ ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు భారత ప్రధాని నెహ్రూ భారత్ కి కూడా ఉపయోగపడతాయని భావించాడు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో అవి పకడ్బందీగా అమలు జరిగాయి. ఆ మేరకు చైనా ప్రజలు అమితంగా లాభపడ్డారు. ఆర్ధిక వ్యవస్ధను ప్రవేటు పెట్టుబడిదారుల ఇష్టారాజ్యానికి వదిలేయకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంచుకుంటూ ఏ కాలానికి ఏ రంగంలో ఎంత ఉత్పత్తిని సాధించాలి అన్న విషయాలను ప్రభుత్వమే నిర్ణయించే వ్యవస్ధను ప్రణాళికాబద్ధ ఆర్ధిక వ్యవస్ధగా చెప్పుకుంటున్నాం. భారత దేశం…

ప్రేమ దక్కవలసిందెప్పుడు? దక్కుతున్నదెప్పుడు?

ఈ కవిత ఫేస్ బుక్ నుండి సంగ్రహించాను. రచయిత ఎవరో తెలియదు. చక్కగా రాశారు. అంకితా రెడ్డి అన్న ఫేస్ బుక్ ఎకౌంట్ లో దీనిని చూశాను. ఈ కవిత క్రెడిట్ అంతా ఆ అజ్ఞాత రచయిత/త్రి కే చెందుతుంది. – — —

ప్రపంచం తుమ్మితే, ఇండియాకు జలుబు చేయక తప్పదు -ప్రణబ్ ముఖర్జీ

రష్యా, చైనాల్లో వర్షం పడితే ఇండియా కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడతారని గతంలో భారత దేశ పాలకవర్గాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీవారు జోకుతూ ఉండేవారు. అప్పుడు కమ్యూనిస్టులు గొడుగు పట్టారో లేదో తెలియదు కాని ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రి స్వయంగా ఒక అనివార్యమైన సత్యాన్ని అంగీకరించాడు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తుమ్మితే గనక భారత దేశ ఆర్ధిక వ్యవస్ధకు జలుబు చేయడం ఖాయమని ఆయన జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.ఎ)…

231 మంది పార్లమెంటు సభ్యత్వం సస్పెండ్ చేసిన పాకిస్ధాన్ ఎలక్షన్ కమిషన్

ఎన్నికల సంస్కరణల గురించి భారత దేశ నాయకులు ఇంకా మాట్లాడడం ప్రారంభమే కాలేదు. పాకిస్ధాన్ మాత్రం ఆ విషయంలో ఓ పెద్ద ముందడుగు వేసింది. తమ ఆస్తులను నిర్ణీత వ్యవధిలోగా ప్రకటించనందుకు గాను ఏకంగా 231 మంది చట్ట సభల సభ్యుల సభ్యత్వాన్ని పాకిస్ధాన్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఎన్నికల సంస్కరణలపై కూడా తాను పోరాడుతానని అన్నా హజారే గతంలో ప్రకటించాడు. ఆయన ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. కేవలం ప్రకటన చేసినందుకే రాజకీయ నాయకులు…

గడ్డాఫీ మరణంపై పలు అనుమానాలు, అంతర్జాతీయ న్యాయస్ధానం విచారణ

గడ్డాఫీ మరణం చుట్టూ పలు అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో అతని విగత శరీరానికి అంతిమ సంస్కారాలు ఆలస్యం అవుతున్నాయి. సజీవుడిగా పట్టుకున్న ముమ్మర్ గడ్డాఫీ ఎలా చనిపోయాడన్న అంశంపై పలు కధనాలు ప్రచారంలోకి వచ్చాయి. గడ్డాఫీని పట్టుకున్న అనంతరం ఒక ట్రక్కులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా గడ్డాఫీ మద్దతుదారులకూ, గడ్డాఫీని ఆసుపత్రికి తీసుకెళ్తున్న తిరుగుబాటుదారులకూ మధ్య కాల్పులు జరిగాయనీ, ఈ కాల్పుల్లో గడ్డాఫీ తలకు బులెట్ గాయం కావడంతో ఆసుపత్రికి వెళ్ళేలోపు చనిపోయాడనీ తాత్కాలిక ప్రభుత్వం ప్రధానంగా చెబుతోంది.…

గడ్డాఫీని ఎలా చంపేశారు?

ది గార్డియన్ పత్రిక గడ్డాఫీ మరణంపై కొంత సమాచారాన్ని అందించింది. గడ్డాఫీని పట్టుకున్నపుడు ఆయన సజీవంగా ఉన్న వీడియోను ప్రచురించింది. అందులో గడ్డాఫిని పట్టుకుని ట్రక్కులోకి మారుస్తున్న దృశ్యం ఉంది. గడ్డాఫీ బాగా తెలివిగానే ఉన్నట్లుగా ఆ వీడియో ద్వారా స్పష్టం అవుతోంది. ట్రక్కులోకి మారుస్తుండగా ‘అతన్ని సజీవంగా ఉంచండి’ అని ఒకరు అరిచారని గార్డియన్ తెలిపింది. తదనంతరం రక్తపు మడుగులో ఉన్న గడ్డాఫీ ఫొటో అన్ని వార్తా సంస్ధలూ ప్రచురించాయి. ఈ మధ్యలోనే గడ్డాఫీ తలలో…

పట్టుకున్నపుడు బతికే ఉన్న గడ్డాఫీ -ఫొటోలు

గడ్డాఫీ డ్రైనేజి పైపులో దాగి ఉన్నాడనీ, చివరి క్షణాల్లో ‘నన్ను కాల్చొద్దంటూ’ అరిచాడనీ, లిబియా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు పెద్ద ఎత్తున వార్తలు రాస్తున్నాయి. నలుగురైదుగురు చేతులు పైకిత్తి నవ్వుతున్న ఫొటోలు ప్రచురించి లిబియా అంతా సంబరాలు జరుపుకుంటున్నారని చెబుతున్నాయి. నాలుగు శవాలు పడిఉన్న డ్రైనేజి పైపులను చూపించి గడ్డాఫీ దాక్కున్నది ఇక్కడేనని చూపిస్తున్నాయి. ఇవన్నీ పచ్చి అబద్ధాలని అవి ప్రారంభంలో ప్రచురించిన వార్తలే చెబుతున్నాయి. గడ్డాఫీ పట్టుబడ్డాడని మొదట వార్తలు…

నాటో బాంబు దాడిలో గడ్డాఫీ మరణం -ఫొటో

గడ్డాఫీ చనిపోయింది లిబియా తిరుగుబాటు సైన్యాల చేతుల్లో కాదు. జన్మ పట్టణం సిర్టే నుండి వాహనాల కాన్వాయ్ లో కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీ వెళుతుండగా నాటో బలగాలు అతని వాహనాలపై బాంబు దాడులు చేశాయి. రెండు కాళ్ళు, తలకు బలమైన గాయాలు కావడంతో అతని గాయాలతోనే చనిపోయాడు. గడ్డాఫీ విగత శరీరాన్ని మిస్రాటా నగరానికి తెచ్చినట్లుగా రాయిటర్స్ ప్రకటించింది. గడ్డాఫీ మృత శరీరం ఫోటోను యూట్యూబ్ లో ఉంచబడింది. – —

లిబియా అధ్యక్షుడు గడ్డాఫీని పట్టుకుని చంపేసిన నాటో బలగాలు?

లిబియా అధ్యక్షుడు మౌమ్మర్ గడ్డాఫీని అతని సొంత పట్టణం సిర్టే లోనే పట్టుకుని చంపినట్లుగా ఆల్ జజీరా టివి ఛానెల్ ప్రకటించింది. బిబిసి, రాయిటర్స్ తదితర ఛానెళ్ళు గడ్డాఫీని పట్టుబడ్డాడని చెబుతున్నప్పటికీ చంపేసిన సంగతిని ధ్రృవీకరించడం లేదు. ‘కాల్చొద్దు, కాల్చొద్దు’ అని గడ్డాఫీ కేకలు వేసినట్లుగా పశ్చిమ దేశాల వార్తా ఛానెళ్ళు అప్పుడే దుష్ప్రచారం మొదలుపెట్టాయి. గడ్డాఫీ గాయపడ్డాడని కొందరు చెబుతుండగా అతన్ని చంపేశారని మరికొందరు చెబుతున్నారని బిబిసి తెలిపింది. “అతను పట్టుబడ్డాడు. అతని రెండు కాళ్ళకూ…

పెద్ద దొంగను పట్టిస్తే జరిగేదేమిటి? -కార్టూన్

సౌదీ అరేబియాలో, అది కూడా రాజధాని రియాధ్ లోనే దరిద్రం ఎలా తాండవిస్తున్నదీ తెలియజెస్తూ ఫెరాస్ బగ్నా అనే యువకుడు ఒక చిన్న వీడియో తీసి దానిని ఇంటర్నెట్ లో పోస్ట్ చేసాడు. ఆ వీడియో చూసిన ధనవంతులు తమకు తోచిన మొత్తాన్ని దానం చేసి దరిద్రులకు అండగా నిలుస్తారని అతను భావించాడు. కాని అతనికి తెలియని మరొక విషయం కూడా వీడియో ద్వారా వెల్లడయింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న సౌదీ అరేబియా ప్రజలు, అందునా…

అమెరికా వ్యాపార రహస్యాలు అమ్ముతూ పట్టుబడిన చైనీయుడు

అమెరికాలో స్ధిర నివాసం ఏర్పరచుకున్న చైనా శాస్త్రవేత్త ఒకరు అమెరికా వ్యాపార రహస్యాలను చైనాకు అమ్మడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయాడు. ‘డౌ ఆగ్రో సైన్సెస్’ కంపెనీలో పరిశోధనా శాస్త్రవేత్తగా పని చేస్తూ వ్యాపార రహస్యాలను అందజేసాననీ, కార్గిల్ కంపెనీలో పని చేస్తుండగా వ్యాపార రహస్యాలను దొంగిలించానని సదరు శాస్త్రవేత్త ‘కీక్సూ హువాంగ్’ అంగీకరించాడని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్’ (డి.ఒ.జె) డాక్యుమెంట్ల ద్వారా వెల్లడయ్యింది. గత ఆగస్టులోనే ఇదే విధంగా ‘జున్ వాంగ్’ అనే చైనీయుడు అత్యున్నత సామర్ధ్యంగల న్యూక్లియర్…

“వెయ్యి మందికి ఒకరు, ఒకరికి వెయ్యి మంది” -కార్టూన్

మూడు రోజుల క్రితం పాలస్తీనా పోరాట సంస్ధ హమాస్, ఇజ్రాయెల్ ప్రభుత్వం మధ్య ఖైదీల మార్పిడి జరిగింది. హమాస్ తమ బందీగా ఉన్న ఒకే ఒక్క ఇజ్రాయెల్ సైనికుడు (గిలాద్ షాలిత్) ను వదిలిపెట్టగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం దశాబ్దాల తరబడి విచారణ లేకుండా తాను ఖైదు చేసి ఉంచిన 1027 మంది పాలస్తీనీయులను విడుదల చేయవలసి వచ్చింది. ఈ మార్పిడి కోసం గత ఐదు సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. అసలు మార్పిడి జరగదని కూడా అనుకున్నా, ఇజ్రాయెల్…