తల్లి హృదయం -హృద్యమైన ఫొటో
– –
– –
ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధించాలంటూ యూరోపియన్ యూనియన్ పిలుపు ఇవ్వడాన్ని రష్యా తిరస్కరించింది. ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధించడం తమకు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. బుధవారం బ్రిటన్ విదేశాంగ మంత్రి విలియం హేగ్, ఇరాన్ పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశాడు. 2003లో అణ్వాయుధాలు నిర్మించడానికి ఇరాన్ ప్రయత్నించినట్లుగా ఐ.ఎ.ఇ.ఎ ఇటీవల తన నివేదికలో పేర్కొనడాన్ని చూపిస్తూ విలియం హేగ్, ఈ డిమాండ్ చేశాడు. రష్యా తిరస్కరణతో ఇరాన్ పై ఆంక్షలు…
ఇటలీలో రాజకీయ, ఆర్ధిక సంక్షోభం చేయిదాటి పోతోంది. దాని ఫలితంగా యూరోపియన్ యూనియన్, ఒక యూనియన్ గా నిలబడలేక పోవచ్చన్న భయాలు ఏర్పడుతున్నాయి. యూరప్ లో మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ ఇటలీ సావరిన్ బాండ్లపైన వడ్డీ డిమాండ్ ఏడు శాతాన్ని మించి పలుకుతుండడంతో ఇటలీ రుణ సేకరణ అసాధ్యంగా మారుతోంది. దానితో ఇటలీకి రుణ సేకరణ కష్టంగా మారి ఇ.యు రక్షణ నిధి నుండి బెయిలౌట్ ఇవ్వవలసి ఉంటుందన్న భయాలు వ్యాపిస్తున్నాయి. పెద్ద ఆర్ధిక…
పాకిస్ధాన్ మొదటిసారిగా కసబ్ ను టెర్రరిస్టు అని పేర్కొంది. “కసబ్ ఒక టెర్రరిస్టు. అతను ప్రభుత్వేతర వ్యక్తి. అతనిని ఉరి తీయాలి” అని పాకిస్ధాన్ అంతర్గత (హోం) శాఖా మంత్రి రెహ్మాన్ మాలిక్ అన్నాడు. మాల్దీవుల లో జరుగుతున్న సార్క్ సమావేశాల సందర్భంగా హాజరైన రెహ్మాన్ మాలిక్ అక్కడ భారత విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్ధాన్ నుండి త్వరలో జ్యుడీషియల్ కమిషన్ ఇండియా సందర్శించనున్నదనీ, ఆ సందర్శన ముంబై టెర్రరిస్టు దాడులపైన పాక్ లో…
కార్పొరేట్ కంపెనీలన్నీ బెయిలౌట్లు మెక్కినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడానికి సుతరామూ ఇస్టపడడం లేదు. ఆర్ధిక వ్యవస్ధలో ప్రభుత్వ జోక్యాన్ని విమర్శించే కార్పొరేట్లు ఆ ప్రభుత్వం ఇచ్చిన బెయిలౌట్లు తేరగా మెక్కి బ్రేవ్ మని త్రేన్చి తిరిగి ఉద్యోగాల రూపంలో చెల్లించడానికి నిరాకరిస్తున్నాయి. ఫలితంగా ఆర్ధిక సంక్షోభం నుండి అమెరికా సాధించిన రికవరీ ‘జాబ్ లెస్ రికవరీ’ గా చరిత్రలో మొదటిసారి చరిత్ర పుటలకు ఎక్కనుంది. – –
‘మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్’ సంస్ధ భారత దేశ బ్యాంకింగ్ వ్యవస్ధ రేటింగ్ తగ్గించింది. ‘స్ధిరం’ (స్టేబుల్) నుండి ‘ప్రతికూలం’ (నెగిటివ్) రేటింగ్ కు తగ్గించింది. భారత దేశ ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం, ఆస్తుల క్వాలిటీ విదేశాల్లో దెబ్బతినడం, బ్యాంకుల పెట్టుబడీకరణ, లాభదాయకత దెబ్బతినడం రేటింగ్ తగ్గించడానికి కారణాలుగా మూడీస్ పేర్కొంది. ఆర్ధిక వృద్ధి అంచనా తగ్గించుకోవడం, ప్రభుత్వం అధికంగా అప్పులు తెచ్చుకోవడం వల్ల ప్రవేట్ క్రెడిట్ మార్కెట్ లో నిధుల లభ్యతను తగ్గించివేస్తుందనీ దానివల్ల ప్రవేట్ అప్పు…
గోధ్రా లో రైలు దహనకాండ అనంతరం, నరేంద్ర మోడి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం ప్రజలపై జరిగిన దారుణ హత్యాకాండపై జరుగుతున్న అనేక కేసుల విచారణలో మొదటిసారిగా నేర నిర్ధారణ జరిగింది. సర్దార్ పురా హత్యకాండకుగాను 31 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. శిక్షలు ఇంకా ఖరారు కావలసి ఉంది. హత్యాకాండపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ విచారణ జరిగిన కేసులో కోర్టులో నేర నిర్ధారణ జరగడం…
ఫ్యూడల్ రాజుల కాలం పోయి, ‘ప్రజాస్వామ్య’ రాజుల కాలం వచ్చింది. ఇద్దరూ రాజులే కనుక రోం నగరం తగలబడుతున్నపుడు ఇద్దరూ ఫిడేలే వాయిస్తున్నారు. ప్రజల పట్లా, వారి సమస్యల పట్లా అప్పటి రాజు దృక్పధం ఎలా ఉన్నదో, ఇప్పటి రాజుల దృక్పధం కూడా అలానే ఏడుస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ ధనికులు, వ్యాపారులు, వాణిజ్యవేత్తలకే రాజు వద్ద అగ్ర స్ధానం. వారికోసమే రాజ్యాలూ, రాజ్యపాలనానూ. అప్పటికీ, ఇప్పటికీ ఆకలి, దరిద్రం, కరువూ అన్నీ ప్రజల సొత్తే. ఇటలీ విషయంలో…
ఎడ తెగని గ్రీసు రుణ సంక్షోభం యూరపియన్ యూనియన్ ఓడను ముంచేస్తోంది. గ్రీసు కోసం ఇ.యు నాయకులు రక్షణ నిధి ని ప్రకటించినప్పటికీ అది గ్రీసు ను కాపాడుతుందన్న నమ్మకం కలగడం లేదు. ఈ లోపు ఇటలీ కూడా రుణ సంక్షోభంలో దూకడానికి సిద్ధంగా ఉంది. రుణ సంక్షోభం యూరప్ దేశాల ప్రభుత్వాలను కూలుస్తోంది. ఇటలీలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. గ్రీసు ప్రధాని రాజీనామాకి రంగం సిద్ధమైంది. ఎన్నికలూ జరగనున్నాయి. ఇటలీ ప్రధాని…
ఈ ఫొటోలను ‘ది హిందూ’ ప్రచురించింది.
హిందువుల పుణ్య క్షేత్రం హరిద్వార్ లో ‘ఆచార్య పండిట్ శ్రీరాం శర్మ’ గారి వందవ పుట్టినరోజు సందర్భంగా జరిగిన మత కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 14 మంది స్త్రీలు, ఇద్దరు పురుషులు దుర్మరణం చెందారు. గంగా నదిపై గల ప్రఖ్యాతి చెందిన ‘హర్ కి పురి’ ఘాట్ వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో మరో ముప్ఫై మంది గాయపడ్డట్లుగా జిలా కలెక్టర్ తెలిపాడు. చనిపోయినవారు ఎక్కువమంతి వయసు మళ్ళినవారేనని ఎస్.పి తెలిపాడు. కొన్ని పదుల వేలమంది హాజరైన…
“పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించకపోతే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాం” అని బెదిరించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, చివరికి తన బెదిరింపులు నిజమైనవి కావని తేల్చేసింది. మంగళవారం ప్రధానితో సమావేశమైన తృణమూల్ కాంగ్రెస్ ఎం.పి లు ప్రధాని నుండి తమకు ఏ విధమైన హామీ రాలేదని చెప్పారు. “(ఇప్పుడు పెంచితే పెంచారు), ఇకముందు పెంచకూడదు” అని హెచ్చరించి వచ్చాం” అని కూడా వారు పత్రికలకు చెప్పి చక్కా పోయారు. ‘లేస్తే మనిషిని కాను’ టైపు ప్రకటనలతో ప్రజల్నీ,…
తన మమ్మీ దృష్టిని ఆకర్షించడానికి ఈ బుడతడు చేస్తున్న విన్యాసాలు చూడండి. – –
పెట్రోలు ధరలు ఈ సంవత్సరం ఇప్పటికి ఐదు దార్లు పెంచారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పదకొండు సార్లు పెంచారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపుపై గతంలో ఎన్నడూ నోరు విప్పని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కొద్ది రోజుల క్రితం రు1.80 లు పెంచితే గయ్యిమని లేచింది. పెంచిన రేట్లు తగ్గిస్తారా లేక కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించమంటారా? అంటూ తాఖీదు పంపింది. పెట్రోల్ ధరలు తగ్గించకపోతే మద్దతు ఉపసంహరిస్తామని తన ఎం.పిలు (తనకు తెలియకుండా)…
తాను అనుకున్న బొమ్మని చాలా వేగంగా ఈ గీసేస్తున్నాడు, ఈ బాలుడు. చూడ్డానికి వీధి బాలుడిలా కనిపిస్తున్నాడు. ఇతన్ని ఎవరైనా చేరదీసి శిక్షణ ఇవ్వగలిగితే, లేదా ఇప్పిస్తే తన ప్రతిభను ఇంకా ఉన్నత స్ధాయిలో రుజువు చేసుకోగలడేమో. ఫేస్ బుక్ పేజి లో ఈ వీడియో లభ్యమయ్యింది.