‘తెలంగాణ’ ఏర్పాటుపై ఇంత ద్వేషం అవసరమా?

ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుపైన ఇంత నటన, రాజకీయం, ఎగతాళి, విద్వేషం అవసరమా? తెలంగాణ ప్రాంతం వాళ్ళు భారత దేశం నుండి విడిపోతామని కోరుతున్నారా? కేంద్ర ప్రభుత్వ అధికారం తమపై వద్దని నిరాకరిస్తున్నారా? తెలంగాణకు స్వయం ప్రతిపత్తి కావాలని అడుగుతున్నారా? పాకిస్ధానీ ఐ.ఎస్.ఐ కి గూఢచారుల్ని సరఫరా చేస్తున్నారా లేక చైనా ఇంటెలిజెన్స్ కు సమాచారం ఇస్తున్నారా? తెలంగాణ రాష్ట్రం అడుగుతున్నారా వాళ్ళు, లేక తెలంగాణ దేశం అడుగుతున్నారా? కేవలం రాష్ట్రం మాత్రమే తెలంగాణ ప్రజలు అడుగుతున్నది.…

పాపం అంతా యూరోజోన్‌దే -నిరుద్యోగం పై బ్రిటన్ ప్రభుత్వం

కన్సర్వేటివ్ ల నాయకత్వంలోని కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రిటన్ ప్రభుత్వం బ్రిటన్ నిరుద్యోగం పాపం అంతా యూరోజోన్ సంక్షోభందేనని చేతులు దులుపుకుంది. బ్రిటన్ లో నిరుద్యోగం పెరగడానికి దేశీయంగా ప్రభుత్వ రంగం, ప్రవేటు రంగం, ఛారిటి రంగాల నిర్వాకాలే కారణమని సి.ఐ.పి.డి నివేదిక చెబుతుండగా ట్రెజరీ కి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న మార్క్ హోబన్ మాత్రం పాపం అంతా యూరోజోన్ సంక్షోభంపైకి నెట్టేసి దులుపుకున్నాడు. యూరప్ లో 27 దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ గా ఏర్పడ్డాయి.…

బ్రిటన్ లో దారుణ స్ధితికి చేరుకున్న నిరుద్యోగం

యూరప్ రుణ సంక్షోభం బ్రిటన్ పైన దారుణంగా ప్రభావం చూపుతోంది. ఉపాధి అవకాశాలు అక్కడ పూర్తిగా పడిపోయాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి. పబ్లిక్, ప్రవేటు రెండు రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. పొదుపు ఆర్ధిక విధానాల పేరుతో ప్రభుత్వరంగాన్ని ప్రవేటుపరం చేస్తుండడంతో ప్రభుత్వరంగంలో ఉపాధి అవకాశాలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. కంపెనీలు ఉద్యోగులను నియమించే ఆలోచనే పెట్టుకోవడం లేదు. ఒకరిద్దరూ ఎవరైనా నియామకాలకు పూనుకున్నా, యూరప్ లోని తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలను రద్దు చేసుకుంటున్నారు. పైగా…

చంద్రబాబునాయుడు ఆస్తులపై సి.బి.ఐ విచారణకు హైకోర్టు ఆదేశం

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విసిరిన పాచిక తాత్కాలికంగానైనా పని చేసినట్లు కనిపిస్తోంది. దాదాపు రెండు వేల పేజీల సాక్ష్యాలతో మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల సంపాదించాడంటూ జగన్ తల్లి వై.విజయమ్మ ద్వారా వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు డివిజన్ బెంచి పిటిషనర్ల కోరిక మేరకు సి.బి.ఐని రంగంలోకి దించింది. వై.విజయమ్మ ఆరోపించినట్లుగా మాజీ ముఖ్యమంత్రి తన అధికారాన్ని ఉపయోగించుకుని, రామోజీరావును ముందుంచి అక్రమ ఆస్తులను సంపాదించిందీ లేనిదీ విచారించవలసిందిగా హైకోర్టు బెంచి సి.బి.ఐని ఆదేశించింది.…

జమ్ము& కాశ్మీర్ లో సైనిక చట్టం ఉపసంహరణకు ప్రధాని, సి.ఎం సమావేశం

జమ్ము&కాశ్మీరు రాష్ట్రంలో ప్రజల పాలిట మృత్యుపాశంగా మారిన “సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ – ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ)” ను కొన్ని జిల్లాలలో ఉపసంహరించుకునే విషయమై చర్చించడానికి సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధానితో సమావేశం అయ్యాడు. గత కొన్ని వారాలుగా ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టాన్ని భద్రతా పరిస్ధితులు మెరుగుపడిన జిల్లాలలో ఉపసంహరించాలని జమ్ము&కాశ్మీరు ముఖ్యమంత్రి వాదిస్తూ వచ్చాడు. సి.ఎం వాదనను సైనిక దళాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భద్రత రిత్యా చట్టం ఉపసంహరణ…

త్వరలో ఎలక్త్రానిక్ దిగుమతులు ఆయిల్ దిగుమతుల్ని మించిపోతాయ్ -పిట్రోడా

దేశీయంగా ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిపైన దృష్టి పెట్టకపోతే త్వరలో ఎలక్ట్రానిక్స్ దిగుమతుల బిల్లు, ఆయిల్ దిగుమతుల బిల్లుని మించిపోవడం ఖాయమని భారత ప్రభుత్వ ఐ.టి సలహాదారు శ్యాం పిట్రోడా హెచ్చరించారు. ఎలక్ట్రానికిక్ మాన్యుఫాక్చరింగ్ లో పునాదిని విస్తృతపరుచుకోవడం కోసం ఆ రంగంలో పెట్టుబడులు పెంచాలని పిట్రోడా తెలిపాడు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ బాగా పెరుగుతున్నదని కాని ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ పై దృష్టి పెట్టకపోవడంతో ఆ డిమాండ్ తట్టుకోవడానికి దిగుమతులపై…

మాజీ రాష్ట్రపతి ‘కలాం’ వళ్ళంతా వెతికిన తెల్లతోలు దురహంకారులు

అమెరికా దురహంకారం మరో రెండు సార్లు భారతీయ గౌరవాన్ని తిరస్కరించింది. భారత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా తన దురహంకారం తగ్గించుకునేదే లేదో పొమ్మంది. అంతర్జాతీయ ప్రొటోకాల్ తన ముందు దిగదుడుపేనని చాటి చెప్పింది. భారత నాయకులు, ప్రభుత్వాధికారుల దేశాభిమానానికి మరోసారి ‘నిరూపించుకొమ్మని’ సవాలు విసిరింది. సెప్టెబరు నెలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అమెరికా వెళ్ళిన సందర్భంగా న్యూయార్క్ నగరంలోని ‘జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం’ లో రెండుసార్లు ప్రొటోకాల్ ను ఉల్లంఘిస్తూ ఆయనను ఒళ్ళంతా తడిమి…

నవంబరు 16 నుండి పెట్రోల్ ధర తగ్గుతుందట!!!

అవును. అనుమానం లేదు. మీరు చదివింది నిజమే. పెట్రోల్ ధరలు నవంబరు 16 తేదీ నుండి తగ్గించడానికి ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు రాయిటర్స్ సంస్ధ ఓ వార్త ప్రచురించింది. తగ్గించడం అంటూ జరిగితే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా తగ్గించినట్లు అవుతుంది. అంతేకాక, పెట్రోల్ రేట్లపై నియంత్రణ ఎత్తేసిన 18 నెలల తర్వాత మొదటిసారిగా తగ్గించినట్లు అవుతుంది. నియంత్రణ ఎత్తివేసేటప్పుడు ఏం చెప్పారంటే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగినప్పుడు దేశీయంగా పెట్రోల్…

డజను భారత సరుకుల దిగుమతులపై నిబంధనలు ఎత్తివేసిన పాకిస్ధాన్

త్వరలో భారత్ కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదా ఇవ్వడానికి వీలుగా ప్రక్రియ ప్రారంభించడానికి అనుమతినిస్తూ పాకిస్ధాన్ కేబినెట్ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే పాక్ ప్రభుత్వం, భారత్ నుండి వచ్చే 12 రకాల సరుకుల దిగుమతులపై నిబంధనలు ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా భారత్ తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం మాటల వరకే కాదని నిరూపించుకుంది. పాకిస్ధాన్ శనివారం ఈ విషయం తెలిపింది. పాకిస్ధాన్ లో ‘ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ’ (ఇసిసి),…

‘ఆకుపై వాల్ స్ట్రీట్’ ఆందోళనా శిబిరాల్లో హత్యలు, ఆత్మహత్యలు

‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమాల నిమిత్తం వివిధ నగరాల కూడళ్ళలో ఆందోళనకారులు గుడారాలు వేసుకుని రాత్రింబవళ్ళూ అక్కడే గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ శిబిరాల్లో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు ఇపుడు సమస్యగా మారాయి. ఈ చావులు అటు నిరసనకారులకూ, ఇటు పోలీసులకు కూడా సమస్యలుగా మారాయి. ఆకుపై వాల్ స్ట్రీట్, ఆకుపై ఓక్లాండ్ లాంటి నగరాల్లో నిరసన కారులు వేసుకున్న శిబిరాల్లో ఒకరు తెలియని కారణాల వల్ల చనిపోగా, మరొకరు తనను తాను కాల్చుకుని చనిపోయారు. మరో ఇద్దరు…

ఆపరేషన్ ‘ఇటలీ’ -కార్టూన్

యూరప్ రుణ సంక్షోభం కేంద్ర స్ధానం ఇప్పుడు గ్రీసు నుండి ఇటలీకి మారింది. ఇటలీ సావరిన్ రుణ బాండ్లపైన వడ్డీ రేట్లు బాగా పెరగడంతో ఆ దేశానికి రుణ సేకరణ కష్టంగా మారింది. అంటే ఇటలీకి అప్పు పుట్టడం కష్టంగా మారింది. ఈ పరిస్ధితి కొనసాగితే ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు బెయిలౌట్ రుణ ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఇటలీ, యూరప్ లొ మూడో పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కావడంతో దానికి బెయిలౌట్ ఇచ్చే పరిస్ధితి యూరప్ కు…

యూరప్ దేశాల్లో రేడియేషన్ ఆనవాళ్లు, ఫుకుషిమా కారణం కాదన్న ఐ.ఎ.ఇ.ఎ

యూరప్ లో అనేక చోట్ల వాతావరణంలో రేడియో ధార్మికత కనుగొన్నట్లుగా ఇంటర్నేషనల్ ఎటామిక్ ఎనర్జీ అసోసియేషన్ (ఐ.ఎ.ఇ.ఎ) సంస్ధ శుక్రవారం వెల్లడించింది. 11.11.11 తేదీన ప్రపంచ ప్రజలందరికీ శుభం జరుగుతుందని కాలజ్ఞానులు చెబుతున్న నేపధ్యంలో ఈ వార్త వెలువడడం గమనార్హం. రేడియో యాక్టివ్ అయోడిన్ – 131 మూలకానికి సంబంధించిన రేడియేషన్ తక్కువ స్ధాయిలో చెక్ రిపబ్లిక్ వాతావరణంలో కనిపించిందని ఐ.ఎ.ఇ.ఎ తెలిపింది. చెక్ రిపబ్లిక్కే కాక యూరప్ లోనే అనేక దేశాల్లో ఈ రేడియేషన్ కనిపించిందని…

సౌమ్య రేప్‌ కేసు నిందితుడికి మరణ శిక్ష

తమిళనాడులో ఇరవై మూడేళ్ళ స్త్రీని రేప్ చేసి హత్య చేసిన నేరానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి మరణ శిక్ష విధించింది. గత ఫిబ్రవరి నెలలో నిందితుడు వేగంగా పోతున్నరైలు నుండి బాధితురాలు సౌమ్యను తోసివేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గాయపడిన సౌమ్యపై రైలు పట్టాలపైనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ముప్ఫై ఏళ్ల నిందితుడు గోవింద చామి అత్యంత క్రూరమైన పద్ధతిలో నేరాలకు పాల్పడ్డాడనీ, ఏ మాత్రం…

లిక్కర్ రారాజుకి కష్టాలట! కేంద్రం బెయిలౌట్ ఇచ్చి ఆదుకుంటుందట!!

ప్రజలకి కష్టాలొచ్చినపుడు ఆదుకోవాలనీ, వారికి బెయిలౌట్ ఇవ్వాలనీ ప్రభుత్వాలు భావించిన దృష్టాంతాలు చరిత్రలో దుర్భిణీ వేసినా వెతకినా కనపడవు. కాని జనాలకి మద్యం తాగబోసి, తెగమేసిన సొమ్ముల్ని బొక్కసంలో కుక్కుకుని, తమ మరో కంపెనీ ‘కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్’ కష్టాల్లో ఉందంటూ బీద అరుపులు అరుస్తున్న లిక్కర్ రారాజు విజయ్ మాల్యాకు బెయిలౌట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధ పడుతోంది. ఐ.పి.ఎల్ ఫ్రాంచైజి ల్లో ఒకటయిన పంజాబ్ సూపర్ కింగ్స్ కి సొంతదారు కూడా అయిన విజయ్…