ఒబామా పై హత్యా ప్రయత్నం, ఒకరి అరెస్టు

గత శుక్రవారం, నవంబరు 11 వ తేదీన వైట్ హౌస్ పై కాల్పులు జరిపిన నేరానికి 21 సంవత్సరాల యువకుడిపై అమెరికా ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడిపై హత్యా ప్రయత్నం నేరం మోపింది. బారక్ ఒబామాను “క్రీస్తు వ్యతిరేకి” గానూ, “దయ్యం” గానూ ‘అస్కార్ ఒర్టెగా-హెర్నాండెజ్ గా అభివర్ణించినట్లుగా తెలుస్తోంది. వైట్ హౌస్ పై కాల్పులు జరిగిన అనంతరం వైట్ హౌస్ అధికారులు వెంటనే కాల్పుల గురించి స్పందించలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి కారులో పారిపోయినట్లుగా వార్తలు వెలువడ్డాయి…

ఆసియా నుండి మేము కదిలేదే లేదు, చైనాకు ఒబామా పరోక్ష హెచ్చరిక

ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లనుండి అమెరికా సైన్యాన్ని విరమించుకుంటున్నట్లు కొద్దివారాల క్రితం ప్రకటించిన బారక్ ఒబామా, ‘ఆసియాలో అమెరికా ఉనికి కొనసాగుతుందని’ ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగిస్తూ తేల్చి చెప్పాడు. అయితే ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లనుండు విరమించుకునే ఆలోచనలో అమెరికాకి మరో ఉద్దేశ్యం లేదు. ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లనుండి ఉపసంహరించుకుంటున్నంత మాత్రాన తాము ఆసియా నుండి వెళ్ళిపోతున్నట్లు కాదన్ ఒబామా చెప్పదలుచుకున్నాడు. మరీ ముఖ్యంగా ఆసియాలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తున్న నేపధ్యంలో ఒబామా ప్రసంగం చేనాను…

నియంతృత్వ కువైట్ లో ప్రజాందోళనలు -ఫొటోలు

అరబ్ ఉద్యమాల ప్రభావం ఎట్టకేలకు కువైట్ కి కూడా పాకింది. ఆందోళనకారులు కువైట్ నగరంలోని నేషనల్ అసెంబ్లీ వద్ద ప్రదర్శన నిర్వహించారు. గేట్లను తోసుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. కొంతమంది నేషనల్ అసెంబ్లీలోనికి చొచ్చుకుని వెళ్లగా మరి కొందరు పార్లమెంటు బైట ప్రదర్శన నిర్వహించారు. దానికి సంబంధించిన ఫొటోలివి: ‘ది గార్డియన్’ పత్రిక ఈ ఫొటోలను ప్రచురించింది.

ఎయిర్ ఇండియాకు బోయింగ్ విమానాలు అమ్మకుండా యు.ఎస్ ఎయిర్ లైన్స్ అడ్డుపుల్ల

వ్యాపార పోటీని అడ్డదారిలో అడ్డు తప్పించుకోవడం అమెరికా కంపెనీలకు వెన్నతో పెట్టిన విద్య. చైనాతో గల వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి వ్యాపార, వాణిజ్యాల్లో పోటిపడడం చేతగాని అమెరికా, చైనా తన కరెన్సీని అసహజంగా తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదని ఆరోపిస్తూ యువాన్ విలువను పెంచేలా ఒత్తిడి తెచ్చి, చైనా నుండి వస్తున్న దిగుమతులను తగ్గించుకుని, తన వాణిజ్య లోటును తగ్గించుకోవాలని అమెరికా ఎత్తులు వేస్తున్నది. ఇప్పుడు బోయింగ్ విమానాలను ఇండియా కొనుగోలు చేయడానికి వీలుగా ఇండియా కంపెనీలకు, అమెరికాకి…

చైనా, అమెరికాల వాణిజ్య అసమతూకం -కార్టూన్

పశ్చిమ దేశాలు, చైనా పట్ల గుర్తుగా ఉండే ముఖ్యమైన అంశాల్లో వాణిజ్య మిగులు ఒకటి. ప్రతి నెలా చైనాతో యూరప్ దేశాలకు గానీ, అమెరికాకి గానీ వాణిజ్య మిగులు ఉండవలసిందే. అమెరికాతో చైనాకు గల వాణిజ్య మిగులు గురించి చెప్పనవసరం లేదు. ప్రతి సంవత్సరం కనీసం రెండొందల బిలియన్ డాలర్లవరకూ వాణిజ్య మిగులు చైనాకు ఉంటోంది. ఇది అమెరికాకి అస్సలు నచ్చడం లేదు. చైనా ఉద్దేశ్యపూర్వకంగా తన కరెన్సీ యువాన్ విలువను తక్కువగా ఉంచడం వలన చైనా…

కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -4

OTPOR మరియు CANVAS (కేన్వాస్) OTPOR అన్నది సెర్బియా భాషా పదం. ‘ప్రతిఘటన’ అని దాని అర్ధం. సెర్బియాలో 1998లో తలెత్తి 2003వరకూ కొనసాగిన ఉద్యమంగా ఇది చరిత్రలో రికార్డయి ఉంది. అహింసా పద్ధతుల్లో ఉద్యమించి నాటో దాడులకు, సామ్రాజ్యవాద ఆక్రమణలకు ఎదురొడ్డి నిలిచిన అప్పటి సెర్బియా నాయకుడు స్లోబోడాన్ మైలోసెవిక్ ను అక్టోబరు 5, 2000 న కూలదోయగలిగిందని ఈ సంస్ధకు పేరు ఉంది. మైలోసెవిక్ ప్రభుత్వం కూలిపోయాక కూడా ఈ సంస్ధ కొనసాగి కొత్త…

కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -3

అక్టోబరు 15 తేదీనజరిగిన “ఆకుపై యూజీన్” ప్రదర్శనలో ‘మంత్లీ రివ్యూ‘ పత్రిక ఎడిటర్ ‘జాన్బెల్లమీ ఫాస్టర్‘ పాల్గొని ప్రసంగించాడు. తన ప్రసంగంలో ఆమెరికాలో ఆదాయఅంతరాలపై ఆయన చెప్పిన కొన్నివివరాలు ఇలా ఉన్నాయి. పైన ఉన్న ఒక శాతం మంది, అమెరికా మొత్తం ఆదాయంలో 25 శాతానికి సొంతదారులు. పైన ఉన్న పది శాతం మంది, మొత్తం ఆదాయంలో దాదాపు 50 శాతానికి సొంతదారులు. 1950, 1970 సం.ల మధ్య కాలంలో కింది 90 శాతం మంది సంపాదించిన…

కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -2

అమెరికా అసమానతలు అక్టోబరు 26 తేదీన కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీసు (సి.బి.ఒ) అమెరికాలో ఆర్ధిక అంతరాయాలపైన ఒక నివేదికను వెలువరించింది. దాని ప్రకారం అమెరికాలో అత్యంత ధనికులైన ఒక శాతం మంది ఆదాయాలు 1979, 2007 మధ్య మూడు రెట్లు (275 శాతం) పెరగ్గా, జాతీయ సంపదలో వారి వాటా రెట్టింపు (8 శాతం నుండి 17 శాతానికి) పెరిగింది. ఇదే కాలంలో ఆందరికంటె పైన ఉన్న 20 శాతం మంది జాతీయాదాయంలో తమ వాటా పెంచుకోగా,…

కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -1

“వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం (ఆకుపై వాల్‌స్ట్రీట్).” ఇప్పుడు అమెరికాలో ప్రజలను, పాలకులను ఆకర్షిస్తున్న ఉద్యమం ఇది. సమస్యలపై అందరి దృష్టినీ ఆకర్షించినందుకు ప్రశంశలనూ, ఒక నాయకుడు గానీ, నిర్ధిష్ట డిమాండ్లు గానీ లేనందుకు విమర్శలను ఈ ఉద్యమం ఎదుర్కొంటోంది. ప్రజలు ఆ ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతుండగా, కొందరు పాలకులు సంపన్నులు కూడా ప్రత్యక్ష, పరోక్ మద్దతును ప్రకటిస్తున్నారు. మరికొందరు తమ మౌనంతో ఉద్యమానికి ప్రచారం రాకుండా ప్రయత్నిస్తున్నారు. అక్కడక్కడా సంపన్నులు నోరు తెరిచి ఉద్యమం, అసంతృప్తుల…

శ్రీకృష్ణ కమిటీ విశ్వసనీయత

శ్రీకృష్ణ కమిటీ విశ్వసనీయత ‘ఛాప్టర్ 8′ తోనే మట్టిగొట్టుకు పోయింది. ఏ కమిషన్ అయినా, స్వతంత్ర భారత దేశంలో ఈ విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని ఎలా అణచివేయాలో సూచించిన సందర్భాలు లేవు. భారత దేశమే కాదు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో దేనిలోనైనా ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి సూచనలిచ్చిన కమిషన్ ఉందా అన్నది నాకు అనుమానమే. ప్రభుత్వాలు గూడచారులను నియమించుకుని ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు తగిన సమాచారం తెప్పించుకుంటాయి అది వేరే సంగతి. కాని ప్రధాని భాషలోనే…

అప్పు ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్తల పేర్లు వెల్లడించండి, సమాచార కమిషనర్ సంచలనం

భారత పాలక పార్టీలన్నీ ఇన్నాళ్ళూ కాపాడుతూ వచ్చిన రహస్య సమాచారం ఒకటి, కొద్ది రోజుల్లో బట్టబయలు కానున్నది. ‘సమాచార హక్కు చట్టం’ అమలుకు ఉద్దేశించబడిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తే బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బుల్ని అప్పనంగా కాజేసిన బడా భోక్తల పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి. భారత పబ్లిక్ రంగ బ్యాంకులనుండి అప్పులు తీసుకుని చెల్లించకుండా ఎగవేసిన పారిశ్రామిక వేత్తల పేర్లను ఆర్.బి.ఐ డిసెంబరు 31 లోగా పబ్లిక్ గా…

‘భాషాప్రయుక్త రాష్ట్రాల’ సిద్ధాంతానికి తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకం కాదు

“ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వారు” ఉండడమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి మూల సిద్ధాంతం. “ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడేవారు” ఉండడం అన్న ప్రాతిపదికన మాత్రమే హిందీ భాషకు అన్ని రాష్ట్రాలు ఉండడాన్ని అర్ధం చేసుకోగలం. “ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడేవారు” ఉండడం అంటే ఒక రాష్ట్రంలో రెండు భాషలు మాట్లాడెవారు ఉండకూడదన్నదే అర్ధం తప్ప ఒకే భాష మాట్లాడేవారు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో ఉండకూడదని అర్ధం కాదు. హిందీ…

పెట్రోల్ ధరలు లీటరుకి రు.1.85 పై.లు తగ్గించిన ఆయిల్ కంపెనీలు

ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరల్ని ఈ రోజు అర్ధ రాత్రి నుండి అంటే బుధవారం నుండీ లీటరుకు రు.1.85 పై.ల చొప్పున తగ్గించాలని నిర్ణయించాయి. అంటే 3.2 శాతం తగ్గింపన్నమాట! 18 నెలల క్రితం పెట్రోల్ ధరలపై నియంత్రణలను ఎత్తివేసిన తర్వాత ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. పన్నులతో కలుపుకుని ఢిల్లీలో లీటర్ పెట్రో ధర రు.2.22 పై మేరకు తగ్గుతుంది. అంటే ఢీల్లీలో పెట్రోధర లీటరుకి రు.66.42 పై. కు తగ్గుతుంది. భారత…

తెలంగాణ డిమాండ్ ను ఎందుకు సమర్ధించాలి?

బ్రిటిష్ వాడికి కోస్తా జిల్లాలనుండి రెవిన్యూ వసూళ్ళు రావడానికి రెండు డ్యాంలు కట్టించాడు. విజయవాడ, ధవళేశ్వరం. కొన్ని కాలవలు తవ్వించాడు. కేవలం వాడి ప్రయోజనాల కోసమే. వాటి ద్వారా కృష్టా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో భూస్వాములు వ్యవసాయం చేసి అభివృద్ధి చెందారు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేనాటికి వారి వద్ద పెట్టుబడి సమకూరింది. పెట్టుబడి సమకూరాక అది ఊరికే కూర్చోదు. లాభాల కోసం పరుగులు పెడుతుంది. లాభాలకోసం కృ, గుం, ఉ.గో జిల్లాల భూస్వాములు హైద్రాబాద్ వచ్చి…