బూతోడుండేది అమెరికాలో, భారత్ లో ఉండేవారి దేశభక్తిపైనే అనుమానాలు

ఈ బూతు వెధవలు ఉండేది అమెరికాలో. ఐనా ఇండియాలో ఉండే వారి దేశ భక్తికి పరీక్షలు పెడుతుంటారు. ఉదాహరణకి వీడిని చూడండి. వీడి ఐ.పి నంబరు: 117.192.199.112. వీడి పేరు needa అట. వీడి ఈ మెయిల్: avasarama@eesuttiki.com సొంత పేరు, సొంత ఈమెయిల్ ఐ.డి చెప్పుకోలేని దౌర్భాగ్యం ఇతన్ది. అందుకే వీడ్ని సన్నాసి అని పిలవాలనిపిస్తోంది. కతార్ లో తాలిబాన్ ఆఫీసు తెరవడం పైన నేను రాసిన ఈ పోస్టు కింద వీడు ఒక పనికిమాలిన…

(90 మంది రోగులను చంపిన) కోల్ కతా ఆసుపత్రి డైరెక్టర్లను వెంటనె విడుదల చేయాలి -ఫిక్కి

డిసెంబరు 9 తేదీన కోల్ కతా లోని ‘ఎ.ఎం.ఆర్.ఐ ధాకూరియా’ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొంభై మందికి పైగా రోగులు, ఉద్యోగులు చనిపోయిన సంగతి విదితమే. ముఖ్యమంత్రి మమత ప్రమాదానికి వెంటనే స్పందించి ఆసుపత్రి డైరెక్టర్లు పది మందిలో ఏడుగురిని వెంటనే అరెస్టు చేయించింది. వారికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో కోల్ కతా జైలులోనే ఉన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని భారత పెట్టుబడిదారుల సంఘం “ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్…

తాలిబాన్ ఆఫీసు తెరవడానికి కతార్ అంగీకారం, ఇండియాపై పాక్ పైచేయికి మార్గం!

ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అభ్యంతరాలను తోసి పుచ్చుతూ కతార్ రాజధాని ‘దోహా’ లో కార్యాలయం తెరవడానికి ఆఫ్ఘన్ తాలిబాన్ కి అనుమతి దొరికింది. ఈ మేరకు కతార్, ఆఫ్ఘన్ తాలిబాన్ ల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ లతో తాలిబాన్ జరపబోయే శాంతి చర్చలకు ఈ కార్యాలయం అనుమతి దోహదపడుతుందని అమెరికా ఆశపడుతోంది. కతార్ లో తాలిబాన్ కార్యాలయం తెరవడానికి నిజానికి అంగీకారం ఎన్నడో కుదిరింది. కాని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్…

“తెలుగులో జాతీయ అంతర్జాతీయ వార్తలు” బ్లాగ్ సమీక్ష -2011

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog. Here’s an excerpt: The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 100,000 times in 2011. If it were an exhibit at the Louvre Museum, it would take about 4 days for that many people to see…

‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమంలో వెల్లువెత్తిన సృజనాత్మక నినాదాలు -ఫొటోలు

“ఆకుపై వాల్ స్ట్రీట్” ఉద్యమంలో ప్లెకార్డులపై రాసిన నినాదాలు ఒక పెద్ద వార్తగా మారాయి. ముందుగా అనుకుని రాసి తెచ్చుకున్న నినాదాలు కొన్నయితే, అప్పటికప్పుడు చేతికి అందిన అట్టపైనో, కార్డ్ బోర్డ్ అట్టపైనో, కాగితంపైనో రాసి ప్రదర్శించిన నినాదాలు అనేకం. – –

అన్నా బృందం కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం రద్దు?

మరి కొద్ది వారాల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్న అన్నా బృందం, తమ ఆలోచనను ఉపసంహరించుకున్నట్లు కనిపిస్తోంది. అన్నా హజారే, తనకేం కాలేదనీ, కొద్దిరోజుల్లో తాను ఆరోగ్యంగా బైటికి వస్తాననీ ఆసుపత్రి నుండి సందేశం పంపినప్పటికీ ఎన్నికల ప్రచారం విషయంలో అన్నా బృందం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ పాల్ విషయంలో కాంగ్రెస్ దేశాన్ని దారుణంగా మోసం చేసిందనీ కనుక ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరగనున్న…

నిరుద్యోగ సైన్యం బులెట్లుగా, శవపేటికలే ఖాళీ బుల్లెట్లుగా… -‘బ్లూ’ వీధి చిత్రం

నిరుద్యోగ సైన్యం అమెరికా, యూరప్ ల యుద్ధోన్మాదానికి బలవుతున్న వాస్తవాన్ని ఈ వీధి చిత్రంలో వీధి చిత్రకారుడు ‘బ్లూ’ హృద్యంగా చిత్రీకరించాడు. సైన్యంలో చేరడానికి వచ్చిన యువకులు నిలబడ్డ క్యూలను బులెట్ల మ్యాగజైన్లుగానూ, ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లనుండి తిరిగివస్తున్న శవపేటికలు కాల్చాక మిగిలిన ఖాళీ బులెట్లుగానూ చిత్రించిన తీరు నిజంగా అద్భుతం. – – –

భారత రాయబారిపై చైనా వ్యాపారుల దాడి? ఏది నిజం?

  భారత రాయబారి ఎస్.బాలచంద్రన్ పైన చైనా వ్యాపారులు దాడి చేశారనడాన్ని షాంఘైలోని భారత రాయబార కార్యాలయ అధికారులు నిరాకరిస్తున్నట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. కాని సంఘటనను వివరిస్తున్న భారత పత్రికల కధనాలు వేరే విధంగా ఉన్నాయి. దాడి జరిగిందని చెప్పలేనప్పటికీ, దాడిలాంటిది జరిగిందని మాత్రం అర్ధం అవుతోంది. ఇందుకు ప్రధానంగా చైనా వ్యాపారుల తొందరపాటుతనం కారణంగా కనిపిస్తోంది. తమకు ఇవ్వవలసిన డబ్బులను రాబట్టుకునే ప్రయత్నంలో వారు తొందరబాటుకి గురైనట్లు కనిపిస్తోంది. షాంఘై నగరం దగ్గర…

భారత రాయబారికి వైద్యం నిరాకరించడంపై విచారణకు చైనా అంగీకారం

తన రాయబారికి వైద్యం నిరాకరించడం విషయంలో భారత విదేశీ మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదుపై విచారణ జరపడానికి చైనా అంగీకారం తెలిపింది. భారత వ్యాపారులను విచారిస్తున్న కోర్టు వద్ద హాజరైన రాయబారికి కోర్టులో ఉండగా వైద్య సౌకర్యం పొందడానికి అక్కడ ఉన్న చైనా అధికారులు నిరాకరించారని భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేసింది. షాంఘైలోని భారత రాయబార కార్యాలయ అధికారి ఎస్.బాలచంద్రన్ డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ‘యివు’ పట్టణంలో అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న అనుమానంతో భారత…

పచ్చదనాన్ని నమిలేస్తున్న కాంక్రీట్ అరణ్యం -బ్లూ స్ట్రీట్ ఆర్ట్

వీధి చిత్ర కళాకారుడు ‘బ్లూ’,  సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లో గీసిన వీధి చిత్రం ఇది. పట్టణీకరణ తీవ్రం అవుతుండడంతో పల్లెలూ, పల్లెల్ని అంటిపెట్టుకుని ఉండే పచ్చదనం కనపడకుండా పోతున్న సంగతిని ‘బ్లూ’ ఇందులో చిత్రించాడు. – – –

2012 పసి నెత్తిన 2011 భారీ అప్పు -కార్టూన్

యూరప్ ని ఈ కార్టూన్ ఉద్దేశిస్తున్నప్పటికీ, అమెరికా, ఆసియాలకు కూడా ఇది వర్తిస్తుంది. కంపెనీలకు అప్పులివ్వడానికి అప్పులు చేస్తున్న ప్రభుత్వాలు, ప్రజల పైన మాత్రం ‘పొదుపు ఆర్ధిక విధానాలు’ రుద్దుతున్నాయి. కంపెనీల కోసం తాము చేసిన అప్పుని జాతీయ సమస్యగా చేసి ప్రభుత్వాలు ప్రజలపైన రుద్దుతున్నాయి. కంపెనీల కోసం చేసే ఖర్చుని ప్రజల కోసం చేస్తున్న ఖర్చుగా చూపుతూ, నామ మాత్రంగా ప్రజలపై చేస్తున్న ఖర్చులో అవి కోత పెడుతున్నాయి. ఆ విధంగా, ఓ వైపు ప్రజల…

ఇక భారత షేర్ మార్కెట్లతో విదేశీ వ్యక్తిగత ఇన్వెస్టర్లూ ఆడుకోవచ్చు

భారత దేశ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ వ్యక్తిగత మదుపుదారులే నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పించబోతోంది. జనవరి 15 నుండి విదేశీ మదుపరులను షేర్ మార్కెట్లలోకి అనుమతించనున్నట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను సరళీకరణకు గురిచేసే పధకంలో ఇది మరొక అడుగు. 2011 సంవత్సరంలో షేర్ మార్కెట్లనుండి విదేశీ సంస్ధాగత నిధులు పెద్ద ఎత్తున తరలివెళ్ళిన నేపధ్యంలో ఈక్విటీ మార్కెట్ నిబంధనలను మరింత సరళీకృతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.…

డిజిపి వ్యాఖ్య, పురుషాధిక్య పోకడలకు పరాకాష్ట -కత్తిరింపులు

జనవరి ఒకటో తారీఖున ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో వచ్చిన వ్యాసం ఇది. సల్వార్ కమీజ్, చుడీదార్ లు కూడా డిజిపి కి అసభ్య వస్త్ర ధారణగా కనపడడం విపరీతం కాకపోతే ఏమిటి? నిజానికి చీర కంటే, లంగా ఓణి కంటే సల్వార్ కమీజ్ శరీరాన్ని పూర్తిగా కప్పేస్తుంది. అరి చేతులు, అరి కాళ్ళు, తల తప్ప శరీరాన్నంతా చుడీదార్లు కప్పి ఉంచుతాయి. ఐనా ఆ డ్రస్సులు డిజిపి కి రెచ్చగొట్టేలా ఎలా కనపడ్డాయి? ఈ వ్యాస…

నూతన ఆర్ధిక విధానాలు అవినీతిని అనేక రెట్లు పెంచాయి (అన్నాపై విమర్శలు…. -2)

నూతన ఆర్ధిక విధానాలు అవినీతిని అనేక రెట్లు పెంచాయి నిజానికి జాతీయ పత్రికలు ఈ కుంభకోణాలన్నింటినీ ప్రచురించినప్పటికీ అవన్నీ జాతీయ స్ధాయిలో తగిన ప్రచారం పొందలేకపోయాయి. దానికి ప్రజల జ్ఞాపక శక్తి పరిమితులకి అతీతమైన సంఖ్యలో కుంభకోణాలు చోటు చేసుకోవడం ముఖ్య కారణం. గతంలో బోఫోర్స్ కుంభకోణంలో గల్లంతయిన ప్రజాధనం కేవలం అరవై నాలుగు కోట్లు మాత్రమే. కాని ఈ దేశంలో ప్రధాన రాజకీయ వంశం అయిన గాంధీలు ఈ కుంభకోణంలో ఉండడంతో అది విస్తృత ప్రచారం…