ఇందుకే ప్రవీణ్ కి నా మద్దతు

అంతిమంగా ప్రవీణ్ అమాయకత్వంపైన నేను చెప్పేది ఏమంటే: అతను పూర్తిగా అమాయకుడా, కాదా అన్నది నేను తేల్చలేను. నేను, ప్రవీణ్, మా ఇద్దరి భావజాలం, గ్యాంగ్ ప్రచారం… ఈ అంశాల పరిధికి సంబంధించి ప్రవీణ్ కొన్నిసార్లు అమాయకంగా రాశాడు. అవి గ్యాంగ్ కి మేతలయ్యాయి. ఈ నిర్ధిష్ట పరిధిలో ప్రవీణ్ ప్రవర్తనలో తప్పు పట్టడానికి నేను ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను. కారణం అతను ఏళ్లపాటు జరిగిన వ్యతిరేక ప్రచారంలో బాధితుడు. ఆ ప్రచారం నా…

మృత్యువు, విశ్వ రహస్యాలకు సవాలు స్టీఫెన్ హాకింగ్ జీవితం

ఐజాక్ ఐన్ స్టీన్ తర్వాత అంతటి గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా ప్రపంచ వ్యాపితంగా మన్ననలందుకున్న బ్రిటన్ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కి డెప్ఫై ఏళ్ళు నిండాయి. శరీరంలో ఏ భాగమూ కదల్చకుండానే విశ్వ రహస్యాలను ఆవిష్కరించిన ఈ శాస్త్రవేత్త ఒక్క భౌతిక శాస్త్రానికే కాక వైద్య శాస్త్రానికి కూడా అద్భుతం లాగే మిగిలాడు. – – –

‘తె.జా.అ.వా’ బ్లాగ్ కి కొత్త టెంప్లేట్ ఎలా ఉంది?

“తెలుగులో జాతీయ అంతర్జాతీయ వార్తలు” బ్లాగ్ కి కొత్త టెంప్లేట్ అమరుస్తున్నాను. ఈ టెంప్లేట్ తో ఎవైనా సమస్యలు తలెత్తితే మిత్రులు చెప్పగలరు. ఈ టెంప్లేట్ కూడా వర్డ్ ప్రెస్ వారు ఉచితంగా అందించినదే.

భన్వరి దేవిని చంపెసిన నాలుగు నెలల తర్వాత శవం ఆనవాళ్ళు లభ్యం

రాజస్ధాన్ లో రాష్ట్ర మంత్రి చేతుల్లో హత్యకు గురైన నర్సు భన్వరీ దేవి శవం ఆనవాళ్ళు ఎట్టకేలకు లభ్యమైనట్లు తెలుస్తోంది. మంత్రి అనుచరుడి ఆదేశాల మేరకు భన్వరీ దేవిని చంపిన దుండగులు ఆమెను ముప్ఫై అడుగుల లోతు గల గొయ్యిలో తగులబెట్టారని సి.బి.ఐ కనుగొన్నట్లు తెలుస్తోంది. శవాన్ని దహనం చేసిన అనంతరం మిగిలిన శరీర భాగాలను సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ కెనాల్ లో కలిపినట్లు తెలుస్తోంది. భన్వరీ దేవి సెప్టెంబరు 1 తేదీన బిలాడా…

అలియాస్ పేర్లు, నిక్ నేమ్స్ కూడా సొంత పేర్లే

ఇంటర్నెట్ కార్యకలాపాల్లో చాలామంది తమ సొంత పేర్లు (తల్లి దండ్రులు పెట్టిన పేర్లు) వాడరు. ఏదైనా తమకు ఇష్టమయిన పేరు పెట్టుకుంటారు. ఆ పేరు ద్వారా చలామణి అవుతారు. ఇంటర్నెట్ కి సంబంధించినంతవరకూ అలియాస్ పేర్లే సొంత పేర్లుగా చలామణీ అవుతాయి. అవి తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కానప్పటికీ ఇంటర్నెట్ కి సంబంధించినంతవరకూ అలియాస్ పేర్లే వారికి సొంత పేర్లు. ఒకే బ్లాగ్ లో రెండు పేర్లతో వ్యవహరించేవారు అవి రెండు తన పేర్లే అని చెప్పగలిగితే…

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్ళరాదని హజారే నిర్ణయం

ఉత్తర ప్రదేశ్ తో సహా త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికి వెళ్లరాదని అన్నా హజారే నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అన్నా బృందం కోర్ గ్రూపు సభ్యురాలు కిరణ్ బేడీ గురువారం ప్రకటించింది. అన్నా అనారోగ్యంగా కారణంగా ముందు అనుకున్న ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ఆమె తెలిపింది. “రాష్ట్రాల ఎన్నికల్లో అన్నా ప్రచారం చేయడం లేదు. అన్నా ప్రయాణాలు చెయ్యరు. ఆయన ప్రయాణాలు చెయ్యవద్దని మేమూ కోరాము. ఆయన…

మెక్సికో, ఫ్రాన్సు, అమెరికా, రష్యాలకూ ఎన్నికల సంవత్సరమే -కార్టూన్

– మెక్సికో: ఈ ఎన్నికల సంవత్సరాలంటే నాకు పరమ ద్వేషం. ఫ్రాన్సు: కొండల కొద్దీ బురద విసురుతున్నారు. అమెరికా: జిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు పెట్టేస్తున్నారు. రష్యా: ఆ బ్యాలట్ బాక్సుల్లో కుక్కాలి. చైనా పౌరుడు: సర్లే. కనీసం ద్వేషించడానికి ఎన్నికల సంవత్సరం అని ఒకటుంది కదా. – –

భార్యని కాపాడలేదని డాక్టర్ ని చంపేసిన ఆటో డ్రైవర్

గర్భిణి అయిన తన భార్యని కాపాడలేకపోయిందన్న ఆగ్రహంతో ఇరవేయేడేళ్ల మహేష్ అనే ఆటో డ్రైవర్ ఒక డాక్టర్ ని దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. యాభై అయిదేళ్ల డా॥ టి.సేతు లక్ష్మి, తన రోగిని కాపాడడానికి ప్రవేటు ఆసుపత్రికి స్వయంగా అంబులెన్సులో తరలించినప్పటికీ కాపాడలేకపోయింది. డాక్టర్ నిజాయితీని కొంచెమయినా గుర్తించని రోగి భర్త, భార్య చనిపోయిందన్న ఆవేదనతో డాక్టర్ ప్రాణాలు తీయడానికి వెనుకాడకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? సమాజంలో వివిధ వర్గాల…

‘అనూజ్ బిద్వే’ హత్య కేసు విచారణ జూన్ లో

ఇంగ్లండులో హత్యకు గురైన అనూజ్ బిద్వే కేసు విచారణ జూన్ నెలలో చేపట్టనున్నారు. జాత్యహంకారంతో జరిగిన హత్యగా అనుమానిస్తున్న ఈ కేసులో నిందితుడు ఇరవై ఏళ్ళ ‘కియారాన్ స్టేపుల్ టన్’. ఇతను తనను ‘సైకో స్టేపుల్ టన్’ గా పిలవాల్సిందిగా తన మిత్రులను కోరేవాడని తెలుస్తోంది. జూన్ 25, 2012 నుండి కేసులో ట్రయల్స్ ప్రారంభం చెయ్యడానికి కోర్టు నిర్ణయించింది. సాల్ ఫర్డ్ లోని మాంఛెస్టర్ లో అనుల్ బిద్వే తన మిత్రులతో కలిసి నడుచుకుంటూ వస్తుండగా…

బోట్సువానా వీధి చిత్రాలు -ఫొటోలు

ఈ వీధి చిత్ర కారుడి అలియాస్ పేరు ‘ఫెయిత్47’. ఈ వీధి చిత్రాల ‘ధీమ్’ కూడా ‘ఫెయిత్’ లానే ఉంది. ఆఫ్రికా దేశం ‘బోట్సువానా’ లో ‘ఫెయిత్47’ గీసిన వీధి చిత్రాలివి. – – –