ఇటలీ ఇండియా రాయబార యుద్ధంలో ఇండియా పై చేయి
కేరళ రాష్ట్ర సమీపంలోని సముద్ర జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపిన కేసులో ఇటలీ, ఇండియాల మధ్య రాయబార సంబంధాలలో ఉద్రిక్తతలు తలెత్తి కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ప్రస్తుతానికి ఇండియాడే పై చేయిగా కనిపిస్తోంది. ఇద్దరు ఇటాలియన్ మెరైన్లు ఇప్పటికీ కేరళ పోలీసుల కస్టడీలో కొనసాగుతుండడంతో ఇటలీ ప్రభుత్వంపై స్ధానికంగా ఒత్తిడులు తీవ్రం అవుతున్నాయి. ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించలేదంటూ ఇటలీ ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన దుమ్మెత్తి పోస్తుండడంతో ఇటలీలోని ఇండియా రాయబారిని పిలిపించుకుని తమ మెరైన్ల నిర్బంధం…













