చనిపోయినవారిపై ఒంటేలు పోస్తున్న అమెరికా సైనికులు -వీడియో

గత జనవరి నెలలో ఈ వీడియో బైటికి వచ్చింది. శవాలపై ఒంటికి వెళ్తున్న ఈ నీచ, నికృష్ట మానవులు అమెరికా సైనికులు. నార్త్ కరోలినా లోని లెజీన్ క్యాంప్ నుండి వచ్చిన 2 వ మెరైన్స్, 3 వ బెటాలియన్ కి వీరు చెందినవారని వీడియోను యూ ట్యూబ్ లో పోస్ట్ చేసిన వ్యక్తి సమాచారం ఇచ్చాడు. చనిపోయినవారిని చూస్తే ఆఫ్ఘన్ పౌరులని ఇట్టే అర్ధం అవుతోంది. “అమెరికా మిలట్రీ కి చెందినవారు శత్రువుల శవాలపై అసంబద్ధమైన కార్యక్రమానికి…

అమెరికా సైనికులు తాగొచ్చి హత్యాకాండకి దిగారు -రాయిటర్స్, డెయిలీ మెయిల్

తొమ్మిది మంది పిల్లలతో సహా 16 మంది పౌరులను పొట్టనబెట్టుకున్న అమెరికా సైనికులు శుభ్రంగా తాగి వచ్చి ఆఫ్ఘన్ ప్రజల ఇళ్ళలో చొరబడ్డారనీ, కనపడినవారినందరినీ కాల్చి చంపారనీ ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. “వాళ్ళంతా బాగా తాగి ఉన్నారు. నవ్వుకుంటూ, కేకలు వేసుకుంటూ కనపడిన ఆఫ్ఘన్లను కాల్చి చంపారు” అని అమెరికా సైనికుల కాల్పుల్లో పదకొండు మందిని కోల్పోయిన కుటుంబానికి పక్కనే నివశిస్తున్న ‘ఆఘా లాలా’ చెప్పాడని రాయిటర్స్ తెలిపింది. “వాళ్ళ శరీరాల…

ఇళ్ళల్లో జొరబడి 16 మంది ఆఫ్ఘన్ పౌరులను చంపిన అమెరికా సైనికులు

ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికుల దుర్మార్గాలు మానవ మాత్రులు ఊహించని స్ధాయికి చేరుకుంటున్నాయి. అమెరికా సైనికుల బృందం ఒకటి కాందహార్ లో ఉన్న తమ స్ధావరానికి సమీపంలో ఉన్న ఆఫ్ఘన్ పౌరుల ఇళ్ళలో చొరబడి నిద్రిస్తున్న పౌరులను అమానుషంగా కాల్చి చంపారు. కేవలం ఒక సైనికులు మాత్రమే, అదీ నేర్వస్ బ్రేక్ డౌన్ కి గురయిన సైనికుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అమెరికా కమేండర్లూ, నాటో అధిపతులూ చెపుతున్నప్పటికీ, అది నిజం కాదనీ అమెరికా ప్రత్యేక బలగాలకు…

ఆఫ్ఘన్ స్త్రీలు, చిన్నారులను ఊచకోత కోసిన అమెరికా సైన్యం -ఫొటోలు

ఆఫ్ఘన్ లో తిష్ట వేసిన అమెరికా సైనికులు అర్ధరాత్రి దాటాక తమ కాందహార్ సైనిక స్ధావరం నుండి బైటికి వచ్చి 16 మంది పౌరులను ఊచకోత కోసాడు. మరొ ఐదుగురు ఊచకోతలో తీవ్రంగా గాయపడ్డారు. జరిగిన ఈ ఘటన లో మరణించినవారిలో 9 మంది చిన్నారులు కాగా 4 గురు స్త్రీలు. కేవలం ఒకే ఒక అమెరికా సైనికుడు ఈ ఊచకోతకు తెగబడ్డాడని కొన్ని పత్రికలు చెబుతున్నప్పటికీ అనేకమంది సైనికులు ఉద్దేశ్యపూర్వకంగా ఈ హత్యాకాండకు పాల్పడ్డారని బిబిసి…

Rape conviction rate

రేపిస్టులను వదిలేస్తున్న భారత న్యాయ, సామాజిక వ్యవస్ధలు

రేపిస్టులు భారత దేశంలో కాలరెత్తుకు తిరుగుతున్నారు. అనేక సామాజిక అడ్డంకులు ఎదుర్కొని మరీ రేప్ నేరాలను రిపోర్టు చేస్తున్న బాధితులకు దక్కుతున్నది అవమానాలూ, నిరాశే తప్ప న్యాయం కాదు. 1973 నుండి ఇప్పటి వరకూ శిక్షలు పడిన రేపిస్టుల సంఖ్యలు చూస్తే రేప్ నేరాల్లో నేరం రుజువై శిక్ష పడిన కేసులు ప్రతి దశాబ్దానికి పడిపోతూ వచ్చినట్లు స్పష్టం అవుతోంది. రేప్ నేరాలలో పోలీసులు జరుపుతున్న పరిశోధనల్లో తీవ్రమైన లోపాలు, నిర్లక్ష్యం, తేలిక భావం చోటు చేసుకోవడం…

పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ హంతక దాడులు

ఇజ్రాయెల్ వరుసగా మూడో రోజు కూడా గాజా పై దాడి చేసి 7 గురు అమాయక పౌరులను బలి తీసుకుంది. శనివారం గాజాపై వైమానిక దాడులు జరిపి పది మందిని చంపిన ఇజ్రాయెల్, ఆదివారం మళ్ళీ అత్యాధునిక విమానాలతో జరిపిన బాంబు దాడుల్లో మరో 7 గురుని చంపేసింది. చనిపోయినవారిలో 12 యేళ్ళ బాలుడు కూడా ఉన్నాడు. గత కొద్ది నెలలుగా చెదురు ముదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా ఉన్న వాతావరణం, ముఖ్యమైన పాలస్తీనా నాయకుడిని ఇజ్రాయెల్…

బూతు మంత్రులే కాదు, డజను పైన బూతు ఎం.ఎల్.ఏ లు కూడా

కర్ణాటక అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించడం మాని, ముగ్గురు మంత్రులు బూతు వీడియోలు చూసి టెలివిజన్ కెమెరాలకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే ముగ్గురు మంత్రులే కాకుండా ఇంకా డజను కంటే ఎక్కువ మంది ఎమ్మేల్యేలు కూడా ఆ రోజు బూతు వీడియోలు చూసి తరించినట్లు అసెంబ్లీ కమిటీ పరిశోధనలో బైట పడినట్లు తెలుస్తోంది. మంత్రులు సవాది లక్ష్మణ్, సి.సి.పాటిల్, కృష్ణ పాలేమార్ లు ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో బూతు వీడియోలు చూస్తూ…

రేప్ బాధితురాలిని చచ్చిపొమ్మని బెదిరిస్తున్న గ్రామం

పశ్చిమ బెంగాల్ లోని ఓ గిరిజన గ్రామం అది. కామాంధులైన ఐదుగురు చేతిలో సామూహిక మానభంగానికి గురయిన గ్రామ మహిళ ఒకరిని చావనైనా చావాలని లేదా ఊరొదిలైనా పోవాలనీ ఆ గ్రామం హింసిస్తోంది. ఇంటిపై దాడి చేసి తలుపులు పగల గొట్టి, చావబాది గ్రామ పెద్ద విధించిన ‘గ్రామ బహిష్కరణ’ శిక్షను అమలు చేయించడానికి ఆ గ్రామం అంతా ప్రయత్నిస్తోంది. సామూహిక అత్యాచారంతోనే షాక్ లో ఉన్న ఆ మహిళ, గ్రామస్ధుల హింసతో హతాశురాలై సాయం కోసం…

Bomb Iran

ఇరాన్ పై బాంబు పడాల్సిందే -కార్టూన్

ఇరాన్ అణ్వాయుధం తయారు చేసుకుంటుందేమోనన్న భయంతో వణికిపోతున్న ఇజ్రాయెల్ అమెరికా చేత ఇరాన్ యుద్ధం చేయించడానికి కంకణం కట్టుకుని ఉంది. అమెరికాలో అత్యంత శక్తివంతమైన ‘ఇజ్రాయెల్ అనుకూల యూదు లాబీ’ ద్వారా అమెరికా చేత అనేక ఘోరాలు చేయించిన ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ పైన కత్తి కట్టింది. మధ్య ప్రాచ్యం లేదా పశ్చిమాసియాలో ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తూ, పాలస్తీనీయులపై జాత్యహంకార పాలన సాగిస్తూ మూడొందలకు పైగా అణు బాంబులు (బిబిసి ప్రకారం) నిర్మించుకుని ఉన్న ఇజ్రాయెల్ వల్ల ‘ప్రపంచ…

ఇరాన్ వీధి చిత్రకళ -ఫొటోలు

ఇరాన్ వీధి చిత్రకారులు ఐ.సి.వై, ఎస్.ఓ.టి లు గీసిన వీధి చిత్రాలివి. వీరు ఇరాన్ లోని తాబ్రిజ్ నగరానికి చెందినవారు. ప్రఖ్యాత లండన్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ లాగా వీరు స్టెన్సిల్ టెక్నిక్ తో వీధి చిత్రాలు గీయడంలో సిద్ధ హస్తులు. బ్యాంక్సీ లాగా వీరు కూడా పిన్న వయస్కులు. ఐ.సి.వై వయసు 26 ఏళ్ళు కాగా ఎస్.ఓ.టి వయసు 20 యేళ్ళు. యువకులే అయినప్పటికీ వీరు గీసిన వీధి చిత్రాలలో పరిణితికి కొదవేమీ లేదు.  అసత్యారోపణలతో…

నా కొడుకుది రాజకీయ హత్య -ఐ.పి.ఎస్ అధికారి తండ్రి

మధ్య ప్రదేశ్ లో మైనింగ్ మాఫియా చేతిలో దారుణ హత్యకు గురయిన ఐ.పి.ఎస్ అధికారి నరేంద్ర కుమార్ ను రాజకీయ నాయకులే హత్య చేహించారని అతని తండ్రి, పోలీసు అధికారి కూడా అయిన కేశవ్ దేవ్ ఆరోపించాడు. కొద్ది రోజులుగా తాను అక్రమ మైనింగ్ కి సంబంధించిన ట్రక్కులను సీజ్ చేస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల జోక్యంతో వదిలి పెడుతున్నారని తన కొడుకు చెప్పాడని ఆయన తెలిపాడు. రాజకీయ కుట్ర వల్లనే తన కొడుకు హత్యకు గరయ్యాడని కేశవ్…

అమెరికా కంటే చైనా పార్లమెంటు సభ్యులే సంపన్నులు -సర్వే

అమెరికా, చైనా దేశాల పార్లమెంటు సభ్యులలో ఎవరు ఎక్కువ సంపన్నులై ఉంటారు? సాధారణంగా అమెరికా కాంగ్రెస్, సెనేట్ సభ్యులే ఎక్కువ సంపన్నులై ఉంటారని భావిస్తాం. కానీ అది నిజం కాదని ‘బ్లూమ్ బర్గ్’ పత్రిక చెబుతోంది. చైనా పీపుల్స్ కాంగ్రెస్ సభ్యులతో గానీ, చైనా కమ్యూనిస్టు పార్టీ లోని ఉన్నత స్ధానాల్లో ఉన్న నాయకులతో గాని పోల్చి చూస్తే అమెరికా కాంగ్రెస్, సెనేట్ సభ్యులు కడు పేదలని ఆ పత్రిక చెబుతోంది. అమెరికా కాంగ్రెస్ లో మొత్తం…

అమెరికా, చైనా లు లేకుండా ప్రపంచ సమస్యల పరిష్కారం కుదరదు -హిల్లరీ

చైనాకు ప్రపంచ రాజకీయాల్లో ఉన్న స్ధాయిని అమెరికా మరొకసారి బహిరంగంగా అంగీకరించింది. ప్రపంచ వ్యవహారాల్లో ప్రతి టేబుల్ వద్దా చైనాకు సీటు ఉందనీ, ప్రపంచ స్ధాయిలో ప్రాముఖ్యం కలిగిన ప్రతి సంస్ధలోనూ చైనాకు పాత్ర ఉందనీ, అమెరికా, చైనాలు లేకుండా ప్రపంచంలో ఏ సమస్య అయినా పరిష్కారం కావడం అసంభవమనీ అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) హిల్లరీ క్లింటన్ ప్రకటించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు నిక్సన్ చైనా సందర్శించి 40 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా…