మోసపోయిన స్త్రీల అంతరంగం వారి మాటల్లోనే చదవండి -లింక్

– ‘జైజై నాయకా’ బ్లాగర్ కె.ఎన్.మూర్తి గారు ఒక ఇంటర్వ్యూ ప్రచురించారు. వ్యభిచార వృత్తిలో ఉన్న ఒక స్త్రీ తో జరిపిన ఇంటర్వ్యూ ఇది. మూడు కోట్ల మంది స్త్రీల ప్రతినిధిగా ఈమె చెప్పిన సంగతులు హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ వృత్తిలో ఉన్న మహిళలకు తమ వృత్తి పట్ల ఉన్న వ్యతిరేకత, ఆర్ధిక బాధలని ఎదుర్కోవడానికి అదే వృత్తిలో కొనసాగక తప్పనిసరి పరిస్ధితులు వారి బతుకుల్ని ఎంతగా బుగ్గిపాలు చేస్తున్నాయో ఆమె వివరించింది. చాలా కొద్ది…

జీవితంలో చుక్క సారా ముట్టని క్రికెటర్ ‘రాహుల్ శర్మ’

ముంబై లో జరిగిన ఒక రేవ్ పార్టీ పై పోలీసుల రెయిడింగ్ పుణ్యమాని తాను పుట్టి బుద్ధెరిగాక ఆల్కహాల్ చుక్క కూడా ముట్టి ఎరగని క్రికెటర్ గురించి దేశానికి తెలిసొచ్చింది. నిజానికి ఒక క్రికెట్ ప్లేయర్ ఆల్కహాల్ తాగుతాడా లేదా అన్నది పెద్ద వార్త కాదు. కానీ జాతీయ జట్టుకో, ఐ.పి.ఎల్ జట్టుకో ఆడటం మొదలు పెట్టాక తాగకుండా ఉంటే గనక పెద్ద వార్తే. ముఖ్యంగా ఐ.పి.ఎల్ లో పొంగి ప్రవహిస్తున్న డబ్బూ, ప్రతీ లీగ్ మ్యాచ్…

మమతాగ్రహం: సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ స్టూడియోలో ఏం జరిగింది?

శుక్రవారం సాయంత్రం సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో లైవ్ ముఖా ముఖి నిర్వహించింది. కలకత్తాలో ప్రఖ్యాతి చెందిన ‘టౌన్ హాల్’ లో జరిగిన ఈ ముఖాముఖీలో యూనివర్సిటీ విద్యార్ధినులు అడిగిన  ప్రశ్నలకు అసహనం చెంది, వారిపైన ‘మావోయిస్టు’ ముద్రవేసి ఇంటర్వ్యూ నుండి అర్ధాంతరంగా లేచి వెళ్లిపోయింది. ముఖాముఖీలో హాజరై ఆమెకి నచ్చని ప్రశ్నలు అడిగినందుకు విద్యార్ధినీ, విద్యార్ధులకు మావోయిస్టులతోనూ, సి.పి.ఐ(ఎం) తోనూ సంబంధాలున్నాయేమో విచారించాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. టౌన్ హాల్ లో ఏం…

టి.వి ఇంటర్వ్యూ మధ్యలోనే ఆగ్రహంతో వెళ్ళిపోయిన మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన ఫాసిస్టు ఉద్దేశాలను మరోసారి వెళ్లగక్కింది. విద్యార్ధులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి బదులు “మీరంతా మావోయిస్టులు, సి.పి.ఐ (ఎం) పార్టీ వాళ్ళు” అని ఆరోపిస్తూ టి.వి ఇంటర్వూని మధ్యలోనే వదిలి వెళ్లిపోయింది. ప్రశ్నలను అడుగుతున్న విద్యార్ధులందరినీ ఫోటోలు తీసి విచారించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ మోడరేటర్ సాగరికా ఘోష్ వారంతా విద్యార్ధులని చెబుతున్నా వినకుండా స్టూడియో నుండి ఆగ్రహంతో ఊగిపోతూ వెళ్లిపోయింది. పోలీసులు ఇప్పటికే…

బ్రిటిష్ రాణి డైమండ్ జూబ్లీ పండగలో బ్యాంక్సీ? -వీధి చిత్రం

బ్రిటిష్ రాణి ఎలిజబెత్ II సింహాసనాన్ని చేపట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరి 6 తో అరవై యేళ్లు పూర్తి కావస్తున్నాయట. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం ప్రపంచ వ్యాపితంగా పండగ జరుపాలని తలపెట్టింది. గత కొద్ది నెలలుగా ఎక్కడా కొత్తగా బ్యాంక్సీ వీధి చిత్రం జాడలేదు. నార్త్ లండన్ లో ప్రత్యక్షమైన ఈ వీధి చిత్రంతో బ్రిటిష్ రాణి అరవై యేళ్ల పండగని ఈ విధంగా బ్యాంక్సీ జరపుకున్నాడని ఔత్సాహికులు వ్యాఖ్యానిస్తున్నారు. రాణి గారి అరవై యేళ్ల…

‘ఫేస్ బుక్’ ఐ.పి.ఒతో యూజర్ల డేటాకి ప్రమాదం? -కార్టూన్

‘యాక్సిడెంటల్ బిలియనీర్’ మార్క్ జుకర్ బర్గ్ స్ధాపించిన ‘ఫేస్ బుక్’ శుక్రవారం నుండి షేర్ మార్కెట్ లోకి ప్రవేశించిన సంగతి విదితమే. ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్’ (ఐ.పి.ఒ) ద్వారా ‘ఫేస్ బుక్’ సోషల్ నెట్ వర్కింగ్ కంపెనీ షేర్ విలువ 38 డాలర్ల తో ప్రారంభం అయింది. అంటే దాని మార్కెట్ కేపిటలైజేషన్ విలువ దాదాపు 102 బిలియన్ డాలర్లు (ఇప్పటి రూపాయి విలువ ప్రకారం 5.5 లక్షల కోట్ల రూపాయలకు సమానం) అన్నమాట. ఐ.పి.ఒ ప్రకటించడం…

‘పర్షియన్ గల్ఫ్’ వివాదంపై గూగుల్ కి ఇరాన్ హెచ్చరిక

మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) లో ప్రధాన నీటి అఖాతం ‘పర్షియన్ గల్ఫ్’ పేరును గూగుల్ తన మేప్ సర్వీస్ లో తొలగించడం పై న్యాయ చర్యలు తీసుకుంటానని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ను ఇతర గల్ఫ్ దేశాలనుండి ‘పర్షియన్ గల్ఫ్’ సముద్ర జలాలు వేరు చేస్తాయి. ప్రపంచంలోనే భారీ స్ధాయిలో క్రూడాయిల్ నిల్వలు ఈ సముద్ర జలాల్లో ఉన్నట్లు కనుగొన్నప్పటి నుండీ ఈ ప్రాంతానికి ఆర్ధిక, రాజకీయ, వాణిజ్య ప్రాముఖ్యత పెరిగింది. ఈ జలాల్లో ఉన్న హోర్ముజ్…

సాయుధ బలగాల్లో మహిళల ప్రవేశానికి మోకాలడ్డుతున్న ప్రభుత్వం

సాయుధ బలగాల్లో మహిళల ప్రవేశానికి ‘రక్షణ మంత్రిత్వ శాఖ’ అడ్డుపడుతోందని పార్లమెంటరీ కమిటీ దుయ్యబట్టింది. మగ అధికారుల సంఖ్యలో లోపాన్ని పూడ్చడానికి వీలుగా ‘టైమ్ గ్యాప్’ ఏర్పాటు గా మాత్రమే మహిళా అధికారుల సేవలను పరిగణించడం పట్ల అభ్యంతరం తెలిపింది. త్రివిధ దళాల సేవలకు మహిళలను అనర్హులుగా చూస్తున్నారని ఎత్తిచూపింది. మహిళలకోసం శాశ్వత కమిషన్ కు అనుమతి ఇవ్వకుండా సాగదీయడం ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ ‘వివక్ష’ పాటిస్తున్నదని కూడా పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. సాయుధ దళాల్లో…

‘అంటరానితనం’ ఎటూ పోలేదు -వీడియోలు

‘అంటరానితనం చట్టరీత్యా నేరం’ అంటోంది భారత రాజ్యాంగం. ‘అస్పృశ్యత’ ని నిషేధించామంటున్నాయి దళిత చట్టాలు. దళితుల అభ్యున్నతికి ఎన్నో చట్టాలు చేశామంటున్నాయి రాజకీయ పార్టీలు. ప్రపంచంలో ఘనమైన ప్రజాస్వామిక దేశం భారతదేశమని విద్యాధికులు కీర్తిస్తున్నారు. భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని మన్మోహన్, అహ్లూవాలియా, చిదంబరం ల కూటమి గర్వంగా చాటుతోంది. కులాల పునాదులు బలహీనపడ్డాయి అంటున్నారు కమ్యూనిస్టు కార్యకర్తలు. ఇవేవీ భారత దేశ దళితులను ‘అంటరానితనం’ నుండి విముక్తి చేయలేదని ఈ వీడియోలు చెబుతున్నాయి.  దేవాలయాల్లో…

‘అంబేద్కర్ కార్టూన్’ గొడవ ‘అంబేద్కర్’ కే అవమానం -దళిత సంఘాలు

‘అంబేద్కర్ కార్టూన్’ పై పార్లమెంటులో జరిగిన రగడ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కే తీవ్ర అవమానమనీ, భావ ప్రకటనా స్వేచ్ఛ పైన దాడి అనీ దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ప్రకటించాయి. “నెహ్రూ-అంబేద్కర్ కార్టూన్ గానీ, దానితో ఉన్న పాఠ్యం గానీ దానంతట అదే అభ్యంతరకరం కాదని స్పష్టంగా చెబుతున్నాం. నిజానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వంలో ‘రాజ్యాంగ అసెంబ్లీ’ నిర్వహించిన కష్టమైన పనిని అది సమున్నతంగా అభినందించేదిగా ఉంది” అని వివిధ హక్కుల…

Pranab Austerity

త్వరలో ఇండియాలోనూ ‘పొదుపు విధానాలు’ -కార్టూన్

గురువారం ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్ సభలో ఓ జోక్ పేల్చాడు. త్వరలో భారత దేశంలోనూ ఆయన ‘పొదుపు విధానాల్ని’ తెస్తాడట. దేశాన్ని ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతున్నాయనీ వాటిని ఎదుర్కోవడానికి ‘పొదుపు విధానాలు’ తప్పవనీ ‘బడ్జెట్ ఆమోదం’ ముగిసాక ఆయన లోక్ సభ సభ్యుల్ని ఉద్దేశిస్తూ హెచ్చరిక చేశాడు. ఆయన ఆ ప్రకటన చేసినా, ప్రతిపక్ష సభ్యుల్లో ఎవరూ అదేమని ప్రశ్నించినవారు లేరు. ఆయన ప్రకటనని ఎవరూ గుర్తించినట్లు కూడా కనిపించలేదు. అదేదో తప్పనిసరన్నట్లుగా, మామూలే…

అమెరికాలో ఇతరులకంటే తగ్గిన తెల్లవారి జననాలు

అమెరికా జననాలలో జాతి పరంగా చూస్తే తెల్లవారి జననాల సంఖ్య మైనారిటీలో పడిపోయింది. జులై 2011 తో ముగిసిన సంవత్సరంలో తెల్లజాతి ప్రజల్లో జననాల సంఖ్య మొత్తం జననాల్లో 49.6 శాతం నమోదయినట్లు బి.బి.సి తెలిపింది. నల్లజాతి ప్రజలు, హిస్పానిక్ లు, ఆసియా ప్రజలతో పాటు సమ్మిళిత జాతులలో జననాల సంఖ్య 50.4 శాతంగా నమోదయింది. హిస్పానికేతర తెల్లజాతి ప్రజలు మొదటి సారిగా జననాల్లో మైనారిటీలో ఉన్నారని బి.బి.సి తెలిపింది. తెల్లవారిలో జననాల సంఖ్య తగ్గిపోవడానికి ఆర్ధిక…

పోలీసుల సాయంతో తివారీకి రక్తపరీక్షలు చేయండి -ఢిల్లీ కోర్టు

పోలీసుల సహాయం తీసుకుని తివారీ కి రక్త పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ కోర్టు తమ రిజిస్ట్రార్ కి ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్, యు.పి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా కూడా పని చేసిన ఎన్.డి.తివారీ తనకు తండ్రి అంటూ రోహిత్ శేఖర్ అనే 32 యేళ్ళ యువకుడు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. డి.ఎన్.ఏ పరీక్షల ద్వారా రోహిత్ ఆరోపణలను నిర్ధారించడానికి కోర్టు ప్రయత్నిస్తున్నప్పటికీ రక్త నమూనా ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చాడు.…

క్లుప్తంగా… 14.05.2012

జాతీయం పార్లమెంటుకి 60 సంవత్సరాలు భారత పార్లమెంటు సమావేశమై ఆదివారం (మే 13) తో 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం జరిపింది. రాజ్య సభ లో ప్రధాని మన్మోహన్, లోక్ సభలో ఆర్ధిక మంత్రి ప్రణబ్ చర్చ ప్రారభించారు. పార్లమెంటులో పదే పదే అవాంఛనీయ సంఘటనలు జరగడం పట్ల ప్రధాని ఆందోళన వెలిబుచ్చాడు. “సమావేశాలకు ప్రతిరోజూ ఆటంకాలు ఎదురు కోవడం, వాయిదాలు పడడం, కేకలు వేయడం వల్ల బైటి వారికి…

క్లుప్తంగా… 13.05.2012

జాతీయం డబ్ల్యూ.టి.ఒ లో ఇండియా పై అమెరికా ఫిర్యాదు ప్రపంచ వాణిజ్య సంస్ధలో ఇండియాపై అమెరికా ఫిర్యాదు చేసింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే కోడి మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఇండియా విధించిన నిబంధనలు ‘వివక్ష’తో కూడి ఉన్నాయని అమెరికా ఫిర్యాదు చేసింది. ‘సానిటరీ అండ్ ఫైటో సానిటరీ’ (ఎస్.పి.ఎస్) ఒప్పందం ప్రకారం మానవుల ఆరోగ్యంతో పాటు, జంతువులు మొక్కలను కూడా కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకునే హక్కు డబ్ల్యూ.టి.ఒ సభ్య…