వియత్నాం నెత్తిన అమెరికా రుద్ధిన యుద్ధ భీభత్సం -ఫొటోలు

1962 నుండి అమెరికా దురాక్రమణ యుద్ధ భీభత్సాన్ని అతి చిన్న దేశం ‘వియత్నాం’ నెత్తిన రుద్దింది. కమ్యూనిస్టు చైనా ప్రాబల్యం వియత్నాం దేశంలోకి విస్తరిస్తుందన్న భయంతో వియత్నాం ప్రజలపై అమెరికా బలవంతంగా రుద్దిన యుద్ధం ఇది. జాతీయ విముక్తి యుద్ధాల ఫలితంగా ప్రపంచంపై యూరోపియన్ దేశాల వలసాధిపత్యం అంతరించాక అమెరికా తన సామ్రాజ్యాధిపత్యాన్ని విస్తరించడానికి అనేక దుర్మార్గ యుద్ధాలను ప్రపంచ దేశాలపై రుద్ధడం ప్రారంభించింది. అమెరికా కంపెనీల ప్రయోజనాలను ప్రపంచ వ్యాపితంగా విస్తరించడంతో పాటు, కమ్యూనిస్టు వ్యవస్ధల…

క్లుప్తంగా… 12.05.2012

మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి అమెరికా సైనికులకు ‘ఇస్లాం’ వ్యతిరేక పాఠాలు వియత్నాం యుద్ధ ఫోటోగ్రాఫర్ ‘హార్స్ట్ ఫాస్’ మరణం జాతీయం మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి భారత దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ -ఐ.ఐ.పి) మరో సారి నిరాశ కలిగించింది. మార్చి 2012 నెలలో పెరగకపోగా తగ్గిపోయింది. -3.5 శాతం వృద్ధి నమోదు చేసింది. అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు, రూపాయి…

క్లుప్తంగా… 11.05.2012

మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ 2010 లో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు 16.8 లక్షలు జి8 సమావేశానికి పుటిన్ ఎగనామం, అమెరికాపై నిరసనతోటే స్వలింగ వివాహాలకి ఒబామా ఆమోదం జాతీయం మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి నాలుగు గోడల మధ్య అధికారులకు చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే అది నేరం కాబోదని గుజరాత్ అల్లర్లపై నియమించబడిన ‘స్పెషల్ ఇన్వెస్టివేషన్…

ఈసారీ సకాలంలోనే ఋతుపవనాలు -ఐ.ఎం.డి

ఈ సంవత్సరం కూడా సకాలంలోనే జూన్ 1, 2012 తేదీనే ఋతుపవనాలు దేశంలో ప్రవేశించనున్నాయని ‘ఇండియన్ మీటియోరోలాజికల్ డిపార్ట్ మెంట్’ మంగళవారం ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఋతుపవనాలు ప్రవేశించడం దాదాపు ఖాయమయిందనీ తెలిపింది. ప్రతి యేటా మే 20 న దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించే నైరుతి ఋతుపవనాలు అనంతరం జూన్ 1 తేదీన కేరళ తీరాన్ని తాకడం ద్వారా దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయి. రైతులు వ్యవసాయం కోసం ప్రధానంగా వర్షాలపై ఆధారపడే భారత…

పాఠ్య గ్రంధాల్లో 200 కార్టూన్ల సమీక్షకు నిర్ణయం

ఎన్.సి.ఇ.ఆర్.టి (National Council of Educational Research and Training) రూపొందించిన పాఠ్య గ్రంధాల్లో ఉన్న కార్టూన్లు అన్నింటినీ సమీక్షించి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంబేడ్కర్, నెహ్రూ లతో ఉన్న కార్టూన్ పై చెలరేగిన అనవసర వివాదం స్కూల్ పిల్లలకు వివిధ అంశాలపై సాపేక్షికంగా తేలిక పద్ధతిలో అవగాహన కల్పించే ఒక బోధనా పద్ధతి ని దెబ్బ కొట్టింది. కార్టూన్ల ద్వారా వివిధ రాజకీయ శాస్త్రాంశాలను బోధించే పద్ధతి స్కూల్ పాఠ్య గ్రంధాల నుండి మాయం…

(మావో ధాట్) మావో ఆలోచనా విధానం అంటే? -2

అర్ధ భూస్వామ్య వ్యవస్ధలో మేజార్టీ ప్రజలకు భూమి పధాన ఉత్పత్తి సాధనంగా, శ్రమ సాధనంగా కొనసాగుతుంది. కానీ భూస్వామ్య వర్గాలదే పూర్తి ఆధిపత్యం కాదు. వారిలో కొందరు పెట్టుబడిదారీ వర్గంగా రూపాంతరం చెందుతారు. కొంతమంది గ్రామాల్లో భూస్వామ్య ఆధిపత్యం కొనసాగిస్తూనే పట్నాల్లో పెట్టుబడిదారీ వర్గంలోకి ప్రవేశించారు. భారత దేశంలో ఇలాంటి అనేకమందిని మనం చూడగలం. [భారత దేశ భూస్వామ్య వ్యవస్ధకు ‘కుల వ్యవస్ధ’ ప్రధాన పట్టుగొమ్మ. కులం పునాదులు బలహీనపడుతున్నాయని చెబుతున్నప్పటికీ అగ్ర కుల భూస్వామ్య వర్గ…

మావో ఆలోచనా విధానం (మావో ధాట్) అంటే? -1

(మిత్రుడు కొండలరావు గారు మావో ఆలోచనా విధానం గురించి అడిగిన ప్రశ్నకు సంక్షిప్త వివరణ కోసం ఈ పోస్టు రాస్తున్నాను -విశేఖర్) నూతన ‘ప్రజాస్వామిక విప్లవం – మావో ధాట్’ వివరణకి ఇవి అవసరం అని భావిస్తూ ఇవి రాస్తున్నాను. – ఇప్పుడు ప్రపంచంలో రెండు ప్రధాన వ్యవస్ధలు ఉన్నాయి. ఒకటి సంపూర్ణ పెట్టుబడిదారీ వ్యవస్ధలు, రెండు అర్ధ భూస్వామ్య అర్ధ వలస వ్యవస్ధలు. సాధారణంగా బయటి దేశాల జోక్యం లేకుంటే భూస్వామ్య వ్యవస్ధలను కూల్చివేయాల్సిన కర్తవ్యం…

యెడ్యూరప్ప రాజీనామా వాయిదా, కర్ణాటక సంక్షోభం తీవ్రం

సోమవారం భవిష్యత్తు నిర్ణయించుకుంటానని చెప్పిన యెడ్యూరప్ప బి.జె.పి కి రాజీనామా చేసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఎం.ఎల్.ఎ ల ఒత్తిడితో పాటు పార్టీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ విజ్ఞప్తి మేరకు తన రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు పత్రికలకు చెప్పాడని ఎన్.డి.టి.వి తెలిపింది. అయితే ముఖ్యమంత్రి సదానంద గౌడ పై ఆయన విమర్శలు కొనసాగించాడు. మరో వైపు బి.జె.పి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడాన్ని కొట్టి పారేయలేమని జనతా దళ్ (సెక్యులర్) నాయకుడు సిద్ధ రామయ్య…

ప్రజాందోళనలు అణచివేసేందుకు సైన్యాన్ని దించుతాం -ఇటలీ

దేశంలో జరుగుతున్న ప్రజాందోళనలను అణచివేయడానికి సైన్యాన్ని దించక తప్పదని ఇటలీ ప్రధాని ‘మేరియో మోంటి’ ప్రకటించాడు. ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై ఇటలీ ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఆందోళనలు తీవ్రం అయ్యాయి. ఐ.ఎం.ఎఫ్, ఇ.యు ల ఒత్తిడితో యూరోపియన్ దేశాలు పొదుపు విధానాలు అమలు చేస్తుండడంతో అక్కడ నిరుద్యోగం పెరిగిపోయి సామాజిక సమస్యలు తీవ్రం అయ్యాయి. వినాశకర ఆర్ధిక విధానాలు అమలు చేయడం ఆపాలని ప్రజలు కోరుతుండగా వారి మొర ఆలకింకడానికి…

వంద యేళ్ల క్రితం కలకత్తా -ఫొటోలు

బ్రిటిష్ ఇండియా కాలం నాటి కలకత్తాలో ప్రజా జీవనాన్ని తెలిపే ఫొటోలివి. అరుదయిన గ్లాస్ ప్లేట్ నెగిటివ్ లు లండన్ లోని ఒక మ్యూజియం ఆర్కైవ్స్ లో ఇవి లభ్యం అయ్యాయి. RCHAMS (Royal Commission on the Ancient and Historical Monuments of Scotland) వెబ్ సైట్ ఈ ఫొటోలను ప్రచురించింది. ఇవి 1912 నాటి ఫొటోలని తెలుస్తోంది. స్టేట్స్ మెన్ పత్రిక కాపీలతో చుట్టి ఉన్న 178 గ్లాస్ ప్లేట్ నెగిటివ్ ల  ప్యాకేజి…

అవినీతి సహచరులను కాపాడుతున్నందుకు సోనియాపై యెడ్యూరప్ప ప్రశంసలు

కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి యెడ్యూరప్ప కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై ప్రశంసలు కురిపించాడు. సోనియా తో పాటు ఆమె పార్టీని కూడా యెడ్యూరప్ప ప్రశంసించాడు. బి.జె.పి లాగా కాకుండా కష్టాల్లో ఉన్న పార్టీ మంత్రులకు కాంగ్రెస్ గానీ, ఆ పార్టీ నాయకురాలు గానీ తోడు నిలుస్తారనీ, మద్దతునిచ్చి కాపాడుకుంటారని ఆయన పొగడ్తలు కురిపించాడు. కర్ణాటక ముఖ్య మంత్రి సదానంద గౌడ ను ‘మోసగాడి’ గా ఆయన తిట్టిపోసాడు. ఆరు నెలల తర్వాత తన ముఖ్య…

‘పొదుపు విధానాల’ పై ఇటాలియన్ల సమ్మె

ఇటలీ నగరంలో పొదుపు విధానాలను వ్యతిరేకిస్తున్న కార్మికులు, విద్యార్ధులపైన పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. దక్షిణ ఇటలీ నగరం నేపుల్స్ లో పోలీసులు, ప్రజల ఘర్షణలు తీవ్ర స్ధాయిలో జరిగాయని ప్రెస్ టి.వి తెలిపింది. ప్రభుత్వ పన్నుల విధానాలతో ఆగ్రహం చెందిన కార్మికులు, విద్యార్ధులు పన్నుల కార్యాలాయం ముందు ఆందోళన నిర్వహించారు. పోలీసులు లాఠీ ఛార్జీ చేసి ప్రదర్శకులను తరిమివేయడానికి ప్రయత్నించడంతో ప్రదర్శకులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దానితో విద్యార్ధులు కార్మికులు పోలీసులపై బాటిళ్ళు, కోడిగుడ్లు విసిరారని పత్రికలు…

తననూ వదలొద్దని కోరిన నెహ్రూ -కార్టూన్

ప్రజాస్వామిక వ్యవస్ధకు ‘ఫోర్త్ ఎస్టేట్’ గా పత్రికలను అభివర్ణించడం అందరూ ఎరిగిందే. కార్టూన్ ద్వారా రాజకీయ విమర్శలు చేయడం అత్యంత శక్తివంతమైన ప్రక్రియగా పత్రికలు అభివృద్ధి చేశాయి. కాసిన్ని గీతల ద్వారా ప్రకటించే రాజకీయ అభిప్రాయాలని నిషేధించాలని కోరడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్ధలో అత్యంత ముఖ్యమైన ‘భావప్రకటనా స్వేచ్ఛ’ కు సంకెళ్లు వేయాలని కోరడమే. అందుకే ప్రజాస్వామ్య ప్రియులైన రాజకీయ నాయకులు తమను తాము విమర్శలకు అతీతులుగా ఎన్నడూ పరిగణించరు. భారత దేశ ప్రధమ ప్రధాని ‘జవహర్…

క్లుప్తంగా… 10.05.2012

జీన్స్, టీ షర్ట్ అసభ్య దుస్తులు, వేసుకోవద్దు -పంజాబ్ ప్రభుత్వం పాకిస్ధాన్ మైనారిటీలను కాపాడండి -విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ అణచివేతపై ‘గాంధీ మార్గం’లో తిరుగుబాటు చేస్తున్న పాలస్టీనియన్లు   జాతీయం జీన్స్, టీ షర్ట్ అసభ్య దుస్తులు, వేసుకోవద్దు -పంజాబ్ ప్రభుత్వం జీన్స్, టీ షర్ట్ లు అసభ్య దుస్తులనీ వాటిని వేసుకొని ఆఫీసుకి రావద్దని హర్యానా ‘స్త్రీ, శిశు సంక్షేమ శాఖ’ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నా అందుకు…