ఫుకుషిమా వద్ద పొంచి ఉన్న పెను ప్రమాదం -ది హిందూ

ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద మరో వినాశకర ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తీవ్ర స్ధాయిలో హెచ్చరిస్తున్నారు. హీరోషిమా అణు బాంబు కంటే 5,000 రెట్లు రేడియేషన్ వాతావారణంలోకీ విడుదలయ్యే ప్రపంచ స్ధాయి ప్రమాదం సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కోల్డ్ షట్ డౌన్’ పూర్తయిందని గత డిసెంబరు లో జపాన్ ప్రభుత్వం ప్రకటించినా వాస్తవ పరిస్ధితి అది కాదని వారు వెల్లడించారు. కర్మాగారంలో ప్రమాద స్ధాయిని తగ్గించడం కంటే ప్రమాదాన్ని కప్పి పుచ్చుతూ, సేల్స్…

ప్లే స్టేషన్ కోసం మహిళను హత్య చేసిన బాలుడు

ప్లే స్టేషన్ కొనుక్కోవడం కోసం 14 సంవత్సరాల బాలుడు వృద్ధ మహిళను హత్య చేసి నగలు దొంగిలించాడు. పిన్నితో కలిసి పొరుగింటి మహిళను హత్య చేసిన బాలుడు తర్వాత శవాన్ని పాక్షికంగా తగలబెట్టి దూరంగా వదిలిపెట్టాడు. బాలుడు, అతని పిన్ని, శవాన్ని దూరంగా పారేయడానికి సహరించిన బాబాయి లు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు లోని కాంచీపురం జిల్లా ఎస్.పి ఎస్.మనోహరన్ ప్రకారం తిరువుల్లూరు జిల్లా సరిహద్దులోని సెంగాడు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న గుర్తు…

ముందు నీ రాష్ట్రం సంగతి చూసుకో, మోడీ తో నితీష్

బీహార్ అభివృద్ధిపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వ్యాఖ్యలను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరస్కరించాడు. బీహార్ గురించి వ్యాఖ్యానించే ముందు గుజరాత్ సంగతి చూసుకోవాలని హెచ్చరించాడు. నేరుగా మోడీని సంబోధించకుండానే సొంత రాష్ట్ర వ్యవహారం సరిచేసుకోకుండా ఇతర రాష్ట్రాల్లో వేలు పెట్టొద్దని హెచ్చరించినంత పని చేశాడు. బీహార్ లో కుళ్ళిపోయిన కుల రాజకీయాల వల్ల ఆ రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడిపోయిందని ఆదివారం రాజ్ కోట్ లో బి.జె.పి సమావేశంలో ప్రసంగిస్తూ నరేంద్ర మోడి వ్యాఖ్యానించాడు. ఒకప్పుడు…

రక్షిస్తానని వచ్చి లిబియా పౌరులను భక్షించిన రోగ్ ‘నాటో’

ఆయుధ మదంతో అచ్చోసిన ఆంబోతులా ప్రపంచంలోని స్వతంత్ర దేశాలను కబళిస్తున్న నాటో, ‘మానవతా జోక్యం’ పేరుతో పశువులా తెగబడుతున్న వైనాన్ని ఐక్యరాజ్య సమితి నివేదికలు, మానవ హక్కుల సంస్ధలు ఈసడిస్తున్నాయి. గడ్డాఫీ బారినుండి లిబియా పౌరులను రక్షిస్తానంటూ ఐక్యరాజ్య సమితి తీర్మానం ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న నాటో, వైమానిక బాంబు దాడులతో  వేలమంది పౌరుల్ని చంపేసి అంతర్జాతీయ సంస్ధల విచారణకు మోకాలడ్డుతోందని హార్ట్ ఫర్డ్ లోని ట్రినిటీ కాలేజీ లో బోధిస్తున్న విజయ్ ప్రసాద్ ‘ది…

జగన్ మరో రెండు వారాలు జైల్లోనే, నార్కోకి అనుమతి కోరిన సి.బి.ఐ

ప్రభుత్వాన్ని మోసగించి ప్రజాధనాన్ని అక్రమంగా సొంత ఖాతాలకు తరలించిన కేసులో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి కోర్టు మరో రెండు వారాలు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జూన్ 25 వరకూ రిమాండు పొదిగిస్తున్నట్లు సి.బి.ఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ పైన దాఖలైన రెండవ, మూడవ ఛార్జీ షీట్లను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆయనపై పి.టి (ప్రిసనర్ ట్రాన్సఫర్) వారంట్ జారీ చేసి సోమవారం ఇతరులతో పాటు కోర్టుకి రప్పించుకుంది. మే 27 నుండి జగన్…

టైర్ ఊడిపోయినా విమానాన్ని భద్రంగా దింపిన కెప్టెన్ ఊర్మిళ

ఆందోళన చెందవలసిన సమయంలో సైతం ధైర్యం కోల్పోకుండా 48 మంది విమాన ప్రయాణీకులను భద్రంగా గమ్యం చేర్చిన మహిళా కెప్టెన్ ఉదంతం ఇది. ఎయిర్ ఇండియాకి చెందిన విమానం ఒకటి సిబ్బందితో సహా 52 మంది ప్రయాణికులతో సిల్చార్ నుండి గౌహతి వెళ్లడానికి టేక్ ఆఫ్ అవుతుండగానే ముందు చక్రాలలో ఒకటి ఊడి పడిపోయింది. అయినప్పటికీ విమానాన్ని భద్రంగానే గౌహతీ లో దింపి, కెప్టెన్ ఊర్మిళ పలువురు ప్రశంసలు అందుకుంది. ఎయిర్ ఇండియాకి చెందిన విమానం ఎటిఆర్…

అండర్ వాటర్ పోటోగ్రఫీ పోటీలు -ఫొటోలు

అండర్ వాటర్ ఫొటో గ్రఫీ పోటీలో వివిధ మెడళ్లు గెలుచుకున్న ఫొటోలివి. ‘అండర్ వాటర్ పొటోగ్రఫీ వెబ్ సైట్, ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తుంది. అనేక కేటగిరీల్లో పోటీలు జరిపి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ను బహూకరిస్తుంది. ప్రపంచం మొత్తం నుండి ఈ వెబ్ సైట్ నిర్వహించే పోటీల్లో పాల్గొంటారు. ఈ సారి 130 దేశాల నుండి 11.000 కి పైగా ఫొటోలు పోటీలకోసం సమర్పించబడ్డాయి. అందులో కొన్నింటిని ఎన్నిక చేసి టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించింది.…

తమ సిరియా దుష్ప్రచారానికి తామే బలైన బ్రిటన్ విలేఖరులు

సిరియా ‘కిరాయి తిరుగుబాటు’ పై వివాదాస్పద రీతిలో ఏకపక్షంగా వార్తలు ప్రచురిస్తున్న పశ్చిమ దేశాల విలేఖరులకు కాస్తలో చావు తప్పింది. దుష్ట బుద్ధితో తాము రాస్తున్న అవాస్తవ వార్తలకు సరిగ్గా వ్యతిరేక అనుభవం ఎదురై ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు’ బైటపడ్డారు. తమ చావు ద్వారా అంతర్జాతీయంగా జరుగుతున్న దుష్ప్రచారంలో అదనపు పాయింట్లు కొట్టేద్దామనుకున్న కిరాయి తిరుగుబాటుదారుల అసలు స్వరూపం వెల్లడి చేయక తప్పని పరిస్ధితి చానెల్ 4 చీఫ్ కరెస్పాండెంట్ ‘అలెక్స్ ధాంసన్ ఎదుర్కొన్నాడు. కిరాయి…

సిరియాలో జరుగుతున్నదీ, పత్రికల్లో వస్తున్నదీ ఒకటి కాదు -అన్హర్ కొచ్నెవా

సిరియా లో బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారనీ, ప్రభుత్వం వారినీ అత్యంత క్రూరంగా చంపుతోందనీ, అణచివేస్తోందనీ పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. నిత్యం అక్కడ హత్యాకాండలు జరుగుతున్నాయనీ ప్రభుత్వ సైనికులు, ప్రభుత్వ మద్దతుదారులయిన మిలిషియా లు అత్యంత క్రూరంగా ప్రజలను చంపుతున్నాయనీ వార్తలు ప్రచురిస్తున్నాయి. ఈ మధ్యనే ‘హౌలా హత్యాకాండ’ అంటూ అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లతో పాటు ఇతర పశ్చిమ దేశాలు కాకి గోల చేస్తూ సిరియా పై…

దేశ రాజధాని సమీపంలో పరువు హత్య, హత్యా ప్రయత్నం

ప్రేమించిన పాపానికి తండ్రీ, సోదరులే హత్యలకు సిద్ధపడ్డారు. భారత దేశ రాజధాని న్యూఢిల్లీ కి సమీపంలోనే శనివారం రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. తమ ఊరిలోనే వేరొక వ్యక్తిని ప్రేమించినందుకు తన కూతురిని తండ్రే ఉరి బిగించి చంపగా, అక్కడికి సమీపంలోని మరో ఊరిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి సోదరుడు కాల్పులు జరిపాడు. భార్యా, భర్తలు ఇరువురూ ఆసుపత్రిలో తేరుకుంటున్నట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ శివార్లలోని సోనిపట్ లో నివసిస్తున్న బ్రజేష్ సింగ్ కి 12…

అవిశ్రాంత లేఖాయుధ పోరాట యోధుడు సుభాష్ అగర్వాల్

ప్రణాళికా సంఘం కార్యాలయంలో టాయిలెట్ల కోసం 35 లక్షలు ఖర్చు పెట్టిన సంగతిని వెలికి తీసి దేశాన్ని నివ్వెరపరిచిన 62 సంవత్సరాల సుభాష్ అగర్వాల్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. టీ చుక్క ముట్టని ఈ లేఖాయుధుడు పత్రికలకు లేఖలు రాసి ఆ లేఖలనే ఆయుధాలుగా ప్రభుత్వంలోని అనేక విభాగాలలో జరుగుతున్న అనేక తప్పులను సవరించుకునేలా ఒత్తిడి చేసిన ధీమంతుడు. రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్ అధికారులకు ప్రజల పట్లా, వారి అవసరాల పట్లా ఉన్న ఉదాసీనతనూ, ఛీత్కార…

మన్మోహన్ ప్రభుత్వానికి బరువవుతున్న చిదంబరం -కార్టూన్

కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్న పి.చిదంబరం పై ‘అక్రమ ఎన్నిక’ కేసు కొనసాగించడానికి మద్రాసు హై కోర్టు నిర్ణయం తీసుకుంది. తన ఎన్నికపై పిటిషన్ ని కొట్టివేయాలంటూ చిదంబరం దాఖలు చేసుకున్న అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. దానితో కేంద్ర మంత్రిగా చిదంబరాన్ని కొనసాగించాలా లేదా అన్నది మన్మోహన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ అవసరాన్ని ప్రధాని గుర్తించాడో లేదో గానీ, గుర్తించకపోతే పుటుక్కున తెగి నెత్తిపైనే పడడం ఖాయంగా కనిపిస్తోంది.లేదంటే, రాజీనామా చేయాలన్న బి.జె.పి డిమాండ్…

కువైట్ పై దాడికి 8 రోజుల ముందు, అమెరికా ఇరాక్ ల మధ్య ఏం జరిగింది?

ఆగస్టు 2, 1990 న కువైట్ పై ఇరాక్ దాడి చేసింది. ఇది దురాక్రమణ అని అమెరికా గగ్గోలు పెట్టింది. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందని బి.బి.సి లాంటి వార్తా సంస్ధలు ప్రకటించాయి. స్వేచ్ఛా ప్రపంచంలో ఇలాంటి దాడులు కూడదని, ఇరాక్ బలగాలు బేషరతుగా కువైట్ నుండి విరమించుకోవాలని అమెరికా అధ్యషుడు జార్జి బుష్ (సీనియర్) అమెరికా పార్లమెంటు లోపలా బయటా ఎదతెరిపి లేకుండా నీతులు, బోధలు కురిపించాడు. ఒక స్వతంత్ర దేశంపై…

ఎర్ర సూర్యుడి నుదుట ‘శుక్ర’ తిలకం -ఫొటోలు

మరో వందేళ్లకు గాని సంభవించని ఖగోళ అద్భుతం జూన్ 5, 6 తేదీలలో ప్రపంచ ప్రజలకు దర్శనం అయింది. ఎనిమిది సంవత్సరాల తేడాతో సూర్య తలంపై జంట మార్గాల్లో ప్రయాణం చేసే శుక్ర గ్రహం ఎనిమిదేళ్ల క్రితం జూన్ 8, 2004 తేదీన మొదటి ప్రయాణం పూర్తి చేసుకుంది. మళ్ళీ ఎనిమిదేళ్లకు రెండవ ప్రయాణం పూర్తి చేసింది. (భూగ్రహ వాసుల కంటిని రిఫరెన్స్ గా తీసుకున్నందున ఇక్కడ జంట ప్రయాణాలుగా ఉపమానీకరించడం.) మామూలు జనానికి ఇదేమీ పెద్ద…

అమెరికా ఆశల మేరకు చైనాతో మిలట్రీ పోటీకి ఇండియా అనాసక్తి?

అమెరికా ప్రకటించిన ‘ఆసియా-పసిఫిక్’ విధానంలో చైనాతో మిలట్రీ పోటీకి ఇండియాను నిలపడం పట్ల భారత రక్షణ మంత్రి అనాసక్తి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఆసియా పై అమెరికా కేంద్రీకరణ పెరగడం వల్ల పొరుగున ఉన్న సముద్రాల్లో ముఖ్యంగా బంగాళాఖాతంలో ఆయుధ పోటీ పెరుగుతుందని ఇండియా భావిస్తున్నట్లు భారత అధికార వర్గాలను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. అమెరికా తన విధానాన్ని పునరాలోచించాలనీ, పునర్మూల్యాంకనం చేసుకోవాలని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టాకు భారత్ సూచించిందని అధికారులు తెలిపారు. ‘ఆసియా-పసిఫిక్ కేంద్రంగా…