ఇంటర్నెట్ సెన్సార్ షిప్ లో అమెరికా తర్వాత స్ధానం ఇండియాదే -గూగుల్

2011 రెండో అర్ధ భాగానికి గూగుల్ కంపెనీ ‘ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్’ వెలువరించింది. ఈ కాలంలో యూజర్ల కంటెంట్ ను తొలగించాల్సిందిగా ప్రభుత్వాల నుండి వచ్చిన ఆదేశాల సంఖ్యలో అమెరికా తర్వాత స్ధానాన్ని ఇండియా ఆక్రమించింది. అమెరికా, ఇండియా లు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలుగా వర్ధిల్లుతుండడం గమనార్హం. 2011 లో మొదటి అర్ధ భాగం కంటే రెండో అర్ధ భాగంలో ఇండియా నుండి 49 శాతం ఎక్కువగా సెన్సార్ షిప్ ఆదేశాలు అందాయని గూగుల్…

కట్టెలమ్మిన చోట పూలమ్మనున్న ప్రణబ్ -కార్టూన్

పాలక కూటమి తరపున రాష్ట్రపతి పదవికి పోటీదారుడుగా ప్రణబ్ ముఖర్జీ ఖరారయ్యాడు. ఆర్ధికంగా సమస్యలు తీవ్రం అవుతున్న దశలోనే అనుభవజ్ఞుడయిన ప్రణబ్ ముఖర్జీని ఆర్ధిక మంత్రిగా వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దపడడం ఒకింత ఆశ్చర్యకరమే. అయితే మమత బెనర్జీ సహాయ నిరాకరణ, ఆంధ్ర ప్రదేశ్ లాంటి చోట్ల పార్టీ బాగా బలహీనపడుతుండడం లాంటి పలు కారణాల నేపధ్యంలో రానున్న రోజుల్లో కేంద్రంలో రాజకీయంగా గడ్డు పరిస్ధితులు ఎదురుకావచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనిపిస్తొంది. ప్రతిపక్ష ఎన్.డి.ఎ కూటమి అంతర్గత కుమ్ములాటలతో…

కాంగీ, టి.డి.పి రెంటి నుండీ ఓట్లు గుంజుకున్న వైకాపా

18 అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఒక లోక్ సభ నియోజకవర్గానికీ జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చిందీ చూసినట్లయితే కాంగ్రెస్, తెలుగుదేశం రెండు పార్టీల నుండీ వైకాపా ఓట్లు గుంజుకున్నట్లు స్పష్టం అవుతోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువగా ఈ సారి కాంగ్రెస్ కి ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుండి ప్రధానంగా ఓట్లు చేజిక్కించుకున్న వైకాపా తెలుగుదేశం నుండి…

అణు విద్యుత్తుని పక్కకు నెట్టి, సోలార్ విద్యుత్ తో రికార్డులు సృష్టిస్తున్న జర్మనీ

ఆధునిక శాస్త్ర సాంకేతిక ఉత్పత్తులలో పేరెన్నిక గన్న జర్మనీ, దేశానికి అవసరమైన విద్యుత్తులో మూడు వంతులు సూర్య శక్తి నుండే ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. మరో పదేళ్ళలో అణు విద్యుత్ ను పూర్తిగా త్యజించడానికి సాహసోపేతమయిన నిర్ణయం తీసుకున్న జర్మనీ, అణు విద్యుత్తు కంటే శుభ్రమైన ఇంధనం లేదన్న కంపెనీల ప్రచారాన్ని తిప్పికొడుతూ సూర్య శక్తి వినియోగంలో ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది. 20 న్యూక్లియర్ పవర్ స్టేషన్ల సామర్ధ్యానికి సమానంగా గంటకు 22 గిగావాట్ల విద్యుత్…

ఇండియాకు తాలిబాన్ నుండి అనూహ్య ప్రశంసలు

భారత పాలకులకు ఆఫ్ఘన్ తాలిబాన్ నుండి అనూహ్య రీతిలో ప్రశంసలు లభించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లో మిలట్రీ పరంగా జోక్యం చేసుకోవాలన్న అమెరికా ఒత్తిడిని భారత్ సమర్ధవంతంగా ప్రతిఘటించిందని తాలిబాన్ కొనియాడింది. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లియోన్ పెనెట్టా ను భారత్ ఒట్టి చేతులతో పంపి మంచిపని చేసిందని ప్రశంసించింది. స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం పరితపిస్తున్న ఆఫ్ఘన్ ప్రజల ఆకాంక్షలకు భారత్ విలువ ఇచ్చిందనీ, అమెరికా ఒత్తిడికి లొంగి ఆఫ్ఘన్ ఆపదలోకి భారత్ ను నెట్టకుండా విచక్షణ చూపారని…

కన్న కూతురిపై అత్యాచారం, ఫ్రెంచి రాయబారి పై కేసు నమోదు

పతన విలువలకి పరాకాష్ట ఇది. బెంగుళూరు లో నియమితుడైన ఫ్రాన్సు రాయబారి మూడున్నరేళ్ల కూతురుపై అత్యాచారం జరిపినట్లు బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాయబారిని ఇంకా అరెస్టు చేయలేదని ఎన్.డి.టి.వి తెలిపింది. రాయబారి దేశం విడిచి వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భారతీయురాలైన అతని భార్య హోమ్ మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖలకు లేఖలు రాసింది. ఫ్రెంచి జాతీయులైన తమ ముగ్గురు పిల్లలను భర్త కస్టడీకి ఇవ్వరాదని ఆమె డిమాండ్ చేస్తోంది. ఫ్రెంచి రాయబారిపై కేసు…

ఉచ్ఛనీచాలు మరిచిన కొడుకుని చంపించిన తల్లిదండ్రులు

ఇదో హృదయ విదారకమైన కధ. తాగి అరాచకం సృష్టించడమే కాక తల్లితోనే అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకుని ఎలా బాగు చేయాలో ఆ వృద్ధ దంపతులకు అర్ధం కాలేదు. కొడుకు తన జీవితం నాశనం కేస్య్కోవడమే కాక, తాగి వచ్చి కోడలిని విపరీతంగా కొడుతున్నా బలహీనులైన వృద్ధులు అడ్డుకోలేకపోయారు. దెబ్బలు తట్టుకోలేక కోడలు పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోతున్నా ధైర్యం చెప్పి అండ నిలవలేకపోయారు. పనికి పోకుండా తాగి తందనాలాడుతూ డబ్బుల కోసం తమనే వేధిస్తుంటే సహిస్తూ బతికారు.…

తిండిలేక చనిపోతున్న యెమెన్ పిల్లలు సం.కి 34,000 -ఫొటోలు

యెమెన్ దేశంలో అత్యధిక శాతం పిల్లలు పోషకాహారం లేక చనిపోతున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 58 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతుండగా, 46 శాతం మంది తక్కువ బరువుతో తీసుకుంటున్నారని యునిసెఫ్ ప్రకటించింది. ఐదేళ్లలోపే చనిపోతున్న పిల్లల్లో 60 శాతం మంది పోషకాహార లోపం వల్లనే చనిపోతున్నారని ఆ సంస్ధ తెలిపింది. ఫలితంగా యెమెన్ లో పోషకార లోపం వల్ల ప్రతి సంవత్సరం 34,000 మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహార లోపం వల్ల…

ఫుకుషిమా: అణు పరిశ్రమతో బ్రిటన్ ప్రభుత్వం కుమ్మక్కు -ది గార్డియన్

జపాన్, ఫుకుషిమా అణు ప్రమాదాన్ని ప్రజలకు తక్కువ చేసి చూపడానికి బ్రిటన్ ప్రభుత్వం అంతర్జాతీయ అణు పరిశ్రమతో కుమ్మక్కయిందని ‘ది గార్డియన్’ పత్రిక వెల్లడి చేసింది. బ్రిటన్ లో మరో ఆరు కొత్త అణు విద్యుత్ కర్మాగారాలను నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించినందున ఫుకుషిమా ప్రమాదం వల్ల తమ నిర్ణయాలకు ఆటంకం కలగవచ్చని భయపడింది. ఫుకుషిమా ప్రమాదం వాస్తవాలు వెల్లడయితే కొత్త కర్మాగారాల స్ధాపనకు ప్రతిఘటన పెరుగుతుంది గనక, దానికి వ్యతిరేకంగా అణు పరిశ్రమ వర్గాలతో కలిసి బ్రిటన్…

అత్యాచారం ఆరోపణలపై వుమెన్ అధ్లెట్ ‘పింకీ ప్రామాణిక్’ అరెస్ట్

తనతో సహజీవనం చేస్తున్న మరో మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై భారత మాజీ అధ్లెట్ పింకీ ప్రామాణిక్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పింకీ ప్రామాణిక్ వాస్తవానికి మహిళ కాదనీ, మగవాడేననీ బాధితురాలు ఆరోపించినట్లు బెంగాల్ పోలీసులు తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు నిరాకరిస్తోందని బాధిత మహిళ ఫిర్యాదు చేసిందని వారు తెలిపారు. సౌత్ ఆసియా గేమ్స్, ఆసియాడ్, కామన్ వెల్త్ లాంటి పోటీల్లో భారత దేశానికి వివిధ గోల్డ్…

యు.పి.ఎ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరు? -కార్టూన్

కేంద్ర ప్రభుత్వంలో అధికారం నెరుపుతున్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ తమ రాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించలేక మల్లగుల్లాలు పడుతోంది. కూటమి నాయకురాలు కాంగ్రెస్ కి, రెండవ అతి పెద్ద పార్టీ త్రిణమూల్ కాంగ్రెస్ నుండే షాక్ ట్రీట్ మెంట్ ఎదురయింది. కాంగ్రెస్ తన అభ్యర్ధిగా ప్రణబ్ ముఖర్జీని ప్రమోట్ చేస్తుండగానే, త్రిణమూల్, మాజీ రాష్ట్రపత్రి అబ్దుల్ కలాం ను తన ఫేఫరెట్ గా ప్రకటించింది. పనిలో పనిగా ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా రాష్ట్రపతి పదవికి ఒక…

టెర్రరిస్టు వ్యతిరేక పోరాట సహకారానికి అమెరికా మొండి చేయి

భారత దేశం ఎదుర్కొంటున్న టెర్రరిస్టు సమస్య పై పోరాటంలో సహకారం ఇవ్వవలసిన అమెరికా అందుకు నిరాకరిస్తున్నదని భారత పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. టెర్రరిజం పై పోరాడేందుకు ఇరు దేశాల మధ్య సహకార ఒప్పందం ఉన్నప్పటికి అది ఆచరణలో ఒక వైపు మాత్రమే అమలవుతోందని చెబుతున్నాయి. భారత దేశం వైపు నుండి అమెరికాకి ఎంతగా సహకారం అందజేస్తున్నప్పటికీ భారత దేశానికి సహకారం ఇవ్వవలసిన పరిస్ధితిలో అమెరికా మొండి చేయి చూపుతోందని ఆరోపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఇరు దేశాల విదేశాంగ…

భారత దేశ సార్వభౌమాధికారంలోకి చొరబడుతున్న ఎస్&పి -కార్టూన్

ఎస్ & పి రేటింగ్ సంస్ధ పరిమితులను దాటుతోంది. ఎకనమిక్ ఫండమెంటల్స్ ను పరిశీలిస్తూ పెట్టుబడులు పెట్టడానికి మదుపుదారులకు మార్గదర్శకత్వం వహించే పాత్ర పరిమితులను దాటిపోయింది. ఇండియా క్రెడిట్ రేటింగ్ ని ‘ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్’ కంటే తగ్గిస్తామని హెచ్చరిస్తూ ఈ కంపెనీ, భారత ప్రభుత్వ నాయకత్వ సామర్ధ్యం పై కూడా తీర్పు ఇవ్వడానికి సిద్ధపడింది. జిడిపి వృద్ధి రేటు తగ్గిపోవడానికి కారణాలను మన్మోహన్ నాయకత్వంలోనూ, సోనియా గాంధి చొరబాటులోనూ వెతకడానికి ప్రయత్నించింది. రేటింగ్ ఇచ్చే పేరుతో…

ఆసియన్ అమెరికన్ల ఎదుగుదలపై ‘బాంబూ సీలింగ్’ -ఎన్.డి.టి.వి

అమెరికా కంపెనీలలో ఆసియా-అమెరికన్లు ఉన్నత స్ధానాలకు ఎదగకుండా అనేక ఆటంకాలు విధిస్తున్నారని ఎన్.డి.టి.వి తెలిపింది. ఆసియా-అమెరికన్లు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, తమ సామర్ధ్యం ఎంతగా రుజువు చేసుకున్నప్పటికీ కార్పొరేట్ అమెరికా వారిని గుర్తించడం లేదనీ తెలిపింది. కంపెనీలకి విధేయులుగా ఉంటున్నప్పటికీ తమను తాము కంపెనీలకు చెందినవారుగా భావించలేకపోతున్నార తెలిపింది. ఆసియా-అమెరికన్లు ఎదుర్కొంటున్న ఆటంకాలకు  అమెరికా సమాజంలో ఆసియన్లకు వ్యతిరేకంగా, అమెరికన్లకు అనుకూలంగా ‘పక్షపాతం’ పాతుకుపోయి ఉండడమే కారణమనీ ఇటీవలి సర్వేనూ, వివిధ నిపుణులనూ ఉటంకిస్తూ తెలియజేసింది. ఆసియా-అమెరికన్…

మన కాలంలో గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ‘కారల్ మార్క్స్’ -బిబిసి సర్వే (2005)

మన కాలంలో అత్యంత గొప్ప తత్వవేత్త ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి బి.బి.సి రేడియో 4, 2005 లో సర్వే నిర్వహించింది. 20 మంది ముఖ్యమైన తాత్వికులను బి.బి.సి షార్ట్ లిస్ట్ చేయగా వారిలో ‘కారల్ మార్క్స్’ అత్యధిక ఓట్ల శాతంతో ప్రధమ స్ధానంలో నిలిచాడు. అత్యంత గౌరవనీయమైన, ప్రభావశీలమైన ‘ఫిలసాఫికల్ ధింకర్స్’  లో ‘కారల్ మార్క్స్ ప్రధమ స్ధానంలో నిలిచాడని బి.బి.సి జులై 13, 2005 తేదీన ప్రకటించింది. 30,000 మంది ఓట్లను లెక్కించగా,…