మనకీ ఉన్నారు కామిక్ హీరోలు! -కార్టూన్

ప్రపంచం అంతా పాపులారిటీ సంపాదించిన కామిక్ హీరోలంతా దాదాపు పశ్చిమ దేశాల వాళ్ళే. సూపర్ మేన్, బ్యాట్ మేన్, స్పైడర్ మేన్, ఫాంటమ్ ఇత్యాదూలంతా పశ్చిమ దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ప్రాణం పోసుకున్నవారు. వారితో సమానంగా పాపులారిటీ సంపాదించిన జంతు రూప’ కామిక్ క్యారెక్టర్లు కూడా అక్కడివే. అదేం కాదు, మనకి కూడా కామిక్ హీరోలు, క్యారెక్టర్లు ఉన్నారని చెబుతున్నారు ది హిందూ కార్టూనిస్టు. సృజనాత్మకత ఉట్టిపడుతున్న మన కామిక్ హీరోల గొప్పతనాన్ని కనిపెట్టడానికి కేశవ్ లాంటి…

స్నోడెన్ రాజకీయ ఆశ్రయం, వివిధ దేశాల స్పందనలు

ప్రపంచ ప్రజలపై అమెరికా దొంగచాటు నిఘాను బట్టబయలు చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ సకల దేశాల ఎజెండాలోకి చేరిపోయాడు. రాజకీయ ఆశ్రయం కోరుతూ ఆయన వివిధ దేశాలకు వినతి పత్రాలు పంపడంతో ఆయా దేశాల ప్రజాస్వామ్య కబుర్ల ముసుగులు ఒక్కొక్కటిగా తొలగించుకుంటున్నాయి. రాజకీయ ఆశ్రయం పొందడం ప్రపంచంలో ప్రతి పౌరుడి హక్కుగా ఐక్యరాజ్యసమితి గుర్తించగా సభ్య దేశాలన్నీ దాన్ని ఆమోదించాయి. ఐరాస ఒప్పంద పత్రాలపై తాము చేసిన సంతకాలు ఎంత నామమాత్రమో అనేక దేశాలు వెల్లడించుకోగా, చాలా కొద్ది…

ఓ స్నోడెన్! నిన్ను గుండెల్లో మాత్రమే దాచుకోగలం!!

– రచన: చందుతులసి ఓ స్నోడెన్.. ఓ వేగుచుక్కా… సాహసమే ఊపిరిగా స్వేచ్ఛా కేతనం ఎగరేసిన వీరుడా…… గుంటనక్క గోతుల్ని సాక్ష్యాలతో చాటిన శోధనుడా. నీ ధైర్యం ప్రపంచ యువతను వెన్నుతట్టి లేపుతోంది ఆంక్షలు లేని భావప్రపంచపు కొత్తదారిని చూపుతోంది. ఓ స్నోడెన్ ఓ వెలుగు రేఖా… శాంతిని, స్వేచ్ఛను లోకానికి చాటిన బుద్ధుడు పుట్టిన నేల అనుకొని ఆశ్రయం కోరావా….? సిద్ధార్ధుడ్నే కాదు…ఆయన సిద్ధాంతాల్ని మేమెప్పుడో మర్చిపోయాం. మా కెవడైనా గుర్తుచేస్తే వాన్ని పక్క దేశాలకు…

స్నోడెన్: అమెరికాకు ఇండియా జో హుకుం

భారత పాలకులు తమ విధేయతను మరోసారి రుజువు చేసుకున్నారు. భారత దేశంలో రాజకీయ ఆశ్రయం ఇవ్వాలని కోరిన ఎడ్వర్డ్ స్నోడెన్ విన్నపాన్ని భారత ప్రభుత్వం తోసి పుచ్చింది. ఇంకా ఘోరం ఏమిటంటే అసలు అమెరికా చేస్తున్నది గూఢచర్యమే కాదట!? మేము అన్ని దేశాల ప్రజల సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ సంభాషణలపై గూఢచర్యం చేస్తున్నమాట నిజమే అని స్వయంగా అమెరికా అధ్యక్షుడే ఒప్పుకున్నా భారత పాలకులకు అది నిజం కాదని నమ్మదలుచుకున్నారు. ఇంత దివాళాకోరు పాలకులు మనల్ని పాలిస్తున్నందుకు…

150 గోతాల డబ్బు4 ట్రక్కుల్లో గుజరాత్ కి వెళ్తూ పట్టుబడింది

బహుశా ఇంత మొత్తంలో డబ్బు, నగలు, వజ్రాలు పట్టుబడడం చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఎంత విలువ ఉంటుందో తేల్చడానికి కూడా రెండు రోజులు పట్టేటంత డబ్బు, నగలివి. ముంబై రైల్వే స్టేషన్ నుండి గుజరాత్ కు రవాణా కానుండగా పట్టుబడింది. 40 మంది అంగడియాలు నాలుగు ట్రక్కుల్లో, 150 గోతాల్లో నింపుకుని డబ్బు కట్టలు, బంగారు నగలు, వజ్రాలు ముంబై సబర్బన్ రైల్వే స్టేషన్ కు తీసుకెళ్తుండగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్.ఐ.ఏ), ఇన్ కమ్…

గానుగెద్దు సి.బి.ఐ -కార్టూన్

ఆ, అది చాలా సార్లు దగ్గరగా వచ్చింది లెండి! – బీహార్ గడ్డి కుంభకోణం అందరికీ తెలిసిందే. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇందులో ఒక నిందితుడు. ఈ కేసు అంతిమ తీర్పే తరువాయి అన్న దశలో ఉంది. ఈ దశలో గడ్డి కుంభకోణం కేసును సి.బి.ఐ కోర్టు నుండి మరో కోర్టుకు మార్చాలంటూ ఆయన బీహార్ హై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కేసు కొట్టేసింది. కేసును మార్చాలన్న ఆయన…

ప్రిజం: మరో 4 స్లైడ్లు వెల్లడించిన వాషింగ్టన్ పోస్ట్

అమెరికా అక్రమ గూఢచర్యాన్ని ధ్రువపరిచే మరో నాలుగు పవర్ పాయింట్ స్లైడ్లను ‘ది వాషింగ్టన్ పోస్ట్‘ పత్రిక ప్రచురించింది. ప్రిజం అనే ప్రోగ్రామ్ సహాయంతో 9 ఇంటర్నెట్ కంపెనీల సర్వర్ల నుండి ప్రపంచ ప్రజల సెల్ ఫోన్, ఈ మెయిల్, చాటింగ్ తదితర సంభాషణలను అమెరికా గూఢచార సంస్ధ రికార్డు చేస్తున్న సంగతి ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. గూఢచారులకు ట్రైనింగ్ ఇవ్వడానికి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్లను స్నోడెన్ ద్వారా సంపాదించిన ‘ది…

గ్రీసు రుణ సంక్షోభం: లెంపలు వేసుకున్న ఐ.ఎం.ఎఫ్

దేశాల ఆర్ధిక వ్యవస్ధల తప్పులను సవరించే బాధ్యతను తనకు తాను నెత్తిమీద వేసుకున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్ధ మొదటిసారిగా, పటాటోపానికే ఐనా, లెంపలు వేసుకుంది. గ్రీసు దేశ ప్రజలపై బలవంతంగా రుద్దిన పొదుపు విధానాలు ఎంతవరకు పని చేస్తాయన్న విషయమై తాము తప్పుడు అంచనాలు వేశామని అంగీకరించింది. అమెరికా, ఐరోపాల తరపున ప్రపంచ దేశాల మీద ద్రవ్య పెత్తనం సాగించే ఐ.ఎం.ఎఫ్, తాను తప్పు చేశానని ఒప్పుకోవడం అసాధారణం. అయితే, ఈ ఒప్పుకోలు వలన…

గోపీనాధ్ ముండేకి ఎన్నికల సంస్కరణలు కావాలిప్పుడు -కార్టూన్

గోపీనాధ్ ముండే! ఈయన 2009లో మహారాష్ట్ర లోని బీడ్ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికయిన బి.జె.పి నాయకుడు. లోక్ సభలో బి.జె.పి పార్లమెంటరీ పార్టీకి ఈయన ఉపనాయకుడు కూడా. 2009 ఎన్నికల్లో 19 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేశానని ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చిన ముండే ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ తాను లోక్ సభ ఎన్నికలకు 8 కోట్లు ఖర్చు చేశానని అసలు నిజం వెళ్ళగక్కారు. ఈయన మర్చిపోయి నిజం మాట్లాడలేదు.…

ఐరోపా రాయబారులపై నిఘా, అమెరికాపై ఇ.యు ఆగ్రహం

అమెరికా గూఢచారులకు ఒక్క జనం మాత్రమే కాదు, ఐరోపా రాయబారులు కూడా లోకువే. యూరోపియన్ యూనియన్ రాయబారులు, ఇతర అధికారుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లపై కూడా ఎన్.ఎస్.ఎ గూఢచారులు నిఘా వేశారని స్నోడెన్ పత్రాలను ఉటంకిస్తూ జర్మన్ వార్తల మ్యాగజైన్ డర్ స్పీజెల్ తెలిపింది. ఈ మేరకు ది హిందూ ఓ వార్త ప్రచురించింది. ప్రపంచ వ్యాపితంగా సమస్త దేశాల ఇంటర్నెట్, సెల్ ఫోన్ వినియోగదారుల సంభాషణలపై ‘ప్రిజమ్’ ప్రోగ్రామ్ ద్వారా అమెరికా నిఘా…

ఉత్తర ఖండ్ మరణాలు పదివేలు?

ఉత్తర ఖండ్ జల ప్రళయం మరణాలు పదివేలకు పైనే ఉంటాయని ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మరణాలు ఐదు వేలకు పైనే ఉండొచ్చని అంచనా వేసిన గోవింద్ సింగ్, ఇప్పుడా సంఖ్యను రెట్టింపు చేశారు. గల్లంతయిన వారి సంఖ్య గురించి గ్రామాల నుండి తనకు అందుతున్న సమాచారం ప్రకారం మరణాలు పదివేలకు పైనే ఉండవచ్చని రూఢి అవుతోందని ఆయన తెలిపారు. అయితే ముఖ్యమంత్రి విజయ్…

కేదార్ నాధ్ లో ఏం జరిగింది? -వీడియో

కేదార్ నాధ్ ను ముంచెత్తిన జల ప్రళయం ఎలా జరిగి ఉండవచ్చో ఊహిస్తూ నిపుణులు ఒక వీడియో రూపొందించారు. ఆ వీడియోను హెడ్ లైన్స్ టుడే పత్రిక తన వెబ్ సైట్ లో పబ్లిష్ చేయగా యాహూ న్యూస్ షేర్ చేసింది. వీడియోను ఈ బ్లాగ్ లో పబ్లిష్ చేసే మార్గం దొరకలేదు. అందువలన లింక్ మాత్రమే ఇస్తున్నాను.  వీడియోను ‘ఎందుకో ఏమో?’ గారు కింద వ్యాఖ్య ద్వారా అందించారు. కాబట్టి లింక్ ను తొలగించి వీడియో…

ఔషధ కంపెనీలకు రోగులే పాడియావులు -కార్టూన్

– భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై  యేడ్చు చుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు  బిగియ బట్టి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి పద్యం ఇది. భారత జాతీయోద్యమంలో, ఆ తర్వాత కూడా ఈ పద్యం బాగా ప్రసిద్ధి చెందింది. ఈ పధ్యంలో తెల్లవారి స్ధానంలో బడా ఫార్మసీ కంపెనీలను, లేగదూడలుగా రోగులను చేర్చి చదువుకుంటే చక్కగా సరిపోతుంది. ఈ కార్టూన్ కూడా అదే చెబుతోంది. రాన్ బ్యాక్సీ కంపెనీ ఒక లైఫ్ సేవింగ్…

మానవహక్కుల శిక్షణకు నిధులిస్తా తీసుకో, అమెరికాతో ఈక్వడార్

సార్వభౌమాధికార దేశం అంటే ఇదిగో ఇలా ఉండాలి! ఎంత చిన్న దేశం అయితేనేం, తన సార్వభౌమత్వానికి ప్రతీకాత్మకంగా ఐనా భంగం కలిగించే పెత్తందారీ హెచ్చరికల మొఖం మీద చాచికొట్టినట్లు సమాధానం చెప్పగలిగిన సత్తా ఉన్నపుడు! ఈక్వడార్ ఇప్పుడు అదే చేస్తోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇస్తే ఈక్వడార్ కు లబ్ది చేకూర్చే రెండు వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తానని అమెరికా హెచ్చరించిన గంటలలోపే ఈక్వడార్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. రష్యా టుడే ప్రకారం,…

మతాంతర వివాహంపై మియాన్మార్ బౌద్ధుల ఆంక్షలు

తమిళనాడులో పి.ఎం.కె పార్టీ తరహాలోనే మియాన్మార్ లో బౌద్ధ మత పెద్దలు మహిళా స్వేఛ్ఛపై ఆంక్షలకు తెగబడుతున్నారు. బౌద్ధ యువతులను ఇతర మతాల యువకులు వివాహం చేసుకోకుండా ఆంక్షలు విధించే చట్టం ముసాయిదాను దేశ వ్యాపిత బౌద్ధ సాధువుల సమ్మేళనం ఒకటి ప్రభుత్వానికి సమర్పించబోతోంది. తీవ్రవాద భౌద్ధమత గురువుల ఆధ్వర్యంలో బౌద్ధ సన్యాసులు సమావేశమై ఈ మేరకు గురువారం నిర్ణయం తీసుకున్నారు. బౌద్ధ యువతులు ఇతర మతాల యువకులను పెళ్లి చేసుకోకుండా ఆంక్షలు విధించడానికి ఈ ముసాయిదా…