గుజరాత్ హత్యాకాండ: నేను తప్పు చేయలేదు -మోడి

గుజరాత్ మారణకాండను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి పరోక్షంగా సమర్ధించుకున్నారు. తాను ఏది సరైంది అనుకున్నానో అదే చేశానని నరేంద్ర మోడి రాయిటర్స్ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. పార్టీ ప్రతినిధులు ఆయన మాటలకు దురుద్దేశాలను అంటగడుతున్నారని ఆరోపిస్తున్నప్పటికీ ఆ మాట నరేంద్ర మోడియే ఎందుకు చెప్పరో అర్ధం కాని విషయం. మోడి తాను చెప్పదలుచుకున్నది చెప్పేయడం, దానికి అసలు అర్ధాలేవీటో ఆ తర్వాత పార్టీ ప్రతినిధులు వివరణలకు పూనుకోవడం దేశాన్ని పాలించదలుచుకున్న వ్యక్తులకు,…

ఎన్.ఎస్.ఎ తో కుమ్మక్కై యూజర్లను మోసం చేస్తున్న మైక్రోసాఫ్ట్

అమెరికా రహస్య గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఎ -నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ- తో పేరు పొందిన కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సంస్ధ మైక్రోసాఫ్ట్ కుమ్మక్కయింది. “Your privacy is our priority” అన్న తన మోటోకు తానే స్వయంగా తూట్లు పొడుస్తోంది. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన విండోస్, ఈ మెయిల్ సంస్ధ ఔట్ లుక్ డాట్ కామ్ లకు తాను రూపొందించిన పటిష్టమైన ఎన్ క్రిప్షన్ ను ఛేదించి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించగల తాళాన్ని తానే…

భారత్ పై అతి కేంద్రీకరణే లాడెన్ హత్యకు అవకాశం -పాక్ రిపోర్ట్

భారత దేశంతో ఉన్న సరిహద్దులపై అతిగా దృష్టి కేంద్రీకరించడం వల్లనే అమెరికా నేవీ సీల్ బృందం, పాకిస్ధాన్ లోకి చొరబడి ఒసామా బిన్ లాడెన్ ఇంటిపై దాడి చేయగలిగిందని పాకిస్ధాన్ విచారణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అమెరికా మిలట్రీ సంపాదించుకున్న స్టెల్త్ టెక్నాలజీ (సాధారణ పరిజ్ఞానానికి దొరకని విధంగా విమానాలు ఎగరగల సామర్ధ్యం) కూడా లాడెన్ ఇంటిపై దాడిని విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయపడిందని సదరు నివేదిక తెలిపింది. మే 2, 2011 తేదీన…

గౌరవ మర్యాదలకు విఘాతం -ది హిందు సంపాదకీయం

(బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ ప్రయాణిస్తున్న విమానంలో అమెరికన్ ఎన్.ఎస్.ఏ లీకర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ఉన్నాడన్న అనుమానంతో అమెరికా పనుపున ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ దేశాలు అనుమతి నిరాకరించి, ఆస్ట్రియాలో బలవంతంగా కిందకి దించిన ఉదంతం గురించి ది హిందు పత్రిక బుధవారం -జులై 10- రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం -విశేఖర్) “తన ఇష్టం లేకుండా ఒక పావుగా ఉండవలసిన అవసరం గానీ, అందుకు తగిన కారణం గానీ లాటిన్ అమెరికాకు లేదు,”…

ప్రజాస్వామ్య అమెరికాలో 30,000 ఖైదీల నిరాహార దీక్ష

వివిధ దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన పట్ల ప్రతి సంవత్సరం గొంతు చించుకునే అమెరికా తన పౌరులకు మాత్రం మానవ హక్కులు నిరాకరిస్తుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో జైళ్లలోని అమానవీయ పరిస్ధితులను, చిత్రహింసలను, పోలీసుల అణచివేత పద్ధతులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా వివిధ జైళ్లలోని 30,000 మంది ఖైదీలు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం ఈ సంగతిని మరోసారి తేటతెల్లం చేస్తోంది. బహుశా ప్రపంచ చరిత్రలోనే ఇంతమంది ఆమరణ నిరాహార దీక్షకు దిగడం ఇదే మొదటిసారి కావచ్చు. గ్వాంటనామో…

స్నోడెన్: బొలీవియాకు సారీ చెప్పడానికి రెడీ -స్పెయిన్

బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ ప్రయాణిస్తున్న జెట్ విమానానికి తమ గగనతలంలోకి ప్రవేశించకుండా అనుమతి నిరాకరించినందుకు సారీ చెప్పడానికి స్పెయిన్ సిద్ధపడింది. తాము తప్పు చేయలేదని కాబట్టి బొలీవియాకు ఆపాలజీ చెప్పాల్సిన అవసరం లేదని నాలుగు రోజుల క్రితం ప్రకటించిన స్పెయిన్ ఇంతలోనే తమ అవగాహన మార్చుకోవడం విశేషం. అయితే ఇవా మొరేల్స్ విమానానికి అనుమతి నిరాకరించామని చెప్పడంలో నిజం లేదని స్పెయిన్ విదేశాంగ మంత్రి ఇప్పటికీ చెబుతున్నారు. సంఘటనలో అపార్ధం దొర్లినట్లు కనిపిస్తోందని, అందువల్ల దానికి…

లడఖ్ లో మళ్ళీ చైనా చొరబాటు

లడఖ్ లో మళ్ళీ చైనా చొరబాటు చోటు చేసుకున్నట్లు పి.టి.ఐ తెలిపింది. ఏప్రిల్ నెలలో చొరబడిన ప్రాంతానికి సమీపంలోనే తాజా చొరబాటు జరిగినట్లు తెలుస్తోంది. చుమర్ సెక్టార్ లో చొరబడిన చైనా పి.ఎల్.ఏ బలగాలు భారత సైన్యం నిర్మించిన బంకర్లు కొన్ని ధ్వంసం చేసి కెమెరా కేబుల్స్ ను తెంచివేసినట్లు తెలిసింది. ఈ రోజు (మంగళవారం, జులై 9) వెలుగులోకి వచ్చినప్పటికీ వాస్తవానికి ఈ చొరబాటు జూన్ నెలలోనే జరిగింది. చైనా, భారత్ ల భూభాగాలను విడదీసే…

ఉత్తరఖండ్, బుద్ధగయ మరియు జోకర్ వి.ఐ.పిలు -కార్టూన్

ఉత్తరఖండ్ హిమాలయ విలయం నుండి దేశం ఇంకా తేరుకోనే లేదు. అక్కడింకా శవాల లెక్కలు తేలలేదు. మందాకిని పూడ్చిన గ్రామాలు, పొలాలు పైకి లేవలేదు. విగతులైనవారి అంత్యక్రియలు సైతం పూర్తి కాలేదు. ఇంతలోనే బుద్ధగయ మానవ విధ్వంసం! దేశానికి ప్రకృతి విలయాలు కొత్త కాకపోవచ్చు. ఆ మాటకొస్తే ఉగ్రవాద బాంబు పేలుళ్లు కూడా కొత్త కాదు. కానీ రాజకీయ నాయకులకు, వి.ఐ.పి లకు అవి ఎప్పటికప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అక్కరకు వచ్చే నిత్య నూతన సాధనాలు. ప్రకృతి…

అమెరికాలో ప్రయాణికుల విమానం క్రాష్ ల్యాండింగ్ -ఫోటోలు

సౌత్ కొరియాకు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి అమెరికాలోని శాన్ ఫ్రాన్ సిస్కో నగర విమానాశ్రయంలో దిగుతుండగా అదుపు తప్పి కూలిపోయింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు చనిపోగా 181 మంది వరకూ గాయపడ్డారు. గాయపడ్డివారిలో కనీసం 50 మంది పరిస్ధితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదుపు తప్పి కూలుతుండగా విమానానికి మంటలు అంటుకోవడంతో పలువురు ప్రయాణీకులకు కాలిన గాయాలు అయ్యాయి. ‘ఏసియానా ఎయిర్ లైన్స్’ రవాణా కంపెనీకి చెందిన బోయింగ్ 777 విమానం పైలట్లు…

ఉచిత పధకాల ఖర్చు మోయలేం బాబోయ్! -కార్టూన్

– “మరేం ఫర్వాలేదు – మాకు సంతోషమే. ఎందుకంటే ఆ ఉచితాలన్నింటి ఖర్చు ఇక మేము భరించనక్కర్లేదు కదా!” – రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు ఒక విచిత్రమైన తీర్పు ప్రకటించింది. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పధకాలు అవినీతి కాదని చెబుతూనే అవి ప్రజాస్వామ్యం మూలాలను కుదిపి వేస్తాయని అంగీకరించింది. ఎ.ఐ.ఎ.డి.ఎం.కె ప్రభుత్వం తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత గ్రైండర్లు, మిక్సీలు, ల్యాప్ టాప్ పంపిణీ పధకాలను సుప్రీం కోర్టు సమర్ధించింది. అవి అవినీతి…

ఇళవరసన్ ది హత్యా, ఆత్మహత్యా? -తొలగని అనుమానాలు

ధర్మపురిలో రైలు పట్టాలపై శవమై కనిపించిన ఇళవరసన్ ది హత్యే అన్న అనుమానాలు బలపడుతున్నట్లు కనిపిస్తోంది. ది హిందు పత్రిక ప్రకారం ధర్మపురి ప్రాంతంలో రైలు పట్టాల పక్కన శవం కనిపించినట్లుగా ఏ రైలు అధికారీ రికార్డు చేయలేదని రైల్వే అధికారులు చెప్పారు. రైల్వే నిబంధనల ప్రకారం ఒక రైలు ఏ వ్యక్తినైనా ప్రమాదవశాత్తూ ఢీ కొట్టినా లేక ఆత్మహత్య కోసం రైలు ముందుకు దూకినా సదరు రైలు డ్రైవర్ గానీ, గార్డు గానీ లేదా ఇతర…

ఈజిప్టులో మిలట్రీ ప్రజాస్వామ్యం -కార్టూన్

ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని ప్రపంచంలో ఎన్ని నియంతృత్వాలు పని చేయగలవో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఓట్ల కోసం మద్యం, డబ్బు, బంగారం దగ్గర్నుండి క్రికెట్ కిట్ల వరకూ పంచి పెట్టినా అది ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూలదోసే మిలట్రీ అధికారులు కూడా ‘ప్రజాస్వామ్యం కోసమే కుట్ర చేశాం’ అని చెబుతారు. అదే నోటితో ‘త్వరలోనే ఎన్నికలు జరిపి ప్రజా ప్రభుత్వానికి అధికారం అప్పజెబుతాం’ అని కూడా చెబుతారు. చివరికి హిట్లర్ కూడా తనది ప్రజాస్వామ్య పాలనే…

ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్: గుజరాత్ పోలీసు సాక్ష్యంలో మోడి పేరు

గుజరాత్ ముఖ్యమంత్రి, తమ తరపున భావి ప్రధానిగా బి.జె.పి నిలపనున్నదని పత్రికలు ఊహిస్తున్న నేత అయిన నరేంద్ర మోడి మెడపై మరో కత్తి వేలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇష్రత్ జహాన్, ఆమె స్నేహితుడు ప్రాణేశ్వర్ పిళ్లై అలియాస్ జావేద్ షేక్, మరో ఇద్దరు యువకుల బూటకపు ఎన్ కౌంటర్ కేసులో ఆయన పేరు వినిపిస్తోంది. కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో, గుజరాత్ పోలీసులు కలిసి ఉమ్మడిగా చేసిన కుట్ర ఫలితంగా నలుగురు అమాయకులు బూటకపు ఎన్ కౌంటర్ లో చనిపోయారని…

ఈజిప్టులో మిలట్రీ కుట్ర: రాజ్యాంగం రద్దు, ప్రభుత్వం కూల్చివేత

‘సింగడు పోనూ బోయేడు, రానూ వచ్చేడు’ అని సామెత! ఈజిప్టులో అమెరికా నెలకొల్పిన నడమంత్రపు ప్రజాస్వామ్యం పరిస్ధితి అలాగే తగలడింది. 30 యేళ్ళ ముబారక్ నియంతృత్వ పాలనతో విసుగు చెంది ఉన్న ఈజిప్టు ప్రజల అసంతృప్తిని నేర్పుగా పక్కకు తప్పించి మళ్ళీ తన మరో కీలుబొమ్మనే ఈజిప్టు అధ్యక్షుడుగా ప్రతిష్టించడంలో సఫలం అయిన అమెరికా, మోర్శి వ్యతిరేక ప్రభంజనాన్ని బెదిరింపులతో అరికట్టడంలో విఫలం అయింది. ఐరోపా మద్దతు ఉందని భావిస్తున్న నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ అధినేత, ఐ.ఎ.ఇ.ఎ…

స్నోడెన్ భయం: బొలీవియా అధ్యక్షుడి విమానాన్ని దింపిన ఆస్ట్రియా

అమెరికా, ఐరోపా రాజ్యాలకు ఎడ్వర్డ్ స్నోడెన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయన రష్యా విమానాశ్రయంలో కూర్చుని ఏ దేశం తనకు ఆశ్రయం ఇస్తుందా అని ఎదురు చూస్తుండగా ఆయన తమకు తెలియకుండా ఎక్కడ తప్పించుకుని పోతాడా అని అమెరికా కుక్క కాపలా కాస్తోంది. స్నోడెన్ కోసం అమెరికా ఎంతకు తెగించిందంటే బొలీవియా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానానికి తమ గగనతలంపై ప్రయాణించకుండా ఐరోపా దేశాలపై ఒత్తిడి తెచ్చేటంతగా. ఫ్రాన్సు, పోర్చుగల్, స్పెయిన్ దేశాలు బొలీవియా అధ్యక్షుడు…