రాయల-తెలంగాణ ప్రతిపాదన కె.సి.ఆర్ దే!?

రాయల తెలంగాణ ఏర్పాటును మొట్టమొదట ప్రతిపాదించింది తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయారెనా? అవునంటోంది ‘ది హిందు.’ వినడానికి విచిత్రంగా ఉన్నా అదే నిజమట! రాయల తెలంగాణ ప్రతిపాదన తనకే ఎదురు తిరగడంతో దానిని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన ఇప్పుడు నటిస్తున్నారని పత్రిక సూచిస్తోంది.  ది హిందు పత్రిక మాటల్లోనే ఆ సంగతి చూడడం సముచితం. Sounds strange but true that the proposal of ‘Rayala-Telangana’ with ten districts of Telangana and two…

స్పెయిన్ ప్రమాదం: విధ్వంసం-రుధిరం-దుఃఖం పెనవేసుకుని…

ఎంత సేపని! ఈ ప్రమాదం మొదలయ్యి పూర్తి కావడానికి అయిదంటే అయిదే క్షణాలు పట్టింది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపు 78 ప్రాణాలు హరీమన్నాయి. మృతులు ఎంత హృదయ విదారకంగా మరణించారంటే, 80 మంది మరణించారని చెప్పిన అధికారులు ఆ తర్వాత సంఖ్యను 78కి తగ్గించుకున్నారు. ఈ సంఖ్య మళ్ళీ మారవచ్చని కూడా వారు తెలిపారు. అంటే పెరగవచ్చు, లేదా తగ్గవచ్చు. ప్రమాదంలో విధ్వంసం ధాటికి మృత దేహాల శరీర భాగాలు తునాతునకలై పోవడం వలన ఈ…

తెలంగాణ వ(ఇ)చ్చేసినట్లే!

తెలంగాణ ప్రజల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్ష నెరవేరే రోజు కొద్ది దూరంలోనే ఉందన్న సంగతి దాదాపు ఖాయం అయిపోయింది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసేసుకున్నట్లు అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ది హిందూ పత్రిక తెలియజేసింది. సదరు పత్రిక ప్రకారం ‘ఆహార భద్రతా బిల్లు’ కోసమే ప్రస్తుతం నిర్ణయం ప్రకటన వాయిదా పడింది. తెలంగాణ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన చేసిన వెంటనే సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పిలు రాజీనామా చేసే అవకాశం ఉందని, అలా…

అయితే మేమూ దూరమవుతాం లెండి! -కార్టూన్

“అబ్బే, దాన్నేమీ సీరియాస్ గా తీసుకోనక్కర్లేదు. దాన్నుండి మేము దూరం జరుగుతున్నాంగా!” “ఇహిహి, అది కేవలం జోక్, అంతే. దాన్నుండి మేము దూరంగా జరుగుతున్నాం. సరేనా!” “మరేం పర్లేదు. మేమూ మీ నుండి దూరంగా జరుగుతున్నాం!” దేశంలో పేదల బతుకుల్ని అపహాస్యం చేస్తున్న పేదల ప్రభుత్వాన్ని కాంగ్రెస్ రుచి చూపుతోంది. దారిద్ర్య రేఖకు ప్రణాళికా శాఖ నిర్ణయించిన ప్రాతిపదిక అన్యాయంగా ఉన్నదని సుప్రీం కోర్టు సైతం మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తన కాకి లెక్కలనే మళ్ళీ ప్రకటించింది.…

మోడి, అమార్త్య సేన్, ఓ భారత రత్న

“Politics is the last refuge of scoundrels.” అని పెద్దాయన జార్జి బెర్నార్డ్ షా ఏ సందర్భంలో, ఎందుకు అన్నారో గానీ దాన్ని రుజువు చేయడానికి భారత రాజకీయ నాయకులు అనునిత్యం శ్రమిస్తూనే ఉంటారు. అమార్త్య సేన్ తన భావ ప్రకటనా హక్కును వినియోగించుకుంటూ ‘నరేంద్ర మోడి ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు’ అని చెప్పిన సందర్భం వారికి మరోసారి కలిసొచ్చింది. తన అభిప్రాయం చెప్పినందుకు కొందరు బి.జె.పి నాయకులు ఆయనపై విరుచుకుపడ్డారు. ఒక…

ఎడ్వర్డ్ స్నోడెన్: ఆంక్షల బెదిరింపులకు దిగిన అమెరికా

అమెరికాకు తెలిసిన భాష ఒక్కటే. బెదిరించడం, భయపెట్టడం, మందీ మార్బలంతో దాడి చేయడం, ఆనక  సంక్షోభంలో చిక్కుకోవడం. ఆ సంక్షోభ భారాన్ని మళ్ళీ ప్రపంచం నెత్తిన రుద్దడం. సి.ఐ.ఏ, ఎన్.ఎస్.ఏ ల మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ ను తిరిగి రప్పించడానికి ఇప్పటి వరకు జరిపిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడమే కాక, తనకే బెడిసి కొట్టడంతో అమెరికా బెదిరింపుల తీవ్రతను మరింత పెంచింది. ఎడ్వర్డ్ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇచ్చే దేశాలపై ఆంక్షలు విధిస్తానంటూ…

స్పెయిన్ రైలు ప్రమాదం చివరి క్షణాలు, చూసి తీరాలి -వీడియో

బహుశా ఇలాంటివి స్పెషల్ ఎఫెక్టులతో తీసే హాలీవుడ్ సినిమాల్లోనే చూడగలం. ఈ వీడియో తీసిన వ్యక్తి ఆ క్షణాల్లో అక్కడ ఎందుకు ఉన్నాడో గానీ స్పెయిన్ లో రైలు పట్టాలు తప్పిన చివరి క్షణాలని వీడియోలో బంధించగలిగాడు. గంటకు 180 కి.మీ వేగంతో వస్తున్న హై స్పీడ్ రైలు పట్టాలు తప్పుతున్న దృశ్యాన్ని సజీవంగా బంధించడం ఎలా సాధ్యం? వంపు ఉన్న చోట గంటకి 90 కి.మీ వేగాన్ని మించకూడదని స్పెయిన్ చట్టాలు ఉన్నాయట. ఆ చట్టాన్ని…

స్పెయిన్: 40 యేళ్లలో అతి పెద్ద రైలు ప్రమాదం -ఫోటోలు

స్పెయిన్ లో భారీ రైలు ప్రమాదం చోటు జరిగింది. వంపులో పరిమితికి మించి వేగంతో ప్రయాణించడంతో హై స్పీడు రైలు పట్టాలు తప్పింది. దుర్ఘటనలో ఇప్పటికీ 78 మంది మరణించినట్లు లెక్క తేల్చారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు. పట్టాలు తప్పినప్పుడు రైలు ఎంత వేగంగా వెళ్తోందంటే పట్టాలు తప్పిన ఒక కంపార్టుమెంటు ఆ వేగానికి తన ముందున్న కంపార్టుమెంటుని గుద్దుకుని ఎగిరి పైకి లేచి పక్కనే ఉన్న ఎత్తైన గోడని దాడి అవతల ఉన్న…

హిందుత్వ నుండి మోడి పారిపోగలరా? -కార్టూన్

హిందుత్వను ప్రభోదిస్తూ దాన్నుండి దూరంగా ఉన్నారన్న భ్రమల్ని ప్రజల్లో కలిగించడం అంటే మాటలు కాదు. అలాంటి బృహత్కార్యాన్ని విజవంతంగా నిర్వహించినవారిలో ప్రముఖులు అటల్ బిహారీ వాజ్ పేయ్. హిందూత్వలో మోడరేటర్ గా ముద్ర పొందుతూనే అవసరం వచ్చినప్పుడు కరడు గట్టిన హిందూత్వను ప్రదర్శించడం వాజ్ పేయి కి మించినవారు లేరు. తాను కరకు ఆర్.ఎస్.ఎస్ వాడినని చెబుతూనే సెక్యులరిస్టులకు, హిందూత్వ నుండి దూరంగా ఉండదలచినవారికీ ఆయన ఆమోద యోగ్యుడు కాగలిగారంటే అది వాజ్ పేయి చాతుర్యమే అని…

ఏది చీకటి, ఏది వెలుతురు? పాట ఒకటే చిత్రీకరణలేన్నో!

ఈ పాట రాసింది శ్రీ శ్రీ అని తెలియనివారు ఉంటారనుకోను. రాసినప్పుడు ఆయన పాటగా రాశారో, కవిత్వంగా రాశారో నాకు ఖచ్చితంగా తెలియదు. కవిత్వంగానే రాశారని నేనిన్నాళ్లూ అనుకున్నాను. ఆఫ్ కోర్స్, ఇప్పుడూ అదే అనుకుంటున్నాననుకోండి! ఈ పాటను ఒక సినిమాలోనే వాడుకున్నారని అనుకున్నా ఇన్నాళ్ళు. కానీ ఇంకా ఇతర సినిమాల్లో కూడా వాడుకున్నారని ఈ రోజు తెలిసింది. ‘ఆకలి రాజ్యం’ సినిమాలో ఈ పాటను మొదటిసారి విన్నాను, చూశాను. చాలా చిన్నప్పుడు (ఎనిమిదో తరగతిలో) ఆ…

ఈగ. ఈగ.. ఈగ… యముడి మెరుపు తీగ! -కార్టూన్

ఈగ సినిమా చూశారు కదా! చిన్న ఈగను చంపబోయి ఒక పెద్ద విలను తానే కోరి చావును కొని తెచ్చుకుంటాడు. లేదా ఈగే తెలివిగా విలన్ ను చావు వైపుకి నడిపిస్తుంది. ఇప్పుడు బీహార్ లో నితీశ్ కుమార్ పరిస్ధితి కూడా అలాగే ఉంది చూడబోతే! బుద్ధ గయ పేలుళ్లు, మధ్యాహ్న భోజనం తిని 23 మంది పిల్లలు చనిపోవడం.. ఈ రెండు దుర్ఘటనల అనంతరం ఆసక్తికరమైన మౌనం పాటించిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నట్టుండి…

బోస్టన్ బాంబర్ లొంగిపోయిన రక్తసిక్త క్షణాలు… -ఫోటోలు

గత ఏప్రిల్ నెలలో బోస్టన్ నగరంలో మారధాన్ పరుగు పందెం జరుగుతుండగా బాంబు పేలుళ్లు జరిగిన సంగతి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. చెచెన్యా నుండి వలస వచ్చి అమెరికాలో స్ధిరపడిన ఇద్దరు అన్నదమ్ములు ఈ పేలుళ్లకు బాధ్యులని అమెరికా ఆ తర్వాత తేల్చింది. పేలుళ్లు జరిగిన రోజే పెద్ద సోదరుడు తామర్లేన్ జర్నాయెవ్ ను ఎఫ్.బి.ఐ పోలీసులు కాల్చి చంపేశారు. రెండు రోజుల పాటు బోస్టన్ శివార్లలోని ఎం.ఐ.టి యూనివర్సిటీ సమీపంలో ఇల్లిల్లూ గాలించిన తర్వాత ఒక…

మోడీకి వీసా ఇవ్వొద్దు, అమెరికాకు 65 ఎం.పిల లేఖలు

నరేంద్ర మోడిపై అమెరికా విధించిన వీసా నిషేధాన్ని ఎత్తివేయించడానికి బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ఒక పక్క ప్రయత్నాలు చేస్తుండగానే మరో పక్క ఆయనకు వీసా ఇవ్వొద్దంటూ 65 మంది భారత ఎం.పిలు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు లేఖలు రాశారు. అమెరికా మోడి పట్ల ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని వారు తమ లేఖల్లో కోరారు. లేఖలు రాసిన ఎం.పిల్లో 12 రాజకీయ పార్టీలకు చెందినవారు ఉన్నారని ది హిందు తెలిపింది. వాస్తవానికి ఈ…

ముస్లిం జనాభా: దురభిప్రాయాలు -2

జనాభా పెరుగుదలను ప్రభావితం చేసే కారణాలు ఏమిటి? మతానికి జనాభా వృద్ధికి సంబంధం ఉందా? మతంతో సంబంధం లేకపోతే జనాభా పెరుగుదల దేనితో సంబంధం కలిగి ఉంది? ఇవి పరిశీలించవలసిన ప్రశ్నలు. మతాన్ని ఫెర్టిలిటీతో ముడిపెడుతూ కొన్ని వాదనలు ఉన్నాయి. నిర్దిష్ట మత విశ్వాసాలు వారి జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం అని వీరి వాదన. ముఖ్యంగా ముస్లింలకు ఈ కారణాన్ని ఆపాదిస్తారు. కానీ కాస్త నిదానించి పరిశోధిస్తే జనాభా పెరుగుదలలో మతం జోక్యం ప్రభావం చాలా…

సి.బి.ఐ కేసు కంచికి, ములాయం యు.పి.ఎ గూటికి

సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు మరియు యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లపై జరుగుతున్న అక్రమ ఆస్తుల కేసు విచారణ మూసివేత దిశలో ప్రయాణిస్తున్నదని పత్రికలు ఘోషిస్తున్నాయి. అదే సమయంలో ములాయం పార్టీ యు.పి.ఎ కూటమిలోకి ప్రయాణం చేస్తున్నదని కార్టూన్ సూచిస్తోంది. ఈ రెండు పరిణామాలకు ఎంత గాఢమైన అనుబంధం ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మేరకు ములాయం, అఖిలేష్…