ఎడ్వర్డ్ స్నోడెన్: ఆంక్షల బెదిరింపులకు దిగిన అమెరికా
అమెరికాకు తెలిసిన భాష ఒక్కటే. బెదిరించడం, భయపెట్టడం, మందీ మార్బలంతో దాడి చేయడం, ఆనక సంక్షోభంలో చిక్కుకోవడం. ఆ సంక్షోభ భారాన్ని మళ్ళీ ప్రపంచం నెత్తిన రుద్దడం. సి.ఐ.ఏ, ఎన్.ఎస్.ఏ ల మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ ను తిరిగి రప్పించడానికి ఇప్పటి వరకు జరిపిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడమే కాక, తనకే బెడిసి కొట్టడంతో అమెరికా బెదిరింపుల తీవ్రతను మరింత పెంచింది. ఎడ్వర్డ్ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇచ్చే దేశాలపై ఆంక్షలు విధిస్తానంటూ…




