ఎక్కడున్నావే గొంగళీ అంటే… -కార్టూన్

అద్భుతమైన కార్టూన్ ఇది! మన్మోహన్ సింగ్ అనుసరించిన నూతన ఆర్ధిక విధానాల డొల్లతనాన్ని ఈ కార్టూన్ శక్తివంతంగా వివరిస్తోంది. డంకేల్ ఒప్పందాన్ని అంగీకరించడం తప్ప మరో దారి లేదని చెప్పి డబ్ల్యూ.టి.ఓ ఉరుగ్వే రౌండ్ చర్చలను భారత దేశ ప్రజల నెత్తిన ‘నూతన ఆర్ధిక విధానాలు’గా రుద్దిన మన్మోహన్ తిరిగి బయలుదేరిన చోటికే చేరడం యాదృచ్ఛికం ఎంతమాత్రం కాదు. ఆ విధానాల తీరే అంత. ఏ విధానాలైనా ప్రజల కొనుగోలు శక్తిని స్ధిరంగా పెంచగలిగితేనే కంపెనీలకి లాభాలూ,…

కొండలే రగిలే వడగాలి… … -ఫోటోలు

అమెరికాలో ఈ మధ్య దావనలాలు ఎక్కువైనాయి. మే మొదటివారంలో లాస్ ఏంజిలిస్ సమీపంలో భారీ దావానలంతో పోరాడి అదుపులోకి తెచ్చిన అమెరికన్ అగ్నిమాపక దళం ఈసారి ఆ నగరానికి 140 కి.మీ దూరంలోని రివర్ సైడ్ కౌంటీ వద్ద మరో భారీ దావానలంతో తలపడుతున్నారు. ‘సిల్వర్ ఫైర్’ గా పిలుస్తున్న ఈ దావానలాన్ని అదుపు చేయడానికి దాదాపు 1500 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఆగస్టు 7 తేదీన మొదలయిన మంటలు ఇక్కడి కొండాల్ని ఆసాంతం రగిలిస్తున్నాయి.…

ఐ.ఎ.ఎస్ లను తంతే…..?–కార్టూన్

ఏం జరుగుతుందో తెలియడానికి ఇంతకు మించి వివరంగా బహుశా ఎవరూ చెప్పలేరేమో! ఐ.ఎ.ఎస్ లను ‘అయ్యా, ఎస్’ లు అని ఆంధ్ర ప్రదేశ్ జనం చెప్పుకుంటారు. వారు అలా ‘అయ్యా, ఎస్’ అని ఎందుకు అనవలసి వస్తోందో ఉత్తర ప్రదేశ్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. అధికారులకు కూడా స్పష్టమైన రూల్స్ ని ప్రభుత్వ గ్రంధాల్లో నిర్దేశించి ఉంచారు. కానీ రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, కంపెనీల స్వార్ధ ప్రయోజనాల కోసం వీటిని నీరుగార్చడం లోనే…

పార్లమెంటు పొయ్యిపై ఆహార బిల్లు వంటకం -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రతా బిల్లుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాల నుండీ ఈ బిల్లు గురించి చెబుతూ వచ్చిన కాంగ్రెస్ నిరసనల హోరు మధ్య నిన్ననే పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ నిరసనలు ఆహార భద్రతా బిల్లుపై కాకుండా వేరే అంశాలపైన కావడం గమనార్హం. కొంతమంది తెలంగాణ వద్దని నినాదాలు చేస్తుంటే, మరి కొంతమంది కాశ్మీరులో జవాన్ల హత్యలపై ఆందోళన చేస్తుండగా ఈ బిల్లుని హడావుడిగా ప్రవేశపెట్టారు. విచిత్రం ఏమిటంటే ఇలాంటి తొందర…

పైపైకి దూసుకు పోతున్న దాడులు, చొరబాట్లు -కార్టూన్

“అబ్బో!” “అబ్బే, అక్కడ సంతోషించడానికేమీ లేదులెండి. మన సరిహద్దులో పెరుగుతున్న దాడులు, చొరబాట్లను చూపించే గ్రాఫ్ అది!” – ఇటీవలి కాలంలో కాశ్మీరులో భద్రతా బలగాలపై దాడులు పెరిగాయి. చొరబాట్లు కూడా పెరిగాయని పత్రికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ గడువు (డిసెంబర్ 2014) దగ్గర పడేకొద్దీ కాశ్మీరు లోనూ, సరిహద్దు లోనూ దాడులు పెరగడం గమనార్హం. గడువు సమీపిస్తున్న దృష్ట్యా తాలిబాన్ తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా నానా తంటాలు…

ఫుకుషిమా డ్రైనేజి నీటిలో ప్రమాదకర రేడియేషన్ -కంపెనీ

ఫుకుషిమా అణు కర్మాగారం చల్లబరచడానికి నిర్మించిన డ్రైనేజి వ్యవస్ధ మొత్తం తీవ్రస్ధాయి రేడియేషన్ తో కూడిన నీటితో నిండిపోయిందని కర్మాగారాన్ని నిర్వహిస్తున్న ‘టోక్యో ఎలక్ట్రికల్ పవర్ కంపెనీ’ (టెప్కో) ప్రకటించింది. డ్రైనేజీలో ఇప్పుడు 20,000 టన్నుల నీరు నిలవ ఉన్నదనీ ఇందులో అణు ధార్మికత అత్యంత ప్రమాద స్ధాయిలో ఉన్నదని కంపెనీ తెలిపింది. భూమి అడుగున నిర్మించిన పైపుల్లో ఉన్న ఒక లీటర్ నీటిలో 2.35 బిలియన్ బెక్యూరల్స్ పరిమాణంలో సీసియం రేడియేషన్ (అణు ధార్మికత) ఉన్నట్లు…

కదల్పూర్ లో దుర్గాశక్తి నాగపాల్ -ఫోటోలు

ఈ ఫోటోలను ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. ఐ.ఏ.ఎస్ అధికారి, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అయిన దుర్గాశక్తి మసీదు కూల్చివేత సమయంలో అక్కడ లేరని లీక్ అయిన లోకల్ ఇంటలిజెన్స్ వర్గాల నివేదిక చెబుతోందని, వాస్తవానికి ఆమె అక్కడే ఉన్నారని ఈ ఫోటోల ద్వారా తెలుస్తోందని సదరు పత్రిక అట్టహాసంగా ప్రకటించింది. సంఘటన స్ధలంలో ఉన్న స్ధానికులు తమ సెల్ ఫోన్ ద్వారా ఈ ఫోటోలు తీశారనీ, వారి వద్ద నుండి తాము ఫోటోలు సంపాదించామని ఫస్ట్…

సమాజ్ వాదీ ఐ.ఎ.ఎస్ శిక్షణ శిబిరం -కార్టూన్

ఆగండాగండి! ఇది ఐ.ఎ.ఎస్ లను తయారు చేసే శిక్షణా శిబిరం కాదు. తయారయిన ఐ.ఎ.ఎస్ లకు శిక్షణ ఇచ్చే శిబిరం. ఉత్తర ప్రదేశ్ లో ప్రధాని కావాలని ఆశ పడుతున్న ఎం.పి తండ్రి, ముఖ్యమంత్రి అయిపోయిన కుమారులుంగారు కలిసి ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం. ఇందులో దేనికి శిక్షణ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాలా?

దుర్గ, ఐఎఎస్: నెగ్గేది యాదవ్‌ల పంతమేనా?

అవినీతి రాజకీయ నాయకులకు, ఇసుక మాఫియాకు ఎదురొడ్డి నిలబడిన యువ ఐ.ఎ.ఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ అక్రమ సస్పెన్షన్ విషయంలో తండ్రీ కొడుకులయిన యాదవ్ లిద్దరూ తమ మంకు పట్టు కొనసాగిస్తున్నారు. దుర్గాశక్తికి న్యాయం చేయాలంటూ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాసిన నేపధ్యంలో ఆమె సస్పెన్షన్ జాతీయ స్ధాయి రాజకీయ సమస్యగా ముందుకు వచ్చింది. దానితో ములాయం సింగ్ యాదవ్ తన పుత్రరత్నం తీసుకున్న చర్య సరైనదే అని ప్రకటిస్తుండగా ప్రతిపక్షాలు,…

ఏదీ రూపాయి, ఎక్కడా కనబడదేం? -కార్టూన్

– రాజకీయ నాయకుడు: “రూపాయి చాలాకనిష్ట స్ధాయిలో ఉంది. ఇప్పుడూ – దాన్ని ఇంకా మెరుగ్గా గవర్న్ చెయ్యొచ్చంటారా?” – రూపాయి బతుకు కనాకష్టంగా మారింది. జింబాబ్వే ప్రభుత్వం లాగా జాతీయ కరెన్సీ రూపాయి రద్దు చేసుకుని అమెరికన్ డాలర్ నే కరెన్సీగా చేసుకునే రోజులు దాపురిస్తాయా అన్నట్లు తయారయింది పరిస్ధితి. ఆర్.బి.ఐ, ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రూపాయి పతనం కొనసా…….గుతూనే ఉంది. జులై 8 తేదీన చరిత్రలోనే అత్యంత కనిష్ట స్ధాయి…

జింబాబ్వే సిరీస్: రసూల్ బెంచికే పరిమితం, కాశ్మీర్ గరం గరం

కాశ్మీర్ నుండి మొట్టమొదటిసారిగా భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయిన ఆటగాడు పర్వేజ్ రసూల్. ఐదు మ్యాచ్ ల వన్ డే సిరీస్ లో అతన్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడంతో కాశ్మీర్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పత్రికలు చెబుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో భారత వ్యతిరేక సెంటిమెంట్లు మరోసారి ఊపందుకోవడానికి ఇదొక సందర్భంగా మారినట్లు తెలుస్తోంది. కాశ్మీరు ప్రజల్ని ఎన్నటికీ భారత జాతీయ స్రవంతిలో కలవనివ్వరని చెప్పడానికి…

ఆఫ్ఘన్ యుద్ధం మిగిల్చిన బాల్యం -ఫోటోలు

ఎడతెగని ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో ప్రధానంగా బలవుతోంది అక్కడి స్త్రీలు, పిల్లలు. ఈ యుద్ధం అనివార్యం ఏమీ కాదు. అమెరికా స్వయంగా పెంచి పోషించిన ‘ఒసామా బిన్ లాడెన్’ ను పట్టుకోవడం కోసం అంటూ ఆఫ్ఘనిస్ధాన్ పైన అమెరికా బలవంతంగా రుద్దిన దురాక్రమణ యుద్ధం ఇది. పన్నెండేళ్ళ సుదీర్ఘ యుద్ధంలో అమెరికా బావుకున్నది 2007-08 నాటి మహా ఆర్ధిక మాంద్యం మాత్రమే. అమెరికా, ఐరోపాలు రుద్దిన దురాక్రమణ యుద్ధం పుణ్యాన ఆఫ్ఘనిస్ధాన్ లో మరో యుద్ధ తరం…

సి.ఐ.సి వేటగాడొస్తే పార్టీల పక్షులన్నీ ఐక్యమౌతాయ్ -కార్టూన్

రాజకీయ పార్టీలు తమకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నది సమాచారం ఇవ్వాలని సి.ఐ.సి (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్) కొద్ది వారాల క్రితం తీర్పు చెప్పడంతో పార్టీలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే అయింది. పారదర్శకత గురించి ప్రబోధించే ఈ పార్టీలకు అకస్మాత్తుగా పారదర్శకత రాజకీయ పార్టీల హక్కులకు భంగకరంగా కనిపించడం ప్రారంభం అయింది. అది ఎంతవరకూ వచ్చిందంటే పార్టీలన్నీ ఐక్యమై ఏకంగా సమాచార హక్కు చట్టాన్ని (ఆర్.టి.ఐ చట్టం) సవరించేంతవరకూ. రాజకీయ పార్టీలు సి.ఐ.సి చెప్పినట్లుగా పబ్లిక్…

ఎడ్వర్డ్ స్నోడెన్: రష్యాపై అమెరికా తీవ్ర అసంతృప్తి

ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా ప్రభుత్వం రాజకీయ ఆశ్రయం ఇవ్వడం పట్ల అమెరికా తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. సెప్టెంబర్ లో రష్యా వెళ్లనున్న ఒబామా సందర్శనను తాము పునఃసమీక్షిస్తున్నామని వైట్ హౌస్ ప్రతినిధి జే కార్నీ విలేఖరులకు తెలిపాడని హఫింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. రష్యాతో అమెరికాకు గల సంబంధాలు బహుముఖమైనవని, అయినప్పటికీ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన నేపధ్యంలో పుతిన్ తో ఒబామా జరపనున్న శిఖరాగ్ర సమావేశం సంభావ్యతను తాము పునర్మూల్యాంకనం చేస్తున్నామని కార్నీ…

ఇసుక మాఫియా కరిగిస్తున్న ఒక ప్రభుత్వ ఆయువు -కార్టూన్

అనగనగా ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యువకుడు ముఖ్యమంత్రి. నేరాలను, నేరస్ధ మాఫియాలను తుదముట్టిస్తానని ఆయన శపధం చేసి మరీ అధికారంలోకి వచ్చాడు. ప్రజలు పాపం మాఫియాలను తుదముట్టించే రోజుకోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రజల ఆశలు నెరవేరక పోగా విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయి. మాఫియాలను తుదముట్టించే బదులుగా మాఫియాలను తుదముట్టించే నిజాయితీ అధికారులను తుదముట్టించే కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రజలు ఏదయితే ఆశించి గద్దెనెక్కించారో సరిగ్గా దానికి విరుద్ధంగా మన యువనాయకుడు వ్యవరిస్తున్నారు.…