ఇజ్రాయెల్: యూదు రాజ్యంగా చస్తే గుర్తించం -అరబ్ లీగ్

  ఇజ్రాయెల్ దేశాన్ని యూదు రాజ్యంగా గుర్తించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ ని అరబ్ లీగ్ దేశాలు ఖరాఖండీగా నిరాకరించాయి. యూదు రాజ్యంగా గుర్తిస్తే పాలస్తీనా అరబ్ ల పరిస్ధితి ఏమిటని ప్రశ్నించాయి. పాలస్తీనాలో యూదు సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ముందు నిలిపేయాలని డిమాండ్ చేశాయి. కువైట్ లో ముగిసిన అరబ్ లీగ్ సమావేశాల అనంతరం అరబ్ లీగ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా శాంతి చర్చలు ముందుకు సాగకపోవడానికి ఏకైక కారణం ఇజ్రాయెల్ మాత్రమే అని…

న్యూట్రల్ ఓటుతో భారత జాలర్లను విడుదల చేసిన శ్రీలంక

ఐరాస మానవ హక్కుల సంస్ధలో ఇండియా శ్రీలంకకు అనుకూలంగా వ్యవహరించడంతో శ్రీలంక కృతజ్ఞత చూపింది. భారత్ చర్యకు కృతజ్ఞతగా శ్రీలంక జైళ్ళలో మగ్గుతున్న 98 మంది జాలర్లను విడుదల చేసింది. ఐరాసలో భారత దేశం అనుసరించిన వైఖరికి ప్రతి సుహృద్భావ చర్యగానే భారత జాలర్లను విడుదల చేస్తున్నామని చెప్పి మరీ విడుదల చేసింది. ఉపఖండంలో మారుతున్న ధోరణులకు భారత్-శ్రీలంక చర్యలు అద్దం పడుతున్నాయి. ఐరాస మానవ హక్కుల సంస్ధ (United Nations Human Rights Commission) లో…

క్రిమియాను వదిలేసిన ఉక్రెయిన్, జి8 మీటింగ్ రద్దు

ఉక్రెయిన్ కేంద్రంగా మరో రెండు గుర్తించదగిన పరిణామాలు జరిగాయి. ఒకటి: క్రిమియా నుండి ఉక్రెయిన్ తన సైన్యాలను పూర్తిగా ఉపసంహరించుకుంది. రెండు: జూన్ లో రష్యా నగరం సోచిలో జరగవలసిన జి8 శిఖరాగ్ర సమావేశాన్ని జి7 గ్రూపు దేశాలు రద్దు చేశాయి. ఉక్రెయిన్ నుండి పూర్తి స్వాతంత్ర్యం కోరిన తీర్మానాన్ని క్రిమియా ప్రజలు పెద్ద సంఖ్యలో బలపరచడంతో క్రిమియా పార్లమెంటు తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆ వెంటనే రష్యన్ ఫెడరేషన్ లో సభ్య ప్రాంతంగా…

MH370: చైనా శాటిలైట్ చిత్రంలో విమాన శిధిలాలు?

హిందూ మహా సముద్రంలోనే విమాన శిధిలాలు ఉన్నట్లు అనుమానించేందుకు మరో సాక్ష్యం లభించినట్లు తెలుస్తోంది. ఈసారి చైనా దేశానికి చెందిన శాటిలైట్ ‘గావోఫెన్ –1’ రికార్డు చేసిన చిత్రంలో తాజా ఆనవాళ్ళు లభ్యం అయ్యాయి. మార్చి 18 మధ్యాహ్నం సమయంలో శాటిలైట్ గ్రహించిన ఇమేజ్ లో 22 మీ. పొడవు, 30 మీ వెడల్పు ఉన్న వస్తువు కనపడినట్లు చైనా సమాచారం ఇచ్చిందని మలేషియా రవాణా మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ కౌలాలంపూర్ లో విలేఖరులకు తెలిపారు. ఆస్ట్రేలియా…

ఉక్రెయిన్ లో నీతి బోధ, సిరియాలో రొయ్యల మేత

ఉక్రెయిన్-క్రిమియా విషయంలో ప్రజాస్వామ్యం గురించీ, దేశాల సార్వభౌమ హక్కులు, ప్రాదేశిక సమగ్రతల గురించి తెగ బాధపడిపోతూ రష్యా, క్రిమియా నాయకులపై వ్యాపార, వీసా ఆంక్షలు విధించిన అమెరికా సిరియాకు వచ్చేసరిగా తన కుక్క బుద్ధి మార్చుకోలేకపోతోంది. ఊరందరికి రొయ్యలు తీనొద్దని చెప్పిన పంతులుగారు ఇంటికెళ్ళి భార్యను రొయ్యల కూర చేయమని కోరిన చందంలో సిరియా ప్రజాస్వామ్యం తన పని కాదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్-క్రిమియా విషయంలో రష్యాపై ఏ ఆరోపణలనైతే గుప్పిస్తున్నదో సరిగ్గా అవే నీతి బాహ్య కార్యకలాపాలకు…

రష్యాపై ఆంక్షలను సమర్ధించం -ఇండియా

భారత ప్రభుత్వం రష్యాకు మద్దతుగా నిలబడింది. రష్యాపై ఏకపక్ష ఆంక్షలకు తాము సమర్ధించడం లేదని స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా క్రిమియాలో రష్యా ప్రయోజనాలు ఉన్నాయని గుర్తిస్తున్నామని తెలిపింది. క్రిమియా ప్రజలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉన్నదనీ అదే సమయంలో ఆ ప్రాంతంలో రష్యా ప్రయోజనాలను కూడా తాము గుర్తిస్తున్నామని తెలిపింది. ఈ ప్రకటనతో చైనా తర్వాత రష్యాకు మద్దతు ప్రకటించిన దేశాల్లో రెండో దేశంగా ఇండియా నిలిచింది. ఇండియా, రష్యా, చైనా దేశాలు బ్రిక్స్…

మావాళ్లని విడిపించండి -ఐరాసకు ఇటలీ మొర

ఇండియాకు వ్యతిరేకంగా ఇటలీ తొక్కని గడప లేదు. ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన ఇటలీ మెరైన్ల కేసులో ఇప్పటికే యూరోపియన్ యూనియన్ కు మొర పెట్టుకున్న ఇటలీ తాజాగా ఐక్యరాజ్యసమితి గడప తొక్కింది. భారత దేశం బందిఖానా నుండి తమ మెరైన్లను మీరయినా విడిపించాలని ఐరాసను కోరింది. “మెరైన్లను ఇటలీలో విచారించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ లోగా వారికి (భారత దేశం నుండి) విముక్తి కావాలి” అని ఇటలీ…

రిఫరెండం: రష్యాలో విలీనానికే క్రిమియన్ల ఓటు

క్రిమియాలో జరిగిన ‘ప్రజాభిప్రాయ సేకరణ’ ఫలితాలు వెలువడ్డాయి. రష్యాలో చేరడానికే ప్రజలు భారీ సంఖ్యలో మొగ్గు చూపారు. గతంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్న క్రిమియా ప్రజలు ఉక్రెయిన్ లో బలప్రయోగంతో అధికారం చేపట్టిన పాలకుల పట్ల తమ తీవ్ర వ్యతిరేకతను రిఫరెండంలో స్పష్టంగా వ్యక్తం చేశారు. 80 శాతం వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా వారిలో 97 శాతం మంది రష్యాతో పునరేకీకరణకే ఓటు వేశారు. 1954 వరకు క్రిమియా రష్యాలో…

ఇక ఖాళీ చేస్తే మేలు -అమెరికాతో కర్జాయ్

ఆఫ్ఘనిస్ధాన్ ను ఇక ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ దేశ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అమెరికాను కోరారు. ద్వైపాక్షిక భద్రతా ఒప్పందంపై సంతకం పెట్టకుండా ఉండడం ద్వారా అమెరికా వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నట్లు కనిపిస్తున్న కర్జాయ్ మరోసారి అమెరికా దుర్నీతిని ఎండగట్టారు. ఆఫ్హన్ లో 93 శాతం ప్రాంతాన్ని ఇప్పటికే ఆఫ్ఘన్ సైనికులు కాపాడుతున్నారని, ఇక అమెరికా సైనికుల అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 2014 అనంతరం కూడా అమెరికా బలగాలను ఆఫ్ఘన్ కొనసాగించేందుకు వీలు…

ఉక్రెయిన్: ఆంక్షలు ప్రమాదకరం, తొలి గొంతు విప్పిన చైనా

ఉక్రెయిన్ విషయంలో రష్యాపై ఆంక్షలు విధిస్తామన్న అమెరికా, ఐరోపా బెదిరింపులను చైనా వారించింది. నాలుగు నెలలుగా నలుగుతున్న ఉక్రెయిన్ సంక్షోభంపై ఇంతవరకు చైనా నోరు మెదిపింది లేదు. బ్రిక్స్ కూటమిలో సహ సభ్య దేశమైన రష్యాకు మద్దతు ఇవ్వడానికి చైనా ముందుకు రాలేదు. ఐరాస భద్రతా సమితిలో కూడా శాంతి ప్రవచనాలు పలకడం వరకే పరిమితం అయింది. పైగా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత అనుల్లంఘనీయం అంటూ రష్యాను సుతి మెత్తగా మందలించబోయింది. అలాంటిది రష్యాపై ఆంక్షలు విధిస్తామని…

ఉక్రెయిన్: సిగ్గులేని ద్వంద్వ నీతి నీది, అమెరికాతో రష్యా

ఉక్రెయిన్ విషయంలో పరమ అబద్ధాలను ప్రచారంలో పెట్టిన అమెరికాను రష్యా ఎడా పెడా కడిగిపారేసింది. ద్వంద్వ నీతిని అనుసరించే అమెరికా, సిగ్గు లేకుండా తనకు నీతులు చెప్పడం ఏమిటని జాడించింది. స్వతంత్ర దేశాల మీదికి దండెత్తి ఆక్రమించుకునే నీచ చరిత్ర అమెరికాదే తప్ప తనది కాదని గుర్తు చేసింది. తప్పుడు కారణాలతో అమెరికా సాగించిన దండయాత్రలు, మానవ హననాల జాబితా చదివింది. ఉక్రెయిన్ లో కృత్రిమ ఆందోళనలను రెచ్చగొట్టింది చాలక తనపై తప్పుడు ప్రచారానికి లంకించుకోవడం ఏమిటని…

ఉక్రెయిన్ పై మొదటి వేటు వేసిన ‘పడమటి గాలి’

‘పడమటి గాలి’ ఆరోగ్యానికి మంచిది కాదని వింటుంటాం. ‘అబ్బ! పడమటిగాలి మొదలయిందిరా’ అని పెద్దవాళ్ళు అనుకుంటుండగా చిన్నప్పుడు విని ఉన్నాం. అది ప్రకృతికి సంబంధించిన వ్యవహారం. సాంస్కృతికంగా పశ్చిమ దేశాల సంస్కృతి ఎంతటి కల్లోలాలను సృష్టిస్తున్నదో ‘పడమటి గాలి’ నాటకం ద్వారా రచయిత పాటిబండ్ల ఆనందరావు గారు శక్తివంతంగా ప్రేక్షకుల ముందు ఉంచారు. ఇ.యు వైపుకి ఉక్రెయిన్ జరిగిన ఫలితంగా ఇప్పుడు అదే పడమటి గాలి, ఆ దేశాన్ని చుట్టుముడుతోంది. ప్రజల ఆర్ధిక ఆరోగ్యానికి అదెంత ప్రమాదకరమో…

రష్యాలో విలీనానికి క్రిమియా పార్లమెంటు ఆమోదం

పశ్చిమ రాజ్యాల తెరవెనుక మంతనాలను వెక్కిరిస్తూ క్రిమియా పార్లమెంటు రష్యాలో విలీనం చెందడానికి ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత (Teritorial Integrity) ను రష్యా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా, ఇ.యులు ఒకవైపు రష్యాపై ఆంక్షల బెదిరింపులు కొనసాగిస్తుండగానే క్రిమియా పార్లమెంటు తన పని తాను చేసుకుపోయింది. 1954లో సోవియట్ హయాంలో ఉక్రెయిన్ కు కానుకగా ఇవ్వబడిన క్రిమియా ఇప్పుడు మళ్ళీ స్వస్ధలం చేరడానికి రంగం సిద్ధం అయింది. మార్చి 16 తేదీన జరగబోయే రిఫరెండంలో ప్రజలు…

సంచలన లీక్: కీవ్ హత్యలకు బాధ్యులు పశ్చిమ దేశాలేనా?

ఉక్రెయిన్ ఆందోళనలకు సంబంధించి ఓ సంచలన నిజం వెలుగు చూసింది. ఉక్రెయిన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వం కీవ్ వీధుల్లో చెలరేగిన హత్యాకాండ అనంతరం బలవంతంగా కూల్చివేయబడిన సంగతి తెలిసిందే. రష్యా అనుకూల అధ్యక్షుడుగా పశ్చిమ దేశాలు చెప్పే విక్టర్ యనుకోవిచ్ ఈ హత్యాకాండ జరిపించాడని పశ్చిమ దేశాలు, పత్రికలు ఆరోపించాయి. భవనాలపైన ఉన్న స్నైపర్లు ఆందోళనకారులపై కాల్పులు జరిపారని స్నైపర్లను నియోగించింది అధ్యక్షుడే అని అవి ఆరోపించాయి. అయితే 90 మందికి పైగా చనిపోయిన హత్యాకాండకు…

ఈజిప్టు ప్రభుత్వ మార్పిడితో పాలస్తీనా మూల్యం

ప్రపంచంలో అత్యంత అస్ధిర (volatile) ప్రాంతం మధ్య ప్రాచ్యం. అరబ్ వసంతం పేరుతో గత మూడేళ్లుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఈ సంగతిని మరోసారి నిరూపించాయి. మధ్య ప్రాచ్యంలో కూడా అత్యంత భావోద్వేగ ప్రేరక సమస్య పాలస్తీనా సమస్య. ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన క్రైస్తవ, ఇస్లాం, యూదు మతాలకు జన్మస్ధలం అయిన పాలస్తీనా సమస్య సహజంగానే అనేక ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా కొనసాగుతోంది. ఫలితంగా పాలస్తీనాలో జరిగే పరిణామాలు ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తుండగా, మధ్య ప్రాచ్యంలోని…