బ్రిటిష్ రాణి ఆధిపత్యాన్ని రద్దు చేయనున్న బార్బడోస్!
కరేబియన్ దేశాల్లో ఒకటయిన బార్బడోస్ త్వరలో బ్రిటిష్ రాణి ఆధిపత్యం నుండి వైదొలగడానికి నిర్ణయం తీసుకుంది. సర్వ స్వతంత్ర దేశంగా అవతరించనుంది. బ్రిటిష్ డొమీనియన్ నుండి వైదొలిగి నూతన రిపబ్లిక్ దేశంగా అవతరించనుంది. 400 యేళ్ళ పాటు బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా, బ్రిటిష్ వలస దేశంగా మగ్గిన బార్బడోస్ 1965లో స్వాతంత్రం ప్రకటించుకుంది. స్వాతంత్రం ప్రకటించుకున్నప్పటికీ బ్రిటిష్ డొమీనియన్ లో భాగంగా బార్బడోస్ కొనసాగింది. అనగా ఆ దేశ రాజ్యాధిపతిగా (Head of the State) బ్రిటిష్…