ట్రంపోకలిప్స్ పై అవగాహన -ద హిందూ…

  డోనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ కు 45వ అధ్యక్షులు కానున్నారు. ఈ మాటలు నేడు 324 మంది అమెరికన్ల హృదయాలలో ప్రతిధ్వనిస్తుంది, కొందరు దిగ్భ్రాంతికి లోనై నిరుత్సాహానికి గురి కాగా ఇతరులు సంతోషంలో మైరిచిపోయారు. ఆశ్చర్యకరమైన ఫలితాల పట్ల వ్యక్తం అవుతున్న భావోద్వేగాల లోని ఈ శుద్ధ భిన్నత్వమే దేశం, రెండు సంవత్సరాల పాటు భిన్న ధ్రువాల వైపుగా సాగిన ఎన్నికల ప్రచారం అనంతరం, ఎంత లోతుగా విభజనకు గురై ఉన్నదో తెలియజేసేందుకు చురుకైన సంకేతం.…

అమెరికా: విజితులు, పరాజితులు -ఫోటోలు

డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. అనేక ఆరోపణలు ఆయనపైన గుప్పించారు. పాత చరిత్రలు తవ్వి తీశారు. ఎక్కడా లేని బురదా తెచ్చి జల్లారు. ఒపీనియన్ పోల్స్ అన్నీ ఆయనకు వ్యతిరేకంగా చెప్పించారు. అయినా ట్రంప్ గెలుపు ఆగలేదు. మొత్తం వాల్ స్ట్రీట్ అంతా కట్టగట్టుకుని హిల్లరీ క్లింటన్ వెనక నిలబడ్డా ఆమెను గెలిపించలేకపోయింది. ఆమె వాల్ స్ట్రీట్ మనిషి అన్న నిజమే అమెరికా శ్రామిక ప్రజలను ఆమెకు వ్యతిరేకంగా నిలబెట్టింది.…

గెలుపు బాటలో ట్రంప్, మార్కెట్లలో రక్తపాతం!

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డోనాల్డ్ అమెరికా ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలుపు బాటలో దూసుకుపోతున్నాడు. ఎన్నికల ముందు జరిగిన సర్వేలు అన్నింటిలో హిల్లరీ క్లింటన్ పై చేయి సాధిస్తే అసలు ఫలితాల్లో మాత్రం హిల్లరీ ప్రత్యర్థి ట్రంప్ పై చేయి సాధిస్తున్నాడు. ఈ ఫలితాలతో ఆసియా షేర్ మార్కెట్లలో ఊచకోత మొదలయింది. రక్తపాతం జరుగుతోంది. (షేర్ మార్కెట్లు భారీగా కూలిపోతే దాన్ని బ్లడ్ బాత్ గా పశ్చిమ పత్రికలు చెబుతాయి.) కడపటి…

రు 500, రు 1000 నోట్లు రద్దు -ప్రధాని మోడి

ఎన్‌డి‌ఏ/బి‌జే‌పి/నరేంద్ర మోడి ప్రభుత్వం ఒకింత సంచలన నిర్ణయం ప్రకటించింది. రెండు పెద్ద కరెన్సీ నోట్లను ఈ రోజు అర్ధ రాత్రి నుండి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జాతిని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ప్రధాన మంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారని పత్రికలు, ఛానెళ్లు హోరెత్తిస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని చోట్ల నవంబర్ 11 వరకు రు 500/-, రు 1000/- లను అనుమతిస్తారని ఆ తర్వాత అన్ని చోట్లా నిషేధం అమలు అవుతుందని ప్రధాన మంత్రి ప్రకటించినట్లు తెలుస్తున్నది.…

అమెరికా ఎన్నికలు: స్టాక్ మార్కెట్లలో టెన్షన్!

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
  45 వ అధ్యక్షుడిని లేదా అధ్యక్షురాలిని ఎన్నుకునేందుకు అమెరికా ఈ రోజు ఉద్యుక్తం అవుతున్నది. ఈ ఆర్టికల్ రాసే సమయానికి 35 మిలియన్ల మంది ఓటు వేశారని, ఇంకా 70 మిలియన్ల ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉన్నదని పత్రికలు చెబుతున్నాయి. 65 శాతం వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్నదని అంచనా వేసినందున మరో 30-35 మిలియన్ల వరకు ఓటర్లు పోలింగ్ బూత్ లకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది.…

మీడియా స్వేచ్ఛపై అశుభకర ప్రతిబంధకం -ద హిందు…

హిందీ టెలివిజన్ చానెల్ ఎన్‌డి‌టి‌వి ఇండియా ను నవంబర్ 9 తేదీన 24 గంటల పాటు ప్రసారం కాకుండా నిలిపివేయాలని నిర్దేశిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశం మీడియా స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించడమే. జాతీయ భద్రత అంశానికి సంబంధించినంతవరకు భిన్నాభిప్రాయాన్ని సహించనట్లు కనిపించే ప్రభుత్వం నుండే ఈ సస్పెన్షన్ ఆదేశం వెలువడడంలో పాత్రికేయ రచనాంశాల పైన నిబంధనలు విధించే వైపుగా మొగ్గు చూపే కలత పూర్వక ధోరణి తొంగి చూస్తున్నది. పఠాన్ కోట్…

న్యాయ వ్యవస్ధ లేకుండా చేస్తారా? -సుప్రీం కోర్టు

సాక్షాత్తు సుప్రీం కోర్టు కొరడా ఝళిపిస్తేనే దిక్కు లేకపోతే సామాన్య ప్రజల విన్నపాలకి దిక్కెవ్వరు? “కర్ణాటక హై కోర్టులో మొత్తం ఒక అంతస్ధు అంతా తాళాలు వేసేశారు. ఎందుకంటే అక్కడ జడ్జిలు లేరు మరి. ఒకప్పుడు జడ్జిలు ఉన్నా కోర్టు రూములు ఖాళీగా లేని పరిస్ధితి ఉండేది. ఇప్పుడు కోర్టు రూములు ఉన్నాయి గాని, జడ్జిలు లేకుండా పోయారు. ఇప్పుడు మీరు కోర్టు రూములు మూసేసి న్యాయానికి తలుపులు వేసేస్తున్నారు” అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ…

విభేదాల దేశాలకు నాయకత్వం -ద హిందూ..

[Leading the divided nations, ద ఎడిటోరియల్ – అక్టోబర్ 10,2016- కు యధాతధ అనువాదం.] ********* ఆంటోనియో గుతెయర్ ను సెక్రటరీ జనరల్ పదవికి నామినేట్ చేయడంలో ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి కనబరచిన విశాల ఏకాభిప్రాయం, ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలతో తలపడటంలో మరింత పటిష్టమైన ఐరాస అవతరించే దిశలో శుభప్రదమైన ఆరంభం. గత వారం భద్రతా సమితిలోని 15 సభ్య దేశాలలో 13 -వీటో అధికారం ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాలతో…

కావేరీ ప్రవాహంపై అలజడి -ద హిందూ..

కావేరీ నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ (కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ -CWDT), కావేరీ నిర్వాహక బోర్డు (కావేరీ మేనేజ్మెంట్ బోర్డు -సి‌ఎం‌బి) ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పుడు అది చాలా మంచి కారణాలతోనే అలా చేసింది. ఋతుపవనాల లోటు సంవత్సరాలలో వివిధ ఉప-బేసిన్ లలోని నీటి ప్రవాహాల నమూనా, సాధారణ సంవత్సరాలలోని ప్రవాహాల ఆధారంగా రూపొందించిన నీటి విడుదల సూచి (షెడ్యూలు) తో సరిపోలదు. కావేరీ బేసిన్ లోని నిల్వల స్ధాయి, వర్షాల ధోరణిలను పర్యవేక్షిస్తూ…

దళారి పాలకుల గుట్టు విప్పిన పాక్ రాయబారి

  Pakistan envoy has spilled the beans!  రహస్యాన్ని పాకిస్తాన్ అనుకోకుండా వెళ్ళగక్కింది. ఏమరుపాటున ఉన్నాడో, కావాలనే అన్నాడో తెలియదు గాని పాకిస్తాన్ ప్రధాని ప్రత్యేక కాశ్మిర్ రాయబారి ముషాహిద్ హుస్సేన్ సయీద్ అమెరికా – vis-a-vis దళారీ పాలకుల రహస్యాన్ని వెళ్ళగక్కాడు.  అంతే కాదు, అమెరికా సామ్రాజ్యవాదానికి మూడో ప్రపంచ దేశాల పాలక వర్గాలకు మధ్య ఉన్న యజమాని-దళారి సంబంధాన్ని కూడా పాక్ రాయబారి ప్రపంచానికి తెలియజేశాడు.  “అమెరికా ఇక ఎంత మాత్రం ప్రపంచ…

బ్రెగ్జిట్ చర్చలు 2017 మార్చిలో మొదలు -ప్రధాని

బ్రిటిష్ ప్రజల తీర్పు ‘బ్రెగ్జిట్’ ను అమలు చేసే ప్రక్రియ వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం అవుతుందని బ్రిటిష్ ప్రధాని ధెరెసా మే ప్రకటించారు. కన్సర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ ను ప్రారంభిస్తూ ధెరెసా చేసిన ప్రకటన బ్రెగ్జిట్ విషయమై కాస్త స్పష్టత ఇచ్చిందని యూరోపియన్ యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాగా బ్రిటన్ లోని బ్రెగ్జిట్ వ్యతిరేకులు సణుగుడు కొనసాగించారు. బ్రెగ్జిట్ ఓటింగ్ ముందు వరకు ‘రిమైన్’ (ఈ‌యూ లో కొనసాగాలి) శిబిరంలో ఉన్న…

బీహార్: రెండు తీర్పులు -కార్టూన్

మహమ్మద్ షహాబుద్దీన్ బీహార్ లో పేరు మోసిన రౌడీ. కానీ ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ కి సన్నిహితుడు. బీహార్ ప్రభుత్వం కూడా లాలూ దయతోనే నడుస్తోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమారే అయినా, ఎం‌ఎల్‌ఏ లు ఎక్కువ మంది లాలూ పార్టీ వాళ్ళే. దాంతో హై కోర్టులో షాబుద్దీన్ బెయిల్ కి వ్యతిరేకంగా వాదించే పనికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోలేదు. 17 నెలల పాటు చార్జి షీటు మోపలేదు. పాట్నా హై కోర్టు ఆయనకి బెయిల్ ఇవ్వక…

కావేరి ఎన్నికల యజ్ఞం: బీజేపీ పిల్లి మొగ్గలు!

  కావేరి జలాల పంపిణి వివాదం చుట్టూ  ప్రస్తుత కర్ణాటక రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. పార్టీలు సహేతుకతను కావేరి నీళ్లలో కలిపేసాయి. వీలయినంత గరిష్టంగా రాజకీయ లబ్ది పొందేందుకు ఎత్తులు పై ఎత్తులు రచించి అమలు చేయడంలో నిమగ్నం అయ్యాయి. ఈ ఎత్తులు పై ఎత్తుల ఆటలో తనకు ఏది లాభమో అర్ధం కాక బీజేపీ పిల్లి మొగ్గలు వేస్తూన్నది  కావేరి జలాల సంక్షోభంలో తాము కర్ణాటక ప్రయోజనాలకు ఇతర పార్టీల కంటే అధికంగా కట్టుబడి ఉన్నామని చాటుకోవటానికి…

అమెరికా (అధ్యక్ష ఎన్నికల) చర్చ -ద హిందూ…

ఒక అనుభవజ్ఞులైన రాజకీయ నేత మరియు వైట్ హౌస్ కు పోటీ చేస్తున్న మొట్ట మొదటి నామిని అయిన వ్యక్తి, మొండి అయినప్పటికీ ఆశ్చర్యకారకమైన ప్రజాభిమానాన్ని చూరగొన్న స్ధిరాస్ధి వ్యాపారిని (ఎన్నికలకు ముందు జరగవలసిన) మూడు చర్చలలోని మొదటిదానిలో ఎదుర్కొంటున్న దృశ్యం హైప్ కు తగినట్లుగానే ఆవిష్కృతం అయింది. అత్యధిక మీడియా సంస్ధలు చర్చ విజయాన్ని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, మాజీ విదేశీ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) హిల్లరీ క్లింటన్ కే అప్పగించినట్లు కనిపిస్తుండగా, అనేక…

కల్లోల జలాలు -ద హిందూ…

  ఇండస్ నీటి ఒప్పందం (IWT) పైన సమావేశం నిర్వహించి, పాకిస్తాన్ కు MFN (మోస్ట్ ఫెవర్డ్ నేషన్ -అత్యంత సానుకూల దేశం) హోదా ఇవ్వడం పైన మరో సమావేశాన్ని వచ్ఛే వారం ఏర్పాటు చేయాలని తలపెట్టడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూరి దాడికి ప్రతిస్పందనగా మిలటరియేతర అవకాశాలన్నింటిని పరిశీలిస్తున్నామన్న సంకేతాలను పంపారు. “నెత్తురు, నీళ్లు కలిసి మెలిసి ప్రయాణం చేయలేవు” అని ఆయన అన్నట్లుగా తెలుస్తున్నది. అయినప్పటికీ, సమావేశం తర్వాత, కనీసం ప్రస్తుతానికి…