సర్వ మత హక్కులు కాపాడుతాం –మోడి

“ప్రతి పౌరుని యొక్క హక్కులను, స్వేచ్చను మేము రక్షించి కాపాడతాం. ప్రతి ఒక్క మతము, సంస్కృతి, నమ్మకాలకు చెందిన ప్రతి ఒక్క పౌరుడికి మా సమాజంలో సమాన స్ధానం ఉండేలా చూస్తాము. మా భవిష్యత్తులో నమ్మకాన్ని కల్పిస్తాము. ఆ భవిష్యత్తు సాధించేందుకు విశ్వాసం ఇస్తాము.” ఇవి ఫ్రెంచి గడ్డపై ప్రధాని నరేంద్ర మోడి పలికిన పలుకులు. ఫ్రెంచి నేల మనది కాదు. కనీసం మన పాత వలస ప్రభువు కూడా కాదు. ప్రధాని అక్కడికి వ్యాపార ఒప్పందాల…

రాఫెల్ కు స్వామి నో, మోడి యెస్

రాఫెల్ ఫైటర్ జెట్లు తక్షణ ప్రాతిపదికన ఏకంగా 36 కొనుగోలు చేసేందుకు ప్రధాని మోడి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫ్రాన్స్ బయలుదేరుతూనే రాఫెల్ ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ వెళ్ళిన ప్రధాని చెప్పినట్లుగానే ‘పడవపై చర్చలు’ జరిపి భారీ కొనుగోలుకు తలూపారు. మనం ఇప్పుడు ఆర్డర్ ఇస్తే రాఫెల్ ఫైటర్ జెట్లు తయారు చేయడం కాదు. ఇప్పటికే తయారై ఎగరడానికి సిద్ధంగా ఉన్న ఫైటర్ జెట్ విమానాలనే ఇండియా కొనుగోలు చేయనుంది. జెట్ ఫైటర్ విమానాల కొనుగోలు…

ఎర్ర చందనానికి శవపేటికల కాపలా!

చాలా అద్భుతమైన కార్టూన్! ఆంద్ర ప్రదేశ్ పోలీసుల వికృత రక్త కేళీ పిపాసకు ప్రత్యక్ష సాక్ష్యం శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్. ఇది నిజమైన ఎన్ కౌంటరే అని ఎ.పి పోలీసులు, ఎ.పి రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలుకుతున్నారు. పోలీసులు చాలా మంచి పని చేశారని ముద్దు కృష్ణమ నాయుడు గారి లాంటి పెద్ద మనుషులు పోలీసులను పత్రికలు, ఛానెళ్ల సాక్షిగా మెచ్చుకున్నారు. కొన్ని ఛానెళ్లు, పత్రికలు కూడా ‘ఖతమ్’, ‘హతం’ అంటూ మనుషుల ప్రాణాలకు తాము…

కాలిఫోర్నియాలో రికార్డు కరువు, నీటికి రేషన్ -ఫోటోలు

అమెరికాకు అన్నపూర్ణగా పేర్కొనబడే కాలిఫోర్నియా రాష్ట్రం ప్రస్తుతం రికార్డు స్ధాయి కరువుతో తీసుకుంటోంది. వరుసగా 4 సం.ల పాటు వర్షాలు లేకపోవడంతో కరువు అమెరికా భారీ మూల్యం చెల్లిస్తోంది. కాగా ఇంతటి తీవ్ర స్ధాయి కరువు పరిస్ధితులకు గ్లోబల్ వార్మింగే కారణమన్న వాదనపై నాయకులు శాస్త్రవేత్తలు రెండు శిబిరాలుగా చీలిపోయి వాదులాడుకుంటున్నారు. నేల మాత్రం నెర్రెలిచ్చి వర్షపు చుక్క కోసం చేతకపక్షిలా ఎదురు చూస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో కరువు ఎంత తీవ్రంగా ఉన్నదంటే నగరాలకు, పట్టణాలకు 25…

క్లుప్తంగా… 9/4/15

మూడు దేశాల పర్యటనకు మోడి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారు మూడు పశ్చిమ దేశాల పర్యటనకు పయనమై వెళ్లారు. మొదటి విడతగా ఫ్రాన్స్ లో నాలుగు రోజులు పర్యటించే ప్రధాని అనంతరం మూడు రోజుల పాటు ఏంజెలా మెర్కల్ అతిధిగా జర్మనీ పర్యటిస్తారు. తదనంతరం ప్రధాని కెనడా సందర్శించడం ఒక విశేషం. భారత ప్రధాన మంత్రులు కెనడా వెళ్ళడం చాలా తక్కువ. వెళ్తే రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి, వారి కుటుంబ సభ్యులు వెల్లడమే గానీ…

చట్టాల అమలులో హింసా ప్రయోగం -ది హిందు ఎడిట్..

[Violence in law enforcement శీర్షికన ఈ రోజు (ఏప్రిల్ 8) ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్] ఆంద్ర ప్రదేశ్ కు చెందిన యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది 20 మంది చెక్కకోత పనివాళ్లను -ఎర్ర చందనం స్మగ్లింగ్ మాఫియాతో సంబంధం ఉందని భావిస్తూ- చంపివేయడం వల్ల పోలీసుల జవాబుదారీతనం పట్లా, అసమతుల్య బలప్రయోగం పట్లా వ్యాకులపూరితమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెక్కకోత పనివాళ్లను లొంగి పొమ్మని టాస్క్ ఫోర్స్ బలగాలు…

ఇదీ మోడీ వ్యవసాయ మద్దతు! -కార్టూన్

“నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం” అనే సామెత వింటుంటాం. భారత రైతుల పట్ల ప్రధాని మోడి వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది. “వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటిని ఆపలేమా?” అని ఆయన బహిరంగ సభల్లో ప్రశ్నిస్తారు. ఆత్మహత్యలు ఆపండి మహా ప్రభో అని ఆయనని అందలం ఎక్కిస్తే, ఆ అందలం మీద కూర్చొని ఆత్మహత్యల్ని ఆపలేమా అని తిరిగి జనాన్ని ప్రశ్నించడం ఏమిటి, జనాన్ని వెక్కిరించడం కాకపోతే! నిన్నో మొన్నో ఆయన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు.…

క్లుప్తంగా… 8/4/15

గుజరాత్ లో ముస్లిం తరిమివేత హిందూత్వ కోరలు చాస్తూ విషం చిమ్ముతున్న వార్తలు క్రమంగా పెరిగిపోతున్నాయి. గుజరాత్ లో భావనగర్ జిల్లాలోని ఒక చోట 60 హిందూ కుటుంబాల మధ్య నివశిస్తున్న ఒకే ఒక్క ముస్లిం కుటుంబాన్ని అక్కడి నుండి బలవంతంగా తన్ని తగలేశారు. ముస్లిం కుటుంబాన్ని బలవంతంగా తరిమి కొట్టాలని గత సం. ఏప్రిల్ లో హిందూత్వ గణానికి ఉద్భోదించిన కేసులో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా ఇప్పటికీ కోర్టు, ఎలక్షన్ కమిషన్…

కొత్త ధీమ్ సెట్ చేశాను!

‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ లేదా తెలుగువార్తలు వెబ్ సైట్ కు కొత్త ధీమ్ సెట్ చేశాను. దాని పేరు బ్రాడ్ షీట్. ఇది ప్రీమియం ధీమ్. అంటే వర్డ్ ప్రెస్ వాళ్ళు మంచి డిజైన్ లు తయారు చేసి అమ్మకానికి పెడతారు. వాటిని కొనుక్కోవాల్సి ఉంటుంది. మరి డబ్బు! నేనేమీ డబ్బు త్యాగం చేసేయలేదు. నా వెబ్ సైట్ లో వర్డ్ ప్రెస్ వాళ్ళ యాడ్ లు కనిపిస్తున్నాయి కదా. వాటికి సంబంధించిన ఆదాయంలో కొంత…

పొగాకు లాబీకి లొంగి కేంద్ర మంత్రి తొలగింపు?

విదేశీ కంపెనీల లాభాలు పడిపోకుండా ఉండడానికీ, వీలయితే ఇంకా ఇంకా పెంచడానికీ స్వదేశీ భాజపా మంత్రుల పాట్లు అన్నీ ఇన్నీ కాకుండా పోతున్నాయి. ‘ఊరంతా ఒకదారయితే ఉలిపిరి కట్టెది మరోదారి’ అన్నట్లుగా కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తూ తమ బుద్ధి మాంద్యాన్ని చాటుకుంటున్నారు. కాగా పొగాకు లాబీకి లొంగి ప్రధాని నరేంద్ర మోడి ఆరోగ్య మంత్రిగా హర్షవర్ధన్ ను తప్పించారని ప్రతిపక్షాలు ఆరోపించడం ప్రజలు గమనించవలసిన విషయం. లేకపోతే ధూమపానం వల్ల/సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని…

చవకబారు వాగుడు -ది హిందు ఎడిటోరియల్

[బి.జె.పి పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్రాల నేతలు తమ చవకబారు భావజాలాన్ని నిస్సిగ్గుగా ఆరబెట్టుకోవడం కొనసాగుతూనే ఉంది. రాజీవ్ గాంధీ తెల్లతోలు మహిళకు బదులు నైజీరియా మహిళను పెళ్లి చేసుకుని ఉంటే ఆమెను నాయకురాలిగా కాంగ్రెస్ నేతలు అంగీకరించి ఉండేవారా అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించగా, ఆందోళనలో ఉన్న నర్సులు తమ ఆందోళనను విరమించకపోతే వారి చర్మం నల్లబడి మంచి భర్తల్ని వెతుక్కోవడం కష్టమై పోతుందని గోవా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మొన్నటివరకు ఇలాంటి…

ఎవరి గౌరవమీ ట్రయల్ రూముల రహస్య కెమెరాలు?

సాక్ష్యాత్తు కేంద్ర మంత్రి గారే విపత్కర పరిస్ధితిని ఎదుర్కొన్నారు. లేదా ఎదుర్కొన్నానని మంత్రి గారు లోకానికి చాటారు. అదేమీ లేదని ఫాబ్ ఇండియా వారు వివరణ ఇచ్చుకున్నప్పటికీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ఆరోపణ విస్తృత వ్యాప్తిలో ఉన్న ఒక అసహ్యకరమైన వ్యాధిని వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యాధి ఉన్నదని అందరికీ తెలుసు. కానీ అదేమీ ఎరగనట్లు నటించడమే వ్యాధి విస్తరణకు ప్రధాన పోషకురాలు. ఈ రీత్యా స్మృతి ఇరానీ చిన్నపాటి సాహసం చేశారని చెప్పవచ్చు.…

ఎన్నికల విజయం, రాజకీయ ఓటమి -ది హిందు ఎడిట్..

[‘Electoral victory, political defeat’ శీర్షికన ఈ రోజు ది హిందులో ప్రచురితం అయిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. ఈ మధ్య కాలంలో ది హిందు నుండి అరుదుగా మారిన సంపాదకీయ రచనల్లో ఇది ఒకటి. -విశేఖర్] మెరుగైన ప్రజాస్వామిక మరియు పారదర్శక పాలన అందించే లక్ష్యమే తన ఉనికికి కారణంగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీకి అత్యున్నత నాయకత్వ స్ధాయిలో ఎదురవుతున్న కష్టాలు ఆ పార్టీ ఉనికికే ప్రమాదకరంగా పరిణమించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు పార్టీ జాతీయ కన్వీనర్…

జంతువులకూ తెలుసు…! -వీడియో

జీవజాలంలో అన్నింటికంటే అభివృద్ధి చెందిన జీవి మనిషి. సృష్టిలోకెల్లా అత్యంత అభివృద్ధి చెందిన పదార్ధం అయిన మెదడు మనిషి సొంతం. అందుకే మనిషి ఆ అభివృద్ధి సాధించగలిగాడు. బోరింగ్ పంపు, చేతితో తిప్పే ట్యాపు, బర్రెల్ని మందలు మందలుగా కట్టివేసే ఇనప కొక్కేలు… ఇవన్నీ మనిషి ఇటీవల తయారు చేసుకున్నవి. ఇటీవల అంటే పదుల సంవత్సరాలని కాదు. వందల సంవత్సరాలని ఇక్కడ అర్ధం. మానవ పరిణామం పదుల వేల యేళ్ళ తరబడి జరిగింది కనుక ‘ఇటీవల’ అన్న…