విజయవాడ మునక ఎలా జరిగింది?

కలెక్టర్ సృజన గారు బిబిసి తెలుగు చానెల్ కి ఇచ్చిన సమాచారం ప్రకారం విజయవాడ లో 64 వార్డులు ఉంటే అందులో 32 వార్డులు వరద నీటిలో మునిగిపోయాయి. విజయవాడ మునకకు ఆమె మూడు కారణాలు చెప్పారు. ఒకటి: బుడమేరు వాగు పైన వెలగలేరు వద్ద లాకులు ఎత్తివేయవలసి రావటం, రెండు: ఎన్నడూ లేని విధంగా 26 సె. మీ వర్షపాతం విజయవాడలో కురవటం మూడు: కృష్ణా నది పైన 12 మీటర్ల కంటే ఎత్తున నీటి…

అమెరికా ఎన్నికల్ని రష్యా, చైనా, ఇరాన్ ప్రభావితం చేస్తున్నాయిట!

“ఆడలేక మద్దెల ఓడు” అన్నాట్ట వెనకటికొకడు! ప్రపంచం లోనే అత్యంత శక్తివంతమైన ప్రాజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం మాది అని ఒకటే ప్రచారం చేసుకోవటమే కాకుండా ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియా లాంటి దేశాలపై దుర్మార్గమైన దాడులు చేసి ఆ దేశ వ్యవస్థలని సర్వనాశనం చేసిన అమెరికా ఇప్పుడు తగుదునమ్మా అంటూ “మా దేశ ఎన్నికలని ప్రభావితం చేస్తున్నాయ్ బాబోయ్” అంటూ తెగ ఏడ్చి చస్తోంది! “అయినా…, మన బంగారం మంచిది కానప్పుడు…”…

నేను ఛండాలుడ్ని ఎట్లా అయ్యాను?

ఈ వీడియో నాకు వాట్సప్ మేసెజ్ గా వచ్చింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సత్యం అని వీడియో చివర తనే చెప్పారు. ఆయన తాను రాసిన కవితను ఈ వీడియోలో చదివి వినిపించారు. కవిత అద్భుతంగా ఉన్నది. సహజంగానే కవిత నచ్చని వారు ఉండవచ్చు. వారికి నా వైపు నుండి ఒక విజ్ఞప్తి ఏమిటంటే కవిత ఎందుకు నచ్చలేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. (ఆఫ్ కోర్స్, కామెంట్ ద్వారా నన్ను కూడా ప్రశ్నించవచ్చు.) సత్యం గారు…

అమెరికా దాష్టీకం: వెనిజులా అధ్యక్ష విమానం సీజ్!

Venezuelan Aircraft Seized and Stationed in Florida అమెరికా బలహీన పడే కొద్దీ దాని చర్యలు పామరులకు కూడా అర్ధం అయేంతగా హద్దు మీరుతున్నాయి. అంతర్జాతీయ సూత్రాల ఆధారిత వ్యవస్థ (International Rules Based Order) అంటూ పదే పదే సొల్లు కబుర్లు చెబుతూనే ఏ సూత్రానికీ, నిబంధనకూ తన దుష్ట ప్రవర్తన కట్టుబడి ఉండదని చాటి చెబుతున్నది. తాజాగా వెనిజులా దేశాధ్యక్షుడి విమానాన్ని సీజ్ చేయటమే కాకుండా “ఆకుకు అందని పోకకు పొందని” కబుర్లతో…

టర్కీలో అమెరికా సైనికులపై యువకుల దాడి!

The US’ marines attacked in Izmir, Turkey నాటో సభ్య దేశం అయిన టర్కీలో అమెరికా సైనికులకు తీవ్ర అవమానం జరిగింది. ఇజ్మీర్ పట్టణ వీధుల్లో సంచరిస్తున్న అమెరికన్ మెరైన్ సైనికులపై టర్కిష్ యువకుల బృందం దాడి చేశారు. ఒక సైనికుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం జరిగిందని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ వాస్ప్, ఇటీవల వరకు ఇజ్రాయెల్ తీరాన మోహరించింది. సదరు నౌక టర్కీ రేవు ఇజ్మీర్…

ఇంకా తేరుకోని బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ లో రాజకీయ మరియు శాంతి భద్రతల పరిస్ధితులు ఇప్పటికీ మెరుగుపడ లేదని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మధ్యంతర ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ గా విధులు నిర్వహిస్తూ ప్రధాన పాలనా బాధ్యతలు చూస్తున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలో పరిస్ధితిని చక్కదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాలను ఇవ్వటం లేదు. 15 యేళ్ళ పాటు సాగిన షేక్ హసీనా పాలన మిగిల్చిన వైరాలు, వైరుధ్యాలు, పగలు-ప్రతీకారాలు నివురు గప్పిన నిప్పులా తమ ఉనికిని కొనసాగిస్తూనే ఉన్నాయి. బహుశా…

గాజా హత్యాకాండకు బాధ్యులెవరు?

గాజాలో మానవ హననం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ సైన్యం – ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) హమాస్ ని సాకుగా చూపిస్తూ విచక్షణా రహితంగా పాలస్తీనీయుల జనావాసాలపైనా, శరణార్ధి శిబిరాల పైనా, శరణార్ధులకు ఐరాస ఆహార సరఫరాలు తెస్తున్న ట్రక్కుల పైనా, ఐడిఎఫ్ బాంబింగ్ లో గాయపడ్డ పాలస్తీనీయులను ఆసుపత్రులకు తరలిస్తున్న అంబులెన్స్ ల పైనా… ఇదీ అదీ అని లేకుండా పాలస్తీనీయులకు సంబంధించిన సమస్త నిర్మాణాల పైనా మిసైళ్లు, బాంబులు, లాయిటర్ బాంబులు, డ్రోన్ బాంబులు,…

ఈ వరుస హత్యా ప్రయత్నాల వెనుక ఉన్నది ఎవరు?

గత కొద్ది నెలల కాలంలో వివిధ దేశాల పాలకులను హత్య చేసేందుకు వరుసగా ప్రయత్నాలు జరిగాయి. అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తాడు అనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ తో సహా, రష్యా అధ్యక్షుడు పుటిన్, స్లొవేకియా ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో, వెనిజులా అధ్యక్షుడు రాబర్ట్ మదురో, హమాస్ పోలిటికల్ లీడర్ ఇస్మాయిల్ హానియే, హిజ్బొల్లా కమాండర్ ఖలీల్ ఆల్-మగ్దా… ఇలా వరస బెట్టి హత్యా ప్రయత్నాలు జరిగాయి. వీళ్ళలో ట్రంప్ కొద్ది పాటి…

రు. 76 వేల కోట్ల వసూలు ఇక కష్టమే -సెబి

కంపెనీలు పాల్పడిన వివిధ అవినీతి వ్యవహారాల వలనా, చిన్నా పెద్దా మదుపుదారుల నుండి పెట్టుబడులను మోసపూరితంగా వసూలు చేయడం వలనా, సెబి విధించిన అపరాధ రుసుముల వలనా, ఇంకా అనేక ఇతర కారణాల వలనా, వసూలు కావలసిన మొత్తంలో రు 76,293 కోట్లు వసూలు కావటం ఇక కష్టమే అని సెక్యూరిటీ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ప్రకటించింది. సెబి, ఇలాంటి వసూలు కావటం కష్టంగా మారే వాళ్ళ జాబితాను క్రమం తప్పకుండా యేటా తయారు…

అమెరికా కాంగ్రెస్ లో నెతన్యాహు చెప్పిన కొన్ని అబద్ధాలు!

Netanyahu addressing U.S. Congress on July 24, 2024 అమెరికా తోక ఇజ్రాయెల్ అన్న సంగతి ఈ బ్లాగ్ లో చాలా సార్లు చెప్పుకున్నాం. అమెరికా తోకకి ఒక ప్రత్యేకత ఉంది. అమెరికాకి ఎంతయితే దుష్టబుద్ధితో కూడిన మెదడు ఉన్నదో దాని తోక ఇజ్రాయెల్ కి కూడా అంతే స్థాయి దుష్ట బుద్ధితో కూడిన మెదడు ఉండడం ఆ ప్రత్యేకత. ఒక్కోసారి అమెరికా తలలో ఉన్న మెదడు కంటే దాని తోకలో ఉన్న మెదడుకే ఎక్కువ…

ఇరాన్ కి యుద్ధం కావాలి, అందుకే…

ఇరాన్ కి యుద్ధం కావాలి. ఇరాన్ కి యుద్ధమే ఆహారం. కానీ అమెరికాకి శాంతి కావాలి. శాంతి లేనిదే అమెరికా బ్రతకలేదు. ప్రపంచ శాంతి అమెరికాకి చాలా చాలా ముఖ్యం. కానీ ఇరాన్ తన యుద్ధ కాంక్షతో అమెరికాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. కావాలంటే కింద సాక్ష్యం చూడండి! అమెరికా ప్రపంచ శాంతి కోసం తపన పడుతూ, ప్రపంచం నిండా సైనిక స్థావరాలను నిర్మించుకుంది. ఇరాన్ దేశం ప్రపంచ శాంతి కోసం అమెరికాతో సహకరించకుండా…

హసీనాపై ఒత్తిడి వద్దు- అమెరికాకు ఇండియా విజ్ఞప్తి!

బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా పట్ల చూసీ చూడనట్లు వ్యవహరించాలని భారత అధికారులు అమెరికన్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారని ‘బిజినెస్ టుడే’ పత్రిక వెల్లడి చేసింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు పారిపోవటానికి సంవత్సరం ముందు నుండే ఇండియా, హసీనా పట్ల తేలికగా వ్యవహరించాలని, అమెరికాను కోరిందని ది వాషింగ్టన్ పోస్ట్ పత్రికను ఉటంకిస్తూ బిజినెస్ టుడే పత్రిక వెల్లడి చేసింది. బంగ్లాదేశ్ లోని హసీనా ప్రభుత్వం…

సెబి రెగ్యులేటర్ రూల్స్ ఉల్లంఘించింది -రాయిటర్స్

అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ మరియు షార్ట్ సెల్లర్ అయిన హిండెన్ బర్గ్ రీసర్చ్, సెబి రెగ్యులేటర్ (సెబి ఛైర్మన్) మాధాబి పూరి బక్ పై చేసిన ఆరోపణలలో వాస్తవం ఉన్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది. హిండెన్ బర్గ్ రీసర్చ్ గతంలో ఆదాని కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే. అదాని గ్రూప్ కంపెనీ భారీ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నదనీ, టాక్స్ హేవెన్ (పన్నులు అతి తక్కువగా ఉండే) దేశాలను…

బంగ్లాదేశ్ ఉద్యోగాల రిజర్వేషన్ గురించి…

జనవరి 2024 లో జరిగిన ఎన్నికల్లో ఆవామీ లీగ్ పార్టీ విజయం సాధించడంతో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా నాలుగవ సారి పదవి చేపట్టిన షేక్ హసీనా మరో 6 నెలల్లోనే పదవికి రాజీనామా చేసి ఇండియాలో శరణు కోరవలసి వచ్చింది. 15 యేళ్ళ పాటు అవిచ్ఛిన్నంగా ప్రజాస్వామ్య వాసనలు లేకుండా దాదాపు డిక్టేటర్ తరహాలో బంగ్లాదేశ్ ను పాలించిన షేక్ హసీనా ప్రస్తుత పరిస్ధితి స్వయంకృతాపరాధమే అని ది హిందూ లాంటి పత్రికలు వ్యాఖ్యానించాయి. ఈ పరిశీలనలో…

అమెరికా ప్రతీకారమే నా పదవీచ్యుతి -హసీనా

St. Martin Island in North-Eastern Bay of Bengal విద్యార్ధులు, ప్రతిపక్ష పార్టీలు, ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ సంస్థల హింసాత్మక ఆందోళనల ఫలితంగా బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇండియాలో శరణు వేడిన మాజీ ప్రధాని షేక్ హసీనా, అసలు గుట్టును బట్టబయలు చేసిందని రష్యా టుడే పత్రిక తెలియజేసింది. బంగ్లాదేశ్ ద్వీపాన్ని సైనిక స్థావరం నిర్మించేందుకు లీజుకు ఇచ్చేందుకు నిరాకరించినందు వల్లనే అమెరికా ఇప్పుడు తనపై ప్రతీకారం తీర్చుకుందని షేక్ హసీనా కుండ…