ఇంతకు మించిన దుఃఖం ఉంటుందా? -కత్తిరింపులు

భార్య చనిపోతే ఆమె శవాన్ని ఏకాఎకిన భుజాన వేసుకుని 60 కి.మీ దూరం లోని ఇంటికి కాలి నడకన బయలుదేరిన భర్త! జబ్బు పడిన కొడుకుకి వైద్యం చేయించడం కోసం అతన్ని భుజం మీద వేసుకుని, వైద్యం అందక తన భుజం మీదనే ప్రాణాలు వదిలాడని తెలియక  డాక్టర్ల మధ్య పరుగులు పెట్టిన తండ్రి! పురుటి నొప్పులు పడుతున్న కూతురిని సైకిల్ వెనక సీటుపై కూర్చో బెట్టుకుని వెళ్ళి, ప్రసవం అయ్యాక పసికందుతో సహా అదే సైకిల్…

ప్రశ్న: డ్రైవర్ల కక్కుర్తి ఉబర్ కక్కుర్తి ఒకటే కదా?

– [ముంబై ఆటో సమ్మె గురించి రాసిన గత ఆర్టికల్ పైన విశేషజ్ఞ గారు లేవనెత్తిన ప్రశ్నలను చర్చగా చేస్తూ ఈ ఆర్టికల్ రాస్తున్నాను. పాఠకులు గుర్తించగలరు. -విశేఖర్] విశేషజ్ఞ గారు: ఇది నాకు అర్ధం కాలేదు. ఆటోవాళ్ళుకూడా తమ లాభాలు పెంచుకొనే ఉద్దేశ్యంతోనే ప్రతి చిన్నదానికీ, డబల్ ఛార్జీలు, ట్రిపుల్ ఛార్జీలు, లాంగ్‌రూటుకు మాత్రమే ‘సై’ అనడాలు చేస్తున్నారుకదా. వీళ్ళు చేసేది ఓలా, ఊబర్‌లకన్నా ఏవిధంగా ప్రజలకు ప్రయోజనకరం? ఇద్దరి ఉద్దేశ్యమూ, లాభార్జనే ఐనప్పుడు ఓలా,…

ఉబర్ దోపిడీపై ముంబై ఆటోల తిరుగుబాటు -వివరణ

బహుళజాతి ట్యాక్సీ అగ్రిగేటర్ కంపెనీ ‘ఉబర్’ సాగిస్తున్న దోపిడీ పై ముంబై ఆటో రిక్షా కార్మికులు తిరుగుబాటు ప్రకటించారు. ఆటో యజమానులు, కార్మికులు ఉమ్మడిగా బుధవారం పగటి పూట (12 గం) సమ్మె ప్రకటించారు. సమ్మె దిగ్విజయంగా నడుస్తోందని ఆటో కార్మికసంఘాలు ప్రకటించాయి. సమ్మెలో లక్షకు పైగా అఆటోలూ పాల్గొంటున్నాయని సమ్మెదారులు (ముంబై ఆటో రిక్షా యూనియన్) ప్రకటించారు (-ద హిందూ బిజినెస్ లైన్). ఫలితంగా నగర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పత్రికలూ తెలిపాయి. సమ్మెకు ప్రత్యామ్నాయ…

పిప్పర్మెంట్లతో కేంద్రం సరి, సమ్మెకే కార్మిక సంఘాల నిర్ణయం!

దేశ వ్యాపిత సమ్మె మరో రెండు రోజులు ఉందనగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి పిప్పర్మెంట్ బిళ్ళలు ఆశ చూపిస్తూ ముందుకు వచ్చింది. అనేక నెలలు ముందే కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపు ఇచ్చినప్పటికీ వారి పిలుపుకి స్పందించడానికి ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వానికి తీరిక దొరక లేదు. విదేశీ కంపెనీలు, పరిశ్రమల కోసం కార్మిక చట్టాలను కాలరాసిన మోడి ప్రభుత్వం కార్మికుల కోసం మాత్రం కేవలం రెండంటే రెండు రోజుల ముందు స్పందించి వారిని అపహాస్యం చేసింది.…

సోవియట్ రష్యాయే మెరుగు -మాజీ సోవియట్ రాజ్యాలు

  USSR విచ్చిన్నం అయినప్పుడు ఎంతో మంది కమ్యూనిస్టు విద్వేషులు రాక్షసానందాన్ని అనుభవించారు. పెట్టుబడిదారీ పశ్చిమ దేశాల ప్రభుత్వాలు పండగ చేసుకోగా పశ్చిమ దేశాలను గుడ్డిగా ఆరాధించే వాళ్ళు తాము ఎందుకు ఆనందిస్తున్నామో తెలియకుండానే పిచ్చి ఆనందం పొందారు. గట్టిగా అడిగితె సోవియట్ రష్యా అంటే ‘ఇనప తెర’ అని, అక్కడ ‘వ్యక్తి స్వేచ్ఛ’ మృగ్యం అనీ, ‘నియంతృత్వ పాలన’ అనీ… ఇంకా ఇలాంటివి ఏవేవో అక్కడా ఇక్కడా విన్నవి అప్పజెపుతూ తమకే అన్ని తెలిసిపోయాయన్న ఫోజులు…

గౌనులు ధరించొద్దు -విదేశీ టూరిస్టులకు మంత్రి సలహా

  ఈ సారి ఏకంగా కేంద్ర మంత్రివర్యులు సాంస్కృతిక పరిరక్షక సేనాధిపతి అవతారం ఎత్తారు. కేంద్ర మంత్రిని గనుక విదేశీయులకు కూడా సాంస్కృతిక పాఠాలు చెప్పే అర్హత, అధికారం తనకు ఉంటుంది అనుకున్నారో ఏమో గాని విదేశీ టూరిస్టులకు వస్త్ర దారుణ విషయమై హెచ్చరికలు చేసేందుకు సిద్ధపడ్డారు. భారత దేశంలోని యాత్రా స్ధలాలను చూసేందుకు వచ్చే విదేశీ మహిళలు గౌనులు ధరించడం మానుకోవాలని ఉపదేశం దేశారు. భారత దేశ పౌరులకు సంస్కృతీ పాఠాలు నేర్పే కర్తవ్యాన్ని హిందుత్వ…

పాక్ వరద గేటు తెరిచిన మోడి బలోచ్ వ్యూహం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల పెట్టిన వ్యూహం -కాంగ్రెస్ ఆరోపించినట్లుగా- ఇండియాకే బెడిసి కొట్టేట్లు కనిపిస్తోంది. 69వ స్వతంత్ర దినం నాడు బలోచిస్తాన్ ప్రజల పోరాటాన్ని మన ప్రధాని ప్రస్తావించినందుకు ప్రతీకారంగానా అన్నట్లుగా కాశ్మీర్ విషయంలో పూర్తి స్ధాయి అంతర్జాతీయ దౌత్య యుద్ధానికి పాకిస్ధాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నడుం బిగించారు. కాశ్మీర్ సమస్య విషయమై తమ వాదన వినిపించడానికి వివిధ దేశాలకు ఆయన దౌత్యవేత్తలను పంపించారు. కాశ్మీర్ సమస్యను ఇతర దేశాలకు…

ఒడ్డుకు కొట్టుకొచ్చిన రక్షణ రహస్యాలు -కార్టూన్

ఈ కార్టూన్ కి ఇక వ్యాఖ్యానం అవసరమా? ఈ కార్టూన్ గీసిన కేశవ్ “కార్టూన్ ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత ప్రభావవంతంగా ఉంటుంది” అని చెబుతారు. అందుకే ఆయన తన కార్టూన్ లకి, ఎప్పుడో తప్పదు అనుకుంటే తప్ప వ్యాఖ్యానం ఇవ్వరు. జలాంతర్గామి అంటేనే రహస్య ఆయుధం అని లెక్క! సముద్రం అడుగున రహస్యంగా దాగి ఉండాల్సిన స్కార్పీన్ ఒడ్డుకు కొట్టుకొని రావడం బట్టి దానికి బాధ్యత వహించవలసిన వాళ్ళు ఎంత బాధాతాయుతంగా ఉన్నారో తెలిసిపోతున్నది. స్కార్పీన్…

స్కార్పిన్: లీక్ అయింది ఫ్రాన్స్ లోనే -నిర్ధారణ

ఇప్పుడిక ఫ్రాన్స్ సాకులు చెప్పి తప్పించుకునేందుకు వీలు లేదు. “లీకేజి మా పాపం కాదు. మా చేతులు దాటినాకే సమాచారం లీక్ అయింది” అని ప్రకటించి తప్పించుకోజూచిన DCNS కంపెనీ వాదన నిజం కాదని తేలింది. లీకేజికి కారణం అయిన పత్రిక విలేఖరి “ఫ్రాన్స్ లోనే లీక్ అయింది” అని స్పష్టం చేసాడు. తనకు అందిన రహస్య పత్రాలను ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అందజేయడానికి ఆ విలేఖరి సంసిద్ధత తెలిపాడు.  DCNS కంపెనీతో ఆస్ట్రేలియా కూడా 38 బిలియన్…

స్కార్పిన్ లీక్ పరిశోధన -ద హిందూ ఎడిట్…

మజగావ్ డాక్ లిమిటెడ్ లో ఉత్పత్తిలో ఉన్న స్కార్పిన్ జలాంతర్గాములకు సంబంధించిన వేల పేజీల రహస్య పత్రాలు లీక్ అవడం వల్ల ఎంత మేరకు భధ్రత ప్రమాదంలో పడింది అన్న అంశాన్ని తీవ్ర దృష్టితో పరిశోధించాలి. బ్యూరోక్రాటిక్ రాజి పద్ధతుల నుండి, తమ సొంత వ్యవహారాలను సంరక్షించుకునే ధోరణుల నుండి స్వతంత్రంగా ఉండే విధంగా ఈ పరిశోధన జరగాలి. 1,500 టన్నుల సాంప్రదాయక డీజిల్-విద్యుత్ జలాంతర్గామికి చెందిన సాంకేతిక ప్రత్యేకతలు వివరాలను తెలియజెప్పే 22,400 పేజీల పత్రాలు…

నెం. 1 టెస్ట్ క్రికెట్ టీం: పాకిస్తాన్ -కార్టూన్

    “అబ్బే, పాకిస్తాన్ టాప్ టీం అని అన్నది నేను కాదు. నా పైన దేశ ద్రోహం పెట్టకండి దయ చేసి…”   *********   హిందుత్వ కాపలాదారుల మానక స్ధితిని ఈ కార్టూన్ సరిగ్గా వెల్లడి చేస్తున్నది.    హిందుత్వ మూకలు పాల్పడుతున్న విజిలెంటిజం ఆ మూకలతో మొదలై వారితోనే ముగిసేది కాదు. అది నేరుగా సంఘ్ పరివార్  అత్యున్నత నాయకత్వం నుండి కింది స్ధాయి కార్యకర్త వరకు ప్రవహిస్తూ వస్తోంది. అందుకే ప్రధాన…

భారత జలాంతర్గాముల రహస్యాలు లీక్

  రహస్యాల లీకేజి వ్యవహారం ఇండియాకూ చేరింది. భారత దేశానికి సరఫరా చేయడానికి ఫ్రాన్స్ కంపెనీ నిర్మిస్తున్న జలాంతర్గాముల రహస్యాలు పత్రికలకు లీక్ అయ్యాయి. దాదాపు 22,000 పేజీలకు పైగా పత్రాలు -జలాంతర్గాములు సంబంధించినవి- లీక్ అయ్యాయని పలు పత్రికలు తెలియజేశాయి. జలాంతర్గామి రహస్యాలు 22,000 పేజీల వరకు ఉండడం ఏమిటో అర్ధం కాని విషయం. ఎంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అయినప్పటికీ వేల పేజీల తరబడి నిండి ఉంటాయా అన్నది అనుమానాస్పదం. బహుశా జలాంతర్గాములు సంబంధించిన…

‘పాకిస్ధాన్ నరకం కాదు’ అన్నా దేశద్రోహమేనా?

  “అసహనం ఎక్కడుంది?” అని ప్రశ్నిస్తూ  ఢిల్లీలో ఊరేగింపు నిర్వహించిన హాలీ వుడ్ నటుడు ‘అనుపమ్ ఖేర్’ ఓ సారి కర్ణాటక వఛ్చి చూడాలి. హిందుత్వ మూకలు ఏమి చేసినా అది దేశ భక్తే అనో లేదా సహన సహితమే అనో ఆయన తేల్చిపారేస్తే తప్ప, ‘అసహనం’ రుచి ఏమిటో ఆయనకు తెలుస్తుంది.  “పాకిస్తాన్ నరకం ఏమి కాదు. అది ప్రజలు నివసించే దేశం” అని రాజకీయవేత్తగా మారిన ఒక సినిమా నటి ప్రకటించారు. “పాకిస్ధాన్ అంటే…

మెడల్స్ క్రెడిట్ ఆటగాళ్లదేనా? -కార్టూన్

యూ‌పి‌ఏ ఏలుబడిలో ఎలాంటి సానుకూల పరిణామం జరిగినా అది రాహుల్ గాంధీకో, సోనియా గాంధీకో క్రెడిట్ అయ్యేది. ఏమన్నా (ఒప్పుకోవలసిన) తప్పులు జరిగితే మాత్రం అవి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఖాతా లోకి వెళ్లిపోయేవి. ఎన్‌డి‌ఏ-2 ఏలుబడిలోనూ అంతే. పాత్రధారులు మారారు గానీ సీన్ మారలేదు. జి‌డి‌పి వృద్ధి రేటు పెరిగినా, చమురు ధరలు తగ్గి ద్రవ్యోల్బణం తగ్గినా, ఉప ఎన్నికల్లో గెలిచినా… అవన్నీ మోడి గాలి + అమిత్ షా చాణక్య ఎత్తుల ఫలితంగానే…

గులెన్ ని త్వరగా పంపండి! -అమెరికాతో టర్కీ

టర్కీలో సైనికుల తిరుగుబాటుకు కుట్ర చేసిన ఫెతుల్లా గులెన్ ను టర్కీకి ‘అప్పగించే’ పనిని త్వరితం చేయాలని టర్కీ ప్రభుత్వం డిమాండ్ చేసింది. అమెరికాలో శరణు పొందుతున్న గులెన్ అప్పగింతకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేయాలని, టర్కీ-అమెరికాలు చేసుకున్న ‘నేరస్ధుల అప్పగింత’ ఒప్పందాన్ని అమెరికా గౌరవించాలని టర్కీ ప్రధాని బినాలి యెల్దిరిమ్ ఈ రోజు (శనివారం, ఆగస్టు 20) డిమాండ్ చేశాడు. టర్కీ వాణిజ్య నగరం ఇస్తాంబుల్ లో విదేశీ మీడియా విలేఖరులతో మాట్లాడుతూ టర్కీ ప్రధాని…