ఇంతకు మించిన దుఃఖం ఉంటుందా? -కత్తిరింపులు


Dead wife on shoulders

Dead wife on shoulders

భార్య చనిపోతే ఆమె శవాన్ని ఏకాఎకిన భుజాన వేసుకుని 60 కి.మీ దూరం లోని ఇంటికి కాలి నడకన బయలుదేరిన భర్త!

జబ్బు పడిన కొడుకుకి వైద్యం చేయించడం కోసం అతన్ని భుజం మీద వేసుకుని, వైద్యం అందక తన భుజం మీదనే ప్రాణాలు వదిలాడని తెలియక  డాక్టర్ల మధ్య పరుగులు పెట్టిన తండ్రి!

పురుటి నొప్పులు పడుతున్న కూతురిని సైకిల్ వెనక సీటుపై కూర్చో బెట్టుకుని వెళ్ళి, ప్రసవం అయ్యాక పసికందుతో సహా అదే సైకిల్ పైన ఇంటికి తెచ్చుకున్న మరో తండ్రి!

చనిపోయిన మహిళ దేహం రిగర్ మార్టిస్ లోకి వెళ్ళి పోవడంతో నిట్టనీల్గిన శవాన్ని మూట గట్టి రైలు పెట్టెలో పెట్టే వీలు లేక కట్టె పుల్ల విరిచినట్లు ఓ వంక కాళ్లతో నొక్కి పెట్టి మరో వంక చేతుల్తోనే సగానికి విరిచి మూట గట్టి దుంగకు వేలాడ దీసి రైలులోకి చేరవేసిన ఉదంతం మరొకటి!

దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్! అన్నది నిజమే అయితే ఈ దేశానికి ఇంతకు మించిన దుఃఖం మరొకటి ఉండగలదా?

ఈ జన దుఃఖాన్ని దాచి పెట్టి గో మాత – బీఫ్ – కుహనా జాతీయవాదం లలో కృత్రిమ దుఃఖాన్ని చొప్పిస్తున్న నడమంత్రపు రోదనా మూర్తుల నుండి, తండ్రీ, రక్షించు నన్నూ, నా దేశాన్ని!!

[ఈ కత్తిరింపులు ఆంధ్ర జ్యోతి నుండి సంగ్రహించినవి]

Cut in half

One boy and a woman -01

A pregnant woman

1 thoughts on “ఇంతకు మించిన దుఃఖం ఉంటుందా? -కత్తిరింపులు

  1. ఇటువంటి దృష్టాంతాలు పత్రికలకు ఎక్కనికి రోజూ కొన్ని వందలు జరుగుతుంటాయి ఈ దేశంలో! విచారించి లాభంలేదు. విచికిత్స చేయవలసిందే!

    దేశంలో మరే సమస్యలు లేనట్టూ ఎప్పుడూ స్టార్టప్ ఇండియ,మేకిన్ ఇండియ,స్వచ్చభారత్,యోగా డే,జి.యస్.టి(అప్పుడే సగం రాష్ట్రాలలో దిగువ సభలలో బిల్ల్ పాస్ అయిపోయింది) వంటి అనవసర కార్యక్రమాలకు ప్రాధాన్యత నిస్తూ పొజు పెట్టే ప్రభుత్వాలు, తెర చాటున కార్పోరేట్ అనుకూల, కార్మిక, రైతు వ్యతిరేక కార్యక్రమాలలో తలమునకలై ఉన్న ఈ ప్రభుత్వాల కపటనాటకాన్ని తెలుసుకోకుండా ఉండగలరా?

    బుద్ధున్న వాడెవడైనా ఇంకా ఈ మేడిపండు ప్రజాస్వామ్య, పార్లమెంటరీ, వోటు ఆధారిత కపట నాటకాన్ని ఛీత్కరించకుండా ఉండగలడా?

వ్యాఖ్యానించండి